shivratri
-
ఆమె డ్రీమ్ గర్ల్ మాత్రమే కాదు, నాట్య మయూరి కూడా..! (ఫోటోలు)
-
రేపు లైవ్‌లో మహాదేవుని కల్యాణం
రేపు (శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా యూపీలోని కాశీలో మహాదేవుని కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్.. మార్చి 8న మంగళ హారతి నుండి మార్చి 9 న భోగ్ హారతి వరకు మొత్తం 36 గంటల పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో నాన్‌స్టాప్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ట్రస్ట్ అంచనా వేస్తోంది. వికలాంగులు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సుమారు 8 లక్షల మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. వారణాసిలోని అస్సీ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసారం చేయనున్నమని తెలిపారు. -
91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా
దేశ వ్యాప్తంగా మార్చి 8న మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా అత్యంత వైభవంగా జరిగే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ పరిధిలోని చటీడీహ్ శివాలయంలో ఈ ఏడాది మార్చి 8 నుంచి 12 వరకు 5 రోజుల పాటు మేళా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దయాశంకర్ సోని మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయం సుమారు 91 సంవత్సరాల క్రితం నాటిదని, చార్ ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక తన తాత మంగ్లీ ప్రసాద్ సోనీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా నిర్వహిస్తున్నమన్నారు. ఈ ఏడాది కూడా మేళాలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు రావాలని కోరామన్నారు. ప్రస్తుతం మంగ్లీ ప్రసాద్ సోనీ వారసులు ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయంలో ధ్వజారోహణం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని స్థానికులు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు. -
మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది.ఫోక్ సింగర్‌గా గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ సింగర్‌గా కొనసాగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె పాడిన పాటలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరోసారి మంగ్లీ పాడిన ఓ పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో‘భం భం భోలే’ అనే సాంగ్‌ని చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను మంగ్లీ శివరాత్రి స్పెషల్ సాంగ్‌గా రిలీజ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆలయం లోపల వీడియోలు, ఫోటోలు తీసేందుకు అనుమతి లేదు. అలాంటిది గర్భగుడిలో మంగ్లీ అండ్ టీం షూటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరికి పర్మీషన్ ఎలా ఇచ్చారంటూ నిలదీస్తున్నారు.ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున గర్భగుడిలో ఈ పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగ్‌లో ఆలయ అర్చకులు కూడా కనిపిస్తుండటంతో చాన్నాళ్లుగా వస్తున్న ఆచారాలను ఎలా పక్కన పెడతారంటూ భక్తులు కన్నెర్ర జేస్తున్నారు. -
చెరిగిపోని పచ్చబొట్టు సంతకం
‘ఒక మహిళ చిత్రకారిణిగా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.కాని టాటూ ఆర్టిస్ట్‌గా ఉంటానంటేఆశ్చర్యంగా చూస్తారు’ అంటుంది అర్చన భానుషాలి.దేశంలో ఉత్తమ మహిళా టాటూ ఆర్టిస్ట్‌గా గుర్తింపు ΄పొం దిన అర్చనమగవాళ్లు రాజ్యమేలే ఈ రంగంలో తన ఉనికిని సగర్వంగా చాటుతోంది. ఈ రంగంలో మగవారు విపరీతంగా ఉన్నారు. ఆడవాళ్ల ప్రవేశం అంత సులభం కాదు. కాని నేను పంతంతో ఈ స్థాయికి వచ్చాను. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. మీకు లక్ష్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ కష్టం చాలా చేయాలి. ఇవాళ నేను ఈ రంగంలో గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా మంచి రాబడి ΄పొం దుతున్నాను. – అర్చన శివరాత్రి సందర్భంగా ‘శివ్ అండ్ శక్తి కాస్మిక్ డాన్స్’ అనే సబ్జెక్ట్‌ను పచ్చబొట్టుగా వేసింది అర్చన భానుషాలి. శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తున్న ఆ పచ్చబొట్టులో జీవం ఉట్టి పడుతోంది. అర్ధనారీశ్వరుడి చిత్రం కూడా పచ్చబొట్టుగా వేస్తుందామె. ఇవే కాదు ఆమె బొమ్మల్లో మన సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నాలు కనపడతాయి. శివాజీ వంటి వీరులూ, అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారులు కూడా కనపడతారు. పచ్చబొట్టును ఒక విశృంఖల చిహ్నంగా కాకుండా వ్యక్తిత్వ ప్రకటనగా మార్చడం వల్లే అర్చనకు మంచి పేరొచ్చింది. అందుకే ఆమె ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా టాటూ ఆర్టిస్ట్‌లలో బెస్ట్ ఆర్టిస్ట్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా గౌరవం ΄పొందుతోంది. కమర్షియల్ ఆర్టిస్ట్‌గా అర్చన కుటుంబానిది గుజరాత్ అయినా ముంబైలో స్థిరపడింది. అర్చన ఏడేళ్ల వయసు నుంచే వయసుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తూ బొమ్మలు వేసేది. దాంతో ఇంట్లోప్రో త్సహించారు. అయితే ఇంటర్ వయసు వచ్చే సరికి గుజరాతీలలో అమ్మాయిలకు పెళ్లి చేసి పంపాలనే తొందర ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని వెంటపడితే అప్పుడే వద్దని చెప్పి ముంబై జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో మూడేళ్ల డిప్లమా చేసింది కమర్షియల్ ఆర్ట్‌లో. ఆ తర్వాత లండన్ వెళ్లి ఒక సంవత్సరం కోర్సు చదవాలని అనుకుంది. ఆ కోర్సుకు అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుండగా టీవీలో ఒక షో చూసింది. అందులో ప్రఖ్యాత అమెరికన్ టాటూ చిత్రకారిణి కేట్ వాన్ డి తన క్లయింట్లకు అద్భుతంగా టాటూలు వేయడం చూపించారు. ‘నేను పేపర్ మీద వేసేది ఈమె ఒంటి మీద వేస్తోంది. నేనెందుకు ఇలా వేయకూడదు’ అనుకుంది అర్చన. ఆమె యాత్ర మొదలైంది. ‘మా అమ్మానాన్నలు నేను టాటూ ఆర్టిస్ట్‌గా మారతానంటే కంగారు పడినా ఆ తర్వాతప్రో త్సహించారు. దాని వల్ల టాటూ వేయడంలో కోర్సు చేశాను. నాకు బొమ్మలు వచ్చు కనుక చాలా త్వరగా పని నేర్చుకున్నాను. మేము గుజరాతీలం. ఒకరి కింద పని చేయడం కంటే సొంత బిజినెస్ ఉండటాన్నే ఇష్టపడతాం. అందుకే ‘ఏస్ టాటూజ్’ పేరుతో ముంబైలో మా నాన్న నా కోసం టాటూ స్టూడియో ఏర్పాటు చేశాడు’ అంటుంది అర్చన. అయితే అసలుప్రో త్సాహం భర్త నిఖిల్ నుంచి, అత్తా మామల నుంచి లభించింది. ‘మా అత్తగారు నన్ను బాగాప్రో త్సహిస్తారు. పెళ్లయ్యాక నా మొదటి పచ్చబొట్టును ఆమెకే వేశాను’ అంది అర్చన. -
ఆ పాట అప్పుడు ఫాస్టింగ్లోనే ఉన్నా!
‘‘మన కలలను నెరవేర్చుకునే విషయంలో ఆ పరమశివునిలా ఉగ్రంగా, ఇతరులను క్షమించే విషయంలో ఆయనలా దయతో ఉందాం’’ అంటున్నారు పూజా హెగ్డే. నేడు మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ – ‘‘శివరాత్రికి ఉపవాసం ఉండటం అనేది కొన్నేళ్లుగా పాటిస్తున్నాను. ప్రతి శివరాత్రికి మా నాన్నగారు ఉపవాసం ఉంటారు. నా చిన్నతనం నుంచి ఆయన్ను చూస్తున్నాను కాబట్టి నాన్నని ఫాలో అవ్వా లనుకున్నాను. అలా ఎప్పటినుంచో ఫాస్టింగ్ అలవాటైంది. పైగా నేను పదేళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నాను. దాంతో నటరాజుడిని కొలిచేదాన్ని. ఆ విధంగా శివుడితో నా అనుబంధం ఎప్పటినుంచో ఉంది. స్కూల్ డేస్ నుంచే శివరాత్రికి ఉపవాసం ఉంటున్నాను. సినిమాల్లోకి వచ్చాక కూడా తప్పనిసరిగా ఆచరిస్తున్నాను. ‘జిగేల్ రాణి..’ (‘రంగస్థలం’ సినిమా) పాట షూట్ అప్పుడు శివరాత్రి వచ్చింది . ఆ షూట్ అప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను. నాకు వీలు కుదిరినప్పుడల్లా శివుడి ఆలయాలను సందర్శిస్తుంటాను. కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లాను. ధర్మస్థలి (కర్నాటక), బాబుల్నాథ్ మందిర్ (ముంబై)లకు కూడా వెళ్లాను. ఇక నాకు శివుని పాటల్లో ‘శివ్ తాండవ్ స్త్రోత్రం’ ఇష్టం’’ అన్నారు పూజా హెగ్డే. వారణాసిలో జరిగే గంగా హారతిని మా నాన్నగారు గతంలో చూశారు. మేం కూడా చూస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అలా రెండేళ్ల క్రితం నేను, అమ్మానాన్న, అన్నయ్య వెళ్లాం. హారతి చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి లభించింది. అది మాటల్లో చెప్పలేను. గంగా నదీ తీరాన నిలబడి తిలకించడం ఓ గొప్ప అనుభూతి అయితే, పడవలో కూర్చుని తిలకించడం మరో అనిర్వచనీయమైన అనుభూతి. -
Mahashivratri 2023: శ్రీగిరిలో బ్రహ్మోత్సవ వైభవం!
అదిగదిగో శ్రీశైలం.. భూలోకాన కైలాసం అంటూ భక్తజనం మల్లన్న ఎదుట ప్రణమిల్లుతోంది. శ్రీశైలవాసా.. శరణు మల్లన్న అంటూ నీరాజనం పడుతున్నారు. నల్లమల అభయారణ్యం మీదుగా పగలు, రేయి చిన్నాపెద్దా తేడా లేకుండా పాదయాత్రగా వచ్చే శివభక్త గణం ఎండలు మండుతున్నా.. చల్లని గాలులు వణికిస్తున్నా.. భక్తిభావం తొణకడం లేదు. అడుగులన్నీ శ్రీగిరి వైపు పడుతున్నాయి. కైలాస ద్వారం చేరుకుని మరింత ఉత్సాహంతో మల్లికార్జునుడి దర్శనానికి బారులుదీరుతున్నారు. బ్రహ్మోత్సవ సందడి అంబరాన్ని తాకుతుండగా.. భక్తజనం పులకించిపోతుంది. శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీశైలంలో దేవదేవుళ్లు పూలపల్లకీపై వివహరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేళ భక్తజనం ఆనంద పరవశులై స్వామిఅమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరవ రోజు గురువారం నిర్వహించిన మల్లన్న పుష్పపల్లకీ సేవ దివ్య పరిమళభరితంగా సాగింది. ఆలయ తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుంగంధ పుష్పాలతో అలంకరించిన పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. పల్లకీలో స్వామి ఊరేగుతున్నంత సేపు అశేష భక్తజనవాహిని కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, డ్రమ్స్, డప్పులు, తప్పెట్లు, మేళతాళాలు, భజంత్రీలు, శంఖానాదాల కోలాహలం నడుమ గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. కార్యక్రమంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థాన చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, ఈవో ఎస్.లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్.కనకదుర్గ, అంబాల లక్ష్మీసావిత్రమ్మ, ఎం.విజయలక్ష్మి, మఠం విరుపాక్షయ్యస్వామి, ఓ.మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం భక్తజన సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేకువజామున్నే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణవేణమ్మకు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం మల్లన్న దర్శనానికి బారులుదీరుతున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులందరికీ స్వామి వారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అందరికీ అలంకార దర్శనాన్ని కల్పిస్తున్నారు. మల్లికార్జున స్వామి గర్భాలయంలో కూడా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేసి త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర భక్తులు నల్లమల అడవుల్లో నాగలూటి, పెచ్చుర్వు, కైలాసద్వారం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొర్రప్రోలూరు శివస్వాములు 20 కి.మీ దూరంలోని ఆత్మకూరు డివిజన్లోని రోళ్ల పెంట చేరుకుని అక్కడ నుంచి నేరుగా పెచ్చెర్వుకు చేరుకుంటున్నారు. అనంతరం భీముని కొలను మీదుగా శ్రీశైలక్షేత్రానికి నడకమార్గంలో మల్లన్న దర్శనానికి తరలివస్తున్నారు. భక్తులకు ఏ లోటు రానీయొద్దు ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి లోటు రానీయొద్దని దేవస్థానం అధికారులను ఈఓ లవన్న ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్ర పరిధిలో తాత్కాలిక వైద్యశాల, అన్న ప్రసాదవితరణ, దర్శన క్యూలైన్ల్లను పరిశీలించారు. క్షేత్ర పరిధిలో వైద్య శిబిరాల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. లడ్డూ ప్రసాదాల కేంద్రాల వద్ద భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమయానుసారంగా అన్నప్రసాదాలను అందించాలని సూచించారు. క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందించాలని సూచించారు. మేము.. మీకు సహాయ పడగలము! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలదేవస్థానం ఆధ్వర్యంలో నందికూడలి వద్ద సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో క్షేత్రానికి సంబంధించిన వివరాలతో కరపత్రాలు అందుబాటులో ఉంచారు. భక్తులు ఏదేనీ సమాచారాన్ని అడిగిన వెంటనే మర్యాదపూర్వకంగా వారికి తెలియజేస్తున్నారు. రథశిఖర కలశానికి పూజలు ఆదివారం రథోత్సవం సందర్భంగా రథశిఖర కలశానికి గురువారం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈఓ లవన్న ప్రత్యేక పూజల నిర్వహించి, రథశిఖర కలశాన్ని స్వయంగా మోసుకుంటూ ఆలయప్రదక్షిణ చేశారు. అనంతరం రథశిఖర కలశాన్ని సంప్రదాయబద్దంగా రథం వద్దకు చేర్చారు. శ్రీశైలం నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ, గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
‘ప్రభ’వించితివా.. శివా!.. కోటప్పకొండకు శివరాత్రి శోభ
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత ఉంది. ఎక్కడాలేని విధంగా శివరాత్రి రోజున కోటప్పకొండకు 30 కి.మీ. దూరంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఇక్కడి సంస్కృతిలో భాగం. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభల వైభవాన్ని చూడాలే కాని వర్ణించలేం. ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. తిరునాళ్ల రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు అందజేయడం అనవాయితీ. ప్రభల సంస్కృతి ప్రారంభమైందిలా పరమశివుడు మూడు కొండల(త్రికూటం)పై జంగమదేవర రూపంలో «ధ్యానంలో ఉండేవారట. కొండ సమీపంలోని కొండకావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి (గొల్లభామ) నిత్యం స్వామికి పాలను తీసుకెళ్లి ఇచ్చేదట. ఆ తరువాత గర్భం దాల్చిన ఆనందవల్లి స్వామి చెంతకు వెళ్లి.. తాను కొండ ఎక్కి రాలేకపోతున్నానని చెప్పిందట. కొండదిగి కిందకు వస్తే రోజూలాగే పాలను ఆహారంగా ఇస్తానందట. అందుకు అంగీకరించిన శివుడు.. కొండ దిగుతున్న సమయంలో చివరి వరకు వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధించారట. మధ్యలో వెనుదిరిగి చూస్తే శిల అయిపోతానని చెప్పారట. షరతుకు అంగీకరించి ఆనందవల్లి ముందు నడుస్తుంటే.. స్వామి వెనుకే బయలుదేరారట. కొంతదూరం వెళ్లాక భారీ శబ్దాలు రావటంతో ఆనందవల్లి వెనుదిరిగి చూసిందంట. ఆ వెంటనే స్వామి బ్రహ్మ శిఖరంపై శిల రూపంలో మారిపోయారని చెబుతారు. ఈ క్షేత్రంలో ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే స్వామి వారిని దర్శించుకుంటారు. కాగా, అక్కడి భక్తులు స్వామి వద్దకు వెళ్లి కొండ దిగి రావాలని వేడుకోగా.. తన కొండకు ఎప్పుడైతే కోటిన్నొక్క ప్రభలు వస్తాయో అప్పుడే కొండ దిగి వస్తానని చెప్పారట. అప్పటి నుంచి కోటయ్య చెంతకు భక్తులు ప్రభలతో రావడం ప్రారంభమైందని స్థానికులు చెబుతారు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలని.. గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోటప్పకొండకు ప్రభలు కట్టుకుని వెళతారు. క్రమం తప్పకుండా చాలా గ్రామాల ప్రజలు ప్రభలను తీసుకొస్తున్నారు. ప్రభల విషయంలో గ్రామాల మధ్య పోటీ కూడా ఉంటుంది. గ్రామ పెద్దలు ఇంటికి ఇంత, ఎకరానికి ఇంత అని చందాలు వేసుకుని ప్రభలు నిర్మిస్తారు. గ్రామాలతోపాటు ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు కూడా ప్రభలు తయారు చేసుకుంటాయి. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులు జాగారం పూర్తి చేస్తారు. ప్రభ కొండకు బయలుదేరే ముందు గ్రామంలో, కొండ వద్ద తిరునాళ్ల రోజు, తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి పండుగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. గతంలో కోటప్పకొండకు ఎద్దుల సాయంతో ప్రభలను తరలించేవారు. ప్రభల ఎత్తు 20 అడుగుల ఎత్తు వరకు ఉండేది. కాలక్రమేణా ప్రభల ఎత్తు 80 నుంచి 90 అడుగుల వరకు చేరింది. విద్యుత్ ప్రభల తయారీ, కొండకు తరలించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదం, తిరిగి గ్రామానికి చేర్చడానికి ఒక్కో ప్రభకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ప్రభల సంస్కృతిని కాపాడుతున్నాం తరతరాలుగా మా పూర్వీకులు కోటప్పకొండకు ప్రభలు కడుతున్నారు. మేం 44 ఏళ్లుగా విద్యుత్ ప్రభ కడుతున్నాం. సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. – ఎన్.హరిబాబు, అప్పాపురం, నాదెండ్ల మండలం గ్రామం బాగు కోరి.. కోటప్పకొండకు ప్రభలను కడితే గ్రామం సుభిక్షంగా ఉంటుందని పెద్దల విశ్వాసం. అదే అనవాయితీని కాపాడుతూ వస్తున్నాం. శివరాత్రికి రెండు మూడు నెలల ముందే ప్రభల ఏర్పాటుకు సిద్ధమవుతాం. – కంచేటి వీరనారాయణ, కాకాని, నరసరావుపేట మండలం -
Maha Shivaratri 2023: పండంటి ఆహారం.. దానిమ్మ రసం, డ్రై ఫ్రూట్ లడ్డు.. ఇంకా
రేపే శివరాత్రి! రోజంతా ఉపవసించాలి... నీరసించకూడదు. వండ వద్దు... ఎండకు డస్సిపోనూ వద్దు. పండంటి ఆహారంతో శక్తిని పుంజుకోవచ్చేమో! వంటకు నిషేధం... పండ్లకు ఆహ్వానం !! దానిమ్మ రసం కావలసినవి: దానిమ్మ పండ్లు – 2 తయారీ: దానిమ్మ పండ్లను కడిగి ఒక్కొక్క పండును నాలుగు భాగాలుగా కట్ చేయాలి. మొత్తం ఎనిమిది ముక్కలను వెడల్పాటి పాత్రలో వేసి ముక్కలు మునిగేటట్లు నీరు పోయాలి. ఇప్పుడు వేళ్లతో మృదువుగా గింజలను వేరు చేయాలి. గింజలు నీటి అడుగున చేరతాయి, వగరుగా ఉండే పలుచని తొక్క నీటి మీద తేలుతుంది. పై చెక్కు, లోపలి తొక్కలను తీసేసి నీటిని వడపోయాలి. ఈ గింజలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను అలాగే తాగవచ్చు లేదా వడపోసి తాగవచ్చు. వడపోయకుండా తాగినట్లయితే జీర్ణవ్యవస్థ చక్కగా శుభ్రపడుతుంది. దానిమ్మలోని తీపి సరిపోదనుకుంటే గింజలను గ్రైండ్ చేసేటప్పుడు రెండు ఖర్జూరాలను (గింజ తీసేసినవి) కలుపుకోవచ్చు. రెయిన్ బో ఫ్రూట్ సలాడ్ కావలసినవి: స్ట్రాబెర్రీలు – 2 కప్పులు (శుభ్రం చేసి సగానికి కట్ చేయాలి); తర్బూజ ముక్కలు – 2 కప్పులు; బ్లూ బెర్రీలు – కప్పు; కివీ పండ్లు – 2 (తొక్క తీసి పలుచగా ముక్కలు చేయాలి); బొప్పాయి పండు (ముక్కలు చేయాలి); రాస్ప్ బెర్రీలు – కప్పు తయారీ: ఈ ముక్కలను చక్కగా ఫొటోలో ఉన్నట్లు ఇంద్రధనుస్సు ఆకారంలో అమర్చాలి. ఫ్రూట్ సలాడ్ ప్లేట్‌ని ఇలా చూస్తే ఎవరికైనా ఒక ముక్క తినాలనిపిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న అరటిపండు, యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లతోనూ సరదాగా ఇంద్ర ధనుస్సును అమర్చుకోవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు కావలసినవి: ఖర్జూరాల ముక్కలు – కప్పు; బాదం – 3 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; అంజీర్ – 8; కొబ్బరి తురుము – టేబుల్ స్పూన్; యాలకులు – 2. తయారీ: బాదం పప్పును బాగా ఎండబెట్టి సన్నగా తరిగి ఒకపాత్రలో వేయాలి. అంజీర్లను కూడా తరగాలి, యాలకులను తొక్క వేరు చేసి గింజలను పొడి చేసి బాదం తరుగులో వేయాలి. మిక్సీ జార్లో ఖర్జూరం పలుకులు, అంజీర్ మిశ్రమం, జీడిపప్పు, కిస్మిస్, బాదం తరుగు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి సమంగా కలిసేటట్లు బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కావలసిన సైజ్‌లో లడ్డూలుగా తయారు చేయాలి. పుచ్చకాయ రసం కావలసినవి: పుచ్చకాయ – 1 (మీడియం సైజ్); పుదీన ఆకులు – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం – టీ స్పూన్. తయారీ: పుచ్చకాయలో గింజలు తీసేసి ముక్కలు తీసుకోవాలి. ఈ ముక్కల్లో పుదీనా ఆకులు వేసి మిక్సీ జార్ (జ్యూస్ బ్లెండర్)లో గ్రైండ్ చేయాలి. చివరగా నిమ్మరసం కల పాలి. ఫైబర్ సమృద్ధిగా అందాలంటే ఈ మిశ్రమాన్ని వడపోయకుండా తాగవచ్చు. అలా తాగలేకపోతే వడపోసి తాగవచ్చు. -
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో 11 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరగనుంది. ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట ఆవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిశ్వరస్వామి దేవస్థానం అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పిస్తారు. -
వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
-
భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం
-
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు
-
ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు..
