ఎన్నో ఏళ్ల కట్టుబాటు దాటి.. | Woman 'breaks tradition' to enter shrine, villagers upset | Sakshi
Sakshi News home page

ఎన్నో ఏళ్ల కట్టుబాటు దాటి..

Published Sun, Nov 29 2015 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

ఎన్నో ఏళ్ల కట్టుబాటు దాటి..

ఎన్నో ఏళ్ల కట్టుబాటు దాటి..

ముంబయి: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో చాలా ఏళ్లుగా ఉన్న పాత సంప్రదాయాన్ని కొందరు మహిళలు బద్దలు కొట్టారు. ప్రఖ్యాత శని ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ గ్రామస్తులు అవాక్కయ్యేలా చేశారు. సాధారణంగా ఈ ఆలయంలోకి మహిళలకు చాలా రోజులుగా ప్రవేశం లేదు. ఈ ఘటన ఆలయ కమిటీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో మొత్తం ఏడుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు.

మహిళలు ఆ ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించినందున అది అపవిత్రమైందంటూ శుద్ధి క్రతువులు నిర్వహించారు. అయితే, ఎన్నో ఏళ్లుగా కావాలనే మహిళలను ఆ ఆలయంలోకి ప్రవేశించనివ్వడంలేదని, ప్రత్యేక పూజలకు అనుమతించలేదని కొందరు మహిళ సంఘాలు ఓ మహిళా సంఘం అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించినట్లు తెలిసింది. ఏదేమైన ఇలాంటి ఘటన బాధకరమేనని, అపచారమని పేర్కొంటూ గ్రామస్తులు కూడా పాలాభిషేకం నిర్వహించగా ఇతర మహిళా సంఘం నేతలు, ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఆ మహిళలు చేసిన సాహసానికి అభినందించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement