కొండగట్టు(చొప్పదండి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భారీచోరీ జరిగింది. దాదాపు 800 ఏళ్ల ఆలయ చరిత్రలోనే తొలిసారి దొంగతనం జరగడం కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయం వెనకాల తలుపుల పట్టీలను తొలగించి, ముగ్గురు ముసుగు దొంగలు శుక్రవారం వేకువజామున 1.10 గంటల ప్రాంతంలో లోనికి ప్రవేశించారు.
గర్భాలయంలోకి వెళ్లిన దొంగలు సుమారు రెండు కిలోల ఆంజనేయస్వామి వెండికిరీటం, ఆరుకిలోల వెండి మకరతోరణం, 250 గ్రాముల శ్రీరామరక్ష గొడుగులు రెండు, కిలో మకరతోరణ వెండిస్తంభం, మూడు కిలోల వెండి శఠగోపాలు 4, ఆరు కిలోల హనుమాన్ కవచం.. ఇలా మొత్తంగా 15 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. వీటి విలువ దాదాపు రూ.9 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు.
అయితే, ఆలయంలోని హనుమాన్ విగ్రహంపైగల శంఖుచక్రం, బంగారు శ్రీరామ రక్షతోరణం, శ్రీలక్ష్మీఅమ్మవారి ఆలయంలోని వెండితోరణం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీరామ పట్టాభిషేకం వస్తువులను దొంగలు ముట్టుకోకపోవడం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. సాగర్ గెస్ట్‌హౌస్ సమీపంలోకి వెళ్లిన డాగ్‌స్క్వాడ్.. హనుమాన్ కవచానికి సంబంధించిన ఓ ఫ్రేమ్‌ను గుర్తించాయి.
చదవండి: వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్
Comments
Please login to add a commentAdd a comment