
కొండగట్టు జేఎన్టీయూ పరిసరాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈనెల 18న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాందీలు హాజరవనున్నారు. రాహుల్, ప్రియాంకాగాందీలు కొండగట్టుపై తొలుత అంజన్నకు పూజలు చేసి అక్కడ పార్టీకి విజయం సాధించాలని ముడుపు కడతారని, అనంతరం అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రచార రథాలకు పూజలు చేయిస్తారు.
పూజల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్, ప్రియాంకల పర్యటనను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే తమకు ఇంకా అధికారిక షెడ్యూలు మాత్రం అందాల్సి ఉందన్నారు. కాగా, బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న పాత కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు కేవలం ఒక్క సీటే ఉంది. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సీనియర్ పార్టీ నేత ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment