Kondagattu
-
భక్తుడి ఫోన్ ఎత్తుకుపోయి గుడి ఎక్కిన కోతి..
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
18న కొండగట్టుకు రాహుల్, ప్రియాంక ముడుపుగట్టు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈనెల 18న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాందీలు హాజరవనున్నారు. రాహుల్, ప్రియాంకాగాందీలు కొండగట్టుపై తొలుత అంజన్నకు పూజలు చేసి అక్కడ పార్టీకి విజయం సాధించాలని ముడుపు కడతారని, అనంతరం అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రచార రథాలకు పూజలు చేయిస్తారు. పూజల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్, ప్రియాంకల పర్యటనను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే తమకు ఇంకా అధికారిక షెడ్యూలు మాత్రం అందాల్సి ఉందన్నారు. కాగా, బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న పాత కరీంనగర్లో కాంగ్రెస్‌కు కేవలం ఒక్క సీటే ఉంది. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సీనియర్ పార్టీ నేత ఒకరు చెప్పారు. -
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
‘కొండగట్టు’ దొంగల అరెస్ట్
మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ వసతి గృహాల్లో మంగళవారం ఉదయం చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవితో కలిసి డీఎస్పీ ప్రకాశ్ వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దూలం శశాంక్, తోకల నితిన్, ఎనగందుల పవన్‌చందు, మరో ఇద్దరు మైనర్లు జల్సాలకు అలవాటు పడ్డారు. హోలీ సందర్భంగా కొండగట్టులో దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ కారును అద్దెకు తీసుకుని అంజన్న సన్నిధికి చేరారు. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లగా.. మారుతీ నిలయంలోని 11, 16 నంబర్ల గదుల తాళాలు పగులగొట్టారు. భక్తుడు సంధానవేని సంతోష్‌కు చెందిన సెల్‌ఫోన్, అసోంకు చెందిన సంజీత్‌దాస్‌కు చెందిన మరో మొబైల్ ఫోన్, గోదావరిఖనికి చెందిన గుగులోత్ రమేశ్‌కు చెందిన మరో ఫోన్‌తోపాటు రూ.నాలుగు వేల నగదు అపహరించారు. దీంతో సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. దొంగలమర్రి చెక్‌పోస్టు వద్ద సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకొని విచారించగా చోరీ చేసింది వారేనని తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్న సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవిని డీఎస్పీ ప్రకాశ్ అభినందించారు. -
కొండగట్టు ఆలయంలో భారీచోరీ
కొండగట్టు(చొప్పదండి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భారీచోరీ జరిగింది. దాదాపు 800 ఏళ్ల ఆలయ చరిత్రలోనే తొలిసారి దొంగతనం జరగడం కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయం వెనకాల తలుపుల పట్టీలను తొలగించి, ముగ్గురు ముసుగు దొంగలు శుక్రవారం వేకువజామున 1.10 గంటల ప్రాంతంలో లోనికి ప్రవేశించారు. గర్భాలయంలోకి వెళ్లిన దొంగలు సుమారు రెండు కిలోల ఆంజనేయస్వామి వెండికిరీటం, ఆరుకిలోల వెండి మకరతోరణం, 250 గ్రాముల శ్రీరామరక్ష గొడుగులు రెండు, కిలో మకరతోరణ వెండిస్తంభం, మూడు కిలోల వెండి శఠగోపాలు 4, ఆరు కిలోల హనుమాన్ కవచం.. ఇలా మొత్తంగా 15 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. వీటి విలువ దాదాపు రూ.9 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. అయితే, ఆలయంలోని హనుమాన్ విగ్రహంపైగల శంఖుచక్రం, బంగారు శ్రీరామ రక్షతోరణం, శ్రీలక్ష్మీఅమ్మవారి ఆలయంలోని వెండితోరణం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీరామ పట్టాభిషేకం వస్తువులను దొంగలు ముట్టుకోకపోవడం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. సాగర్ గెస్ట్‌హౌస్ సమీపంలోకి వెళ్లిన డాగ్‌స్క్వాడ్.. హనుమాన్ కవచానికి సంబంధించిన ఓ ఫ్రేమ్‌ను గుర్తించాయి. చదవండి: వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్ -
కొండగట్టు ఆలయ అభివృద్ధిలో ‘గ్రీన్ ఇండియా’
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దేశంలోనే ప్రముఖ దేవాలయంగా పునర్ నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని దత్తత తీసుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17న కేïసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున గురువారం తన నిర్ణయాన్ని ఎంపీ ప్రకటించారు. స్వరాష్ట్రం సిద్ధించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఆయన తపనను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కొడిమ్యాల అభివృద్ధి ఇలా... కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్ట్మెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా రూ.కోటి వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని సంతోష్ ప్రకటించారు. దశలవారీగా మిగతా నిధులు కూడా అందించి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఔషధ, సుగంధ మొక్కలు నాటు తామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్దఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
30 ఏళ్ల క్రితం కొండగట్టుకు సీఎం కేసీఆర్.. ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్లిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్.. తమ చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం పెద్దనాన్న కేసీఆర్, సోదరి కల్వకుంట్ల కవిత, పెద్దమ్మ శోభ, తల్లిదండ్రులు రవీందర్రావు, శశికళతో కలిసి కొండగట్టుపై దిగిన ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. ‘ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిలో ఇప్పుడు కొండగట్టు వంతు వచ్చింది. సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి అనేకసార్లు కొండగట్టు అంజనేయస్వామిని దర్శనం చేసుకున్నాం. కొండగట్టు వ్యూ పాయింట్ నుంచి అప్పటి అపురూప చిత్రాలు..’ అంటూ కుటుంబంతో కలిసి దిగిన పాత ఫొటోలు పోస్టు చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. Now it’s #Kondagattu’s turn for its overal facelift by developing another landmark mythological structure. #Throwback pics from the view point place, when we had numerous Darshans of Kondagattu Anajanna along with our Hon’ble CM Sri KCR garu and family. pic.twitter.com/Rz31qoggA1 — Santosh Kumar J (@MPsantoshtrs) February 15, 2023 కాగా సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టు అంజన్న ఆలయ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొండగట్టును ప్రపంచాన్నే ఆకర్షించే అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని, అందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చయినా ఫర్వాలేదని చెప్పారు. -
అవసరమైతే కొండగట్టుకు రూ.వెయ్యి కోట్లు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కొండగట్టు: కొండగట్టును ప్రపంచాన్నే ఆకర్షించే అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని, అందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చయినా ఫర్వాలేదని చెప్పారు. దేశంలో ఆంజనేయుడి పుణ్యక్షేత్రం ప్రస్తావన వస్తే కొండగట్టు పేరు వినిపించాలని, హనుమాన్ జయంతి అనగానే దేశం మొత్తం కొండగట్టు వైపు చూడాలని స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సీఎం సందర్శించారు. అనంతరం ఆలయాభివృద్ధిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆలయం కోసం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆలయం విస్తరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త నిర్మాణాలు, భక్తులకు వసతులపై రెండు గంటలపాటు చర్చించారు. అనంతరం పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. గర్భగుడిని ముట్టుకోవద్దు.. ‘యాదాద్రి తరహాలో వైష్ణవ సంప్రదాయాల్ని పాటిస్తూ.. ప్రతి సూక్ష్మ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం ఉన్న గర్భగుడిని ఏమాత్రం ముట్టుకోకుండా మిగిలిన చోట్ల పునర్మిర్మాణాలు చేపట్టాలి. ఇందుకోసం పండితులు, వాస్తు నిపుణులు, ఆర్కిటెక్టులు సమన్వయంతో వ్యవహరించాలి. హనుమాన్ జయంతి, ఇతర రద్దీ రోజుల్లోనూ భక్తుల తాకిడిని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలి. 850 ఎకరాల్లో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలి. క్షేత్రాన్ని సందర్శించే భక్తుల వాహనాల కోసం 86 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి..’అని చెప్పారు. మాల ధారణ, విరమణ సజావుగా సాగాలి ‘కేవలం తెలంగాణ, పొరుగు రాష్ట్రాల భక్తులే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మాల ధారణ, విరమణ సమయంలో లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. అందుకు అనుగుణంగా పుణ్యక్షేత్రంలో రవాణా సదుపాయాలు, అన్ని ప్రధాన ద్వారాలు విస్తరించాలి. భవిష్యత్తులోనూ పెరిగే భక్తుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం మరికొన్ని ఆదేశాలు – రెండు నెలల్లో వరద కాలువ నుంచి పైపుల ద్వారా కొండగట్టు పైకి నీటిని తరలించాలి. భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా వసతి కల్పించాలి. (సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ఆదేశం) ఈ నీటితోనే నిర్మాణాలు కూడా చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి, పనులు వేగిరం చేయాలి. – విద్యుత్ సబ్ స్టేషన్, దవాఖానా, బస్టాండు, పార్కింగ్ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్ స్టేషన్, కళ్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మించాలి. – గుడి అభివృద్ధికి అవసరమైన శిల్పులను సమకూర్చాలి. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు పడుతుంది. ఆ లోపు బాలాలయాన్ని నిర్మించాలి. – కొండగట్టు అంజన్న అభయారణ్య ప్రాంతాన్ని మైసూరు–ఊటీ రహదారిలో ఉన్న, నీలగిరి కొండల్లోని బండీపూర్ అభయారణ్యం మాదిరి మార్చాలి. (అటవీశాఖ అధికారి భూపాల్ రెడ్డికి ఆదేశం). – మొదట మూలవిరాట్టును దర్శించుకున్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని, గుట్ట కింద బేతాళ స్వామిని, రాములవారి పాదుకలను దర్శించుకునేలా సర్క్యూట్‌ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలి. – క్షేత్రాన్ని సందర్శించే వీవీఐపీల కోసం యాదగిరిగుట్ట మాదిరి ప్రెసెడెన్షియల్ సూట్లు, వీవీఐపీ సూట్లు నిర్మించాలి. ఇందుకోసం స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తు నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలి. – అంజనాద్రి పేరుతో వేద పాఠశాలను నిర్మించాలి. అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలి. గుడి ఆదాయంపై ఆరా.. గుట్టలపై నుంచి సహజంగా ప్రవహించే ప్రవాహం (జలబుగ్గ) నుంచి నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధి గురించి, గుట్ట సమీపంలోని చెరువులపై సీఎం ఆరా తీశారు. గుడికి వస్తున్న ఆదాయం గురించి కూడా ఆరా తీశారు. ప్రభుత్వానికి చేస్తున్న జమలో వ్యత్యాసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహా కార్యం పూర్తయ్యే వరకు తాను వస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ దివకొండ దామోదర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, సంజయ్, కె.విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఆలయ స్తపతి ఆనంద్ సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆలయ ఈఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. గుడికున్న గుర్తింపును దేశవ్యాప్తం చేయాలి.. ‘కొండగట్టు అంటేనే ఆంజనేయుడి నిలయమన్న గుర్తింపు ఉంది. ఈ గుర్తింపును దేశవ్యాప్తం చేయాల్సిన సమయం వచ్చింది. అందుకే మాస్టర్ ప్లాన్ రూపొందించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుదాం. ఇప్పుడు ఆలయాభివృద్ధికి కేటాయించిన రూ.100 కోట్లు చాలకపోతే.. రూ.వెయ్యి కోట్లయినా ఇస్తా. ఇంకా కావాలన్నా ఇస్తా. అయితే ఆగమశాస్త్ర ప్రకారం.. వాస్తు నియమాలను అనుసరించి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సకల సౌకర్యాలతో పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలి. ఎక్కడ సౌకర్యాలు బాగుంటే అక్కడికి భక్తులు తప్పకుండా వస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలి..’అని కేసీఆర్ సూచించారు. -
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
కొండగట్టు ఆలయ అభివృద్ధి సీఎం కేసీఆర్ సమీక్ష
-
ప్రపంచాన్ని ఆకర్షించేలా కొండగట్టును తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్
►సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ముగిసింది. కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరారు. ► కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. 100 కోట్లతో చేపట్టబోయే ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు పనులు, వసతులపై అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలని అన్నారు. ►దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని తెలిపారు. ►ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని.. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. ►‘సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలి. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలి. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు. మళ్ళీ కొండగట్టు వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తాను’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ► కొండగట్టు ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు. ► ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కఅంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయానికి బయల్దేరారు. ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి పయనమయ్యారు. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొని అక్కడి నుంచి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించనున్నారు. తరువాత జేఎన్టీయూ వెళ్లి.. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. కాగా కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో 14న సాయంత్రం 4 గంటల నుంచి 15న మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయానికి గత వారమే రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే -
యాదాద్రి తరహాలో ‘కొండగట్టు’
కొండగట్టు(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వాస్తు సలహాదారు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 14న కొండగట్టు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆనందసాయి ఆదివారం స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అంజన్న దర్శనం తర్వాత కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్, ఇతర అధికారులు, నాయకులతో సమావేశమై ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ఆలయంలో ఇప్పుడున్న ప్రాకారంతోపాటు మరోదానిని నిర్మించాల్సి ఉందన్నారు. పుణ్యక్షేత్రంలో 1980 నాటి భవనాలు ఉన్నాయని, గర్భగుడిలోని స్వామివారు భక్తులకు కనిపించడంలేదని చెప్పారు. ఆలయానికి నాలుగువైపులా గోపురాలు, ముఖమండపం నిర్మాణాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తామని ఆనందసాయి వివరించారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు స్వామివారి చరిత్ర తెలిసేలా ప్రతీస్తంభంపై రాసి ఉంచుతామని చెప్పారు. ఆలయంలో 108 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం యోచిస్తున్నారని పేర్కొన్నారు. భేతాళ స్వామి, శ్రీరాముడి ఆలయం, సీతమ్మ కన్నీటిధారలు పరిశీలించిన ఆనంద్‌సాయి ఆలయంలో చాలామార్పులు ఉంటాయని వెల్లడించారు. ఈ సమాచారం మొత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
రాజన్నకు 50, అంజన్నకు 100 కోట్ల రూపాయల నిధుల విడుదల
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న ఆలయాలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం దక్కినట్లయ్యింది. మొన్న రాజన్న ఆలయానికి రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు.. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో ఆలయాల అభివృద్ధికి ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చినట్లయ్యింది. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సీఎం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. pic.twitter.com/spGZ3N4NUb — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2023 ఎములాడ జంక్షన్ల సుందరీకరణ.. రాజన్న గుడి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 18 జూన్ 2015న స్వయంగా గుడి, పట్టణం కలియ తిరిగారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇందుకు ఏటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించారు. ముందుగా రూ.71 కోట్లు మంజూరు చేశారు. అనంతరం వీటీడీఏ ఏర్పాటు చేసి కమిటీనీ ప్రకటించారు. చైర్మన్‌గా సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డిని నియమించారు. నిధులను వీటీడీఏ ద్వారానే ఖర్చు చేయాలని జీవో విడుదల చేశారు. వేములవాడ రాజన్న ఆలయం ఆ మేరకు ఆలయ అధికారులు రూ.410 కోట్లతో భక్తుల సౌకర్యాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. గతేడాది, ఈసారి బడ్జెట్లో రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. తాజా నిధులతో బద్దిపోచమ్మ గుడి వద్ద సేకరించిన భూమికి ప్రహరీ, బోనాల మంటపం నిర్మిస్తామని వీటీడీఏ వైస్ చైర్మన్ వెల్లడించారు. నగరమంతా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గుడి ట్యాంక్‌బండ్‌పై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ పనులు చేపడతామని, నందికమాన్ నుంచి వేములవాడకు చేరుకునే రోడ్డు సుందరీకరణ, జంక్షన్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గోదావరినదిలో పడవల పోటీ(ఫైల్) కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం.. దాని అనుబంధ ప్రాజెక్టుల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, గోదావరిఖని వంతెన, కోటిలింగాల బ్యాక్ వాటర్, లోయర్, మధ్య, ఎగువ మానేరు డ్యామ్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాను పర్యాటక క్షేత్రంగా మలచాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎప్పటిలోగా నెరవేరుతుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొండగట్టు కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బడ్జెట్లో రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత డిసెంబరు 7న జగిత్యాల సభలో స్వామివారికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం.. సరిగ్గా 50 రోజులకు తన మాట నిలబెట్టుకున్నారు. రానున్న 50 ఏళ్లలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాల్సి ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. నాంపల్లి గుట్ట నాంపల్లి గుట్టకు రోప్‌వే వేములవాడను తీర్చిదిద్దే క్రమంలో మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాంపల్లిగుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. వేములవాడకు వచ్చే కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేట్రాక్ నాంపల్లి గుట్టను ఆనుకుంటూ వెళ్లనుంది. దీంతో హైదరాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఇక్కడి పరిసరాలను తీర్చిదిద్దనున్నారు. ఈ పనులపై కేటీఆర్ ఇప్పటికే సమీక్షించారు కూడా. -
ప్చ్... ఏపీలోనే సీన్ లేదు!
ప్చ్... ఏపీలోనే సీన్ లేదు! -
కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!
‘ఊరు గాదు అడవి గాదు మాట్లాడే మనిషి లేడు ఒంటరి బతుకై పాయే ఒంటెలతో చావాయే దిక్కు మొక్కు లేని గల్ఫ్ బతుకవాయెనే కొడుకు చితికి పాయెనే!' అంటూ 'ఎడారి బతుకులు' కవితలో వాపోయాను. నిజమే కాని మన ఊర్లో మన కళ్ళ ముందు మన పశువుల కాపర్లు పడే కష్టాలు తక్కువేం కాదు సుమా! ఇంత చద్దన్నం కట్టుకొని వెళ్లిన వారు పొద్దంతా ఆ నోరులేని జీవాలతో వేగడం,రాత్రికి గాని ఇల్లు చేరలేకపోవడం అత్యంత కష్టమైన పనే కదా! ఒకప్పుడు సంపదంటే పశువులే. వాటితోనే పాడి, వ్యవసాయం, ప్రయాణాలు కూడా. అలాంటి పశువులు, వాటి పోషణే నేటికీ చాలా మంది బతుకు దెరువు మరి. అలా పశువులు కాస్తూ మంద నుండి తప్పిపోయిన ఒక గేదెను వెతుకుతూ కొండపైకి వెళ్లిన, ప్రస్తుత జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సింగం సంజీవుడికి పొదల్లో హనుమంతుడి విగ్రహం కనబడిందట. మరునాడు భార్య ఆశమ్మతో కలిసి వచ్చి ఆ స్వయంభూ స్వామిని వెలుగులోకి తెచ్చి, దానికో చిన్న గుడికట్టి, అందరికన్నా ముందు కొండగట్టు ఆంజనేయుడికి మొక్కిన వారు ఆ గొల్ల దంపతులు. ఇది దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నాటి మాట. ఆ తర్వాతి కాలంలో కృష్ణారావు దేశముఖ్ అనే దొరవారు ఆ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంవల్ల స్వామివారి దర్శనానికి వచ్చి పోయే భక్తుల సంఖ్య పెరగడం, 1968 లో దాని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖవారు చేపట్టడం జరిగింది. చాత్తాద వైష్ణవులే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేది. జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కి మీ దూరంలో, కరీంనగర్ హైవే పైనున్న కొండగట్టు దేవస్థానం ఏడాది పొడుగునా వచ్చిపోయే హనుమాన్ భక్తులతో కళకళలాడుతుంటుంది. 'ఆంజనేయ స్వామి దీక్ష'ల కాలంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత భక్త జనం. అయితే ఇక్కడ సరియైన రోడ్లు లేకనే చాలా బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలకు జవాబా అన్నట్లుగా ఇటీవలే జగిత్యాల జిల్లా సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ ఈ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ప్రకటించడం విశేషం. 'బల్మూరి కొండాలరాయుడా నీ చరిత పౌరుషానికి మారు పేరురా!' అని ఇక్కడ జానపదులు పాడుకునే పాట. మానాల, పొలవాస, ఎలగందుల నుండి గోల్కొండ వరకు పేరు గాంచిన కొండాలరాయుడు ఈ గట్టును తన స్థావరంగా వాడుకున్నాడని అందుకే దీన్ని కొండగట్టు అన్నారని కొందరంటారు. సంజీవుడు ఆశమ్మలు ఆంజనేయస్వామికి చేసిన సేవలకు శాసనాధారం కూడా చూపుతున్నారు కాబట్టి ఆ గొల్ల దంపతుల విగ్రహాలు, పౌరుషానికి మారు పెరైన కొండలరాయుడి విగ్రహము కూడా కొండగట్టుపై పెట్టడం సమంజసంగా ఉంటుంది. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి... చదవండి: Sagubadi: అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే.. -
కొండగట్టు అంజన్న చినజయంతికి పోటెత్తిన భక్తజనం
సాక్షి,కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంకు లక్షలాది మంది భక్తులు, దీక్షాపరులు తరలిరావడంతో కాషాయమయమైంది. హనుమాన్ చినజయంతి సందర్భంగా తెలంగాణతోపాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, దీక్షాపరులు తరలివచ్చారు. కొందరు పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకున్నారు. మరికొందరు సొంత వాహ నాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. తొలుత కోనేటిలో స్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశాక మాల విరమణ చేశారు. వీరికోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Kondagattu: ఔషధాల ‘కొండగట్టు’
కొండగట్టు(చొప్పదండి): ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక నిలయం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండపై ఈ క్షేత్రం ఉంది. సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఆరోగ్యం బాగోలేకపోయినా, మతిస్థిమితం సరిగా లేకపోయినా కొద్దిరోజులు కొండపై నిద్రచేస్తే నయం అవుతుందని భక్తుల విశ్వాసం. అయితే కొండపై ఆధ్యాత్మికతతో పాటు ఔషధ మూలికలు ఉన్నాయని ఇటీవల శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర ఆచార్యుల పరిశోధనలో వెల్లడైంది. 333 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై 300 రకాల ఔషధ మూలికల చెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ చెట్టుపేరు కుమ్మరిపోనికి. ఇలాంటి మొక్కలు, చెట్లు కొండపై వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుపు రంగులో ఉంటుంది. ప్రత్యేకంగా నిర్మల్ కొయ్యబొమ్మల తయారీలో వాడుకోవచ్చు. ఈ మొక్కలను వెటర్నరీ మందుల తయారీకి కూడా వాడుకోవచ్చని, మొత్తంగా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని ‘కుమ్మరిపోనికి’ ఫారెస్టుగా కూడా పిలుస్తారని శాతవాహనయూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి వెల్లడించారు. 333 ఎకరాలు.. 300 రకాల మొక్కలు కొండగట్టు గుట్ట విస్తీర్ణం 333 ఎకరాల్లో ఉంటుంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ దాటాక కొండపైకి చేరుకునే మార్గంలో, ఘాట్‌రోడ్డు మార్గంలో, ఆలయం ఆవరణలో 300 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ కొండగట్టు అటవీప్రాంతంపై ఎస్సారార్ కళాశాల అధ్యాపకులు పరిశోధన చేశారు. మళ్లీ కొన్నేళ్లతరువాత శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి, విద్యార్థి బాణవత్ సురేశ్ నాయక్ పరిశోధనలు చేయగా.. ఔషధమొక్కల గురించి తెలిసింది. జీవవైవిధ్యపరంగా ఇవి చాలా ముఖ్యమైనవని, వస్తువుల తయారీ, మనుషులు, జంతువుల మందుల తయారీలో ఉపయోగపడతాయని వారు వెల్లడించారు. మొక్కలు.. లాభాలు కొండగట్టు ప్రాంతంలో ఉన్నవి గిరి అడవులు(హిల్ఫారెస్ట్). ఎక్కువగా కుమ్మరిపోనికి చెట్లు ఉంటాయి. ఇవీ తెలుపు రంగులో ఉంటాయి. వృక్షశాస్త్ర పరంగా కైరోకార్పస్ అమెరికాన్స్గా పిలవబడతాయి. ప్రధానంగా ఎడ్లపాల, పాలకొడిసె, బిల్లుడు, తపసి, ఎర్రబోరుగా, నల్లకోడిసా, అందుకు, నల్లగా, ఎక్కువశాతం కుమ్మరిపోనికి, బ్యూటియా మోనోస్పెర్మ, టేకు, పోంగా, మియాపిన్, ఏటా కానుగు, తెల్లపోనికి, టేకు, నల్లాకోడిషా చెట్లతో పాటు వందల సంఖ్యలో ఔషధమొక్కలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా కొండగట్టులోనే ఇలాంటి ఔషధమొక్కలు ఉన్నాయి. ఇవీ కొండపై ఆక్సిజన్ కలుషితం కాకుండా చేస్తాయి. వివిధ రకాల రోగాలు నయమయ్యేందుకు పనిచేస్తాయి. వర్షపాతం నమోదుకు దోహదపడి వర్షాలు పడేందుకు ప్రధానభూమిక పోషిస్తాయి. రామగిరి గుట్టల్లోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయి. ఇతిహాసం చెబుతోందిదే..! ఇతిహాసంలో రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడి ప్రాణానికి అపాయం ఏర్పడినప్పుడు హనుమంతుడు సంజీవనిని తీసుకెళ్తున్న క్రమంలో కొండనుంచి ఓ రాయి పడి.. కొండగట్టుగా వెలిసిందని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే వందలాది ఔషధమొక్కలు కొండపై పెరిగాయని, అవన్నీ ప్రాణాపాయంలో, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడేవారికి సంజీవనిగా పనిచేస్తాయని, అందుకే చాలామంది అనారోగ్యంతో బాధపడేవారు కొండపై నిద్రచేస్తే, రోగాలు నయం అవుతున్నాయని భక్తుల విశ్వాసం. అడవి రక్షణ మనబాధ్యత వందలాది ఔషధమొక్కలున్న కొండప్రాంతంలోని అడవిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటికే ఇక్కడ వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. రోడ్డు, రైలుమార్గంతో ప్రజారవాణా పెరుగుతోంది. కొండపైకి వచ్చే భక్తులు విలువైన చెట్లను వంటచెరుకుగా వినియోగించడంతో అడవులు అంతరించిపోతున్నాయి. కొండగట్టు జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు మార్గాలు సిద్ధం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవవైవిధ్యమండలికి అందిస్తాం. రాబోయేకాలంలో గుట్టపై సీట్బాల్ విసిరేలా సర్కారును కోరుతాం. కొండగట్టు పరిసర ప్రాంతాల వారు, వచ్చే భక్తులకు ఈ విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. మా పరిశోధన కూడా ఇంకా పూర్తికాలేదు... కొనసాగిస్తాం. – డాక్టర్ ఎలగొండ నరసింహమూర్తి, శాతవాహన విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు మొక్కల సంరక్షణకు కృషి చెట్లతోనే మానవ మనుగడ. అవిలేకుంటే మనమూ లేము. కొండపై ఉన్న విలువైన ఔషధమొక్కల సంరక్షణ కోసం తోటమాలిని ఏర్పాటు చేశాం. ప్రతీ మొక్కకి నిత్యం నీరు పట్టడమే కాకుండా, నిత్యం సంరక్షిస్తున్నాం. కొండకు వచ్చే భక్తులకు చెట్ల ద్వారా ప్రశాంత వాతవరణం అందుబాటులో ఉంటోంది. నిత్యం నేనూ మై లైఫ్.. మై ట్రీస్ అనే విధంగా ఉంటా. – వెంకటేశ్, ఈవో, కొండగట్టు -
కళతప్పిన కొండగట్టు
-
యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొండగట్టు దేవస్థానం ఆవరణలో రూ.90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపానికి మంగళవారం భూమిపూజ చేశారు. అంతకుముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్సీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఆలయాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తోంది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇప్పటికే రూ.వెయ్యికోట్లు వెచ్చించి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని బ్రహ్మాండంగా పునర్ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే హనుమాన్ జయంతిలోపు స్తూపం పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ నెల 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించి.. కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పెద్దహనుమాన్ జయంతిలోపు స్తూపం సిద్ధం అవుతుందని తెలిపారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, భక్తులు ఆధ్వర్యంలో కొండగట్టు సేవాసమితి పేరుతో అఖండ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం హనుమాన్ చాలీసా పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఈవో చంద్రశేఖర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఎంపీపీలు విమల, స్వర్ణలత పాల్గొన్నారు. రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కోవిడ్–19 నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శానిటైజర్లు, మాసు్కలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులు భౌతికదూరం పాటించేలా అధికారులు సమన్వయం చేసుకుంటూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భక్తుల భద్రతకు భారీపోలీసు బందోబస్తు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం
-
ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం
జగిత్యాల: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమెకు ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన కల్వకుంట్ల కవిత కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రాజారాంపల్లి వద్దకు రాగానే జగిత్యాల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కారు కొద్దిగా తగిలింది. అప్రమత్తమైన కవిత కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రవిశంకర్ కార్లలోనే ఉన్నారు. అయితే వారికి గాయాలు కాలేదని.. సురక్షితంగా బయటపడ్డారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎడ్లబండ్లు యాడికిపాయే!
సాక్షి, కొండగట్టు(జాగిత్యాల) : గ్రామాల్లో ఒకప్పుడు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే రవాణా సౌకర్యాం కోసం ఎండ్లబండి మీదనే ప్రయాణాలు సాగించే వారు. బంధువుల ఇంటికి, ఇతర గ్రామాలకు వెళ్లాలన్న అప్పటి గ్రామీణ ప్రజలకు ఎండ్లబండిని ముఖ్య ఆధారం చేసుకునేవారు. దీంతో బండిలో ప్రయాణం చేసేందుకు పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తు వెళ్లేవారు.పొలం పనులకు, ఇతరత్ర పనులకు ఎడ్లబండిని వినియోగించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఇంటికో కారు, ద్విచక్రవాహనం ఉన్నాయి. గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులోకి రావడంతో ఎండ్లబండి ప్రయాణం కనుమరుగైంది. అనాటి ఎండ్లబండి ప్రయాణం నేటికి మర్చిపోని తీపి జ్నాపకం. ముడిసరుకుల రవాణాకు ఎండ్లబండినే ఉపయోగించేవారు. వ్యవసాయంపై వచ్చిన పంటధాన్యాన్ని తమ ఇండ్లలోకి బండ్ల ద్వారానే తరలించేవారు. ప్రస్తుతం అంతా యంత్రాల మయంగా మారింది. ఆ కాలంలో యంత్రాలు లేకపోవడంతో వరిధాన్యాలకు ఎండ్ల బండ్లను ఉపయోగించేవారు. కాలుష్యం ఉండేది కాదు ఆకాలంలో బండ్ల ద్వారా రవాణా ఉండటం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండేది కాదు. నేడు ట్రాక్టర్లు, వ్యాన్లు, లారీలు, డీసీఎం వంటి వాహనాలతో ఎంతో కాలుష్యం వెలువడుతోంది. దీంతో బండ్ల ఆదరణ తక్కువయింది. గ్రామానికి ఒకటైనా కానరావడం లేదు. ఆరోజుల్లో ప్రయాణం సురక్షితంగా ఉండేది. తీర్థయాత్రలకు సైతం కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు ఎండ్ల బండిలోనే వెళ్లేవారు. దీంతో వారి అనుభూతులు ఆప్యాయతలు తెలుపుకునేవారు. దీంతో కాలుష్యం కాకుండా ప్రమాదాలు కూడా అయ్యేవి కావు. మొత్తానికి రానున్న రోజుల్లో ఎండ్లబండ్ల పుస్తకాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొననుంది. -
కొండగట్టు కాషాయమయం
కొండగట్టు (చొప్పదండి): తెలంగాణలోని పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం శుక్రవారం కాషాయమయమైంది. హనుమాన్ చిన్నజయంతి సందర్భంగా దీక్షాపరులు భారీ సంఖ్యలో వచ్చి మాలవిరమణలు చేసుకొని మొక్కులు చెల్లించారు. లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాల కలెక్టర్ శరత్, బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఏటా చైత్రపౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, పట్టువస్త్రాలంకరణ చేశారు. భక్తులకు సరిపడా తాగునీరు లేక ఇబ్బంది పడ్డారు. పాతకోనేరులో నీరు బురదగా మారడంతో భక్తులు ఒక్కో బకెట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేశారు. -
నెలరోజులైనా పరిహారం ఇవ్వరా?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆర్టీసీ ప్రమాద బాధిత కుటుంబాలు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం ఆందోళన లు ఉధృతం చేస్తున్నాయి. ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నా.. పరిహారం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిహారం కోసం ఈ నెల ఐదో తేదీన జగిత్యాలలో ధర్నాకు దిగిన విషయం విదితమే. జాయింట్ కలెక్టర్ రాజేశం హామీతో ఆందోళనను విరమించిన మృతుల కుటుంబాలు.. బుధవారం మళ్లీ కొడిమ్యాల, మల్యాల మండలాల సరిహద్దు దొంగలమర్రి వద్ద దర్నా నిర్వహించా లని మంగళవారం నిర్ణయించారు. ఇది తెలుసుకున్న మల్యాల సీఐ, కొడిమ్యాల ఎస్ఐ ధర్నా చేయకుండా భగ్నం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందుతుందని, జిల్లా అధికారులతో మాట్లాడిస్తామన్నారు. 40మంది బాధిత కుటుంబాలు కలెక్టర్ శరత్, జేసీ రాజేశంను కలసి తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరాయి. వారం లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటా నని కలెక్టర్ చెప్పడంతో వారు శాంతించారు. త్వరలోనే ఆదుకుంటాం: కలెక్టర్ కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలను త్వరలోనే ఆదుకుంటామని కలెక్టర్ శరత్ తెలిపారు. అంత్యక్రియలకు రూ.20 వేలు ఇచ్చామని. ఆర్టీసీ రూ.3లక్షల చొప్పున అన్ని కుటుంబాలకు పంపిణీ చేశారన్నారు. ప్రభు త్వం నుంచి రావాల్సిన రూ. 5లక్షలు త్వరలోనే మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి దయనీయం: ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న.. వికలాంగులుగా మారిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైంది. బాధితులం దరూ నిరుపేదలే కావడంతో మెరుగైన వైద్యం పొందలేని స్థితిలో ఉన్నారు. మండల పరిధిలో గాయాలపాలైన 43 మందిలో కొందరు పూర్తి గా కోలుకోలేకపోయినా.. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు వారిని డిశ్చార్జి చేశారు. కాళ్లూ చేతులు విరిగి మంచానికే పరిమితమైన వారు రెండ్రోజులకోసారి వైద్య పరీక్షలకు వెళ్లాలన్నా రవాణా ఖర్చులు లేక వెళ్లలేని స్థితిలో ఉన్నారు. -
ఎవరిని కదిలించినా కన్నీళ్లే
-
కన్నీటిపేట
-
పల్లె గుండె పగిలింది
ఈ చేతితోనే బువ్వ పెట్టాను.. ఈ చేతితోనే నడక నేర్పాను.. ఈ చేతితోనే పాడె మోయాలా.. ఈ చేతితోనే కొరివి పెట్టాలా.. ఒకే రోజు 50 అంత్యక్రియలు..ప్రమాదంలో కొడిమ్యాల మండల పరిధిలో మొత్తం 51 మంది చనిపోగా.. 50 మంది అంత్యక్రియలను ఆయా కుటుంబీకులు పూర్తి చేశారు. శనివారంపేటలో 13 మంది, డబ్బు తిమ్మయ్యపల్లిలో 10 మంది, రాంసాగర్‌లో 10, హిమ్మత్‌రావుపేటలో 9, తిర్మలాపూర్‌లో 5, కోనాపూర్‌లో 2, సండ్రలపల్లిలో ఒకరి చొప్పున 50మంది అంత్యక్రియలు జరిగాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, జగిత్యాల: పల్లె గుండె పగిలింది. నిన్నటి వరకు జనంతో కిక్కిరిసిన పల్లె.. ఇప్పుడు వల్ల్లకాడును తలపిస్తోంది. శుభకార్యాలకు డప్పు కొట్టిన వాళ్లే చావు డప్పులు కొట్టారు. ఎవరిని తట్టినా.. గుండె పిండేసే బాధే.. ఏ మోము చూసినా కళ్లలో నీటి సుడులే.. ఎటు చూసినా అంతిమయాత్రలే.. అరగంటకో పాడె వెళ్తున్న దృశ్యాలే.. బరువెక్కిన గుండెలతో అగ్గి మోసుకెళ్తున్న తండ్రులు, కుమారులు.. తల్లిదండ్రులకు కొరివి పెట్టిన తనయులు.. చితి ఆరకముందే మరో చితికి సిద్ధం అవుతున్న బంధువులు.. కన్నపేగు కడచూపునకు నోచుకోని తల్లిదండ్రులు.. బిడ్డ చనిపోయిన సంగతి తెలియక అపస్మారక స్థితిలో తల్లి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ బిడ్డ అంత్యక్రియలకు అంబులెన్సులో వచ్చిన తల్లులు.. ఇళ్ల ముందు శవాలు పెట్టుకుని అయినవారి కోసం ఎదురుచూసిన అభాగ్యులు.. ఎవరిని కదిలించినా వర్ణించలేని బాధే.. ఇదీ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని డబ్బుతిమ్మయ్యపల్లి, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, కోనాపూర్, తిర్మలాపూర్, సండ్రాలపల్లి గ్రామాల పరిస్థితి. మంగళవారం శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మల్యాల మండలం కొండగట్టు వద్ద ఘాట్ రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 60మంది మృతి చెందారు. మృతుల్లో 51 మంది కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారే కావడంతో ఆయా పల్లెల్లో అంతులేని విషాదం నెలకొంది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన అంత్యక్రియలతో పల్లెలన్నీ మరుభూములను తలపించాయి. నాలుగైదు ఇళ్లకో మృతదేహం.. కొడిమ్యాల మండలంలోని శనివారంపేట గ్రామం నుంచి ఏకంగా 13 మంది దుర్మరణం చెందడంతో ఆ పల్లెలో పెను విషాదాన్నే నింపింది. ప్రతి నాలుగైదు ఇళ్లకో మృతదేహంతో.. ఆ గ్రామం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. ఒక శవయాత్ర తర్వాత మరొకటి.. కాటికి వెళ్లింది. రోజూ ఉదయమే వెళ్లొస్తానని చెప్పిన తన పెనిమిటి తిరిగిరాని లోకానికి వెళ్లాడని తెలిసి దాన్ని జీర్ణించుకోలేని భార్య. అమ్మా.. నాన్న ఇక రాడా..? అని పదే పదే అమాయకంగా అడిగే పిల్లలు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకుంటే మధ్యలోనే వదిలివెళ్లిన తమ కొడుకు ఇక లేడనే తల్లిదండ్రుల రోదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. గ్రామంలో 13 మందికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించగా.. చివరి చూపులకు వచ్చిన మృతుల బంధుమిత్రులతో శనివారంపేట కిక్కిరిసింది. వచ్చినంత మందిని ఎక్కించుకున్నం: పరమేశ్వర్, కండక్టర్ బస్సులో 105 మంది ప్రయాణికులు ఉన్న మాట వాస్తవం. కొండగట్టు గుట్ట వరకు టికెట్లిచ్చిన. తర్వాత మరి కొందరు బస్సెక్కారు. వాళ్లకు టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే ప్రమాదం జరిగింది. వచ్చినంత మందిని ఎక్కించుకున్నం. ఇంకో బస్సు లేదు. కిందికి దిగే సమయంలో మైలేజీ కోసం న్యూట్రల్ చేసిండని చెప్పిన్రు. అంత్యక్రియలకు ట్రాక్టర్లపైనే.. కొడిమ్యాల (చొప్పదండి): కుటుంబ సభ్యుల మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వారే అంత్యక్రియల ఏర్పాట్లను చేసుకోవాల్సిన పరిస్థితి. కుటుంబసభ్యులు, బంధువులే పాడెను కట్టారు. శ్మశానంలో కట్టెలు పేర్చారు. సంప్రదాయ కార్యక్రమాలను కూడా సొంత మనుషులే నిర్వహించారు. చివరకు అంత్యక్రియల నిర్వహణ ఇబ్బందిగా మారడంతో చాలా వరకు మృతదేహాలను ట్రాక్టర్లలోనే శ్మశానానికి తరలించారు. అమ్మను దక్కించుకోలేకపోయాం నేను తిర్మలాపూర్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమ్మ పుష్పలతతో కలసి జగిత్యాల హాస్పిటల్‌కు బయల్దేరాం. బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. కొండగట్టు ఘాట్‌రోడ్డు మూలమలుపు వచ్చేసరికి బస్సు డ్రైవర్ పట్టు కోల్పోయాడు. కిందికిదూకి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అరిచాడు. ఇంతలోనే బస్సు గోతిలో పడింది. సీట్లో కూర్చున్న అమ్మపై చాలామంది పడ్డారు. నేను నిలబడి ఉండటంతో ప్రాణాలు దక్కాయి. నాచేయి విరిగింది. మా అమ్మను అంబులెన్స్‌లో జగిత్యాలకు, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించినా ప్రాణాలు దక్కలేదు – తైదల అర్చన కన్ను తెరవకముందే కన్నుమూశారు! కొడిమ్యాల (చొప్పదండి): బస్సు ప్రమాదంలో ముగ్గురు గర్భస్థ శిశువులు కళ్లు తెరవకముందే కన్నుమూశారు. ఈ లోకంలోకి అడుగుపెట్టక ముందే పరలోకాలకు వెళ్లిపోయారు. కొడిమ్యాల మండలంలోని శనివారంపేట గ్రామానికి చెందిన ఎండ్రిక్కాయల సుమలత (26)కు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవం కోసం అత్తతో కలిసి జగిత్యాల ఆసుపత్రికి బస్సులో వెళ్తూ ప్రమాదంలో కన్నుమూసింది. అదే గ్రామానికి చెందిన నామాల మౌనిక (21)కు ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఈమె కూడా బస్సులో ఆసుపత్రికి వెళ్తూ మృతి చెందింది. డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ సుమలత (21)కు 8 నెలల క్రితం పెళ్లయ్యింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. వైద్య పరీక్షల కోసం జగిత్యాలకు వెళ్తూ ప్రమాదంలో అసువులు బాసింది. దీంతో బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. మంచుగడ్డలపైనే శవాలు.. కొడిమ్యాల(చొప్పదండి): కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలోని 5 గ్రామాలకు చెందిన 51 మంది మృతి చెందడంతో మృతుల కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా ఫ్రీజర్లను తెప్పించారు. అయినా అందరికీ సరిపోలేదు. పోస్టుమార్టం అనంతరం మంగళ వారం రాత్రి ఇళ్లకు తరలించిన మృతదేహాలను బంధువులు మంచుగడ్డలపై ఉంచి, పైనుంచి ఊక పోశారు.సరైన జాగ్రత్తలను తీసుకోక ప్రమాదానికి కారణమైన అధికారులు.. కనీసం ఫ్రీజర్లను కూడా అందుబాటులో ఉంచకపోవడంపై మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరి చూపు కూడా దక్కలేదు.. కొడిమ్యాల (చొప్పదండి): ఘాట్‌రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తమ వారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లిన కుటుంబ సభ్యులు. రాంసాగర్ గ్రామానికి చెందిన గాజుల హర్షవర్ధన్ తండ్రి అశోక్ సౌదీకి, శేర్ల హేమ భర్త అశోక్ ఇరాక్‌కు, కొండ సాయివరుణ్ తండ్రి శేఖర్ దుబాయ్‌కి ఉపాధి కోసం వలస వెళ్లారు. అయిన వారు మృతి వార్త తెలిసినా కూడా తాము పనిచేస్తున్న కంపెనీల నుంచి అనుమతులు రాకపోవడంతో చివరి చూపులకూ నోచుకోలేదు. డ్రైవర్‌కు ఇదే మొదటి.. చివరి యాక్సిడెంట్! జగిత్యాలజోన్: కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాద సమయంలో ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్‌కు డ్రైవింగ్‌లో 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన డ్రైవింగ్ వృత్తిలో ఇదే మొదటి.. చివరి యాక్సిడెంట్ కావడం గమనార్హం. బస్సు ప్రమాదంలో తానూ బలయ్యాడు. శ్రీనివాస్ స్వస్థలం కరీంనగర్ జిల్లా అశోక్‌నగర్. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహమైంది. ఆర్టీసీలో 1998 మే 13న కాంట్రాక్ట్ డ్రైవర్‌గా చేరారు. 2002లో పర్మినెంట్ అయ్యారు. జగిత్యాల డిపోలో 2014 నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఏడాదికోసారి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఫిట్ అని తేలడంతోనే ఆ రూట్ బస్సును అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీనివాస్‌కు ఇంకా ఐదేళ్ల సర్వీస్ ఉంది. హెచ్చార్సీలో ఫిర్యాదు.. సాక్షి, హైదరాబాద్: కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కి ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్.. హెచ్చార్సీ కమిషనర్‌కు బుధవారం పిటిషన్ అందజేశారు. బస్సు ప్రమాదానికి కారణమైన డిపో మేనేజర్, సూపర్ వైజర్, ఆర్టీవోలపై కేసులు నమోదు చేయాలని కోరారు. 60కి చేరిన మృతులు.. బస్సు ప్రమాద ఘటనలో బుధవారం మరో ముగ్గురు కన్నుమూశారు. దీంతో ప్రమాద మృతుల సంఖ్య 60కి చేరింది. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌కు చెందిన చిదురాల రజిత (38) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె భర్త సదయ్య తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లెకి చెందిన గోల్కొండ సుమలత (21) ఏడు నెలల గర్భిణి కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. వైద్య పరీక్షల నిమిత్తం పుట్టింటికి వచ్చిన రజిత తన తల్లి విజయతో కలిసి వెళ్తూ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. కొండగట్టుకు చెందిన పసులోటి లక్ష్మి (60) జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది. మరో 45 మంది క్షతగాత్రులు కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకునేందుకు ఢిల్లీకి చెందిన సేవ్ లైఫ్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అభిజిత్, సౌరవ్‌లను కొండగట్టుకు పంపింది. తల్లిదండ్రులు ఒడ్నాల లస్మవ్వ, కాశీరాంలకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుమారుడు ఒడ్నాల అంజయ్య కంట్రోల్ చేయలేకపోయాడు అమిత్ రవిదాస్, జార్ఖండ్ మాది జార్ఖండ్‌లోని అంజోర ఫిరోజ్‌పూర్ గ్రామం. బట్టలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతాను. కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ కళాశాల వద్ద బస్సు ఎక్కాను. బస్సులో ప్రయాణికులు చాలామంది ఉన్నారు. కొండ దిగే సమయంలో బస్సును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో ఆకస్మాత్తుగా అదుపు తప్పి భారీ గుంతలోకి పడింది. కదిలిస్తే కన్నీళ్లే ‘నా చేతులతోనే నీళ్లు పోసిన.. నా చేతులతోనే అన్నం తినిపించిన.. జ్వరం వచ్చిందని ఆస్పత్రిలో చూపించేం దుకు బస్సు ఎక్కిన.. 15 నిమిషాలకే ఏమైందో తెలియదు.. నా కొడుకు కనబడలే.. నా కొడుకు లేని బతుకెందుకు? నా కళ్లతోనే బిడ్డ దహన సంస్కారాలు చూసిన. ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండు’ అంటూ ఓ తల్లి బోరున విలపించింది. కొండగట్టు బస్సు ప్రమాదంలో ఎందరో తమ కొడుకులు, కూతుళ్లు, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కోల్పోయారు. మరి కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ‘సాక్షి’ కదిలించింది. ఎవరిని కదిపినా.. కన్నీళ్లే..! –జగిత్యాల టౌన్ చిన్నారుల అంత్యక్రియలకు అంబులెన్స్‌లో వచ్చిన తల్లులు బాబును ఒక్కసారి చూడనివ్వరూ.. శనివారంపేట గ్రామానికి చెందిన గాజుల లత (27) తన కొడుకు హర్షవర్ధన్ (3)కు జ్వరం రావడంతో జగిత్యాల ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కింది. ప్రమాదంలో లత, హర్షవర్ధన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుం డటంతో వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హర్షవర్ధన్ మృతి చెందాడు. బుధవారం స్పృహలోకి వచ్చిన లత ‘నా బిడ్డ ఎక్కడ’ అని కన్నీళ్లు పెడుతూ అందరినీ వేడుకుంది. కొడుకు మృతి గురించి తెలుసుకుని గుండెలు బాదుకుంటూ రోదించింది. ‘కడసారి చూపునైనా చూడనివ్వండి’ అంటూ బంధువుల కాళ్లావేళ్లా పడింది. తల, కాళ్లకు, నడుముకు బలమైన గాయాలైన ఆ తల్లి అంబులెన్స్‌లో స్వగ్రామానికి చేరుకుని కొడుకును కడసారి చూసుకుంది. బిడ్డా..ఒక్కసారి కనపడవా! కొడిమ్యాల(చొప్పదండి): ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నరకయాతన ఓవైపు.. తొమ్మిది నెలలు మోసి, కనిపెంచిన పిల్లలు చనిపోయిన హృదయవేదన మరోవైపు.. ఆ మాతృమూర్తుల మనసులను రంపపుకోత కోశాయి. అంబులెన్సుల్లోనే అంత్యక్రియలకు హాజరై కన్నపేగుకు కడసారి వీడ్కోలు పలికారు. కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన బైరి కీర్తన తన కూతురు రితన్య (4)కు ఆరోగ్యం బాగా లేక పోవడంతో మంగళవారం జగిత్యాలకు బయల్దేరింది. కొండగట్టు ఘాట్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో రితన్య చనిపోగా.. కీర్తన కాలు విరిగింది, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురు మరణించిందన్న వార్త విన్న ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. అంబులెన్సులోనే కూతురు అంత్యక్రియలకు హాజరైంది. కొడుకు మృతి.. ఆస్పత్రిలో అమ్మ.. హిమ్మత్‌రావుపేట గ్రామానికి చెందిన శైలజ తన కొడుకు అరుణ్‌సాయికి అనారోగ్యంగా ఉండటంతో తన తల్లి భాగ్యవ్వతో కలిసి జగిత్యాలలోని ఆస్పత్రికి బయలుదేరింది. ప్రమాదంలో తల్లి భాగ్యవ్వతోపాటు కొడుకు అరుణ్ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఛాతీ ఎముకలు విరిగి తీవ్రగాయాలైన శైలజ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘం డబ్బులు చెల్లించేందుకు వెళ్తే.. కొంపల్లి విజయ, తిమ్మయ్యపల్లి, కొడిమ్యాల స్వశక్తి సంఘం డబ్బులను నాచుపల్లి బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్లాను. కొండగట్టు దిగి నాచుపల్లి వెళ్లాల్సి ఉంది. గుట్ట దిగే సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదం జరిగింది. తల, కాళ్లకు తీవ్రగాయాలతోపాటు చెయ్యి విరిగింది. ఆస్పత్రికి వచ్చాకే స్పృహలోకి వచ్చాను. దేవుడి దయతో నా తల్లి, కొడుకు క్షేమం సీహెచ్.లక్ష్మీనారాయణ,బాధితుల కుటుంబ సభ్యులు, తిమ్మయ్యపల్లి మా అమ్మ విజయతోపాటు వాళ్ల ఊరికి వెళ్తానని నా కొడుకు సూరజ్ మారాం చేయడంతో తిమ్మయ్యపల్లిలో వారిని బస్సు ఎక్కించాను. 10 నిమిషాలకే బస్సు ప్రమాదానికి గురైందని సమాచారం అందింది. పెద్ద ప్రమాదమని తెలిసి నా ఆశలు ఆవిరయ్యాయి. తల్లిని, కొడుకును చూశాకే నా మనసు కుదుటపడింది. అమ్మకు ఛాతీలో ఎముకలు విరిగాయి. కొడుకుకు కాలు విరిగింది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవుడి దయతో ఇద్దరూ బ్రతికే ఉన్నారు. -
కొండగట్టు ప్రమాదం: 60కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, జగిత్యాల : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ విషాదకర ఘటనలో 60 మంది మృతి చెందగా, క్షతగాత్రులను కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. కాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత కథనాలు... దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు నిర్లక్యం ఖరీదు! -
కొండంత విషాదం... కడసారి చూపుకోసం..
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): ఆపద్దర్మ మంత్రులు వచ్చారు.. పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వెళ్లారు. అధికారులు వచ్చారు.. సహాయక చర్యలు పరిశీలించి వెళ్లారు. వైద్య సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కానీ మృతి చెందినవారిని అందరూ గాలికొదిలేశారు. మృతి చెందిన వారి బంధువులెవరు.. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులేంటని పట్టించుకున్న నాదుడే లేడు. అయినవారి కడసారి చూపు కోసం ఫ్రీజర్ బాక్స్(ఐస్ బాక్స్)లో పెట్టే ఆర్థిక స్థోమత లేక మృతదేహాలను మంచు గడ్డలతో కప్పి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి కొడిమ్యాల మండల ప్రజలు చలించపోతున్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలో విషాదాన్ని నింపింది. ఈ మండలానికి చెందిన వారే సుమారు 49 మందికి పైగా మృత్యువాతపడ్డారు. దీంతో ఈ మండలంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం పరాయి దేశానికి వలస వెళ్లారు. కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ వారు మరణించిన విషయం తెలుసుకొని కడసారి చూపుకోసం హుటాహుటిని స్వస్థలానికి బయలుదేరారు. వారు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో లేక.. ఉన్నా వాటికి అద్దె కట్టే ఆర్థిక స్థోమత లేక.. అధికారులు పట్టించుకోకపోవడంతో మంచు గడ్డలతో మృతదేహాలని కప్పిపెట్టారు. కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 57 మంది దుర్మరణం -
నిర్లక్ష్యమే మృత్యుకుహరానికి కారణం
-
‘ఆర్టీసీ తప్పిదం వల్లే ప్రమాదం జరిగింది’
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షితో మాట్లాడుతూ.. ‘ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులు మాములుగా దొంగలమర్రి, నాచుపల్లి మీదుగా వెళ్లాలి. కానీ గత పది రోజులుగా బస్సులు కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం, బస్సు కండీషన్లో లేకపోవడం ప్రమాదానికి ఒక కారణం అయి ఉండొచ్చు. మూల మలుపు వద్ద బస్సు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగింది. మేము ఇక్కడికి చేరుకున్నప్పుడు ఇరవై మంది మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, ఆర్టీసీ తప్పిదం వల్లే జరిగింద’ ని తెలిపారు. ‘ఈ రూట్లో అసలు బస్సును నడపాల్సింది కాదు. దీనికి కారణమైన జగిత్యాల డిపో మేనేజర్, ఆర్టీసీ డీఎంపై చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డుపై గతంలో లారీ ప్రమాదం జరిగిందని.. అయినా ఘాట్ రోడ్డు భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల’ని స్థానికులు కోరుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో 55మంది మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
బస్సు ప్రమాదం: జగిత్యాల ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు!
-
కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 57 మంది మృతిచెందారు. ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి జగిత్యాల, కరీంనగర్‌లలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు. మృతుల వివరాలు: 1. నామాల మౌనిక (23), శనివారంపేట 2. బైరి రిత్విక్(3), రామసాగర్ 3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట 4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట 5. గండి లక్ష్మీ (60), శనివారంపేట 6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి 7. బండపల్లి చిలుకవ్వ(76) 8. గోలి అమ్మాయి(44), శనివారంపేట 9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్ 10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి 11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్ రావుపేట 12. బందం లస్మవ్వ (65) ముత్యంపేట 13. బొల్లారం బాబు (54), శనివారంపేట 14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట 15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట 16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట 17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి 18. ఉత్తమ్ నందిని , కోనాపూర్ 19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట 20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి 21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్ 22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట 23. కుంబాల సునంద (45), శనివారంపేట 24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట 25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట 26. దాసరి సుశీల (55), తిరుమలపూర్ 27. డ్యాగల ఆనందం(55), రామసాగర్ 28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట 29. చెర్ల హేమా(30), హిమ్మత్ రావుపేట 30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి 31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట 32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి 33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి 34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి 35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి 36.కొండ అరుణ్ సాయి(5), కోరెం 37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి 38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్ 39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్ 40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి 41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట 42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి 43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్ 44. బొంగోని రాంచరణ్ (09), రాంపెల్లి 45. చిర్రం పూజిత (15, జగిత్యాల 46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట 47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్ 48. చెర్ల మౌనిక (24), రాంసాగర్ 49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్) 50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్ 51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్‌రావుపేట 52. డ్యాగల స్వామి (32), రాంసాగర్ 53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట 54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్ 55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి 56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల 57. గోలి రాజమల్లు (60), శనివారంపేట -
అప్డేట్స్: బస్సులో మొత్తం 101 మంది.. 60 మంది దుర్మరణం..!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డులో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘోర రోడ్డు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 101 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారుల సమాచారం. సంఘటనా స్థలానికి బస్సు చేరుకునే సమయానికి కండక్టర్ 82 మందికి టికెట్ ఇచ్చారు. మిగతావారికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. అంతలోపే ఈ ఘోరం జరిగిపోయింది. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. కొండగట్టు ఘాట్ రోడ్డులోయలో పడిపోవడంతో ఈ ప్రదేశంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్... సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో చోటుచేసుకున్న ఘోర బస్సుప్రమాదం కేసులో విచారణ ప్రారంభమైంది. ఈ ఘటన నేపథ్యంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటనాస్థలాన్ని ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అధికారులు వారికి వివరించారు. మృతుల కుటంబాలను ఆదుకుంటామని, గాయపడిన వారికి పూర్తి చికిత్స అందించడంతోపాటు అండగా ఉంటామని కేటీఆర్, మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. సాయంత్రం 5.30 గంటలు: కొండగట్టు బస్సుప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. The bus accident in Telangana’s Jagtial district is shocking beyond words. Anguished by the loss of lives. My thoughts and solidarity with the bereaved families. I pray that the injured recover quickly. — Narendra Modi (@narendramodi) 11 September 2018 సాయంత్రం 4.30 గంటలు: కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లిన తమవారు.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను తరలించిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో ఉద్విగ్నంగా మారిపోయింది. ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తమవారిని మృత్యువు కబళించడంతో.. అయినవారు, ఆత్మీయులు బంధువులు గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద మహిళలు గుండెలు బాదుకొని రోదిస్తున్న దృశ్యాలు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. కొండంత విషాదం.. ఎవరిది నిర్లక్ష్యం.. ఎన్నెన్నో ప్రశ్నలు.. చదవండి కొండగట్టు బస్సుప్రమాదంపై పూర్తి కథనాలు అంజన్న భక్తులకు విషాదం ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది! కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే? సాయంత్రం 4 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై తెలుగులో, ఆంగ్లంలో ఆయన ట్వీట్ చేశారసు. తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మరియు గాయపడిన వారికి నా ప్రఘాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను. — President of India (@rashtrapatibhvn) 11 September 2018 Shocked to learn about the bus accident in Jagtial, Telangana. Thoughts with the bereaved families and those injured. I understand local authorities are making efforts to rescue and help passengers who have suffered #PresidentKovind — President of India (@rashtrapatibhvn) 11 September 2018 మధ్యాహ్నం 3.30 గంటలు: కొండగట్టు బస్సు ప్రమాదం పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆమె కోరారు. మధ్యాహం 3 గంటలు: కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో పసిపిల్లలు కూడా ఉన్నారని, గాయపడిన పిల్లలు అత్యవసరస్థితిలో ఉంటే ఆసుపత్రులు వారిని వెంటనే చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు పేదవారైతే వారికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ తరఫున సహాయం అందిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలు: జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, మంత్రి మహేందర్‌రెడ్డి.. మరికాసేపట్లో హెలికాప్టర్లో వెళ్లనున్న నేతలు -
బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. గతంలో ఇదే చోట ఓ లారీ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదమప్పుడే అధికారులు ఈ ఘాట్ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. కేవలం బైక్స్‌ను మాత్రమే అనుమతించేవారు. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుకు ప్రత్యామ్నయంగా బైపాస్ రోడ్డు కూడా ఉంది. కానీ గత మూడు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలను మళ్లీ అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్డు నుంచి హైవేపైకి కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రత్యమ్నాయ రోడ్డు ఉపయోగిస్తే మరో ఐదు కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతోనే ఆర్టీసీ అధికారులు డిజీల్‌కు కక్కుర్తిపడి బస్సులను షార్ట్‌కట్‌గా భావించిన ఘాట్‌రోడ్డు రూట్లో నడిపిస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా ఆర్అండ్బీ నిబంధనలకు విరుద్దంగా ఉందని గతంలోనే అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపుల గోడను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఆ గోడ నిర్మాణం చేబడితే ఈ ఘోర ప్రమాధం సంభవించేది కాదని, వారి నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 57మంది ప్రాణాలు కోల్పోయారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం..
-
ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి
సాక్షి, కొండగట్టు: అంజన్న దర్శనం పూర్తి చేసుకొని మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న భక్తుల ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. ఈ ఘోరప్రమాదంలో 57 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరికొంత మందికి తీవ్ర గాయలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పుత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 88 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘాట్ రోడ్ వద్ద బస్సు మలుపు తిప్పుతున్నప్పుడు ప్రయాణికులు ఒక వైపే ఒరగడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడి వుంటుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు. మంగళవారం కూడా కావడంతో కొండగట్టుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ.. బస్సులు ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఏపీ 28 జెడ్ 2319 నంబర్ ఆర్టీసీ బస్సు 88మందితో శనివారంపేట నుంచి జగిత్యాలకు బయలుదేరింది. రెగ్యులర్ డ్రైవర్ కాకుండా కొత్త డ్రైవర్ బస్సును నడిపిస్తున్నారు. డ్రైవర్ మలుపులను అంచనా వేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్ రెండు కాళ్లు విరిగిపోయాయి. అదే విధంగా ఘాట్ రోడ్డు వెడల్పు లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని స్థానికలు పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రహదారులను పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం స్థలం వద్ద మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
కొండగట్టలో ఘోర రోడ్డు ప్రమాదం ఫోటోలు
-
కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే?
సాక్షి, కొండగట్టు: ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 57 మందికిపైగా మృతి చెందగా, మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండగట్టులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను వేములవాడ డిపో మేనేజర్ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే బస్సు కండీషన్లోనే ఉందని.. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘాట్ రోడ్డుపై సైన్ బోర్డులు ఉన్నప్పటికి ఈ ప్రమాదం జరగడం బాధకరం అని పేర్కొన్నారు. బస్సు శనివారంపేట నుంచి కొండగట్టుకు బయలుదేరిందని తెలిపారు. బస్సులో ఎక్కువ శాతం మంది స్థానికులు ఉన్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం స్థానికుల సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. (ఈ విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం!
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 101 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. 44 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదు మృతదేహాలు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కొండగట్టు అంజన్న స్వామి భక్తులు. దేశ ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువగా 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు ఆపద్ధర్మ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు చెప్పారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదం చాలా బాధాకరం: రవాణ మంత్రి కొండగట్టు రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఆపద్ధర్మ రవాణ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కొండపై తొలిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. తను ఘటనాస్థలికి బయలు దేరుతున్నానని, ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద వివరాలను ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామన్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి కొండగట్టు ఆర్టీసీ ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి : కొండగట్టు రోడ్డుప్రమాదంపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. (ఈ విషాదానికి సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంజనీపుత్రుడిని దర్శించుకున్న పవన్
సాక్షి, కొండగట్టు(జగిత్యాల) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ. 11 లక్షల నగదును విరాళంగా అందజేశారు. రాజకీయ యాత్రను ఆరంభించబోయే ముందు కొండగట్టులో వెలసిన అంజనీపుత్రుడిని దర్శించుకుంటానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి 50 కార్ల భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ కరీంనగర్ చేరుకున్నారు. సాయంత్రం రాజకీయ యాత్రపై మీడియాతో మాట్లాడనున్నారు. -
పవన్‌కు తిలకం దిద్దిన లెజ్నేవా
