ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్తులు
శివరాత్రి రోజున మధ్యప్రదేశ్‌లో కలకలం చోటు చేసుకుంది. పండుగ రోజు ప్రసాదం తిని 1500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. మధ్యప్రదేశ్, బార్వానీ జిల్లాలోని ఆశ్రమ్ గ్రామంలో శివరాత్రి వేడుకలు నిర్వహించారు. పూజలు అన్నీ పూర్తయ్యాక ప్రసాదం కిచడీ పంపిణీ చేశారు. ప్రసాదం తిన్నప్పటి నుంచి దాదాపు 1500 మందికిపైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు.
భక్తులంతా తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో ఆలయ వర్గాలు, స్థానికులు బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరి కొంత మందిని మరో రెండు ప్రవేటు ఆస్పత్రుల్లో చేర్చి వైద్యం అందించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం కుదురుగా ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఈసంఘటకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించమని జిల్లా అధికారులు, వైద్యులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment