shrine
-
18న కొండగట్టుకు రాహుల్, ప్రియాంక ముడుపుగట్టు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈనెల 18న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాందీలు హాజరవనున్నారు. రాహుల్, ప్రియాంకాగాందీలు కొండగట్టుపై తొలుత అంజన్నకు పూజలు చేసి అక్కడ పార్టీకి విజయం సాధించాలని ముడుపు కడతారని, అనంతరం అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రచార రథాలకు పూజలు చేయిస్తారు. పూజల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్, ప్రియాంకల పర్యటనను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల పోలీసులు కూడా ధ్రువీకరించారు. అయితే తమకు ఇంకా అధికారిక షెడ్యూలు మాత్రం అందాల్సి ఉందన్నారు. కాగా, బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న పాత కరీంనగర్లో కాంగ్రెస్‌కు కేవలం ఒక్క సీటే ఉంది. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బస్సుయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు సీనియర్ పార్టీ నేత ఒకరు చెప్పారు. -
శ్రీసత్య నారాయణుడి కల్యాణం చూతము రారండీ...
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే లక్ష్మీ సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, ఇక్కడ రత్నగిరి పై పంపానదీ తీరాన 128 సంవత్సరాల క్రితం వెలసిన భక్తవరదుడు శ్రీ వీర వేంకటసత్యనారాయణ స్వామి. లక్ష్మీదేవి అంశ అయిన శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుడు ఒకే పానపట్టంపై దర్శనమిచ్చి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా సత్యదేవుని ఖ్యాతి జగద్విదితం. శివ కేశవులకు భేదం లేదని తెలిపే విధంగా విష్ణుమూర్తి శివుడు, శక్తి స్వరూపం అనంతలక్ష్మీ అమ్మవారు పక్కపక్కనే దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. 14 నుంచి స్వామివారి దివ్యకల్యాణమహోత్సవాలు శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి అనగా మే14 వ తేదీ నుంచి వైశాఖ బహుళ పాడ్యమి 19వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వైశాఖ శుద్ధ ఏకాదశి, మే 15 రాత్రి తొమ్మిది గంటల నుంచి 11–30 గంటల వరకూ స్వామివారి దివ్య కల్యాణమహోత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారి కల్యాణమహోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలను కూడా పంపిణీ చే యనున్నారు.ఈసారి స్వామి కల్యాణమహోత్సవాలు ఏడు రోజులకు బదులు ఆరు రోజులు మాత్రమే జరుగుతాయని అధికారులు తెలిపారు. వైశాఖ శుద్ధద్వాదశి, త్రయోదశి రెండు తిథులు ఒకే రోజు వచ్చినందున ఆ రెండు రోజుల కార్యక్రమాలు ద్వాదశినే నిర్వహిస్తున్నారు.భద్రాద్రి రాముని కల్యాణం తరువాత తెలుగు రాష్ట్రాలలో అంత ప్రాముఖ్యత కలిగిన వేడుక రత్నగిరి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణం. ఈ వేడుకకి పెళ్లి పెద్దలుగా శ్రీసీతారాములే వ్యవహరిస్తారు. అన్నవరం క్షేత్రానికి క్షేత్రపాలకునిగా శ్రీరాముడు పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. ఆ హోదాలో ఆ వేడుకలకు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. 15 నుంచి ‘పంచహారతుల సేవ’ ఈ కల్యాణమహోత్సవాల వేడుకల్లో భాగంగా శ్రీసత్యదేవుడు, అమ్మవారికి నూతనంగా ‘పంచ హారతుల సేవ’ను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎంవీ సురేష్ బాబు తెలిపారు. ఈ సేవకు పెద్దాపురానికి లలితాబ్రాండ్ రైస్ కంపెనీ అధినేతలు మట్టే సత్యప్రసాద్, శ్రీనివాస్ సోదరులు సుమారు 12కిలోల వెండితో చేయించిన ఎనిమిది రకాల ఆకృతులతో వెండిహారతి సామాగ్రి విరాళంగా అందచేస్తున్నారని తెలిపారు. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి అర్ధగంట సేపు ఈ సేవ స్వామివారి ప్రధానాలయంలో నిర్వహిస్తారు. రూ.500 టికెట్‌తో రోజూ 20 దంపతులను మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తారు. మే 14, వైశాఖ శుద్ధ దశమి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి దేవాలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవారిని వధూవరులను చేస్తారు. అనంతరం రామారాయ కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 15, వైశాఖ శుద్ధ ఏకాదశి, బుధవారం రాత్రి తొమ్మిది నుంచి 11–30 గంటల వరకూ కల్యాణవేదిక మీద స్వామి, అమ్మవార్లకు దివ్యకల్యాణమహోత్సవం నిర్వహిస్తారు. 16, వైశాఖ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, గురువారం ప్రధాన స్థాలీపాక హోమాలు, రాత్రి ఏడు గంటలకు అరుంధతి దర్శనం, అనంతరం స్వామి అమ్మవార్లను రాత్రి తొమ్మిది గంటల నుంచి రావణవాహనం మీద, పొన్నవాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. 17, వైశాఖశుద్ధ చతుర్దశి, శుక్రవారం మధ్యాహ్నం 2–30కు అనివేటి మండపంలో పండిత సదస్యం, సాయంత్రం ఐదు గంటలకు కొండదిగువన దేవస్థానం గార్డెన్స్‌లో శ్రీవారి వనవిహారం. 18, వైశాఖ శుద్ధ్ద పౌర్ణమి, శనివారం ఉదయం 8–30 గంటలకు పంపానదిలో నిర్మించిన పుష్కరిణిలో స్వామివారి ‘శ్రీచక్రస్నానం’. సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన. 19, వైశాఖ బహుళ పాడ్యమి, ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్వామివారి నిత్య కల్యాణమండపంలో శ్రీస్వామి, అమ్మవార్లకు శ్రీపుష్పయోగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. నాగఫణిశర్మ అష్టావధానం ఈసారి శ్రీసత్యదేవుని దివ్యకల్యాణమహోత్సవాలలో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ అష్టావధాన కార్యక్రమం 16వ తేదీ సాయంత్రం ఏర్పాటు చేశారు. నాగఫణిశర్మ 14న ఎదుర్కోలు ఉత్సవంలో, 15న స్వామివారి కల్యాణమహోత్సవాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.కాగా పంపలో నీరు లేకపోవడంతో తాత్కాలిక పుష్కరిణి నిర్మించారు. ఆ పుష్కరిణికి ఏలేరు జలాలు తరలించడంతో పుష్కరిణి కళకళ లాడుతోంది. ఈ పుష్కరిణి లోనే 18న సత్యదేవుని చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం, -
శ్రీకూర్మనాథుని డోలోత్సవానికి వేళాయె...
మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కూర్మం. స్వామివారు కూర్మనాథుడిగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శ్రీకూర్మ క్షేత్రం హిందూదేశానికే తలమానికం. ప్రాచీన శిల్పకళా శోభితంగా, దేశ నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను పంచిపెడుతూ అలరారుతోంది. వైష్ణవుల 108 దివ్యారామాల్లో ప్రముఖంగా ఉంది. అంతటి మహిమాన్విత గల ఈ క్షేత్రంలో ప్రముఖమైన ఉత్సవంగా ఫాల్గుణ మాసంలో జరిగే డోలోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా ఫాల్గుణమాస త్రయోదశి నాడు మఖ నక్షత్రంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మార్చి 19న కామదహనోత్సవం, 20న పడియ, 21న డోలోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కామదహనోత్సవం... అంటే మనలోని కోరికలను దహనం చేసే ఉత్సవంగా చెబుతారు. మన్మథుని దహించేందుకు గానూ తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఉభయానాంచారులతో కలిపి గోవిందరాజస్వామి, చొప్పరంలో సీతారామ, అశ్వవాహనంపై లక్ష్మణ, పల్లకీలో చక్రనారాయణస్వామి హోమం అనంతరం ప్రత్యేక పూజలనంతరం కామదహనం చేస్తారు. గరుడవాహనం పై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. గ్రామ సమీపంలోని కామదహనం మంటపం వద్ద కామదహన కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు.పడియ... కామదహనంలో పాల్గొన్న భక్తులు వేకువజామున సమీపంలోని సముద్రస్నానాలు చేసి ఆలయంలోని శ్వేతపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడంతో పడియ ఉత్సవం పూర్తవుతుంది. శ్వేతపుష్కరిణిని విష్ణువు సుదర్శన చక్రంతో తవ్వడం జరిగింది. తవ్వుతున్న సమయంలో లక్ష్మీదేవి గరుడవాహనంపై కూర్చున్న విగ్రహం లభ్యమవ్వడంతో ఆలయంలో శ్రీకూర్మనాయకిగా పూజలందుకుంటోంది. డోలోత్సవం... డోలాయమానం గోవిందం మధ్యస్ధ మధుసూదనం రథస్త వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే... డోలోత్సవంలో ఉయ్యాల మంటపంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదన్నది శ్లోక భావన. గ్రామదేవత మోహినీ భద్రాంబిక దర్శనార్ధమై శ్రీకూర్మనాథుడు రాజరాజ అలంకరణలో డోలామంటపం వద్దకు వెళ్తారని స్ధలపురాణం చెపుతుంది. ఈ సందర్భంగా స్వామిపాదాలను భక్తులు తాకే అవకాశం ఉంది. స్వామి అస్పృశ్య దోష నివారణకు బుక్కా, భర్గుండ (రంగులు కలిపిన పదార్ధం)తో అర్చకులు పూజలు చేస్తారు. పూజ చేసిన బుక్కా, భర్గుండను భక్తులపై చల్లుతారు. సనాతనంగా వచ్చిన ఈ ఉత్సవమే ప్రస్తుతం హోళీగా మారిందని చెబుతుంటారు. డోలోత్సవం రోజున ఆలయం నుంచి గజ వాహనంపై స్వామివారు, మరోవాహనంపై ఉభయ నాంచారులు తిరుగు ప్రయాణంలో గరుడవాహనంపై స్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం మాడ వీధుల గుండా జరిగిన ఈ యాత్ర డోలా మంటపం చేరుకున్న తరువాత ఉత్తర నక్షత్ర లగ్నమందు ఉత్తరాభిముఖ దర్శనం ఇస్తారు. విజయనగరం రాజవంశీకుడు పూసపాటి అశోకగజపతిరాజు గోత్ర నామాలతో తొలిపూజలు చేస్తారు. శ్రీరంగం, వైకుంఠంలో స్వామిని చేరేందుకు గద్యత్రయం పఠనం చేస్తారు. కూర్మనాథుని ఆవిర్భావం.... ఆలయం తొలుత దేవతలు నిర్మించగా, 2వ శతాబ్దంలో అనంత చోళగంగుడు, అనంగ భీముడు హయాంలో పునఃనిర్మాణం జరిగింది. కూర్మనాథుడి పైనే భూమి అంతా ఆధారపడి ఉందని, క్షీరసాగర మధనంలో దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణువు కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని తన మూపున మోస్తూ అమృతం పొందేందుకు సహకరించాడు. తాను స్వామిని కూర్మరూపునిగా సందర్శించాలని ఉందన్న శ్వేత చక్రవర్తి కోరిక మేరకు స్వామి కూర్మరూపంలో ఇక్కడ దర్శనమిచ్చారని స్ధలపురాణం చెబుతుంది. గోపురం అష్టదళపద్మాకారంలో ఉంటుంది. ఈ గోపురంపై గల గాంధర్వ, నారసింహా, కపీశ, హయగీవ్ర, ధదివక్త్ర దర్శనం పుణ్యభరితమని, సర్వరోగ, సకల పాప నివారణి అని చెబుతారు.ఈ క్షేత్రంపై మహమ్మదీయ చక్రవర్తులు దాడికి దిగుతున్నారని తెలిసి, స్థానికులు సున్నం, గుగ్గిలం రాశులుగా పోసారట. వాటిని సైనికుల కొండలుగా భావించి, వీరిని జయించలేమని మహమ్మదీయ సేనలు వెనుదిరిగారట. అప్పటి సున్నం, గుగ్గిలం ఆనవాళ్లు మనం చూడవచ్చు. క్షేత్ర పాలకునిగా ఆలయం చెంతనే శివుడు పాతాళ సిద్ధేశ్వరుడుగా దర్శనమిస్తాడు. త్రిమతాచార్యులు సందర్శించిన ఏకైక క్షేత్రం.... ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామి వారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్దంలో స్వామిని సేవించిన రామానుజాచార్యులు కోరిక మేరకు తూర్పు ముఖం కలిగి ఉన్న కూర్మనాథుడు పశ్చిమానికి తిరిగి దర్శనం ఇచ్చాడని చెబుతారు. అందుకోసం రెండు ధ్వజస్తంభాలను ఇక్కడ చూడవచ్చు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీనరహరి తీర్థులు క్షేత్రాన్ని సందర్శించి సీత, రామలక్ష్మణ ఉత్సవమూర్తులను బహూకరించారని, ప్రస్తుత ఉత్సవమూర్తులైన గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను లవకుశులు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. శైవ, విషు -
‘అమర్నాథ్ యాత్ర’కు ఆధునిక హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : అమర్నాత్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మంచు లింగాన్ని దర్శించి తరించాలని వేల సంఖ్యలో భక్తులు కోరుకుకుంటారు. అయితే అమర్నాథ్ యాత్ర అంత సులువుకాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా మౌలిక సదుపయాలు, రవాణ వంటి సమస్యలు ఈ యాత్రలో భక్తులను విపరీతంగా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అమర్నాథ్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాక మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అడిషనల్ సెక్రెటరీ హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అమర్నాథ్ యాత్రపై పరిశీలన చేసి.. భక్తులకు అవసరమైన వసతులు, సౌకర్యాల ఏర్పాటుపై ప్రణాళిక రూపోందిస్తుందని ఎన్జీటీ ప్రకటించింది. ఈ కమిటీ ప్రధానంగా రహదారి, దేవస్థానం సమీపంలో పరిశుభ్రత, భక్తులకు అవసరాలను పరిశీలిస్తుందని ఎన్జీటీ తెలిపింది. -
14 గిన్నీస్ రికార్డుల పోలీస్.. అమ్మకు గుడి
మదురై: అతడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే మరోపక్క, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దేవతా ప్రాయంగా కొలిచాడు. ఆమె అంటే అతడికి ఎక్కడ లేనంత గౌరవం, భక్తి. ఆమె కోసం ఏం చేసేందుకైనా వెనుకడుగేయడు. అందుకే ఆమె అనారోగ్యం పాలయిందని తెలిసిన వెంటనే తన ఉద్యోగాన్ని సైతం పక్కకు పెట్టి ఆమె కోలుకోవాలని కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లాడు. కానీ, అతడి పూజలు ఫలించలేదు. గుండెపోటు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఈ బాధలోంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆ హెడ్ కానిస్టేబుల్ కనిపించకుండాపోయిన తన అమ్మ (జయలలిత) రూపాన్ని తన కళ్లముందే ఉంచుకోవాలనుకున్నాడు. ఆమెకు ఏకంగా ఆలయం నిర్మించేందుకు మరో 20 ఏళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడా పనికి దిగాడు. ఈ కార్యక్రమానికి అతడి కుటుంబ సభ్యులు కూడా దన్నుగా నిలవడం మరో విశేషం. ఇతడి పేరిట 14 గిన్నీస్ రికార్డులు కూడా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్ వేల్మురుగున్(45) అనే వ్యక్తి తేని జిల్లాలో ఓడపట్టి అనే ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ కానిస్టేబుల్‌గానే కనిపించినప్పటికీ ఎప్పుడంటే అప్పుడు పలుమార్లు జయలలితను కలుసుకున్నాడు. జయలలిత రాజకీయ గురువైన ఎంజీఆర్‌కు రామవరంలో ఉన్న ఇంటికి వేల్మురుగన్ తండ్రి సెక్యూరిటీగా ఉన్నాడు. దీంతో ఎలాగైనా తాను ఓ పోలీసు అవ్వడం ద్వారా అమ్మవద్ద పనిచేసే అవకాశం పొందవొచ్చని కలలుగన్నాడు. అనుకున్నట్లే పోలీసు ఉద్యోగం రావడం, జయలలిత ఇంటి వద్ద కూడా 1999 నుంచి 2002 వరకు సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తించడం చేశాడు. ఆ సమయంలో ఆమె చిరునవ్వును ప్రతిరోజు చూసి మురిసిపోయేవాడట. కన్నతల్లికి సేవ చేస్తున్నట్లుగా భావించేవాడట. ‘జయలలిత నాకు కాలేజీ రోజుల్లో నుంచి ఆరాధ్య దైవం. ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ పనిచేసినప్పుడు నా కల నేరవేరింది. ప్రతి రోజు ఎంతో ఆతృతగా ఆమె దర్శనం కోసం చూస్తూ మురిసిపోయేవాడిని. అమ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలియగానే కాశీకి ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్లాను. కానీ, దేవుడు నా ప్రార్ధనలకు సమాధానం ఇవ్వలేదు. తిరిగి నేను సోమవారం చెన్నై వచ్చాను. ఆ రోజు మా అమ్మ చనిపోయింది. ఏఐఏడీఎంకే భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. నావరకు ఏఐఏడీంకే అంటే అమ్మమాత్రమే. ఆమెకు నేను ఆలయం నిర్మించుకుంటాను’ అని వేల్మురుగన్ చెప్పాడు. మరో విశేషమేమిటంటే ఇతడి పేరిట దాదాపు 14 గిన్నీస్ రికార్డులు ఉన్నాయి. కొన్ని అవార్డుల ద్వారా వచ్చిన డబ్బును అతడు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందించాడు. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24న ఈ ఆలయాన్ని పన్నీర్ సెల్వం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. -
హజి అలీ దర్గాలో ప్రవేశించిన తృప్తీ దేశాయ్
ముంబైః భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు, మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీదేశాయ్ ముస్లింల పవిత్ర క్షేత్రాలనూ వదల్లేదు. ప్రసిద్ధ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై పోరాడి ఫలితాలను సాధిస్తున్న ఆమె..... తన మద్దతుదారులతో కలసి, తాజాగా ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించి సంచలనం రేపింది. పలువురు మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు భారీ బందోబస్తుతో తృప్తి దేశాయ్...ముంబైలోని ముస్లిం పవిత్ర క్షేత్రం హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ, సంప్రదాయ బంధనాలను తెంచుకొని ఆమె.. గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అయితే దర్గాలోని గర్భాలయంలోకి మాత్రం ఆమె ప్రవేశించలేదు. దర్గా ఆచారాలను అనుసరించి, ట్రస్ట్ సభ్యుల అనుమతితో, పోలీసు బందోబస్తుతో దర్గాలోకి ప్రవేశించిన తృప్తి... అక్కడ ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోపు మరోసారి దర్గాలోని పురుషులు మాత్రమే ప్రవేశించే ముఖ్య ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడే ప్రార్థనలు జరుపుతామంటూ వ్యాఖ్యానించారు. తృప్తి దేశాయ్, ఆమె మద్దతు దారులు, ఇంతకు ముందే ఓసారి దర్గాలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా... పోలీసులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. ప్రార్థనాలయాల్లో మహిళలకు అనుమతిపై లింగ వివక్షను విడనాడాలంటూ పోరాడుతున్న తృప్తి దేశాయ్... శనిసింగనాపూర్, త్రంయబకేశ్వర్ హిందూ ఆలయాల ప్రవేశం అనంతరం ముంబైలోని ప్రముఖ దర్గా ప్రవేశాన్ని ఎంచుకున్నారు. త్వరలోనే మహిళలను దర్గాలోని నిషేధ ప్రాంతానికి కూడ అనుమతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నో ఏళ్ల కట్టుబాటు దాటి..
ముంబయి: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో చాలా ఏళ్లుగా ఉన్న పాత సంప్రదాయాన్ని కొందరు మహిళలు బద్దలు కొట్టారు. ప్రఖ్యాత శని ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ గ్రామస్తులు అవాక్కయ్యేలా చేశారు. సాధారణంగా ఈ ఆలయంలోకి మహిళలకు చాలా రోజులుగా ప్రవేశం లేదు. ఈ ఘటన ఆలయ కమిటీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో మొత్తం ఏడుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మహిళలు ఆ ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించినందున అది అపవిత్రమైందంటూ శుద్ధి క్రతువులు నిర్వహించారు. అయితే, ఎన్నో ఏళ్లుగా కావాలనే మహిళలను ఆ ఆలయంలోకి ప్రవేశించనివ్వడంలేదని, ప్రత్యేక పూజలకు అనుమతించలేదని కొందరు మహిళ సంఘాలు ఓ మహిళా సంఘం అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించినట్లు తెలిసింది. ఏదేమైన ఇలాంటి ఘటన బాధకరమేనని, అపచారమని పేర్కొంటూ గ్రామస్తులు కూడా పాలాభిషేకం నిర్వహించగా ఇతర మహిళా సంఘం నేతలు, ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఆ మహిళలు చేసిన సాహసానికి అభినందించారు. -
నలుదిశలా కైలాసం
పండుగ అనగానే పొద్దున్నే తలంటు పోసుకుని.. దగ్గర్లోని గుడికి వెళ్లేసి.. ఇంటికొచ్చేసి.. రిలాక్స్ అయిపోతాం.రొటీన్‌లైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న సిటీవాసులం ఇంతకన్నా ఏం చేస్తాం అంటారా..? పండుగ సెలవును.. టీవీ చూస్తూనో.. సినిమాలతోనో కాల క్షేపం చేయకుండా.. మహా శివరాత్రిని మహదానందంగా జరుపుకోవాలంటే.. సకుటుంబ సపరివార సమేతంగా ఏదైనా శైవక్షేత్రానికి వెళ్లండి. ఒక్కరోజులో.. ఎలా అంటారా..! సిటీ నుంచి ఒక్కరోజులో హాయిగా వెళ్లొచ్చే దూరంలో శైవక్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని మీ కోసం.. ..:: త్రిగుళ్ల నాగరాజు జాతరో జాతర.. వేములవాడ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీ అని ప్రతీతి. క్రీస్తుశకం 750 నుంచి 973 వరకు ఈ ప్రాంతం చాళుక్య రాజుల ఏలుబడిలో ఉండేది. ఆ సమయంలోనే ఆలయం నిర్మించినట్టు తెలుస్తోంది. దేవర్షి నారదుడి ప్రార్థనతో.. ఆశ్రీత జన రక్షకుడిగా కాశీలో విశ్వేశ్వరుడిగా కొలువుదీరిన పరమేశ్వరుడు అక్కడ సంతృప్తి చెందక వేములవాడలో రాజరాజేశ్వరుడిగా వెలిశాడని స్థలపురాణం. గర్భగుడిలోని మహాలింగం సూదంటురాయిలా ఆకర్షిస్తుంది. రాజరాజేశ్వరుడితోపాటు రాజరాజేశ్వరి అమ్మవారు, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, కోటిలింగాల మంటపం ఆలయంలో కనిపిస్తాయి. శివరాత్రి సందర్భంగా వేములవాడ జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. కాగా, రాజన్నను దర్శించుకున్న భక్తులు ప్రధానాలయానికి వెలుపల ఉన్న హజ్రత్‌బాబా ఖాజాభాగ్ సావర్ దర్గానూ దర్శించుకుంటారు. కోడె మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ మరో విశేషం. దూరం: హైదరాబాద్‌కు 127 కిలోమీటర్లు రవాణా సౌకర్యం: ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి బస్సులు నడుస్తాయి. సల్లంగ జూడన్న మల్లన్న చారడేసి కన్నులవాడు.. బారడేసి మీసాలవాడు.. కొమురవె ల్లిలో కొలువు దీరాడు. జానపదుల కొంగు బంగారమై పూజలందుకుంటున్న మల్లికార్జునుడిని కాకతీయుల వీరశైవానికి ప్రతీకగా భావిస్తారు. ‘పోదాం పద యాతరో.. కొమురెల్లి జాతర..’ అంటూ శివరాత్రి ఉత్సవాలకు భక్తులు కొమురవెల్లికి బారులు తీరుతారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో ఉన్న ఖండోభా దేవుడు ఇక్కడ మల్లన్నగా వెలిశాడని స్థానికుల విశ్వాసం. ఈ క్షేత్రానికి మరో విశేషం ఉంది. ఇక్కడకు వచ్చిన భక్తులు.. ఎలా వచ్చారో అలా ముందుగా స్వామిని దర్శించుకుంటారు. స్నానం ఆచరించడం కాదు కదా.. కనీసం కాళ్లు కూడా కడుక్కోరు. దీన్నే ధూళి దర్శనం అంటారు. శివరాత్రి సంబరాలు ఇక్కడ అంబరాన్నంటుతాయి. దూరం: హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లు మార్గం: హైదరాబాద్-కరీంనగర్ హైవేలో తిమ్మారెడ్డిపల్లి దగ్గర కుడివైపు తీసుకుంటే అక్కడికి 10 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. రవాణా సౌకర్యం: జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. భక్తి, ముక్తి సంగమం మహాదేవుడి ఆగ్రహానికి గురై, పూజకు నోచుకోని బ్రహ్మ, కేతకి (మొగలిపువ్వు) సాక్షిగా వెలిసిన దివ్యక్షేత్రమే ఝరాసంగం. శాపవిమోచనానికి శివుడి ఆనతి మేరకు బ్రహ్మదేవుడు ఝరాసంగంలోని కేతకి వనంలో ఘోర తపస్సు ఆచరించాడట. అందుకు మెచ్చి శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని స్థలపురాణం. బ్రహ్మకు దర్శనమిచ్చిన మహాలింగమే నేడు సంగమేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటోంది. ఆనాడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని అభిషేకించిన జలాలు ఆలయం వెనుక భాగంలో అమృతగుండంగా మారిందని భక్తులు విశ్వసిస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పరమేశ్వరుడికి నిత్యం కేతకి పూలతో పూజాదికాలు నిర్వహిస్తారు. దూరం: నగరానికి 125 కిలోమీటర్లు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు 20 కిలోమీటర్లు రవాణా సౌకర్యం: బస్సులు అందుబాటులో ఉన్నాయి హరి పూజించిన హరుడు రంగారెడ్డి జిల్లా కీసరగుట్టపై రామలింగేశ్వరుడు త్రేతాయుగం నాడు కొలువుదీరాడని అంటారు. సీతారాములు ఆంజనేయుడి సమేతంగా వనవిహారం చేస్తూ ఇక్కడికి వచ్చారట. ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్న శ్రీరాముడు.. కాశీకి వెళ్లి లింగం తీసుకురావాలని ఆంజనేయుడిని పంపాడట. ఈలోగా ముహూర్తం మించిపోతుండటంతో శ్రీరాముడు పరమేశ్వరుడిని ప్రార్థించగా.. లింగ రూపంలో వెలిశాడట. కాశీ నుంచి కేసరీ నందనుడు 101 లింగాలను తీసుకొచ్చేసరికే రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించేశాడట. దీంతో కలత చెందిన హనుమ తన తోకతో ఆ 101 లింగాలను తోసివేశాడని.. అవన్నీ తలోదిక్కూ పడ్డాయని కథ. ఆంజనేయుడిని శాంతింపజేసిన రాముడు ఇకపై ఈ ప్రాంతం కేసరి నామంతో వర్ధిల్లుతుందని వరమిచ్చాడట. ఆనాటి నుంచి కేసరిగిరిగా, ప్రస్తుతం కీసరగుట్టగా మారింది. ఇక చారిత్రక నేపథ్యంలోకి వెళ్తే.. క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల సైనిక స్థావరం ఈ గుట్టమీదే ఉండేది. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు దగ్గర మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్న.. తరచూ ఈ ఆలయాన్ని దర్శించుకునేవారట. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వారే నిర్మించారు. దూరం: హైదరాబాద్‌కు 35 కిలోమీటర్లు రవాణా సౌకర్యం: ఈసీఐఎల్, సికింద్రాబాద్ నుంచి బస్సు సౌకర్యం