-
లోకుల వద్దకు లోకపావనుడు
త్రిలోకపావనుడు, త్రినేత్రుడు, అయిన ఆ పరమేశ్వరుడు, ఈ 21, శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఇల కైలాసమైన శ్రీశైలమహా క్షేత్రంలో దేవేరి భ్రామరితో కలిసి నవ నవోన్మేషుడై నవవాహనాలపై ఊరేగుతాడు. శివరాత్రి కల్యాణోత్సవానికి ముందే పుష్పోత్సవ పల్లకీ, శివరాత్రి నాడు ప్రభోత్సవ వాహనంలో ఊరేగడంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనువిందు చేస్తాడు. ఆయన సేవలో తరించడానికి సకల ప్రాణులు సిద్ధంగా ఉన్నా కొన్నింటిని మాత్రమే ఆయన అనుగ్రహించి వాహనంగా చేసుకున్నాడు. ఆఖరు రోజున తెప్పోత్సవంతో సేవలు ముగుస్తాయి. ఒక్కొక్క వాహనానికి ఒక్కోప్రత్యేకత ఉంది. ఆ వాహనాలు వేటికి ప్రతీక... మొదలైన వాటిపై సాక్షి ప్రత్యేక కథనం. భృంగి వాహనం ప్రమథ గణాలలో నంది తరువాత స్థానం కలిగినవాడు భృంగి. ప్రకృతి, పురుషులు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు వేర్వేరు కాదని, ఒక్కరేనని తెలుసుకుని వారిద్దరికి కలిసి ప్రదక్షిణలు ఆచరించాడు. వారిని తన వీపుపై కూర్చోబెట్టుకుని ఊరేగించాడు. ఆనాటి నుంచి భృంగివాహనంగా మారాడు. పార్వతీదేవి కోపానికి గురై రెండు పాదాలలో శక్తి కోల్పోతే స్వామి కరుణించి మూడోపాదాన్నిచ్చి రక్షించాడు. కనుక ఇతను త్రిపాదుడు. నమ్మిన వారిని స్వామి ఎప్పటికీ మరచిపోడని భృంగివాహనం తెలియజేస్తోంది. హంసవాహనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు సాయంత్రం స్వామి, అమ్మవార్లు హంసవాహనంపై ఊరేగుతారు. హంస అఖండమైన జ్ఞానానికి ప్రతీక, పరమేశ్వరుడు సకల కళలకు అధిపతి. అంతులేని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుకనే జ్ఞానానికి ప్రతీకయిన హంసపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. హంస పాలను, నీళ్లను వేరు చేస్తుంది. పాలల్లో నీళ్లు కలిపి ఇస్తే నీటిని ఉంచి పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అలాగే జీవితంలో కష్టనష్టాలు, సుఖదుఃఖాలు వచ్చినా కష్టాలను విడిచిపెట్టి సుఖ జీవనం సాగించాలని, దుర్గుణాలను విడిచి అఖండ జ్ఞానాన్ని సంపాదించమని జ్ఞాన ఉపదేశకుడైన స్వామి జ్ఞానశక్తి అమ్మవారితో కలిసి జ్ఞానప్రతీకయైన హంసవాహనంపై ఊరేగుతారు. మయూర వాహనం మయూరం అంటే నెమలి. ఈ నెమలి సమస్త సృష్టి క్రియా చైతన్యానికి ప్రతీక. మయూరం సుబ్రçమణ్యస్వామి వాహనం. మరి ఈ వాహనం స్వామికి వాహనంగా ఎలా మారింది? శివునిలోనూ సుబ్రమణ్యస్వామిలోనూ ఉన్నది ఒకే అంశ అదే శివాంశ. అలా శివుడికి శిఖి (నెమలి)వాహనమైంది. కాగా నెమలి వెయ్యి కన్నులతో (పింఛాలతో)కనిపిస్తుంది. తనను శరణు వేడిన భక్తులను వెయ్యికన్నులతో కనిపెట్టుకుని ఉంటాననడానికి సంకేతంగా నెమలిపై వస్తున్న స్వామి తన భక్తులకు హామీ ఇస్తున్నట్లుంది. రావణ వాహనసేవ రావణుడు అఖండ శివభక్తుడు. నిరంతరం శివధ్యానం చేస్తూ ప్రతి నిత్యం కోటి శివలింగాలను అర్చించేవాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఎన్నో వరాలు పొంది పరమేశ్వరుడి కోసం చేసిన తపస్సులో పదిసార్లు తన తలను నరికి తిరిగి పది తలలను పొంది దశకంఠుడిగా పేరు పొందాడు. తన ప్రేగులనే తంత్రులుగా చేసుకుని తన పదవతలనే మీటగా మార్చి