సాక్షి, హైదరాబాద్ : అప్రహిత రాజకీయ యాత్రకు బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆయన భార్య అన్నా లెజ్నేవా వీరతిలకం దిద్దారు. హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి సాగనంపారు. సోమవారం హైదరాబాద్‌లోని నివాసం నుంచి పవన్ కొండగట్టు(కరీంనగర్ జిల్లా)కు పయనమయ్యారు. దాదాపు 50 వాహనాల్లో వందలమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయనను అనుసరించారు. కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం ఆయన తన యాత్ర ఉద్దేశాన్ని వివరించనున్నారు. ఇంటి వద్ద కోలాహలం : పవన్ యాత్రకు బయలుదేరనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన ఇంటివద్ద ఆదివారం రాత్రి నుంచే హడావిడి కనిపించింది. సోమవారం ఉదయానికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రష్యన్ జాతీయురాలైన లెజ్నేవా.. తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ధరించారు. సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి, బొట్టుపెట్టి భర్తను సాగనంపిన దృశ్యాలు చూసి అభిమానులు కేరింతలు వేశారు. కేసీఆర్‌తో కలిసిన తర్వాత.. : ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో 2014 ఎన్నికలకు ముందు సొంతగా జనసేన పార్టీని ఏర్పాటుచేసి బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇవ్వడం తెలిసిందే. గడిచిన నాలుగేళ్లుగా అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన.. ఇప్పుడు యాత్రకు తెరలేపారు. సమస్యలను అధ్యయనం చేసి, అవగాహన పెంచుకోవడం కోసమే యాత్ర చేస్తున్నట్లు చెప్పుకున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన పవన్.. పరిపాలన బాగుందంటూ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. తన కార్యక్షేత్రం ఏపీనే అని గతంలో వ్యాఖ్యానించిన ఆయన.. కేసీఆర్‌ను కలిసిన తెలంగాణ నుంచి యాత్రను ప్రారంభించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. యాత్ర ఇలా.. : జనసేన పార్టీ కీలక నేత హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం కొండగట్టు నుంచి ప్రారంభమయ్యే పవన్ యాత్ర మూడురోజులపాటు సాగనుంది. 23న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలతో సమావేశం, 24న కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ర్యాలీ, అదేరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో భేటీ కానున్నారు. -
పవన్ పర్యటనపై నిప్పులు చెరిగిన పొన్నం
కరీంనగర్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. మేడారం జాతర సందర్భంగా కొండగట్టు రద్దీ పెరిగిన నేపథ్యంలో పవన్ పర్యటనకి ఎలా పర్మిషన్ ఇచ్చారన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కి పవన్ కి మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. పవన్ మొక్కు తీర్చుకోవడానికి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పొన్నం పేర్కొన్నారు. కానీ, రాజకీయ మనుగడ కోసం వస్తే ఊరుకోమన్నారు. ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన చేస్తానంటే ఎలా పర్మిషన్ ఇస్తారని పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. నేరెళ్ల బాధితుల గురించి, తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడని పవన్ తెలంగాణలో ఎలా అడుగుపెడతాడంటూ పొన్నం ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటుని చీల్చడానికే పవన్ కొండగట్టు వస్తున్నాడన్నారు. తెలంగాణ ఇచ్చిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వస్తే పోలీసులు ఆంక్షలు విధిస్తారు. తెలంగాణాని వ్యతిరేకించిన పవన్ వస్తే రెడ్ కార్పేట్ పరుస్తారా అంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఏపి విభజన విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన వైజాగ్ లో దళిత మహిళపై జరిగిన అకృత్యం పై స్పందించిన పవన్ తెలంగాణపై ఎందుకు స్పందించలేదన్నారు. నేరెళ్లలో దళితులపై అరాచకత్వం సృష్టించిన ఘటన దేశాన్నే కదిలించిందని, పవన్ నిన్నెందుకు కదిలించలేదో సమాధానం చెప్పాలి అని పొన్నం డిమాండ్ చేశారు. -
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
జగిత్యాల: జగిత్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి మంగళవారం వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లన్నీ నిండిపోయి ఆలయం వెలుపల వరకు రద్దీ నెలకొంది. భక్తులు పవిత్ర కోనేరులో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. -
కిటకిటలాడుతున్న హనుమాన్ ఆలయాలు
► హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు భద్రాచలం : హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి ఆలయాలు భకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచే పలు ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రిలో శ్రీరామచంద్రస్వామి దర్శనానికి భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీతారాముల దర్శనానికి భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో హనుమాన్ మాలధారులు పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని మరో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పుణ్యక్షేత్రానికి భక్త జనం పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. -
కొండగట్టు వద్ద ప్రమాదం..ఇద్దరు మృతి
మల్యాల(జగిత్యాల): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు కారులో వరంగల్‌లో జరిగే వివాహానికి వెళ్తున్నారు. కొండగట్టు సమీపంలోకి వెళ్లగానే వారి వాహనం ముందు వెళుతున్న కంటెయినర్‌పై నుంచి ట్యాంకర్‌లాంటి భారీ వస్తువు కిందపడింది. దానిని తప్పించబోయి కారు రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు స్టేజీ వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ వ్యాన్ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న డీసీఎం వ్యాన్ కొండగట్టు వద్ద సబ్‌కంట్రోల్ రూం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. సుమారు 20 మీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. మృతుడు మానకొండూరు మండలానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సబ్‌కంట్రోల్ రూం ఉన్నా ఫలితం శూన్యం కొండగట్టు పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ట్రాఫిక్‌ను నియంత్రించడంతోపాటు, ప్రజలకు పోలీసులు మరింత అందుబాటులో ఉండేందుకు 2013లో అప్పటి ఎస్సీ శివకుమార్ పోలీస్ సబ్‌కంట్రోల్ రూం ప్రారంభించారు. అడపాదడపా సబ్‌కంట్రోల్ రూం తీస్తున్నప్పటికీ దాదాపు ఏడాదికాలంగా మూలనపడింది. స్థానికంగా పోలీసులు లేకపోవడంతో వాహనాల వేగానికి అడ్డుకట్టవేసేవారు కరువయ్యారు. -
శ్రీ ఆంజనేయం
మల్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి జయంతిని పురస్కరించుకుని లక్షలాది మంది తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు. రామలక్ష్మణ జానకీ..జైబోలో హనుమాన్ కీ.. శ్రీహనుమ..జయ హనుమ..జయజయ హనుమ.. అంటూ అంజన్న కీర్తిస్తూ వేలాదిమంది భక్తులు అంజన్న కొండకు తరలివచ్చారు. సుమారు రెండు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో, కాలినడకన అంజన్న సన్నిధికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఉత్సవమూర్తికి పట్టు పట్టువస్త్రాలు అలంకరించి, సహస్రనాగవల్లి అర్చన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాలు ముగియడంతో భక్తులు అంజన్న నీకొండకు మళ్లొస్తామంటూ తిరుగుపయనమయ్యారు. * హైదరాబాద్‌కు చెందిన కాంతితేజ కంపెనీ కుటుంబ సభ్యులు మూడురోజులుపాటు భక్తులకు అల్పాహారం, అన్నదానం చేశారు. బొజ్జపోతన్న నుంచి కొండపైకి మల్యాల ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మజ్జిగ అందించారు. కరీంనగర్ బాలాజీ ఆటోస్టోర్స్ వారు నీరు ఏర్పాటు చేశారు. * దీక్ష విరమణకు వెళ్లే దారిలో నీళ్లు నిలవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. మెట్లదారిని కింది వరకు పూర్తి శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లింది. మెట్లదారిలో చలివేంద్రం ఏర్పాటు చేసినా నీళ్లు నింపకపోవడంతోపాటు, చలివేంద్రాల నిర్వహణను పట్టించుకోలేదని భక్తులు విమర్శించారు. * మెట్లదారి వెంట దీక్షాపరుల కోసం కేశఖండన టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసినప్పటికీ ఉదయం 8గంటల వరకు తెరుచుకోలేదు. * కొండపైకి వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు కాలినడక ఇబ్బంది కలగకుండా వెళ్లగలిగారు. -
కొండగట్టుకు భక్తుల తాకిడి
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ఆంజనేయ ఆలయానికి భక్తుల రాక మొదలైంది. శుక్రవారం ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో పాల్గొనేందుకు హనుమాన్ మాల ధారులు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకోవటం ఆనవాయితీ. సాయంత్రానికి దాదాపు 40వేల మంది మాలధారులు ఇక్కడికి చేరుకుంటారని అంచనా. రేపు జరిగే ఉత్సవాల్లో లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. -
కొంగుబంగారం... కొండ గట్టు
పెద్ద పెద్ద వృక్షాలు... నిశ్శబ్ద వాతావరణం... నల్ల రాతి బండల గాంభీర్యత... పక్షుల కిలకిలా రావాలతో ఓ పక్కన ప్రశాంతతను ప్రసాదిస్తూనే, మరోపక్క ఆధ్యాత్మిక నిలయంగా వెలుగొందుతోంది... కొండగట్టు. అక్కడ కొలువైన ఆంజనేయస్వామి భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామ శివారులో... కొండగట్టు మీద... కోరంద పొదల మధ్యన పవన సుతుడు, శ్రీరామ పాదదాసుడు అయిన ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశాడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవ ంగా వెలుగొందుతున్నాడు. కొండగట్టులో ఆంజనేయ స్వామి... నారసింహస్వామి, ఆంజనేయస్వామి రెండు ముఖాలతో ఉంటాడు. నరసింహస్వామి అంటే సాక్షాత్తూ విష్ణుస్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీత ఉండడం విశేషం. ఆలయ ప్రాశస్త్యం.. ఐదు వందల ఏళ్ల క్రితం సింగం సంజీవుడనే వ్యక్తి ఆవులను మేపుతూ కొండకు రాగా, ఒక ఆవు తప్పిపోయింది. వెతికి వేసారి చివరికి ఓ చింతచెట్టు కింద సేదతీరుతుండగా స్వప్నంలో స్వామి కనపడి ‘నేను కోరంద పొదల్లో ఉన్నాను. నాకు కాస్త ఎండ.. వాన.. ముండ్ల నుండి రక్షణ కల్పించు. నీ ఆవు ఇదిగో, ఇక్కడే ఉంది’ అని చెప్పాడు. సంజీవుడు నిద్రలోంచి లేచి చూడగా ఆవు ఎదురు వచ్చింది. వెంటనే కోరంద పొదలను తొలగించి చూస్తే శంఖు, చక్ర గదాలంకరణతో ఆంజనేయ స్వామి విశ్వరూపం దర్శనమిచ్చింది. వెంటనే అతడక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దక్షిణ భాగంలో చెక్కిన శిలాక్షరాలు ఈ కథ అంతటినీ మన కళ్లకు కడతాయి. కొండ గట్టు మీద చుట్టూ చిన్న కోటగోడ ఆకారంలో మూడు భిన్నమైన ప్రహరీలున్నాయి. వీటిని కొండల్రాయుడు కట్టించాడు. స్వామి భక్తుడైన చిలుమూరి రఘు పతిరావును చంపిన వారిపై పగ సాధించేం దుకు అతడి కొడుకు కొండల్ రాయుడు కోట, బురుజు కట్టి బలగాన్ని సేకరించాడు. అతడి గుర్రం అడుగులు, కోట గోడలు, కొలను గుంటలు ఇక్కడ దర్శనమిస్తాయి. కొండగట్టు పేరు ఎలా వచ్చిందంటే.. ఆంజనేయస్వామి దేవాలయం నల్లరాతి బండల సమూహాలు, గుహలు, అనేక రకాల వృక్షజాతులతో కూడిన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలపై మళ్లీ ఒక చిన్న గుట్ట ఏర్పడగా, ఆ గుట్టపై ఆంజనేయస్వామి వెలిశాడు. అందుకే కొండగట్టు అని పేరువచ్చిందనే ప్రచారం ఉంది. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయస్వామి సంజీవని పర్వతం తీసుకొని వెళ్తుండగా అందులోంచి ఒక ముక్క రాలి ఈ కొండలలో పడిందని, అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని, అందుకే శారీరక, మానసిక బాధలు, ఇతర గ్రహ బాధలున్నవారు స్వామిని దర్శించుకోగానే తొలగిపోతాయని పూర్వీకులు చెబుతుండేవారు. దేవాలయానికి సమీపంలో రాతి బండల మధ్య 30 గజాల లోతు పుష్కరిణి ఉంది. తపస్వీకులు స్నానాలు చేసి, స్వామిని సేవించి, సమీపంలోని గుహలో తపస్సు చేసేవారు. ఒకే మంటపంలో మూడు వేర్వేరు గర్భగుడులున్నాయి. మధ్యలో ఆంజనేయ స్వామి, కుడిపక్కన వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు, ఎడమ పక్కన అమ్మవారు వెలిసి ఉండగా, ఆలయానికి పడమరవైపు క్షేత్ర పాలకుడు భేతాళస్వామి ఆలయం ఉంది. బేతాళస్వామికి దక్షిణాన రామపాదుకలు ఉండగా... ఫర్లాంగు దూరంలో పొలిమేర దేవత బొజ్జ పోతన్న ఉంటాడు. రామ పాదుకలకు కొద్ది ముందు భాగంలో సీతా పతివ్రతా తల్లి కూర్చొని, తన కష్టాలు తలుచుకుని ఏడ్చేదట. ఆ సాధ్వి కన్నీటి గుర్తులూ ఇక్కడ ఉన్నాయి. ఐదు వందల ఏళ్లుగా నిత్య హారతులు.. కొండగట్టు ఆంజనేయస్వామికి ఐదు వందల ఏళ్లుగా నిత్య హారతులు కొనసాగు తున్నాయి. అనారోగ్యం, దీర్ఘకాల పీడితులు, మతిస్థిమితం లేనివారు, స్వామి సన్నిధిలో 11, 21, 41 రోజులు నిష్టతో పూజలు చేయడమే కాక, మూడుపూటలా భజనలు చేస్తున్నారు. బేతాళస్వామి ఆలయం వద్ద గ్రహపీడితులు విగ్రహానికి మొక్కి, అల్లుబండను ఆలింగనం చేసుకుంటారు. స్వామి కలలోకి వచ్చి గ్రహ బాధ నుండి విముక్తి కలిగిస్తున్నట్లు భక్తులు చెబుతుంటారు. స్వామిని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని భక్తుల విశ్వాసం. చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలను హనుమాన్ చిన్న జయంతిగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి రోజున అత్యంత ైవె భవంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. త్రయాహ్నిక, త్రికుండాత్మక, మహాయాగం, మూడురోజులపాటు స్వామికి ప్రత్యేక పంచా మృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. సుమారు 3 నుండి 5 లక్షల మంది దీక్షా పరులు స్వామిని దర్శించుకుని, దీక్ష విరమణ చేస్తారు. - జవ్వాజి చంద్రశేఖర్, మల్యాల కంట్రిబ్యూటర్ -
కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు క్షేత్రానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నానికి 50 వేల మంది భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. క్యూలైన్లు అన్నీ నిండిపోయి భక్తులు బయట బారులు తీరారు. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికి మరో 10 వేల మంది స్వామిని దర్శించుకుంటారని అంచనా. -
కొండగట్టుకు ఎన్నారై రూ. 5.80లక్షల విరాళం
మల్యాల(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి జగిత్యాలకు చెందిన ధర్మపురి నీతూ వెంకటరమణ అనే ఎన్నారై రూ.5.80 లక్షల విరాళాన్ని అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆయన మంగళవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భార్య నీతూ, కుమార్తె త్రిషలతో కలిసి విరాళాన్ని ఆలయ ఈవో నర్సింహులుకు అందజేశారు. భోగశాల నిర్మాణానికి రూ. 5 లక్షలు, నిత్యాన్నదానం కోసం రూ. 30 వేలు, నిత్యహోమం కోసం రూ. 50 వేలు వెచ్చించాలని కోరారు. ఆలయ అర్చకులు వెంకటరమణకు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. -
అంజన్న కొండ.. భక్తులు నిండా..
