villagers upset
-
ముందుకు సాగని ఆపరేషన్ గజ
పాతపట్నం: మండలంలోని పెద్దమల్లిపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఎనిమిది ఏనుగులు గురువారం సంచరించాయి. ఇక్కడే రెండు రోజులుగా తిష్ఠ వేయడంతో అటవీశాఖ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ గజ’ ముందుకు సాగడం లేదు. దీంతో బయట నుంచి తీసుకొచ్చిన శిక్షణ పొందిన ఏనుగులతో అటవీ సిబ్బంది పెద్దమల్లిపురం గ్రామం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్, డీఎఫ్ఓ శాంతిస్వరూప్, పాతపట్నం రేంజర్ సోమశేఖర్లు ఏనుగులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళతాయనే సూచనలు చేస్తూ మ్యాప్‌లను పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామస్తులతో మాట్లాడి ఎటువంటి బాణసంచా కాల్చవద్దని సూచించారు. బుధవారం, గురువారం కూడా ఏనుగులు ఒకే ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలి పారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దగుజ్జువాడలో పంటలు నాశనం సారవకోట: మండలంలోని పెద్దగుజ్జువాడ గ్రామం పరిధిలోని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. పలువురి రైతులకు చెందిన చోడి, వేరుశనగ, నువ్వు, ఆనపకాయల పంటలను బుధవారం రాత్రి నాశనం చేశాయి. గత ఐదు రోజుల నుంచి మండలంలోని రిజర్వ్ ఫారెస్టు ఏరియాలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు రాత్రి పూట గ్రామాల సమీపంలో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ గజ’లో భాగంగా శిక్షణ పొందిన ఏనుగులతో ఈ అడవి ఏనుగుల గుంపును రిజర్వ్ ఫారెస్టు ఏరియాలోకి అటవీశాఖ అధికారులు పంపిస్తున్నా రాత్రి పూట తిరిగి అవి గ్రామాల సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాలకు చేరి పంటలను తినేసి ధ్వంసం చేస్తున్నాయి. దీంట్లో భాగంగా బుధవారం రాత్రి పెద్దగుజ్జువాడ గ్రామానికి సమీపంలోని గొర్లె రుద్రుడు, గొర్లె జయడు, ఉర్లాన సింహాచలం, మల్లేషు, వసంత, సుందరరావు, శశిలకు చెందిన చోడి, వేరుశనగ, ఆనపకాయలు, నువ్వు పంటలను పాడుచేశాయి. ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపు మల్లిపురం కొండలలో ఉన్నట్టు ఫారెస్టు అధికారులు తెలిపారు. -
ప్రసాదం తిని 1500 మందికి అస్వస్థత
శివరాత్రి రోజున మధ్యప్రదేశ్‌లో కలకలం చోటు చేసుకుంది. పండుగ రోజు ప్రసాదం తిని 1500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. మధ్యప్రదేశ్, బార్వానీ జిల్లాలోని ఆశ్రమ్ గ్రామంలో శివరాత్రి వేడుకలు నిర్వహించారు. పూజలు అన్నీ పూర్తయ్యాక ప్రసాదం కిచడీ పంపిణీ చేశారు. ప్రసాదం తిన్నప్పటి నుంచి దాదాపు 1500 మందికిపైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. భక్తులంతా తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో ఆలయ వర్గాలు, స్థానికులు బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరి కొంత మందిని మరో రెండు ప్రవేటు ఆస్పత్రుల్లో చేర్చి వైద్యం అందించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం కుదురుగా ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఈసంఘటకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించమని జిల్లా అధికారులు, వైద్యులను ఆదేశించారు. -
ఎన్నో ఏళ్ల కట్టుబాటు దాటి..
ముంబయి: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో చాలా ఏళ్లుగా ఉన్న పాత సంప్రదాయాన్ని కొందరు మహిళలు బద్దలు కొట్టారు. ప్రఖ్యాత శని ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి ఆ గ్రామస్తులు అవాక్కయ్యేలా చేశారు. సాధారణంగా ఈ ఆలయంలోకి మహిళలకు చాలా రోజులుగా ప్రవేశం లేదు. ఈ ఘటన ఆలయ కమిటీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో మొత్తం ఏడుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మహిళలు ఆ ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించినందున అది అపవిత్రమైందంటూ శుద్ధి క్రతువులు నిర్వహించారు. అయితే, ఎన్నో ఏళ్లుగా కావాలనే మహిళలను ఆ ఆలయంలోకి ప్రవేశించనివ్వడంలేదని, ప్రత్యేక పూజలకు అనుమతించలేదని కొందరు మహిళ సంఘాలు ఓ మహిళా సంఘం అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించినట్లు తెలిసింది. ఏదేమైన ఇలాంటి ఘటన బాధకరమేనని, అపచారమని పేర్కొంటూ గ్రామస్తులు కూడా పాలాభిషేకం నిర్వహించగా ఇతర మహిళా సంఘం నేతలు, ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఆ మహిళలు చేసిన సాహసానికి అభినందించారు.