వీణానాదంతో శివుడికి ప్రీతి కలిగించాడు. ఆ వీణే రుద్రవీణగా ప్రసిద్ధికెక్కింది.. రావణుని పది తలలు పది రకాలెన జ్ఞానానికి ప్రతీక. అనన్యమైన భక్తితో పరమేశ్వరుడిని శరణు వేడితే అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని రావణవాహనం చెబుతోంది. పుష్పపల్లకీ సేవ స్వామివారు అభిషేక ప్రియుడైతే అమ్మవారు పుష్పప్రియురాలు. హిమవంతుడు తన కుమార్తెతో వివాహానికి స్వామివారిని ఒప్పించి స్వామిని తీసుకురమ్మని మేనా (పల్లకి)ని పంపుతాడు. ఆ మేనాను సృíష్టిలో అరుదైన అద్భుతమైన దివ్యపరిమళం కలిగిన పూలతో అలంకరించి పంపుతుంది పార్వతిదేవి. తన వాహనం విడిచి రాని శివుడు పార్వతి మాట చెల్లించడం కోసం ఆ పుష్పపల్లకి ఎక్కి వస్తాడు. పుష్పాలు మోహాన్ని కలిగిస్తాయి. ఆ మోహం క్షణికం. సుతిమెత్తని పూల ఆయుష్షు ఒక్కరోజే కాని అవి చేరాల్సిన చోటుకు చేరి పరమేశ్వరుని సాన్నిధ్యం పొందాయి. నేను పెంచిన పూలైన మీరంతా నన్ను ఆర్చించి చివరకు నా దరికే చేరుకోండనే సంకేతం ఉంది. గజవాహనసేవ గజం ఐశ్వర్యానికి, ఆధిపత్యానికి, అంగబలానికి ప్రతీక. శ్రీశైలమల్లికార్జునస్వామి శ్రీలింగ మహాచక్రవర్తి, ఈ సమస్త భూమండలానికి మూలమై నిలిచే శ్రీశైలం ఆయన మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాధినేతకు, సమస్త భక్తులు ఆయన సైన్యం. జయ జయధ్వానాల నడుమ ఆయన అమ్మతో కలిసి ఐరావతాన్ని ఆధిరోహించి దర్శనమిస్తాడు. భక్తులకు అండగా నిలుస్తాడు. ఈ సమస్త భూ మండలాన్ని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయి. ఈ దిగ్గజాలు అషై్టశ్వర్యాలకు ప్రతీకలు. అటు వంటి అష్టగజాల సమిష్టి రూపమైన గజంపై ఆయన ఊరేగింపుగా వస్తుంటే సమస్త భక్తులకు కొండంత అండగా కనిపిస్తాడు. తమ కష్టాలు గట్టెక్కాయనే ధైర్యం భక్తులలో కలుగుతుంది. కుబేరుడు, లక్ష్మీదేవి మొదలైన వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించినæఐశ్వరేశ్వరుడు. గజవాహæనంపై దర్శనమిస్తున్న స్వామి భక్తులకు సమస్త సుఖసంపదలను ప్రసాదిస్తాడు. ప్రభోత్సవం ఉత్సవాలలో ముఖ్యమైన మహాశివరాత్రి నాడు ప్రభోత్సవం అత్యంత ప్రముఖమైన ఘట్టం. ప్రభపై స్వామి, అమ్మవార్లు ఊరేగుతారు. ప్రభ రెండు స్తంభాలు ఒకటై చివరికి ముక్కోణంగా కనిపిస్తుంది. అంటే భగవంతుని మూడు మార్గాల ద్వారా అంటే కాయక (శరీరం) వాచిక (మాటలు), మానసిక మార్గం ద్వారా ఉపాసించమని తెలుపుతుంది. ప్రభలో ఎన్ని రంగులున్నాయో, తమ జీవితంలో అన్ని శుభాలు కలగాలని స్వామిని కోరుకుంటారు. నందివాహనసేవ నంది శివుడికి అత్యంత ఆప్త భక్తుడు. తనకు తండ్రి ద్వారా లభించిన శివభక్తితో శివుడికై తపస్సు చేసి చివరికి ఎప్పటికీ శివుని వీడి ఉండకుండా నిరంతరం స్వామి సాహచర్యం పొందే గొప్ప అవకాశాన్ని పొందాడు. నంది సాక్షాత్తు ధర్మస్వరూపం. అతడి నాలుగు పాదాలు నాలుగు వేదాలు. అతడి రెండు కళ్లు సూర్యచంద్రులు. అతని రూపం రుద్రుడి రూపం. అతని హృదయం ధర్మానికి నిలయం. రథోత్సవం రథం ఒక వాహనం మాత్రమే కాదు. ఒక సంకేతం. రథచక్రం కాల చక్రానికి ప్రతీక. ఆత్మను రథసారథిగా, మనస్సును పగ్గాలుగా, దేహాన్ని కదిలే రథంగా అభివర్ణించాయి ఉపనిషత్తులు. రథం చూడడానికి మరో ఆలయంగా దర్శనమిస్తుంది. ఆలయానికి చక్రాలు బిగించి కదిలే దేవాలయంగా కమనీయంగా దర్శనమిస్తుంది రథం. భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునుడు రథంపై విహరిస్తూ భక్తుల తాపత్రయాన్ని (మూడు బాధలను) నివారిస్తూ ఆలయానికి రాలేని వృద్ధులు, రోగులను ఆదుకుంటానని అభయమిస్తూ రథాలయాన్ని భక్తుల ముందుకు తెస్తుందీ రథోత్సవం. అశ్వం నూతనత్వానికి ప్రతీక. నిరంతరం శక్తిని కూడగట్టుకుని లక్ష్యాన్ని చేరే వరకూ అలుపెరగదు అశ్వం. అలాగే పరమేశ్వరుని పాదాలను చే రుకునే వరకు మీ పూజలు, తపస్సు ఆపకండి నిరంతరం శివభక్తిలో ప్రయాణించి చివరకు శివసాన్నిధ్యం పొందటమే మీ జీవిత లక్ష్యంగా మార్చుకొండి అని అశ్వవాహనం తన సందేశాన్ని తెలుపుతుంది. – ఎన్.నాగమల్లేశ్వరరావు, సాక్షి, శ్రీశైలం రథోత్సవం తెప్పోత్సవం అశ్వవాహనం -
మహాశివరాత్రి: కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు
-
ప్రసాదం తిని 1500 మందికి అస్వస్థత
శివరాత్రి రోజున మధ్యప్రదేశ్‌లో కలకలం చోటు చేసుకుంది. పండుగ రోజు ప్రసాదం తిని 1500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. మధ్యప్రదేశ్, బార్వానీ జిల్లాలోని ఆశ్రమ్ గ్రామంలో శివరాత్రి వేడుకలు నిర్వహించారు. పూజలు అన్నీ పూర్తయ్యాక ప్రసాదం కిచడీ పంపిణీ చేశారు. ప్రసాదం తిన్నప్పటి నుంచి దాదాపు 1500 మందికిపైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. భక్తులంతా తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో ఆలయ వర్గాలు, స్థానికులు బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరి కొంత మందిని మరో రెండు ప్రవేటు ఆస్పత్రుల్లో చేర్చి వైద్యం అందించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం కుదురుగా ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఈసంఘటకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించమని జిల్లా అధికారులు, వైద్యులను ఆదేశించారు. -
శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
కిటకిటలాడుతున్న శివాలయాలు
హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఎటు వైపు చూసిన భక్తి పారమశ్యంతో శివ నామస్మరణతో ఆలయాలు కిక్కిరిస్తున్నాయి. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. పరమశివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. -
ఆకాశాన్నంటిన పండ్ల ధరలు
రంగారెడ్డి: శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రూ.20లకు లభించే పుచ్చకాయ రూ.40 నుంచి రూ.120 వరకు ధర పలుకుతోంది. రూ.30లకు లభించే డజన్ అరటి పండ్లు నేడు రూ.45 నుంచి రూ.60లకు చేరాయి. ద్రాక్ష గతంలో కిలో రూ.50 ఉండగా ప్రస్తుతం రూ.70 నుంచి రూ.100కు చేరాయి. గతంలో రూ.10లకు నాలుగు బత్తాయి పండ్లు వస్తే ప్రస్తుతం ఒకదానికి రూ.5లకు విక్రయిస్తున్నారు. మొరంగడ్డ కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.60లకు చేరింది. ఇలా... అన్ని రకాల పండ్లకు రెక్కలొచ్చాయి. పండుగ కావడంతో ఎలాగైనా కొనుగోలు చేస్తారని అమ్మకందారులు రేట్లు పెంచారని పలువురు అంటున్నారు. ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి మరీ పండ్లను విక్రయిస్తున్నారు. (ఘట్కేసర్)