
‘భారత్‌మాతాకీ జై’ అనకుంటే దేశద్రోహులే
ఆధ్యాత్మిక గురువు, ఎంపీ సాద్వీ ప్రాచీ
అబిడ్స్/అప్జల్‌గంజ్: ‘హిందుస్థాన్‌లో ఉన్నవారంతా భారత్‌మాతాకీ జై అనాల్సిందే... అలా అనకుంటే దేశద్రోహులే అవుతారు.. అటువంటి వాళ్లు దేశంలో ఉండడానికి వీలులేదు’ అని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు, ఎంపీ సాద్వీ ప్రాచీ అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శుక్రవారం ధూల్‌పేట్ గంగాబౌలి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర బేగంబజార్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా శోభాయాత్రలో భక్తులను ఉద్దేశించి సాద్వీ ప్రసంగిం చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. మనమంతా హిందూస్థాన్‌లో ఉన్నామన్నారు. ఇటీవల అసదుద్ధీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అని అననని వెల్లడించడం దేశద్రోహమే అవుతుందన్నారు. హైదరాబాద్‌కీ చువ్వా (ఎలుక) ఏ కలుగులో దాక్కుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి అన్నారు. రాజ్యాంగంలో ‘ఎక్కడా భారత్‌మాతాకీ జై’ అనాలని లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
పురానాపూల్ గాంధీ పుత్లా చౌరస్తాలో....
హిందూత్వ ధర్మ పరిరక్షణకు కంకణ బద్ధుడినై ఉన్నానని గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్‌లోథ అన్నారు. శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకొని పురానాపూల్ గాంధీ పుత్లా చౌరస్తా వద్ద ఆయన మాట్లాడారు. గోషామహల్ నియోజకవర్గం లోనే ధూల్‌పేట్ గంగాబౌలి ప్రాంతాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు. 51 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రాణప్రతిష్ట చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చానని, ఇప్పటికే నగరం నుంచే గాక ఇతర పరిసర జిల్లాల నుంచి కూడా ఆకాష్‌పురి హనుమాన్‌ను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారన్నారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం: సాక్షి మహరాజ్
దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో కేం ద్రం లోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తుదముట్టిస్తుందని ఉత్తర భారతదేశ ఆధ్యాత్మిక గురువు సాక్షి మహరాజ్ పేర్కొన్నారు. శోభాయాత్రలో ధూల్‌పేట్ ప్రాంతంలో ప్రసంగించారు. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టడానికి మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ హిందుత్వాన్ని పెంపొందించడంలో, గోవులను రక్షించేందుకు చేస్తున్న కృషి అమోఘమని ఆయన కొనియాడారు.