మల్యాల: కరీంనగర్ జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో బుధవారం హనుమాన్ జయంత్యుత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు, హనుమాన్ దీక్షాపరులు తరలివచ్చారు. మంగళవారం రాత్రికే సుమారు లక్ష మంది కొండపైకి చేరుకున్నారు. రాత్రంతా భజనలు చేశారు. ఉదయం ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేసిన భక్తులు మొక్కులు చెల్లించారు. బుధవారం రాత్రి కరీంనగర్లో శ్రీరాముడు, హనుమంతుడు భారీ విగ్రహాలతో శోభాయూత్ర చేపట్టారు. పరిపూర్ణానందస్వామి ప్రజలనుద్దేశించి ప్రసంగిం చారు. హుండీల ఆదాయూన్ని ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు అందజేస్తామని యూత్ర నిర్వాహకులు బండి సంజయ్‌కుమార్ తెలిపారు. రాముడి సన్నిధిలో హనుమాన్ భక్తులు భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. సీతారామచంద్రస్వామి, ఆంజనేయస్వామివారికి భక్తులు పూజలు చేశారు. హనుమాన్కు ఏకాం త తిరుమంజనం నిర్వహించారు. హనుమాన్ దీక్షధారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇరుముడులు సమర్పించి, దీక్ష విరమించారు. -
కొండగట్టు కాషాయమయం
కొండగట్టు: హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాల సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి క్షేత్రం భక్తుల రద్దీతో పోటెత్తింది. వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు ఇరుముడులతో తరలిరాగా.. అంజన్న పుణ్యక్షేత్రం కాషాయ వర్ణం సంతరించుకుంది. బుధవారం జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలకు మంగళవారం నుంచే భక్తుల రాక మొదలైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల నుంచి రాత్రి వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు. -మల్యాల హనుమాన్ నామస్మరణతో కొండగట్టు మార్మోగుతోంది. ఇరుముడులతో దీక్షాపరులు అంజన్న సన్నిధికి తరలివస్తున్నారు. వేలాది మంది దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. మెట్లదారివెంట, నాచుపల్లి, ఘాట్‌రోడ్డు వెంట దీక్షాపరులు భజనలు చేసుకుం టూ కాలినడకన తరలివస్తున్నారు. జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు. హనుమాన్ పెద్దజయంతి ఉత్సవాలకు కొండగట్టు అంజన్న ఆలయం ముస్తాబైంది. ఆలయ ప్రాకారాలు విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కొండగట్టు వై జంక్షన్ నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రికే 70 వేల మంది భక్తులు కొండపైకి చేరుకున్నట్లు అంచనా. హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ ఉచిత అన్నదానం, మంచినీరు అందించారు. బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశం ఉంది. నేడు ప్రత్యేక పూజలు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయస్వామివారి సన్నిధిలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 3 గంటలకు తిరుమంజనము, 6 గంటలకు ద్రావిడ ప్రబంధ పారాయణములు, 9 గంటల నుంచి విశేష అభిషేకము, అర్చన, పట్టు వ స్త్రముల అలంకరణ, సహస్ర నాగవల్లి అర్చన, హోమము, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఉత్సవ మూర్తికి ఉయ్యాల సేవ, మంత్ర పుష్పం, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగం, సామూహిక భజన నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30కు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణము, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహనసేవ, కంకణోద్వాసన, మంత్ర పుష్పము, మహదాశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గజరాజు నర్సింహులు తెలిపారు. -
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది భక్తుల స్వామి వారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. (మాల్యాల) -
అంజన్న భక్తులతో జనసంద్రమైన కొండగట్టు
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తసంద్రమైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అంజన్న మాలధారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాయుపుత్రుడు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా ఈరోజు తెల్లవారుజాము నుంచే పవన పుత్రుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయితే ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 50వేలకు పైగా భక్తులు తరలి వచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హనుమన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులతో ఆంజనేయుని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. -
కొండంతా కాషాయం
నేడు హనుమాన్ జయంతి మూడు రోజుల పాటు ఉత్సవాలు ముమ్మరమైన ఏర్పాట్లు కొండగట్టుకు చేరుకుంటున్న దీక్షాపరులు మల్యాల, న్యూస్‌లైన్: కొండగట్టు గిరులు కాషాయ వర్ణమవుతున్నాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు దీక్షాపరులు కొండకు చేరుకుంటున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాక నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తర లి రానున్నారు. ఇప్పటికే వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు వారం రోజులగా కొండగట్టుకు వస్తూ దీక్షలను శ్రీస్వామివారి సన్నిధానంలో విరమిస్తున్నారు. మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలతో పాటు క్యూలైన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ సీఐ వెంకటరమణ కొండగట్టుకు వచ్చి వసతులను పరిశీలించారు. ఘాట్‌రోడ్డును వన్‌వేగా మార్చడంతో పాటు ఆలయంలో మూడు రోజుల పాటు ఎలాంటి ఆర్జిత సేవలు ఉండబోవని ఈ వో గజరాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుం టున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. -
అంజన్న దర్శనం భారం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : పేదల దేవుడిగా పేరొందిన కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లే భక్తులకు అడ్డంకులు మొదలవ్వనున్నాయి. కొండ మార్గానికి వేగంగా చేరుకునేందుకు ఉపయోగపడుతుందనుకున్న రోప్‌వే(తాడు మార్గం) భక్తుల జేబులకు చిల్లులు పెట్టనుంది. ప్రభుత్వ పరంగా నిర్మించి భక్తులు ఉచితంగా కొండపైకి వెళ్లేందుకు ఉపయోగపడుతుందనుకున్న రోప్‌వేపై ప్రైవేటు కంపెనీల కళ్లు పడ్డాయి. రూ.7 కోట్లతో రోప్‌వే నిర్మించి.. వడ్డీతో సహా ఈ ఖర్చులు రాబట్టే వరకు భక్తుల నుంచి టిక్కెట్ వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిర్మించి, నిర్వహించి, బదలాయించే(బీవోటీ) పద్ధతిలో అమలు చేస్తామని, కనీసం 25 ఏళ్లు భక్తులకు టిక్కెట్ పెడతామని ప్రాజెక్టు రూపొందించింది. కోల్‌కతాకు చెందిన ఈ కంపెనీకి రాష్ట్రంలోని శ్రీశైలం రోప్‌వే నిర్మాణం చేసిన అనుభవం ఉన్నట్లు తెలిసింది. కొండగట్టులో మాత్రం నిర్మాణం తామే చేసి నిర్వహణ కూడా చూస్తామని ప్రతిపాదించింది. రోప్వో ఖర్చు రాబట్టుకునే క్రమంలో కొండపైకి నడిచివెళ్లే భక్తుల విషయంలోనూ కొన్ని ఆంక్షలు విధించక తప్పదని ప్రాజెక్టు రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్వహణ ప్రైవేటు కంపెనీ పరిధిలో ఉన్నన్ని రోజులు ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకుండా నియంత్రిస్తారని చెబుతున్నారు. రోప్‌వే తో కొండపైకి వెళ్లే ఒక్కో భక్తుడికి కనీసం రూ.80 నుంచి రూ.100 చొప్పున టిక్కెట్ రుసుము ఖరారు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. న్యాయపరమైన అంశాల్లో అభ్యంతరాలను పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు ప్రభుత్వ ఆమోదానికి వెళ్లనుంది. ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపితే జేబు నిండా డబ్బులు తెచ్చుకునే భక్తులకు మాత్రమే అంజన్న వద్దకు చేరుకునే భాగ్యం ఉంటుంది. అనుకున్నదొక్కటి... వామపక్ష ఉద్యమం తీవ్రత తగ్గి రవాణా వసతులు మెరుగవడంతో పదేళ్లుగా కొండగట్టు అంజన్న వద్దకు భక్తుల రాక భారీగా పెరిగింది. మొదట్లో కేవలం కొండపైన ఉన్న చిన్న గుడి... ఇప్పుడు పెద్ద పట్టణంగా తయారైంది. కొండగట్టుకు ఇప్పుడు సగటున రోజుకు మూడు వేల మంది భక్తులు వస్తారు. కొండగట్టు కాలినడక మార్గం నుంచి అంజన్న వద్దకు 750 మీటర్ల పొడవైన రోప్‌వే అవసరమని నిఫుణులు అంచనా వేశారు. దీనికోసం రూ.7 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ పరంగానే జరుగుతుందని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇన్నాళ్లుగా ప్రకటిస్తూ వచ్చారు. వీరి ప్రకటనలు అమల్లోకి వస్తే మంచి వసతులు ఉంటాయని భక్తులు ఆశించారు. ఇంత మొత్తంతో రోప్‌వే చేపట్టడం తమ వల్ల కాదని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇదే అదనుగా ప్రైవేటు కంపెనీ ఇక్కడి ఆదాయంపై కన్నేసింది. నిర్వహణలో ఇబ్బందుల కారణంగానే ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని చెబుతున్న అధికారులు... ప్రైవేటు కంపెనీకి ఇది ఎలా సాధ్యమనే సందేహాలకు జవాబివ్వడంలేదు. రోప్‌వే ఏర్పాటు చేసిన కంపెనీ... నడకదారిలో వచ్చే భక్తులను, వాహనాలను నియంత్రిస్తే ఏమిటనే సందేహాలకు ఎవరూ స్పందించడంలేదు. ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు ఇలా ఓ ప్రైవేటు సంస్థకు ఆదాయ వనరుగా ఎలా మారిందనే విషయంపైనా అధికారులు స్పందించడం లేదు. రోప్‌వే ప్రాజెక్టు అంశాలు ఏమిటనే విషయంపై పర్యాటక శాఖ అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు.