91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా | Fair is Organized in This Temple on Mahashivratri for 91 Years | Sakshi
Sakshi News home page

Chhattisgarh: 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా

Published Wed, Mar 6 2024 9:20 AM | Last Updated on Wed, Mar 6 2024 10:34 AM

Fair is Organized in This Temple on Mahashivratri for 91 Years - Sakshi

దేశ వ్యాప్తంగా మార్చి 8న మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా అత్యంత వైభవంగా జరిగే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ పరిధిలోని చటీడీహ్ శివాలయంలో ఈ ఏడాది మార్చి 8 నుంచి 12 వరకు 5 రోజుల పాటు మేళా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు  దయాశంకర్ సోని మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయం సుమారు 91 సంవత్సరాల క్రితం నాటిదని, చార్ ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక తన తాత మంగ్లీ ప్రసాద్ సోనీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా నిర్వహిస్తున్నమన్నారు. 

ఈ ఏడాది కూడా మేళాలో దుకాణాలు ఏ‍ర్పాటు చేసేందుకు వ్యాపారులు రావాలని కోరామన్నారు. ప్రస్తుతం మంగ్లీ ప్రసాద్ సోనీ వారసులు ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయంలో ధ్వజారోహణం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని స్థానికులు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement