Fair
-
మూడు రోజుల గిరిజన జాతరకు సర్వం సిద్ధం
సాక్షి, పాడేరు: ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన అరకు లోయ శుక్రవారం నుంచి జరగబోయే చలి జాతరకు ముస్తాబైంది. గిరిజన ఆచార, సంప్రదాయాలకు చలి ఉత్సవాలు అద్దం పట్టనున్నాయి. అరకు లోయలోని డిగ్రీ కళాశాల వేదికగా అరకు చలి ఉత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హాట్ బెలూన్, పారాగ్లైడ్, హెలికాప్టర్ వంటి వాటిని ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో పర్యాటకులు, స్థానికులు విహరించేలా ఏర్పాట్లు చేశారు. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సంప్రదాయ డప్పు వాయిద్యాలు హోరెత్తనున్నాయి. ఈ నెల శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగిసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. అరకు మారథాన్, పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో, గిరిజన వంటకాల ఫుడ్ కోర్టు, పలు రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాఫీ రుచులు, ఫ్యాషన్ షో, సినీ కళాకారులతో కామెడీ స్కిట్స్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో అరకు ట్రెక్కింగ్, హెలికాప్టర్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయలో ఇటువంటి ఉత్సవాలను తిలకించడం లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటుంటారు పర్యాటకులు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
గాల్లో బాలిక ప్రాణాలు
లఖింపూర్‌ఖేరీ (యూపీ): ఆ 14 ఏళ్ల బాలిక జాతరకు వెళ్లింది. సరదాగా జెయింట్ వీల్ ఎక్కింది. అది కాస్తా పూర్తిగా పైకి వెళ్లాక 150 అడుగుల ఎత్తులో ఉండగా బాలిక ఉన్నట్టుండి అదుపు కోల్పోయింది. తన కేబిన్ నుంచి విసురుగా బయటికొచ్చింది. అయినా వీల్ ఆడకుండా తిరుగుతూనే ఉంది. దాంతో కిందనుంచి చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ పాప చురుగ్గా స్పందించింది. క్యాబిన్ కిందివైపున్న మెటల్బార్ను గట్టిగా పట్టుకుంది. దాన్ని కరుచుకుని కదలకుండా ఉండిపోయింది. ఆపరేటర్లు హుటాహుటిన జెయింట్ వీల్‌ను ఆపేశారు. అది నెమ్మదిగా తిరుగుతుండగా బాలికను కిందకు వచ్చింది. వెంటనే తనను అందుకుని దించి కాపాడారు. 30 సెకన్లకు పైగా బాలిక మెటల్బార్ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సమీపంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ అధికారులు జెయింట్ వీల్‌ను సీల్ చేశారు. -
ఏటా పుష్కరమే..! బ్రహ్మ దేవుడి క్షేత్రం
బ్రహ్మదేవుడంటే... ఈ సమస్త భూమండలంలో ఆలయం లేని దేవుడనే అసంతృప్తిని రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ తీర్చింది. అజ్మీర్‌కి 11 కి.మీల దూరంలో పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. పుష్కర్ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం కావడంతో ఈ పట్టణానికి కూడా అదే పేరు స్థిరపడింది. రాజస్థాన్ అంటేనే ఎడారులు, ఒంటెలు. ఇక్కడ ఏటా జరిగే క్యామెల్ ఫెయిర్ ప్రపంచ ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే వేడుకకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ప్రదేశం పేరు పుష్కరే కానీ వేడుకలు పుష్కరానికొకసారి కాదు ఏటా జరుగుతాయి.పుష్కర్ మేళాప్రపంచ ప్రసిద్ధి చెందిన వేడుక కావడంతో ఇది క్యామెల్ ఫెయిర్‌గా వాడుకలోకి వచ్చింది. పుష్కర్మేళా సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వారోత్సవాల్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీత ప్రదర్శనలను, నాట్య ప్రదర్శనలతో΄ాటు సాముగారడీలు, పాములనాడించేవాళ్లు కూడా వస్తారు. స్థానిక హస్తకళలు, దుస్తుల దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ సీజన్లో పుష్కర్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పగలు ఏదో ఒక సమయంలో 22 డిగ్రీలకు చేరుతుంది, కానీ సూర్యకిరణాలు మబ్బును చీల్చుకుని మనిషిని తాకి వెచ్చదనాన్నివ్వడం కష్టమే. రాత్రి టెంపరేచర్ ఎనిమిది డిగ్రీలకు పడి΄ోతుంది. పాశ్చాత్యదేశీయులకు అనువుగా ఉంటుంది. ఈ ఏడాది వేడుకలు నవంబర్ 9 నుంచి మొదలై 15 వరకు కొనసాగుతాయి. -
పేపర్ లీక్ కట్టడికి యూపీ సర్కారు సరికొత్త ప్రణాళిక
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో జరిగే పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు పలు చర్యలు ప్రారంభించాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ ఒకటి.ఉత్తరప్రదేశ్ జనాభాలో 56 శాతం మంది యువతే ఉన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టాలని ఇక్కడి యువత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటుంది. తాజాగా యూపీలోని యోగి సర్కారు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో జరిగే ఏ పరీక్షకైనా వాటి నిర్వహణ బాధ్యతను నాలుగు ఏజెన్సీలకు అప్పగిస్తారు.ప్రింటింగ్ ప్రెస్ ఎంపికలో గోప్యత ఉండటంతోపాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ప్రింటింగ్ ప్రెస్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తారు. బయటి వ్యక్తులెవరూ ప్రెస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్‌లోనికి స్మార్ట్ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తారు.రాష్ట్రంలో జరిగే ఏదైనా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య నాలుగు లక్షలు దాటితే, ఆ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి షిఫ్ట్‌లో తప్పనిసరిగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పేపర్ సెట్లు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సెట్ ప్రశ్నాపత్రాల ముద్రణ వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. అలాగే ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు చేపట్టనున్నారు. -
91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా
దేశ వ్యాప్తంగా మార్చి 8న మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా అత్యంత వైభవంగా జరిగే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ పరిధిలోని చటీడీహ్ శివాలయంలో ఈ ఏడాది మార్చి 8 నుంచి 12 వరకు 5 రోజుల పాటు మేళా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దయాశంకర్ సోని మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయం సుమారు 91 సంవత్సరాల క్రితం నాటిదని, చార్ ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక తన తాత మంగ్లీ ప్రసాద్ సోనీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా నిర్వహిస్తున్నమన్నారు. ఈ ఏడాది కూడా మేళాలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు రావాలని కోరామన్నారు. ప్రస్తుతం మంగ్లీ ప్రసాద్ సోనీ వారసులు ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయంలో ధ్వజారోహణం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని స్థానికులు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు. -
ముసుగు వీరుడిలా హరియాణా సీఎం, ఎందుకిలా? వీడియో వైరల్
హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పంచకులలోని జాతరలో మారువేషంలో కనిపించడం వైరల్‌గా మారింది. రాష్ట్రంలో స్థానికంగా నిర్వహించే జాతరకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తనను ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి కండువాతో కప్పుకొని మరీ మంగళవారం సాయంత్రం దర్శమనిచ్చారు. వాచ్మెన్ వేషంలో ఈ వేడుక మైదానంలో షికారు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఖట్టర్ అని ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి తర్వాత ధృవీకరించారు. స్థానిక వేడుకలో ఎవరికీ అనుమానం రాకుండా వాచ్‌మెన్‌లా అది కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సీఎం ఖట్టర్ జనాల మధ్య ఖాకీ రంగు దుస్తులలో , కాషాయ రంగు టోపీతో ఈ వీడియోలో కనిపించారు. అయితే హరియాణాలోని పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రావణ్ దహనం దృశ్యాలని తెలుస్తోంది. हरियाणा के मुख्यमंत्री मनोहर लाल खट्टर पंचकूला के सेक्टर-5 के दशहरा ग्राउंड में मेला देखने के लिए पहुंचे। यह दावा उनके एक वीडियो को लेकर किया जा रहा है। सीएम इस वीडियो में बिना सिक्योरिटी के मेले में घूमते नजर आ रहे हैं।#ManoharLalKhattar #haryana pic.twitter.com/1Z17xXgdZB — Parmeet Bidowali (@ParmeetBidowali) November 8, 2023 హాట్ బెలూన్ ప్రాజెక్ట్ ఇది ఇలా ఉంటే ఈరోజు ఉత్తర హరియాణాలో హాట్ బెలూన్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక వృద్ధితోపాటు, అక్కడి సాహస ప్రియులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసినట్టు సీఎం చెప్పారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించి, లాంచ్ సందర్భంగా ప్రకృతి సఫారీ ప్రాజెక్ట్‌న ఎంజాయ్ చేయడం విశేషం. విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణించాం.. కానీ హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ అనేది ప్రత్యేకమైన అనుభూతి అంటూ ట్వీట్ చేశారు. హరియాణాలో పర్యాటకులకు స్వాగతం! గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ఎంతో కృషి చేశామని సీఎం పేర్కొన్నారు. हरियाणा में पर्यटकों का स्वागत है! पर्यटन के मानचित्र पर हरियाणा को उभारने के लिए हमने पिछले 9 वर्षों से अभूतपूर्व कार्य किए हैं। आज एक और कदम आगे उठाते हुए पर्यटन की रोमांचक गतिविधियों को बढ़ावा देने हेतु पिंजौर में हॉट एयर बैलून सफारी का शुभारंभ कर इसका लुत्फ भी उठाया।… pic.twitter.com/mX7YCzIrJe — Manohar Lal (@mlkhattar) November 8, 2023 -
యోగి సర్కార్ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ!
ఉత్తరప్రదేశ్‌లోని వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయాన్ని అందించేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని 75 జిల్లాల్లో నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు దీపావళి మేళా నిర్వహించనున్నారు. పీఎం స్వనిధి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ మేళా జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర పట్టణ జీవనోపాధి మిషన్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణ పౌరులకు అవసరమయ్యే ఉత్పత్తులను ఒకే చోట అందించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎకె శర్మ తెలిపారు. ఈ మేళాతో వీధి వ్యాపారులకు, స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం అందుతుందని అన్నారు. ఈ మేళాకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. మేళా జరిగే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా యోగి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, బోనస్‌ను కానుకగా ఇచ్చింది. అలాగే గృహిణులకు పీఎం ఉజ్వల పథకం కింద రెండు ఉచిత సిలిండర్లను బహుమతిగా అందించింది. ఈ కోవలోనే వీధి వ్యాపారులకు దీపావళి మేళా ద్వారా అదనపు ఆదాయానికి మార్గం చూపింది. ఇది కూడా చదవండి: అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్పీఎఫ్ -
క్రీడా ఉత్సవంలో అపశ్రుతి.. ట్రాక్టర్ కింద నలిగి యువకుడు మృతి
చంఢీగర్: పంజాబ్ గురుదాస్‌పూర్‌లోని గ్రామీణ క్రీడా ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టంట్ చేస్తూ ఓ యువకుడు(29) ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. Video | Man Crushed To Death Performing Tractor Stunt During Punjab Sports Fair Read here➡️https://t.co/TZIq7d6bvw pic.twitter.com/V2z6beZzey — NDTV (@ndtv) October 29, 2023 ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని సర్చూర్ గ్రామంలో ట్రాక్టర్ స్టంట్స్ క్రీడా ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో సుఖ్‌మన్‌దీప్ సింగ్ అనే యువకుడు స్టంట్స్ చేసే క్రమంలో మరణించాడు. స్టంట్స్ చేసే క్రమంలో సుఖ్‌మన్‌దీప్ ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో సరస్ ఫెయిర్ 2022
-
టీటీఎఫ్ హైదరాబాద్ 2022: ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్)హైదరాబాద్- 2022 రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 4 దేశాలు, 150 స్టాళ్లు, 19 రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిజం ప్రతినిధులు టూరిజం ప్రచారంలో భాగంగా టూరిజం స్టాల్స్ ను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యటకాభివృద్ధి కోసం అనేక చర్యలను చేపట్టారన్నారు. కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందన్నారు. అలాగే భూదాన్ పోచంపల్లికి వరల్డ్ బెస్ట్ టూరిజం గ్రామంగా గుర్తింపు లభించిందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం లభించేలా టూరిజంప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితమైన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కరివేన, ఉద్ధండ పూర్ రిజర్వాయర్ల ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిని సీఎం నేతృత్వంలో చేస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద అర్బన్ ఎకో టూరిజం పార్క్, కేసీఆర్ ఎకో పార్క్, అతిపెద్ద జలపాతాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల గత రెం డేళ్లనుంచి పర్యాటక రంగం ఎంతో నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టూరిజంలో అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, ఇండియా టూరిజం రీజినల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, టీటీఎఫ్ చైర్మన్ సంజీవ్ అగర్వాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
జాతరలో కీచకపర్వం.. కొరడా ఝుళిపించిన ఖాకీలు
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. జాతరకు వెళ్లిన గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. ఆ కీచకులను గుర్తించి జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు ఖాకీలు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా.. వైరల్ అయిన ఓ వీడియోను సుమోటాగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం పదిహేను మంది నిందితుల్లో.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్ఎస్ఏ (National Security Act) కింద కేసు నమోదు చేశారు. వాళ్లను అరెస్ట్ చేసి.. రోడ్ల వెంబడి నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వాళ్ల తల్లిదండ్రుల్ని పిలిపించి.. వాళ్ల సమక్షంలోనే ఘటన గురించి వివరించి చెప్పారు. ఇక మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మార్చి 11వ తేదీన అలిరాజ్పూర్ జిల్లా సోన్వా రీజియన్ వాల్పూర్ గ్రామంలో భగోరియా జాతర జరిగింది. ఈ జాతరకు వెళ్లిన ఇద్దరు గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కొందరు. అంతటితో ఆగకుండా ఆ మృగచేష్టలను వీడియో తీసి వైరల్ చేశారు. సాయం కోసం ఆ యువతులు కేకలు వేసినా.. జనాలెవరూ వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం పదిహేను నిందితులు.. ధార్, అలిరాజ్పూర్ జిల్లాలకు చెందినవాళ్లుగా గుర్తించారు. ⚡️Distressing Video A tribal woman molested in broad daylight by saffron-clad goons during a fair in Madhya Pradesh, India.pic.twitter.com/lTZKLxVVwF — Ahmer Khan (@ahmermkhan) March 13, 2022 అయితే పోలీస్ స్టేషన్ గడప తొక్కడం ఇష్టం లేని ఆ యువతుల కుటుంబాలు.. ఘటనపై ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు.. బాధితుల కుటుంబాలకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన లేకపోవడంతో.. వాళ్ల కోసం వెతికారు. బాధితుల జాడ లేకపోవడంతో స్వయంగా పోలీసులే సుమోటాగా కేసు నమోదు చేసుకున్నారు. నరేంద్ర దావర్, విశాల్ కియాదియా, దిలీప్ వస్కెల్, మున్నా భీల్.. ఇలా ప్రధాన నిందితులు నలుగురు ముప్ఫై ఏళ్లలోపు వాళ్లే కావడం విశేషం. ఈ నలుగురిని ప్రస్తుతం ఉజ్జయిని జైలుకు తరలించినట్లు అల్జిపూర్ ఎస్పీ మనోజ్ సింగ్ వెల్లడించారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఆయన. -
ఓలా, ఉబెర్.. మరీ ఇంత వరెస్టా?
Ola And Uber Down In Fairwork India Rankings 2021: దేశంలోనే యాప్ యూజర్లకు ప్రయాణ సౌకర్యాలు అందించే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లుగా ఓలా, ఉబెర్‌లకు పేరుంది. అయితే చాలాసార్లు యూజర్లను ఇవి ముప్పుతిప్పలు పెడుతున్నాయనే ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల వెర్షన్లోనూ ఈ రెండింటికి ఎదురుదెబ్బ తగిలింది. ఫెయిర్‌వర్క్2021 ర్యాంకింగ్స్‌లో ఈ రెండు స్టార్టప్‌ల రేంజ్ సున్నాకి పడిపోయింది. కిందటి ఏడాది ఫెయిర్‌వర్క్2021లో ఓలాకు రెండు, ఉబెర్‌కు ఒక పాయింట్ రేటింగ్ దక్కింది. ఈ ఏడాది ఏకంగా ఈ రెండూ జీరోకి చేరుకోవడం విశేషం. గిగ్ ఎంప్లాయిస్ పట్ల ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమే ఈ రేటింగ్. అందుకే ఈ ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది కంపెనీలు తమకు అందిస్తున్న కమిషన్, బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ఫెయిర్‌వర్క్ నివేదిక వెల్లడించింది. కొన్నిచోట్ల కనీసం వాళ్లను మనుషుల్లా చూడట్లేదన్న ఫీడ్‌బ్యాక్ ఎదురైందని తెలిపింది. ఇక ఈ లిస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. కిందటి ఏడాది 8 పాయింట్లతో టాప్‌లో నిలిచిన అర్బన్ కంపెనీ.. ఉద్యోగులకు(భాగస్వాములతో) నష్టం చేకూర్చే నిర్ణయం, వాళ్లను రోడ్డుకు ఎక్కించడం, నోటీసులు పంపడం లాంటి చేష్టలతో 5 పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఇక స్విగ్గీ(కిందటి ఏడాది 1) ఈ వియంలో 3 పాయింట్లు మెరుగుపడి ఏకంగా 4 పాయింట్లు దక్కించుకుంది. జొమాటో(కిందటి ఏడాది 1) రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని 3 పాయింట్ల రేటింగ్ దక్కించుకుంది. ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, ఒలా, జొమాటో, స్విగ్గీ.. ఇలాంటి డిజిటల్-స్టార్టప్ బేస్డ్ కంపెనీల్లో పని చేసే వాళ్లను గిగ్ వర్కర్స్‌గా గుర్తిస్తారు. వీళ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉండొచ్చు. వీళ్లకు ఆయా కంపెనీలు ఎలా పట్టించుకుంటున్నాయే స్కేలింగ్ ఆధారంగా లేబర్ స్టాండర్డ్స్ ఆధారిత వెబ్సైట్ ఫెయిర్ డాట్ వర్క్ ప్రతీ సంవత్సరం రేటింగ్ ఇస్తుంటుంది. ఈ స్కేలింగ్ పదిపాయింట్లకు ఉంటుంది. ఈ లిస్ట్‌లో డెలివరీ యాప్ కంపెనీ డుంజో కిందకి దిగజారగా.. అమెజాన్ 2 పాయింట్ల నుంచి 1 పాయింట్‌కు దిగజారింది. అందుతున్న జీతాలు.. ఇతర బెనిఫిట్స్, పని పరిస్థితులు, కాంట్రాక్ట్‌లు, మేనేజ్మెంట్ తీరు, ప్రాతినిధ్యాలు, ఇతర సౌకర్యాలు.. వీటి ఆధారంగా ఈ స్కేలింగ్‌ను నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా గిగ్ ఉద్యోగులు 50 లక్షల మందికి పైనే ఉన్నట్లు ఒక అంచనా. ఆయా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ గిగ్ ఎంప్లాయిస్ యూనియన్లు తరచూ కోర్టు మెట్లు ఎక్కుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. చదవండి: మీరు పార్ట్నర్స్.. మీరే లొల్లి చేయడమేంది? -
చాక్లెట్ డ్రెస్సుల్లో అందాల ముద్దుగుమ్మలు
-
ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..
న్యూఢిల్లీ: తెల్లని మేనిఛాయే సౌందర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రామాణికమనే విధంగా అనేక సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ తాజాగా కొత్త మార్పులకు లోను కానుంది. రీబ్రాండింగ్ కసరత్తులో భాగంగా ఉత్పత్తి పేరు మార్చనున్నట్లు ఫెయిర్ అండ్ లవ్లీ తయారీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హెచ్‌యూఎల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని వర్ణాలకు ప్రాధాన్యమిచ్చేలా ఇకపై తమ చర్మ సౌందర్య సాధనాల పోర్ట్‌ఫోలియో ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘ఇకపై ఫెయిర్ అండ్ లవ్లీతో పాటు హెచ్యూఎల్కి చెందిన మిగతా స్కిన్‌కేర్ సాధనాల పోర్ట్‌ఫోలియో కూడా సౌందర్యానికి సంబంధించి కొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించే విధంగా ఉంటుంది‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీకి సంబంధించి కొత్త పేరు గురించి దరఖాస్తు చేసుకున్నట్లు, నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాక త్వరలోనే దీన్ని ప్రకటించనున్నట్లు మెహతా తెలిపారు. మరికొద్ది నెలల్లో మారిన పేరుతో ఈ ఉత్పత్తి మార్కెట్లో లభ్యమవుతుందని వివరించారు. అలాగే మహిళల విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు ఇచ్చేందుకు 2003లో ఏర్పాటు చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్‌కు కూడా త్వరలో కొత్త పేరు ప్రకటించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. ఫెయిర్, ఫెయిర్‌నెస్, వైట్, వైటెనింగ్, లైట్, లైటెనింగ్ వంటి పదాలన్నింటినీ తమ ఉత్పత్తుల ప్యాక్‌లు, ప్రకటనల నుంచి తొలగించనున్నట్లు హెచ్‌యూఎల్ మాతృసంస్థ యూనిలీవర్ వెల్లడించింది. బ్రాండ్ పేరు మార్చాలంటూ చేంజ్డాట్ఆర్గ్ ద్వారా సంతకాల ఉద్యమం చేస్తున్న కార్యకర్తలు హెచ్‌యూఎల్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. -
ధాన్యపు సిరుల జాతర
నేల ఉంది నీరు లేదు. చేవ ఉంది సాగు లేదు. బీజం ఉంది జీవం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆకలి తీరేదెలా? మనిషి బతికేదెలా? ఏడాదిలో ఎప్పుడో ఓసారి పడీపడనట్లు పడే నాలుగు వాన చుక్కలతోనే జీవం పోసుకోవాలి. మబ్బు ఎంతిస్తే నేల అంతే తీసుకోవాలి. అంతకంటే వేరే ఆధారం లేదు. కరెంటు బోర్లు లేవు, పంట కాలువలు లేవు. నేలలో ఇంకిన నాలుగు నీటి చుక్కలతోనే జీవం పోసుకోగలిగిన గింజలను నమ్ముకోవాలి. అందులోనే పచ్చదనాన్ని వెతుక్కోవాలి... బతుకు చిత్రాన్ని దిద్దుకోవాలి. జహీరాబాద్‌లోని గిరిజన తండాలు ఇప్పుడు ఈ ‘దిద్దుబాట’లోనే పండుగ సంతోషాన్ని వెతుక్కుంటున్నాయి. పంటల జాతర చేసుకుంటున్నాయి. మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని గిరిజన తండాల ప్రజలు నది తీరంలో ఏమీ జీవించడం లేదు. ప్రాజెక్టు సాగు కింద లేదు వాళ్ల భూమి. ఎర్రటి ప్రచండభానుడి తీక్షణ దృక్కుల కింద ఉంది వాళ్ల జీవితం. ఆ నేలలో తల్లిని చూశారు వాళ్లు. పొద్దు పొడవక ముందు నుంచి పొద్దు కుంకే వరకు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. మట్టిని నమ్ముకుంటే బతుకు పండుతుందని నిరూపిస్తున్నారు. పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ. పంట లక్ష్మి ఇంటికి వచ్చిన లక్షణమైన పండుగ. ఈ లక్షణాలను అందరూ పుణికిపుచ్చుకోవాలని ఊరూరా తిరిగి చెబుతున్నారు. ‘దేవుడమ్మ దేవుడు... మా ఊరి దేవుడు... మీ ఊరికొచ్చాడు’ అని జాతర చేస్తూ ఇరుగుపొరుగు తండాలకు చెబుతున్నారు. పంటల జాతరలో ఊళ్లకు ఊళ్లు కలిసి సంబరం చేసుకుంటున్నాయి.మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలంలోని లక్ష్మణ్ నాయక్ పంచాయతీలోని మూడ్తండాలో మొదలైంది ఈ పంటల జాతర. ఈ నెల 14వ తేదీన భోగిపండుగ రోజున లంబాడా సంప్రదాయ ఆటపాటలతో మొదలైన ఈ జాతర బండ్లు ఇప్పుడు ఇరుగుపొరుగు తండాలలో పర్యటిస్తున్నాయి. ఈ పంటల బండ్లు ఫిబ్రవరి 13వ తేదీ నాటికి ఝరాసంఘం మండలంలోని మాచ్నూర్ గ్రామం చేరుకుంటాయి. మొత్తం 23 గ్రామాల్లో డెబ్బైకి పైగా తండాల జనాలకు తాము పండించిన పంటలను ఊరేగిస్తారు. మాచ్నూర్లో ఆటపాటలతో ముగింపు వేడుక చేసుకుంటారు.ప్రకృతిని దైవంగా పూజించడం ప్రాచీనంగా వస్తున్న ఆచారమే, నేలకు మొక్కే కల్చర్ మనది. చెట్టును ప్రేమించే సంప్రదాయం మనది. చెట్టు కోసం ప్రాణాలర్పించే బిష్ణోయి గిరిజనులున్నారు రాజస్తాన్‌లో, మచ్చిక చేసుకున్న మృగాన్ని అక్కున చేర్చుకుని స్తన్యమిచ్చి ఆకలి తీర్చే తల్లులు ఆ గిరిజన మహిళలు. తోటి వారి ఆకలి తీర్చే సంప్రదాయంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు అర్జున్ నాయక్ తండా గిరిజన మహిళలు. తాము పండించిన పంటలనే దేవుళ్లుగా కొలుస్తున్నారు. ఆ పంటలకే జాతర చేస్తున్నారు. అంకాళమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల జాతర్లలో వేడుక చేసుకున్నట్లే పంటల జాతరనూ ఊరు ఊరంతా కలిసి సంతోషాల పంటగా మలుచుకున్నారు. ఒకరి దగ్గరున్న గింజలను మరొకరికి పంచుతారు. అందరూ నేలనిండుగా పంటలు పండించుకోవాలని కోరుకుంటారు. ఇన్ని రకాల ధాన్యాలా! వరి పండని నేలలో పండే ప్రతి గింజనూ అపురూపంగా దాచుకున్నారీ మహిళలు. తమకున్న కొద్ది నేలలోనే మడులు కట్టారు. జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, వరిగెలు, కొర్రలు, నువ్వులు, అవిశెలు, సాయిజొన్న, కందులు, పెసలు, అండుకొర్రలు, సామలు... ఇలా దేనికది విడిగా పంటలు పెట్టారు. ఇన్ని పంటలెందుకంటే... ‘‘ఒకటి పోయినా ఒకటి పండుతుంది. ఏడాదికి కడుపు నింపుతుంది. ఒకటి వానకు తట్టుకునే పంట, ఒకటి ఎండకు తట్టుకునే రకం, ఒకటి మంచుకు పట్టే తెగుళ్లను తట్టుకుంటుంది. ఇలా కలిపి పెట్టుకుంటే ఒక పంట మరో పంటకు ఎరువవుతుంది’’ అంటారు. ఒక్కొక్కరు పది రకాలకు తక్కువ లేకుండా పండిస్తున్నారు. మొత్తం ఎనభై రకాల చిరుధాన్యాలు పండిస్తున్నారు. ఇంకా ‘‘వాన నీళ్లు, నేల మట్టి సారంతోనే పండుతాయి. మందుల్లేవు, ఎరువుల్లేవు మా పంటలకు. మేము గంపలో గింజను నిల్వ చేస్తే మూడేళ్లకు నేల మీద చల్లినా మొలకలొస్తాయి. పెద్ద కంపెనీలు మా దగ్గర తీసుకెళ్లి సరిగ్గా నిల్వ చేయకుండా బస్తాల్లో నింపి వాళ్ల పేర్లు వేసి (లేబిల్) అమ్ముతారు. వాటిలో సగం మొలకలొస్తే అదే చాలా ఎక్కువ. అందుకే మా తండాల్లో ఆడవాళ్లందరికీ ధాన్యాన్ని గింజ కట్టడం నేర్పిస్తున్నాం. మేము పండించిన ధాన్యానికి మరొకరు గింజకట్టి వ్యాపారం చేయడమేంటి, వాళ్ల దగ్గర మేము గింజలను కొనడమేంటి’’ అని ఎదురు ప్రశ్నించారు వాళ్లు. పలకా బలపం çపట్టని గిరిజన మహిళలు... దేశం బహుళ జాతి విత్తనాల కంపెనీల బారిన పడకుండా స్వయంసమృద్ధి సాధన దిశగా నడిపిస్తున్నారు. దేశీయ గింజను కాపాడటం ఎంత గొప్ప పని అనేది వాళ్లకు తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా... బిష్ణోయిలు ప్రకృతిని కాపాడటానికి తమ ప్రాణాలను అడ్డువేసినట్లే, కన్నబిడ్డకూ, జింకపిల్లకూ స్తన్యమిచ్చి కాపాడినట్లే... తమతోపాటు తోటి వారి జీవితాలనూ పరిరక్షించుకోవడం. అలాగే... వ్యవసాయంలో జీవ వైవిధ్యతను కాపాడటానికి రెక్కలు ముక్కలు చేసుకోవడం, తాము జీవిస్తూ తోటి వారికి జీవికనివ్వడం కూడా. – వాకా మంజులారెడ్డి -
బొమ్మ కొనివ్వు నాన్నా
ఒకరోజు ఒక పిల్లాడు తన తండ్రితో కలిసి జాతరకు వెళ్లాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని తండ్రి తపన. జాతరలో బోల్డన్ని బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించుకుని మురిసిపోవాలని కొడుకు ఆలోచన. పిల్లవాడికి కబుర్లు చెబుతూ మెల్లగా నడుస్తున్నాడు తండ్రి. ఇంకా తనకి బొమ్మలేమీ కొనిపెట్టలేదని ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చింది. ఆ బొమ్మ కొనిమ్మన్నాడు. ఆ బొమ్మవంకా, దాని పైన ఉన్న ధర వంకా చూశాడు తండ్రి. ఆ తర్వాత జేబులో ఉన్న డబ్బును చూసుకున్నాడు.‘‘ఇది వద్దులే’’ అంటూ ముందుకు నడిపించాడు కొడుకుని. డబ్బంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో భార్య తీసుకుని రమ్మని చెప్పిన సరుకుల మాటేమిటి అని ఆలోచిస్తూనే, ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలనుకున్నాడు తండ్రి. ఇంతలో ఎవరో తండ్రిని పలకరించారు. కొడుకు చేయి వదిలి వారితో మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు తండ్రిని గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. కాసేపయ్యాక వెనక్కి తిరిగి చూస్తే తండ్రి కనిపించలేదు. భయమేసింది. దిగులుతో ఏడుపు మొదలైంది. ఏడుస్తున్న ఆ పిల్లాణ్ణి చూసి అందరూ పోగయ్యారు. ‘‘నీకు బోలెడన్ని బొమ్మలిస్తాము. ఏడవకు’’ అన్నారెవరో.‘‘నాకు నాన్న కావాలి’’ అన్నాడు పిల్లాడు వెక్కుతూ. ఇంకెవరో రకరకాల తినుబండారాలు తీసుకొచ్చి పిల్లాడి చేతిలో పెట్టారు. ‘‘నాకు నాన్న కావాలి’’ అని వెక్కిళ్లు పెట్టాడు. ఆశ్చర్యం! ఆ పిల్లాడికిప్పుడు బొమ్మల గురించిన ఆలోచనే లేదు. ‘నాన్న కావాలి’ అంతే! ఇంతలో కొడుకును వెదుక్కుంటూ అక్కడికొచ్చాడు నాన్న. వెలిగిపోతున్న ముఖంతో తండ్రిని అతుక్కుపోయాడు ఆ పిల్లాడు.తెలిసిన వాళ్లెవరో కనిపిస్తే చేబదులు తీసుకొచ్చిన తండ్రి ‘‘బొమ్మలు కొందాం పద’’ అన్నాడు.‘‘నాకు బొమ్మలేమీ వద్దు. ఇంటికెళదాం’’ అన్నాడు కొడుకు! దేవుణ్ణి అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకుంటాం. అడిగిందల్లా ఇవ్వలేదని బాధపడతాం. ఇంతలో ఏదో జరుగుతుంది. అప్పుడు మనమే వేడుకుంటాం దేవుణ్ణి.. కనీసం ఇలాగైనా ఉంచు స్వామీ’’ అని. దేవుడు గీసిన పెద్దగీత ముందు మన కోరికలనే చిన్న గీతలు చిన్నబోతాయన్నమాట. – డి.వి.ఆర్. -
శ్వేతపత్రం విడుదల చేస్తాం..
మందమర్రి : చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకుడు సంజయ్‌కుమార్ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జె.రవీందర్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.850 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు చేపట్టారని అన్నారు. అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. నాయకులు మల్లేశ్, నర్సింగ్, భట్టు రాజ్‌కుమార్, వాసాల శంకర్, తోట సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకులు పారిపోతుండ్రూ...
భువనగిరి : అసెంబ్లీ సమావేశాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడి పారిపోతుండ్రని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలో రూ. 3.64 కోట్లతో చేపట్ట నున్న సీసీరోడ్లు, అండర్ డ్రెయినేజీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద ఎమ్మె ల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నాయకుల తీరు పదో తరగతి విద్యార్థులు పరీక్ష కు ఎగ్గొట్టేలా ఉందని ఎద్దేవా చేశారు. 2014లో టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను మూడేళ్లో అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. హామీ ఇవ్వని అనేక సంక్షే మ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రైతులు పండించిన ధరను వారే నిర్ణయించుకోవడానికి రైతుల సమన్వయ సమి తులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అధిక నిధులు కేటా యించినట్టు చెప్పారు. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా 44 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం చేయనున్నట్టు తెలిపారు. బీబీనగర్‌లో ఎస్సీ ఫంక్షన్ హాల్‌కు అవసరమైతే మరి న్ని నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి బీబీనగర్‌కు మంజూరైన సుమారు రూ.4 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సూచించారు. 70ఏళ్ల కాలంలో ఎన్నడూ రాని నిధులు ఒకేసారి వచ్చినందున గ్రామ అభివృద్ధికి ఖర్ఛు చేయాలని సూచించారు. అంతకు ముందు కొండమడుగు మెట్టు నుంచి బీబీనగర్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డప్పులు, బాణాసంచా కాల్చి మం త్రికి స్వాగతం పలికారు. కళాకారులు నిర్వహించిన ఆట, పాట అందరినీ అలరించాయి. సమావేశంలో కలెక్టర్ అనితారామచంద్రన్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామేల్, డీఆ ర్ఓ రావుల మహేదంర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్, ఎంపీపీ గోలి ప్రణితా పింగల్‌రెడ్డి, నాయకులు సుధాకర్, నరేందర్‌రెడ్డి,వెంకన్నగౌడ్, వెంకట్ కిషన్, మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కేటీఆర్ సాయం – ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే భూ దాన్‌పోచంపల్లికి రూ. 3 కోట్లు ఇవ్వడం సంతోషకరం అన్నారు. బీబీనగర్, భూదాన్‌పోంచంపల్లి, వలిగొండ, భువనగిరి మండలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరిన వెంటనే మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పరుగులు – ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రా మాల్లో అభివృద్ధి పరిగెడుతుందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 4,380 గ్రామ పంచాయతీలు 147 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్‌ను కల్పించినట్టు తెలిపారు. జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరైందని, ఎస్సీ స్టడీ సర్కిల్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
పొగలొచ్చాయ్.. కారును కాల్చేశాయ్
♦ జాతరకు వెళ్లి వస్తుండగా కారు దగ్ధం ♦ ప్రయాణికులు సురక్షితం మనుబోలు: ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. ఆ కారు పూర్తిగా దగ్ధమైన ఘటన మనుబోలు మండలం పొదలకూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉదయగిరి పట్టణానికి చెందిన మేడా హరిహర, ఉమామహేశ్వరావు అనేవారు తమ కుటుంబ సభ్యులు మరో ముగ్గురితో కలిసి సొంత ఇండిగో కారులో వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు మనుబోలు మండల పరిధిలోని పొదలకూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగా.. హఠాత్తుగా ఇంజిన్‌లోంచి పొగలు రాసాగాయి. వెంటనే కారును ఆపేసి అందులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు దిగారు. అందులోని సామగ్రిని సైతం హుటాహుటిన బయటకు తీశారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు ఎగసి కారు దగ్ధమైంది. సమాచారమందుకున్న గూడూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. -
అవ్వతాతలను ఇంట్లో పెట్టి నిప్పు
► డబ్బివ్వలేని మనవరాలి దాష్టీకం ► వృద్ధులకు గాయాలు మైసూరు: డబ్బులడిగినందుకు మందలించారనే కోపంతో ఒక యువతి తన అవ్వతాతలపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టి పరారైంది. బాధితులకు గాయాలు కాగా ఇరుగుపొరుగు రక్షించారు. మైసూరు సిటీ హెబ్బాళలోని లక్ష్మీ కాంతనగరలో గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... తల్లి ఆత్మహత్య చేసుకోగా, తండ్రి మరో పెళ్ళి చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆయన కూతురు ప్రియదర్శిని (22) తన అవ్వతాత సోమసుందర్ (85), లీలావతి (80)ల వద్ద ఉంటోంది. ఇంటర్ ఫెయిలైన ఆమె ఎప్పుడూ స్నేహితులతో గడిపేది. రోజు ఖర్చుల కోసం డబ్బులు కావాలని వృద్ద దంపతులతో గొడవ పడేది. చాలాసార్లు చుట్టుపక్కలవారు మందలించినా పట్టించుకునేది కాదు. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ప్రియదర్శిని, తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఇంటిని మిమ్మల్ని ఇద్దరినీ మంటల్లో వేసి తగలబెడతానని బెదిరించింది. ఎప్పుడూ ఉండే గొడవే కదా అని వృద్ధ దంపతులు పట్టించుకోలేదు. అయితే ఆమె అన్నంతపనీ చేసింది. ఇంట్లో నిప్పంటించి పారిపోయింది. ఇంట్లోంచి మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల వారు వచ్చి వృద్ధులను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, ఫైర్‌సిబ్బంది మంటలను అదుపుచేశారు. దాడికి పాల్పడిన యువతి పరారీలో ఉంది. ఆమె డ్రగ్స్ మత్తులోనే ఈ అకృత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
మేడ్చల్ జాతర ప్రారంభం
మేడ్చల్: రామలింగేశ్వర స్వామి కల్యాణ ఉత్సవం మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే మేడ్చల్ జాతర బుధవారం నుంచే ప్రారంభమయింది. మంగళవారం రాత్రి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బుధవారం మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి లు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సంధర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. -
చిన్నారుల చిత్తరువులు వన్నెవన్నెల పెన్నిధులు
ఓఎన్జీసీ ఈడీ దేబశీష్ సన్యాల్∙కేంద్రీయ విద్యాలయలో చైల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : వివిధ రాష్ట్రాలకు చెందిన కేంద్రీయ విద్యార్థులు గీసిన వర్ణచిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ దేబశీష్ సన్యాల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఓఎన్జీసీ బేస్‌కాంప్లెక్స్ ఆవరణలోని కేంద్రీయ విద్యాలయలో 12వ ఆల్ఇండియా కేంద్రీయ విద్యాలయ చైల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లోని ప్రతి చిత్రాన్నీ ప్రజలను ఆలోచింప చేసేలా తీర్చిదిద్దారన్నారు. విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. 223 విద్యాలయాల నుంచి 4,371 చిత్రాలు ఎగ్జిబిషన్లో 29 రాష్ట్రాల్లోని 223 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు 4,371 చిత్రాలను ఎగ్జిబిషన్‌కు పంపించారు. తరగతుల వారీగా ఐదు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూపులో 30మందికి మెడల్స్‌ను అందిస్తారు. ఆయిల్ అండ్ ఎకతాలిన్ పెయింటింగ్‌్సను ప్రత్యేకంగా విభజించి 25మందికి మెడల్స్‌ను అందజేయనున్నారు. టాప్‌టెన్ స్కూళ్లను ఎంపిక చేసి, పాఠశాలకు, డ్రాయింగ్ ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా మెమెంటోలు అందిస్తారు. సేవ్ గర్‌్లచైల్డ్, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ట్రీ సేవ్ లైఫ్, నేషనల్ ఇంటిగ్రిటీ మొదలగు అంశాలపై ప్రస్తుత టెక్నాలజీతో చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. మధుబని పెయింటింగ్, ట్రైబల్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్‌లు సైతం ఆకట్టుకున్నాయి. కేంద్రీయ విద్యార్థులతో పాటు ది ఫ్యూచర్‌కిడ్స్, డెఫనే స్కూళ్ల విద్యార్థులు ఆర్టు ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఓఎన్జీసీ డీజీఎం(సివిల్) వైయూబీరావు, విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.కె.ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ సిన్హా, డ్రాయింగ్ టీచర్ కె.సుబ్బారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కమ్మని అరటి..తినేందుకు పోటీ!
కోడుమూరు రూరల్: యువకులంతా ఆబగా అరటిపండ్లు తింటున్నారేమిటి అనుకుంటున్నారా.. ఇది ఒక సరదా పోటీ. శ్రీచౌడేశ్వరీ దేవి తిరుణాలను పురస్కరించుకొని కోడుమూరులో శనివారం నిర్వహించారు. అల్లీనగరానికి చెందిన బాలు అనే యువకుడు 41అరటిపండ్లు తిని మొదటి స్థానంలో నిలువగా, చనుగొండ్లకు చెందిన తిప్పయ్య.. 33 అరటిపండ్లు తిని రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. తిరుణాల్లో భాగంగా 5కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. రైనాపురం నరసింహుడు, చనుగొండ్ల గోపాల్, రుద్రప్ప.. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందారు. కబడ్డీ పోటీలను సైతం నిర్వహించారు. విజేతలకు గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ కేఈ.మల్లికార్జునగౌడ్..బహుమతులు ప్రదానం చేశారు. -
గార్దభం..పోటీ అదరహో!
నంద్యాల: జంబులాపరమేశ్వరి తిరునాల సందర్భంగా శనివారం గార్దభాల(గాడిదల) పోటీలు నంద్యాల పట్టణంలో ఆసక్తికరంగా సాగాయి. పోటీలకు మహానంది, వెలుగోడు, బండి ఆత్మకూరు, రుద్రవరం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాల నుండి 20 గాడిదలు వచ్చాయి. లక్కీడిప్ ద్వారా పందెంలో పోటీ పడే గాడిదలను ఎంపిక చేశారు. దాదాపు 160 కేజీల ఇసుకను బస్తాలను కట్టి గాడిదలపై ఉంచి పరుగు పెట్టించారు. ఎక్కువ దూరం పరిగెత్తిన వాటిని విజేతలుగా ప్రకటించారు. విజేతలైన గాడిదల యజమానులకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు, రూ.2వేలు, రూ.వెయ్యి నగదు బహుమతులుగా అందజేశారు. పోటీల్లో హింసకు తావులేకుండా ముళ్లకర్రను నిషేధించారు. గాడిద లక్ష రూపాయలు.. పోటీల్లో బెంగళూరు నుంచి బండి ఆత్మకూరుకు చేరిన రేసు గాడిద ఆకర్షణగా నిలిచింది. దీని ఖరీదు అక్షరాల లక్షరూపాయలు. బెంగళూరులో పలు పోటీల్లో ఇది విజేతగా నిలువడంతో డిమాండ్ వచ్చింది. బండిఆత్మకూరు మండలానికి చెందిన లింగమయ్య దీనిని కొనుగోలు చేశారు. ప్రతిరోజూ మంచి పౌష్టికాహారాన్ని అందించి దీనిని రేసు గాడిదగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. గాడిదల ఉనికిని చాటేందుకే.. రవాణా వసతులు పెరగడంతో గాడిద జాతి అంతరించిపోతోందని, వీటి ఉనికిని చాటడానికి నాలుగైదేళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లెల్ల శ్రీరాములు తెలిపారు. పోటీల్లో ఆలయ పాలక మండలి కార్యదర్శి గాండ్ల వెంకటేశ్వర్లు, నిర్వాహకులు పరమేశ్వరరెడ్డి, జిల్లెల్ల శ్రీరాములు, ఎన్కే నూర్‌బాషా, పాణ్యం మద్దిలేటిస్వామి, జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు, గాండ్ల మధుప్రకాష్ పాల్గొన్నారు. -
బండలాగుడు పోటీలతో జాతరకు వన్నె
ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి –ముగిసిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) ఎంతో చారిత్రాత్మకమైనవనీ, బండలాగుడు పోటీలు జాతరకు మరింత వన్నె తెచ్చిపెట్టాయని ఎమ్మెల్యే డాక్టర్ బి.జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి బివి మోహన్‌రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు బుధవారం ముగిసాయి. చివరి రోజు సీనియర్ సైజు వృషభాల పోటీలు జరిగాయి. ఇందులో వెల్దుర్తి మండలం కొత్తకోటకు చెందిన డాక్టర్ గురునాథ్ నాగయ్య వృషభాలు 20 నిమిషాల్లో 2487.3 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతి(రూ.60,000)ని కైవసం చేసుకున్నాయి. బెళగల్ మండలం ఎనకండ్లకు చెందిన బోయకాటి బోడెన్న వృషభాలు ద్వితీయ(రూ.50,000), కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మల్లికార్జున రెడ్డి వృషభాలు తృతీయ(రూ.35,000), అదే పట్టణానికి చెందిన చంద్ర ఓబుళరెడ్డి వృషభాలు నాల్గవ(రూ.25,000), బెళగల్ మండలం గుండ్రేవులకు చెందిన కోడెల కిష్టన్న వృషభాలు ఐదవ (రూ.15,000) బహుమతిని సాధించాయి. సబ్ జూనియర్ విభాగంలో.. సబ్ జూనియర్ విభాగంలో కర్నూలు వీఆర్నగర్కు చెందిన గీతామృతచౌదరి వృషభాలు ప్రథమ బహుమతి(రూ.40,000). ఉయ్యాలవాడ మండలం తడమలదిన్నెకు చెందిన పేరెడ్డి సుబ్బారెడ్డి వృషభాలు ద్వితీయ(రూ.30,000), వెల్దుర్తి మండలం బాపురానికి చెందిన నడిపి సోమిరెడ్డి వృషభాలు తృతీయ(రూ.20,000), అనంతపురం జిల్లా తాడిచెర్లకు చెందిన బీమిరెడ్డి లవకుమార్ వృషభాలు నాల్గవ(రూ.10,000), బెళగల్ మండలం పోల్కల్కు చెందిన మహేంద్రనాయుడు వృషభాలు ఐదవ బహుమతి(రూ.5,000) కైవసం చేసుకున్నాయి. న్యూ కేటగిరి విభాగంలో.. న్యూ కేటగిరిలో సంజామలకు చెందిన గుండం చిన్నారెడ్డి, ఓబులరెడ్డి వృషభాలు ప్రథమ బహుమతి(రూ.30,000), ఆదోని మండలం బైచిగేరికి చెందిన బ్రహ్మానందరెడ్డి వృషభాలకు ద్వితీయ( రూ.20,000), సంజామల మండలం కొత్తూరుకు చెందిన డీఎస్ఎస్రెడ్డి వృషభాలు తృతీయ(రూ.15,000), అనంతపురం జిల్లాకు చెందిన వెంకటరెడ్డి, చింతల రాముల వృషభాలు నాల్గవ (రూ10,000), నంద్యాల మండలం పి.కొట్టాలకు చెందిన డీ.కేశవరెడ్డి వృషభాలు ఐదవ బహుమతి( రూ.5,000) పొందాయి. పాలపళ్ల విభాగంలో.. పాణ్యం మండలం ఎస్.కొత్తపల్లెకు చెందిన కేఎస్ఎస్ రెడ్డి వృషభాలు ప్రథమ (రూ.25,000),. ప్యాలకుర్తికి చెందిన జాకీర్ వృషభాలు ద్వితీయ (రూ.20,000), ఐజ మండలం తుప్పత్రాళ్లకు చెందిన బుడ్డన్న వృషభాలు తృతీయ (రూ.15,000), ఆదోని మండలం చిన్న పెండేకల్‌కు చెందిన చిన్ననాగిరెడ్డి–వీరలింగేశ్వరస్వామి వృషభాలు నాల్గవ(రూ.10,000),కోడుమూరు మండలం కొత్తపల్లికి చెందిన పెద్దరాముడు వృషభాలు ఐదవ బహుమతి(రూ.5,000)ని కైవసం చేసుకున్నాయి. విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్ బి.జయనాగేశ్వరరెడ్డి నగదు, షీల్డులను బహుకరించారు. పోటీల నిర్వహకులను సన్మానించారు. నిర్వాహకులు కొండయ్యచౌదరి, హరిప్రసాద్‌రెడ్డి, మిఠాయి నరసింహులు, రాందాస్‌గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముగతి ఈరన్నగౌడ్, మార్కెట్ ఛైర్మెన్ సంజన్న, ఎంపీపీలు చిన్న నరసింహారెడ్డి, శంకరయ్య, కౌన్సిలర్లు రంగస్వామిగౌడ్, రామకృష్ణ, పరశురాముడు, రంగన్న, జయన్న పాల్గొన్నారు. -
రైతన్నల జాతర
ఎమ్మిగనూరు : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించుకునే ఎమ్మిగనూరు జాతర వృషభాలు, వాటి అలంకరణ సామగ్రి, సాగు పరికరాల విక్రయాలకు పేరు గాంచడంతో రైతుల జాతరగా మారిపోయింది. వృషభాలు, సాగు పరికరాల క్రయవిక్రయాలకు తరలివచ్చిన వారితో జాతర కళకళలాడుతుంది. నాలుగు రోజులపాటు రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు బలప్రదర్శనలు జరుగుతాయి. ఆదివారం మంత్రాలయం రహదారిలో ఏర్పాటు చేసిన ఎద్దుల సంతకు ఒంగోలు జాతి, కిలారీ జాతి, దూపాటి, సీమరకం ఎద్దులు, తూరునాటి దూడలు అధిక సంఖ్యలో అమ్మకానికి తరలివచ్చాయి. జత వృషభాల ధర రూ.50వేల నుంచి రూ.1.80 లక్షల వరకు పలికాయి. ముఖ్యంగా సేద్యంకు చురుకుదనంతో ఉండే కిలార్ రకం ఎద్దుల కొనుగోలుకు రైతులు మొగ్గు చూపారు. భవిష్యత్తుల్లో బలప్రదర్శనకు ఉపయోగపడే తూరునాటి దూడలు జత రూ.25 వేల వరకు పలికాయి స్థానిక టీటీడీ కల్యాణమంటపం ఆవరణలో ఎద్దుల బండ్లు, వాటి చక్రాలను అమ్మకానికి ఉంచారు.బండి ధరను రూ.25వేలు, బండికి అమర్చే రెండు చక్రాలు రూ.15వేల వరకు ధర పలికాయి. -
గీసుకొండ జాతర ప్రారంభం
నేడు రేపు ప్రత్యేక పూజలు బౌద్ధం వర్ధిల్లినట్లుగా చారిత్రక ఆధారాలు గీసుకొండ(పరకాల): మండల కేంద్రమైన గీసుకొండ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభువగా వెలసిన లక్ష్మినర్సింహస్వామి జాతర శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 10న స్వామి వారిని గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆల యం నుంచి గుట్టపైకి తీసుకు వచ్చారు. గురువారం రాత్రి నుంచి జాత ర ప్రారంభమైందని, శుక్ర, శనివారాల్లో కొనసాగుతుందని నిర్వహణ కమిటీ బాధ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం స్వామివారిని గ్రామానికి తోడ్కొని వెళ్లనున్నారు. స్వామివారి గుట్టకు చారిత్రక ప్రాధాన్యం.. స్వామివారు వెలసిన నల్లని కొండను గీసుకొండ గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట నలుపు రంగులో ఉండటంతో ‘గీసు అనగా నలుపు అని, నల్లని కొండ శివారులో వెలసిన గ్రా మం కావడంతో గీసుకొండ అని పేరు వచ్చిందని చెబుతా రు. అలాగే ఆదిమానవులు శిలాయుగంలో గుట్ట ప్రాంత ంలో జీవించేవారిని, వారి తర్వాత శాతవాహనుల వరకు నాగరికత వెలసినట్లు, బౌద్ధం ఇక్కడ వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయల్ప డ్డాయి. గుట్ట వద్ద పురావస్తుశాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో బయల్పడ్డ టెర్రాకోట బొమ్మలు, బుద్దుడి ప్రతిమ, రాతి ఆయుధాలను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వెనకవైపు ఉన్న పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. ఆది మానువులు తమ రాతి ఆయుధాలను పదును చేయడానికి గుట్టపై నూరా(గీశా) రని, అందుకే ఈ కొండకు ‘గీసుడుకొండ’అని పేరు వచ్చిందని ఆ పేరుతోనే గ్రామానికి గీసుకొండ అని పేరు పెట్టి ఉంటారనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులేవీ కేటాయించకపోవడం, ప్రచారం కొరవడటంతో ప్రాశస్త్యం మరుగున పడుతోంది. -
అన్ని దారులూ అటువైపే
నోట్ల కొరత ఇంతింత కాదయా.. సరిపడునంత నగదు నిల్వలు లేవు బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూ జాతరను తలపిస్తున్న వైనం అనంతపురం అర్బన్ : పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం వాటి స్థానంలో కొత్త కరెన్సీని సమకూర్చలేకపోయింది. రిజర్వ్ బ్యాంకు నుంచి అరకొరగా వస్తున్న నగదును అన్ని బ్యాంకులూ పంచుకుని ఖాతాదారులకు తలా కొంత పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అవసరాలకు తగినంత నగదు అందకపోవడంతో జనం ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఈ నెల పదకొండో తేదీ వచ్చిన రూ.90 కోట్ల నగదుతోనే బ్యాంకులు, ఏటీఎంలకు కేటాయించి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాటికి జిల్లా వ్యాప్తంగా నగదు నిల్వలు తగ్గిపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. విత్ డ్రా పరిమితి రూ.2వేల నుంచి రూ.4వేలకు మించడం లేదు. ఏది కొనుగోలు చేయాలన్నా నగదు అవసరమవుతోంది. నగదు రహిత లావాదేవీలు జరిపి నోట్ల కష్టాల నుంచి బయటపడవచ్చని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా స్వైపింగ్ మిషన్లు ఎక్కడా లేవు. చేసేది లేక ప్రజలు నగదుతోనే లావాదేవీలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో నగదు కోసం ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వద్దకు ఉదయం 7 గంటల నుంచే చేరుకున్నారు. మరికొందరు ఏటీఎంలు ఎక్కడతెరిచారో, ఎక్కడ నగదు వస్తోందో అన్వేషించి మరీ అక్కడకు వాలిపోతున్నారు. ఎన్ని పనులు ఉన్నా అన్నింటినీ మానుకుని, నగదు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం ఓపికను కూడగట్టుకుని మరీ గంటల తరబడి క్యూలోనే నిల్చుంటున్నారు. కొన్ని చోట్ల ఏటీఎంలు తెరిచినా అందులో నగదు లేకపోవడం, స్టేట్మెంట్లు చూసుకునేందుకు పేపర్ రోల్ కూడా ఉంచకపోవడంతో జనం ఉసూరుమంటూ వెనుదిరిగారు. గురువారం నగదు వచ్చే అవకాశం ఉందని, అయితే ఎంత మొత్తం అనే సమాచారం లేదని బ్యాంకర్లు తెలిపారు. లోన్ బిల్లులు కూడా తీసుకోవడం లేదు : పుష్పవల్లి, జూనియర్ అసిస్టెంట్, అనంతపురం డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఇక బిల్లులు కూడా తీసుకోవడం లేదు. లోన్‌కి సంబంధించిన బిల్లులకు మూడు రోజులుగా తిరుగుతున్నాను. బ్యాంక్‌లోకి వెళ్లనీయడం లేదు. ఉద్యోగానికి సెలవుపెట్టి రావాల్సి వస్తోంది. మాటల్లో చెప్పలేని ఇబ్బంది : కీర్తి, గృహిణి, సోమనాథ్ నగర్, అనంతపురం బ్యాంకులు, ఏటీఎం చుట్టు తిరుగుతున్నా కనీసం అవసరానికి సరిపడా నగదు అందడం లేదు. మా ఇబ్బందుల్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఉదయం 8.30 గంటలకు వచ్చి లైన్లో నిల్చొని ఏటీఎంలో వచ్చే రూ.2 వేలు తీసుకుంటున్నాం. ఈ రోజు బ్యాంక్‌లోనూ రూ.2 వేలు ఇచ్చారు. ఇంటి అవసరాలకు చాలా కష్టంగా ఉంది. -
పుస్తకం...వెన్నంటి వచ్చే నేస్తం
కష్టాల్లో ఓ దారుస్తుంది ఆత్మీయతను పంచుతుంది నేటితో ముగియనున్న పుస్తక సంబరాలు రాజమహేంద్రవరం కల్చరల్ : పుస్తకం... ప్రతి ఒక్కరికి వెన్నంటి వచ్చే నేస్తం. ఓ మంచి పుస్తకం కష్ట సమయంలో ఓదారుస్తుంది. మనసుకు సాంత్వన చేకూరుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మీయతను పంచుతుంది. ఆనంద సమయంలో మరింత ఆహ్లాదం కలిగిస్తుంది. అలాంటి అద్భుత పుస్తకాల సమాహారంగా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రియుల మదిని దోచుకుంటోంది. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆదివారంతో ముగియనున్నాయి. మొదట్లో అంతంత మాత్రంగానే సందర్శకులు ఈ ప్రదర్శనను తిలకించినా, రెండు రోజులుగా వీరి సంఖ్య పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం మరింతగా పుస్తకాల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలు... మైదానంలోని 20, 21, 22, 23, 24 నంబరు స్టాళ్లలో ఉన్న ఎమెస్కోలో వైవిధ్యభరితమైన పుస్తకాలు ఉన్నాయి. పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’, టంగుటూరి ప్రకాశం ‘స్వీయచరిత్ర,’, నారా చంద్రబాబు నాయుడి ‘మనసులో మాట’ ఇక్కడ పది శాతం డిసౌంట్లో లభిస్తున్నాయి. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీమహాస్వామి ఉపదేశాలు ‘అమృతవాణి’ పేరిట లభిస్తున్నాయి. దాశరథి, గాలిబ్ గీతాలు, బి.వి.ఎస్.రామారావు గోదావరి కథలు, అడవి బాపిరాజు నవలలు, వడ్డెర చండీదాస్ హిమజ్వాల, శ్రీశ్రీ అనంతం కథలు, అమరావతి కథలు, బాలసాహిత్యం..ఇలా ఎన్నో ఎన్నో పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విప్లవ శంఖం ఇదిగో.. నవ్యాంధ్ర సంబరాలు, స్టాల్ నంబరు 70, ‘విరసం’ స్టాలులో విప్లవ, వామ పక్షభావాలకు చెందిన సాహితీ గ్రంథాలు లభిస్తున్నాయి. దిగంబర కవులు, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల రచనలు ఇక్కడ ఉన్నాయి. కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహించిన ప్రబుద్ధాంధ్ర పత్రికలను గ్రంథరూపంలో ఇక్కడ చూడవచ్చు. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. నేటికీ పుస్తకాలపై ఆసక్తి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అన్ని రంగాలు అంతో, ఇంతో దెబ్బతిన్నాయి. పుస్తకాల పట్ల పాఠకుల్లో నేటికీ ఆసక్తి ఉంది. ఈ స్టాళ్ళను సందర్శించడం వల్లఏ పుస్తకం ఎక్కడ లభిస్తుంది అన్న విషయంపై అవగాహన కలుగుతుంది. - జి.జనార్దన్, ఎమెస్కో నిర్వాహకుడు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవు నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. తరుచుగా ఇటువంటి ప్రదర్శనలను నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. - అరసవిల్లి కృష్ణ, విరసం కార్యవర్గ సభ్యుడు -
కనుల పండువగా పవిత్రారోపణ
ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీవారి దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం పవిత్రారోపణ కార్యక్రమం కనుల పండువగా సాగింది. రెండు రోజులుగా ఆలయంలో ఈ ఉత్సవాలను పురస్కరించుకుని విశేష కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఉదయం ఆలయ యాగశాలలో హోమగుండం వద్ద అగ్ని ఆరాధన, చతుర్ధ కలశస్థాపనను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా జరిపారు. స్వామి, అమ్మవార్లకు అలంకరణలు చేసి పవిత్రాలను శిరస్సుపై ఉంచుకుని అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఆలయంలో కొలువైన శ్రీవారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు, అమ్మవార్లకు ఈ పవిత్రాలను ధరింపజేశారు. అనంతరం పవిత్రాంగహోమం, శాంతి హోమాన్ని భక్తుల గోవింద నామస్మరణల నడుమ జరిపారు. -
పాత చీరలకు కొత్త గిరాకీ
బాల్కొండ : రైతులు తమ పంటలను అడవి పందులు, కోతులు, ఉడుతల బారి నుంచి కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు పాత చీరలను కొనుగోలు చేసి పంటల చుట్టూ కడుతున్నారు. దీంతో పాత చీరలకు కొత్త గిరాకీ ఏర్పడుతోంది. ఆదివారం ఎస్సారెస్పీ కాలనీలో నిర్వహించే సంతలోకి ఆదిలాబాద్ జిల్లా రైతులు తరలి వచ్చి పాత చీరలను కొనుగోలు చేశారు. ఒక్కో చీర రూ. 15 పలికింది. కొందరు రైతులు 100 కుపైగా చీరలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పంటల రక్షణకు పాత చీరలు ఉపయోగపడుతున్నాయని రైతులు పేర్కొన్నారు. ప్రధానంగా మక్క పంటను అడవి పందులనుంచి కాపాడుకోవడానికి చీరలు ఉపయోగ పడుతున్నాయని, చీరల రంగును చూసి అవి బెదిరి పోతున్నాయని పేర్కొంటున్నారు. -
లష్కర్ బోనాలు విజయవంతం
రాంగోపాల్‌పేట్: వివిధ శాఖల అధికారులు, వాలింటీర్లు, భక్తులు, పోలీసుల సహకారంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతర విజయవంతమయిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రంగం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని నెలల నుంచి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.‡ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతం కావాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఉదయం సతీసమేతంగా ఆయన ఆలయంలో పూజలు చేశారు. -
జాతర ముసుగులో జబర్దస్త్ వసూళ్లు..?
చందాల కోసం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు బెంబేలెత్తుతున్న కుప్పం వ్యాపారులు, వైద్యులు తిరుపతి : అమ్మవారి జాతర పేరిట విరాళాల దందా మొదలైంది. జాతర నిర్వహణకు భారీగా చందాలివ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. చందాలు ఇచ్చేందుకు నిరాకరించే వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు, పేరున్న వైద్యులు బెంబేలెత్తి పోతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం పట్టణంలో ఈ పరిస్థితి నెలకొంది. కుప్పంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరను ఏటా భక్తులు సంప్రదాయ బద్దంగా జరుపుతుంటారు. ఈ సారి కూడా ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీతో పాటు ప్రత్యేకంగా సబ్ కమిటీలు, ఉత్సవ కమిటీలు కూడా ఏర్పడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు హాజరయ్యే వీలున్నందున భారీ ఎత్తున జాతర జరపాలని పెద్దలు నిర్ణయించారు. ప్రధానంగా ఉత్సవాల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న కొందరు టీడీపీ నేతలు ఇందుకోసం చందాలు వసూళ్లు చేస్తున్నారు. సాధారణంగా అమ్మవారిపై భక్తి భావం ఉన్న వారంతా ఏటా తమకు తోచినంత విరాళాలను జాతర టకోసం ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం చందాల దందా కనిపిస్తోందని సమాచారం. వేలు...లక్షల కోసం ఒత్తిళ్లు... ఉత్సవాలకు విరాళాలివ్వడం భక్తుల మనోభీష్టానికి సంబంధించిన అంశం. తమకున్న ఆర్థిక స్తోమతను బట్టి భక్తులు, వ్యాపారులు చందాలిస్తుంటారు. అయితే జాతర ముసుగులో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. గంగమ్మ దేవస్థానం ఉన్న నేతాజీ రోడ్డులో వ్యాపారాలు నిర్వహించే షాపుల యజమానులందరూ రూ.5 నుంచి రూ.25 వేల వరకూ చందాగా ఇవ్వాలని నిర్ణయించినట్లు కొందరు పెద్దలు నిర్ణయించినట్లు తెల్సింది. ఉత్సావాల నిర్వహణ కోసం ఓ క్వారీ యజమానిని రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. పట్టణంలో పేరున్న వైద్యులు కూడా లక్షల్లో చందాలివ్వాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు సైతం పెద్ద మొత్తంలో చందాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తేవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఒత్తిళ్లు, వసూళ్లు సమంజసం కాదని భావించిన పలువురు పట్టణ పెద్దలు, ప్రజాసంఘ నాయకులు ఈ నెల 20 లోగా టీడీపీ జిల్లాస్థాయి నేతలను కలిసి పరిస్థితిని వివరించేందుకు సమాయత్తమవుతున్నారని తెల్సింది. -
నమ్మకమే కొనిపిస్తోంది!
♦ జాతరలో మేలు జాతి పశువుల కొనుగోళ్లు ♦ లక్షలు పోసి కొనేందుకు పలు రాష్ట్రాల రైతులు ఆసక్తి ♦ అర్ధ శతాబ్దం నుంచి నమ్మకంతో సాగుతున్న తంతు ♦ తాండూరు ‘భద్రేశ్వర జాతర’లో స్పెషల్ ప్రదర్శన యాభై ఏళ్ల నుంచి నడిపిస్తున్న నమ్మకం అది. ఇక్కడ పశువును కొంటే వ్యవసాయం సాఫీగా సాగుతుందని విశ్వాసం. అందుకే రాష్ట్ర సరిహద్దులు దాటి వస్తారు అన్నదాతలు. లక్ష, లక్షన్నర అయినా పర్వాలేదు.. మేలు జాతి కాడెడ్లయితే సరి.. కొనేయాల్సిందే. తాండూరులో యేటా జరిగే భద్రేశ్వర జాతర ప్రత్యేకత ఇది. మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు పక్కనే ఉన్న మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి దేవిని, ఔరాద్, హాల్లి, రేనాపూర్ తదితర రకాల మేలుజాతి పశువులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ధర కూడా దండిగా వస్తుంది. ఆ జాతర విశేషాలే నేటి సండే స్పెషల్.. తాండూరు: మేలు జాతి పశువులకు కేరాఫ్ తాండూరు. తింటే గారెలే తినాలి. కొంటే తాండూరు భద్రేశ్వర జాతరలో పాడి ఆవైనా...పోట్ల గిత్తై కొనాలి. అదీ భద్రేశ్వర జాతర ప్రత్యేకత. తాండూరులో శ్రీభావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాల సందర్భంగా ఎన్నోఏళ్లుగా పశుప్రదర్శన ఏర్పాటు చేయడం ఇక్కడి సంప్రదాయం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతోపాటు పక్కనే ఉన్న మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పశువులు ప్రదర్శనకు వస్తాయి. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా తాండూరులో పశుప్రదర్శన కొనసాగుతుండడం విశేషం. పశుప్రదర్శనకు మేలు రకం జాతి పశువుల రాకతో ఉత్సవాలు సందడిగా మారుతాయి. వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి పశువులను కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా జరిగే సంతలో కన్నా జాతరలో పశువులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ధరలు లక్షల్లో ఉంటాయి. వందల జతల పశువులు ప్రదర్శనకు వస్తాయి. జాతరలో ఏర్పాటు చేసే పశుప్రదర్శనలో మేలు జాతి పశువులు దొరుకుతాయని రైతులు నమ్ముతారు. దూర ప్రాంతాలకు వెళ్లి పశువులను కొనుగోలు చేయడం కష్టంగా ఉంటుం దని, రైతులకు వెసులుబాటుగా ఉంటుందని తాండూరులో పశుప్రదర్శన ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతుంటారు. జెర్సీతోపాటు దేశవాళీ రకాలు.. దేవిని, ఔరాద్, హాల్లి, రేనాపూర్ తదితర మేలు జాతి పశువు లు ప్రదర్శనకు వస్తాయి. జెర్సీతోపాటు దేశవాళీ రకాలు ఇక్కడికి వస్తాయి. తాండూరు ప్రాంతంతోపాటు సరిహద్దు జిల్లాలైన మెదక్, మహబూబ్‌నగర్ నుంచి పలువురు రైతు లు తమ పశువులను ఇక్కడికి విక్రయానికి తరలిస్తారు. ఏటా ఐదారు రోజులపాటు పశుప్రదర్శన కొనసాగుతుంది. సుమారు 5వందల నుంచి వెయ్యి జతల మేలుజాతి పశువులు ప్రదర్శనలో పాల్గొంటాయి. ప్రస్తుతం పట్టణంలోని బస్వన్నకట్ట సమీపంలో ఉన్న శ్రీసరస్వతీ శిశుమందిర్‌లో పశుప్రదర్శన ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పశువులు ప్రదర్శనకు వస్తున్నాయి. -
జాతర ముసుగులో రికార్డింగ్ డ్యాన్స్‌లు!
ఆనందపురంలో మాజీ ఎంపీపీ నిర్వాకం మంత్రి ఫొటో పెట్టి వేదిక ఏర్పాటు సహకరించిన పోలీసు యంత్రాంగం విశాఖపట్నం :రికార్డింగ్ డ్యాన్స్‌లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించినా ఆనందపురం జంక్షన్లో మాత్రం అమ్మవారి జాతర పేరుతో ఓ మాజీ ఎంపీపీ ఏర్పాటు చేసి అందరికీ వినోదం పంచాడు. నియంత్రించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి తమ వంతు సహకారం అందించారు. వేదికపై జిల్లా మంత్రి ఫొటోను ఏర్పాటు చేయడంతో పోలీసు యంత్రాంగం అతనికి దాసోహమంది. కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అధికారులకు భారీగా నజరానా అందినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. ఆనందపురానికి చెందిన మాజీ ఎంపీపీ ఒకరు మండలంలోని వేములవలసలో పైడితల్లమ్మ ఉత్సవాలను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆదివారం డ్యాన్స్ బేబీ డ్యాన్స్, మంగళవారం సినీ మ్యూజికల్ నైట్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు కాస్త పక్కదారి పట్టి రికార్డింగ్ డ్యాన్స్‌లుగా మారిపోయాయి. యాంకరింగ్ పేరుతో వచ్చిన మహిళలతో కురుచ దుస్తులు వేయించి ప్రదర్శన చేయించారు. ఆదివారం నాటి కార్యక్రమం శ్రుతిమించి మహిళలు సిగ్గు పడే విధంగా ఉందని పలువురు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం నాటి కార్యక్రమంలో కూడా సినిమా పాటలకు పురుషులు, మహిళలతో గ్రూపు రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను మంత్రి ముఖ్య అనుచరుడు వేదికపై కూర్చొని కాసేపు వీక్షించారని తెలిసింది. వీధి డ్యాన్స్‌లపై కేసులు బనాయించే పోలీసులు ఈ కార్యక్రమాలపై కన్నెత్తై చూడకపోవడం వెనక మంత్రి ఫొటోలతో ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు నజరానాలు కూడా అందడమే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
నేటి నుండి శ్రీరామలింగేశ్వరస్వామి జాతర
- ఏప్రిల్ 10 వరకు ఉత్సవాలు - ముస్తాబైన ఆలయం గొల్లపల్లి (కరీంనగర్) మండలంలోని చిల్వకోడూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి భక్తులకు కోర్కెలు తీర్చి నిత్యపూజలు అందుకుంటున్నాడు. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతాయి. జిల్లా నలుమూలల నుండి ఆశేషభక్తజనం ఈ ఉత్సవాలకు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే రామలింగేశ్వరస్వామి భక్తుల పాలిట ఇలవేల్పుగా విరాజిల్లుతున్నాడు. కరీంనగర్‌కు ఉత్తరాన 70 కి.మీ దూరంలో జగిత్యాల తూర్పున 20 కిలో మీటర్ల దూరంలో జగిత్యాల నుండి పెద్దపెల్లికి వెళ్లే రహదారిపై ఉన్న చిల్వకోడూర్ గ్రామంలో జంపన్నవాగు ఒడ్డున శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. చుట్టుపక్కల గ్రామాల భక్తులు తమ ఇలవేల్పు దైవంగా ఆరాదిస్తారు. ఆలయ పురాణం : ఈ ఆలయం కళ్యాణి చాలుక్య కళారీతిని ప్రతి బింబిస్తుంది. 11వ శతాబ్దపు చివరి బాగంలో లేదా 12వ శతాబ్దపు ప్రథమార్థంలో నిర్మించబడిందని ఇక్కడి ప్రాంతవాసుల నమ్మకం. రాయికల్ మండలం కేంద్రంలో ఉన్న త్రికుటాల శివుడు, సూర్యుడు, విష్ణువు ప్రతిష్టించబడినారు. పొలాస రాజదానిగా పొలాస రాజులు తమ రాజ్యాదికారమును గోదావరిని ఆనుకొని తూర్పున మంత్ర కూటమును దాటి వరంగల్ జిల్లాలోని నర్సంపేట తాలూక వరకు మల్లన్నపేట, చిల్వకోడూర్, నందిమేడారం, రామగుండం, మంథని, నర్సంపేట ప్రాంతంనందు దేవాలయాలు నిర్మించినారని, వీరు శైవ, వైష్ణవ, సౌర, జైన దేవతల ఆరాదికులని దవపరుస్తున్నాయి. ఈ దేవాలయం అధిష్టానం భూమిలో మునిగి ఉంది. ఆలయానికి తూర్పు, ఉత్తర దిశల ప్రవేశధ్వారాలు, మంటపమునందు గణపతి, దేవి, నంది విగ్రహాలున్నాయి. సమీపంలోని జంపన్నవాగులో స్నానాలు చేసి ఆలయంలో పూజలు చేస్తారు. జాతర విశిష్టత : ఆలయం ఎదుట ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సరం పంచాంగ శ్రవణం, కళ్యాణోత్సవం, రథోత్సవం, ఎడ్లబండ్ల ఉత్సవాలు, ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. మూడు రోజుల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఖరీఫ్‌లో వేసిన దీర్ఘకాలిక పంటలు, రబీలోని అంతరపంటలు విక్రయించే దశలో ఉంటాయి. కాబట్టి రైతుల దన, ధాన్య ఆనందంలో ఈ ఉత్సవాలకు కుటుంబ సమేతంగా తరలివస్తారు. ఉగాది పర్వదినా ఉత్సవాలు జరిగే రామలింగేశ్వరస్వామి జాతరను ఉగాది జాతరగా భక్తులు పిలుస్తారు. రథోత్సవం, బండ్ల ఉత్సవాలు తిలకించడానికి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో సందడిగా ఉంటుది. రామలింగేశ్వరస్వామి మహత్యం దశదిశ వ్యాపించడంతో జిల్లా నలుమూలల నుండి భక్తులు కుటుంబ సభ్యులతో ప్రతి ఏడాది రామలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. పక్కనే జర పన్న వాగు ప్రవాహం ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం కలిగిస్తుంది.కాగా ఏడాది కరువు వల్ల ఆ వాతావారణం కనిపించదు. ఉత్సవ తేదీలు : 06న అష్టబలి, స్థాలీపాకం, 07 గురువారం నాగవెల్లి, 08న సాయంత్రం5 గంటలకు నూతన సంవత్సరం పంచాంగ శ్రవణం, స్వామివారి సేవ,09న శనివారం మద్యాహ్నం 3 గంటలకు స్వామి వారి రథోత్సవం, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ, 10న ఆదివారం సాయంత్రం బండ్ల ఉత్సవములు, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ఎడ్లబండ్ల పోటీలు, మద్యాహ్నం 12 గంటలకు అన్నదానం నిర్వహించనున్నట్ల ఆలయ కమిటి తెలిపింది. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 2.5 గ్రాముల బంగారం(దాత వైద్యులు ఎల్లాల శ్రీనివాస రెడ్డి) ద్వితీయ,100 గ్రామల వెండి తృతీయ 50 గ్రాముల వెండి బహుమతి,( దాత వైద్యులు ప్రవీణ్ కుమార్ ఫిజియే తెరపి హాస్పిటల్ జగిత్యాల),ప్రధానం చేస్తామని జిల్లా నలుమూలల నుండి భక్తులను బస్సు సౌకర్యం ఉందని ఆలయ కమిటి చైర్మేన్ గర్వందుల మిల్ట్రీ మల్లయ్య తెలిపారు. -
రేపటి నుంచి నూకాంబిక జాతర
నెలరోజులపాటు ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తిచేసిన దేవాదాయశాఖ అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి మే 6 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆలయ సహాయ కమిషనర్ సుజాత తెలిపారు. ఆరో తేదీ రాత్రి జాతర, ఏడో తేదీన కొత్త అమావాస్య పండగ, 8న ఉగాది, మే 6న నెల పండగ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ పరిసరాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యంతోపాటు పిల్లలకు పాలు, పెద్దలకు మజ్జిగను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ప్రభుత్వశాఖ అధికారులతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించారు. అమ్మవారి చరిత్ర... సుమారు 550 ఏళ్లకిందట నూకాంబిక అమ్మవారు కాకతాంబగా వెలిశారు. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పని చేసి కాకర్లపూడి అప్పలరాజు కళింగాంధ్ర ప్రభువైన బహుభలేంద్రుడిని ఓడించి అనకాపల్లి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే గవరపాలెం ప్రాంతంలో శత్రుదుర్బేధ్యమైన కోటను నిర్మించి వారి ఇలవేల్పు కాకతాంబ గుడిని దక్షిణ ప్రాంతంలో నిర్మించారు. తర్వాత కాలంలో విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారిగా మార్చి కొలిచేవారు. తర్వాత కాలంలో గోడి జగన్నాథరాజును అనకాపల్లి కోటకు సామంతరాజుగా విజయనగరం రాజు నియమించారు. అనేక సంవత్సరాలు బ్రిటీష్వారికి పన్నులు చెల్లించకపోవడంతో కోటను వేలం వేశారు. వైరిచర్ల ఆనందగజపతిరాజు వేలంపాటలో కోటను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి వైరచర్ల వంశీయులే దేవస్థానం ధర్మకర్తలుగా వ్యవహరించేవారు. 1935లో దేవాదాయ శాఖ పరిధిలోకి... నూకాంబిక అమ్మవారి దేవాలయంలో 1935లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. దినదిన ప్రవర్థమానమై 40 కాటేజీలు, క్యూకాంప్లెక్స్లు, కల్యాణ మండపాలను నిర్మించారు. పిలిచిన వెంటనే పలికే ఇలవేల్పుగా, కల్పవల్లిగా, తల్లిగా భక్తులు కొలిచే అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధికెక్కారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ బహుళ అమావాస్య అనగా ఉగాది ముందురోజు నుంచి నెలరోజులపాటు కొత్త అమావాస్య జాతర మాసోత్సవాలను నిర్వహిస్తారు. నిత్య అన్నదాన పథకం... నూకాంబిక అమ్మవారి ఆలయంలో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి రోజు ఇక్కడికి విచ్చేసే కొందరు భక్తులకు అన్నదానం చేస్తున్నారు. -
అది జాత్యహంకారం..
రాహుల్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలపై జైట్లీ * నల్లధనంపై పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టదు * నగలపై ఎక్సైజ్ సుంకం ఉపసంహరణ కుదరదు * బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు ఆర్థికమంత్రి జవాబు న్యూఢిల్లీ: నల్లధనం వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసిన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలు జాత్యహంకార మనఃస్థితిని ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తిప్పికొట్టారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండానే.. ఆ వ్యాఖ్య రాజకీయంగా సరైనది కాదని, తెల్లగా (ఫెయిర్) లేని వారు ఆకర్షణీయంగా (లవ్లీ) ఉండబోరన్నది ఆ వ్యాఖ్యల మనఃస్థితిని పేర్కొన్నారు. నల్లధనంపై ప్రభుత్వం ప్రకటించిన పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టే పథకం కాదని ఉద్ఘాటించారు. నల్లధనం వెల్లడించే వారు 30 శాతం పన్ను, 15% సర్‌చార్జి, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు జైట్లీ సోమవారం సాయంత్రం సమాధానం ఇస్తూ.. ఆటంకతత్వం లేకపోతే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందగలదన్నారు. జీఎస్టీ, దివాలా బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని కోరారు. నగలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్లను తిరస్కరించారు. జీఎస్టీ అమలు చేయటానికి సన్నాహంలో భాగంగా ఈ సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అలాగే.. రుణ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన వాణిజ్యవేత్త విజయ్‌మాల్యా దేశం విడిచి వెళ్లటంపై విపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. చట్ట వ్యవస్థ ఆ రుణాల వసూళ్లకు అడ్డంకిగా మారి, ఆయన తప్పించుకుపోవటానికి వీలు కల్పించిందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వ్యాఖ్యానించారు. అనంతరం.. బడ్జెట్ కసరత్తులో తొలి దశను పూర్తిచేస్తూ వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అర్ధసత్యాల బడ్జెట్: విపక్షంఅంతకుముందు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. బడ్జెట్ అంతా ఎంతో బాగుందన్నట్లు చిత్రిస్తోందని.. అర్థసత్యాలతో నిండి ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ‘అచ్ఛే దిన్’ నినాదాన్ని గుర్తుచేస్తూ.. నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ఎదిగిన ఆర్ఎస్ఎస్కు మాత్రమే మంచి రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడ్జెట్‌కు నూరు శాతం మార్కులు ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. పరీక్ష రాసే వారిగా, ఆ పరీక్షను పరిశీలించే వారిగా మోదీయే వ్యవహరిస్తున్నారని తారిక్ అన్వర్ (ఎన్సీపీ) విమర్శించారు. బడ్జెట్ మధ్యతరగతికి వ్యతిరేకమైనదని సంతోక్సింగ్చౌదరి (కాంగ్రెస్) ధ్వజమెత్తారు. బడ్జెట్‌కు దిశానిర్దేశమేదీ లేదని, అంతా డొల్ల అని ప్రకాశ్నారాయణ్యాదవ్ (ఆర్జేడీ) విమర్శించారు. బడ్జెట్లో దూరదృష్టి లేదని తపస్మండల్ (టీఎంసీ) తప్పుపట్టారు. రైతులను కాపాడటానికి ఏదైనా చేయాలని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ విజ్ఞప్తిచేశారు. రైతుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం వద్ద ఏ మంత్రదండం ఉందని ధర్మేంద్రయాదవ్ (ఎస్పీ) ప్రశ్నించారు. బడ్జెట్ సంతులనంగా ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు ఉన్నాయని, నగలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని బుట్టా రేణుక (వైఎస్సార్ కాంగ్రెస్) ప్రభుత్వాన్ని కోరారు. పలువురు బీజేపీ సభ్యులు బడ్జెట్‌ను ప్రశంసించారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో అజ్ఞానం కనిపిస్తోంది : జైట్లీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రేరేపించేవిగా ఉన్నాయని, ఫెయిర్ అండ్ లవ్లీ యోజన అంటూ ప్రభుత్వ పథకాలను రాహుల్ విమర్శించడంలో సమన్వయం కనిపించడం లేదని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సమంజసం కాదన్నారు. నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిర్ అండ్ లవ్లీ పథకాన్ని ప్రారంభించింది అంటూ రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... అటువంటి వ్యాఖ్యలు వ్యక్తుల్లోని అజ్ఞానాన్ని తెలియజేస్తాయని అన్నారు. 'ఫెయిర్ అండ్ లవ్లీ యోజన్' అంటూ రాహుల్ వాడిన పదబంధం రాజకీయ నాయకులు మాట్లాడే పద్ధతిలో లేదని, ఇది జాతి అభిప్రాయం అంటూ అరుణ్ జైట్లీ లోక్ సభ బడ్జెట్ చర్చ జరుగుతున్న సమయంలో పేర్కొన్నారు. -
అమ్మవారి జాతరలో అపశ్రుతి
= అగ్నిగుండంలో పడిన భక్తులు = 70 మందికి గాయాలు తుమకూరు : అమ్మవారి జాతరకు వచ్చిన భక్తులందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయం ముందు ఉన్న అగ్ని గుండంలో మంటలు ఇంతెత్తున ఎగరిపడుతున్నాయి. మరో వైపు గుండంలోకి దిగి మొక్కులు తీర్చుకోవాలని భక్తులు బారులు తీరారు. ఇంతలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో గుండంలోకి పడిపోయారు. దీంతో హాహాకారాలు మిన్నంటాయి. పోలీసులు, స్థానికులు అప్రమత్తమై గుండంలోకి దిగిన 70 మందిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. వివరాలు..తుమకూరు జిల్లా, హెతైనహళ్లిలో మారెమ్మ దేవి కొలువైంది. ఆనవాయితీగా శివరాత్రి పర్వదినం మరుసటి రోజు మంగళవారం ఉదయం జరిగే అమ్మవారి జాతరకు కమ్మంజిపాళు, రంగయ్యపాళ్య, కంబత్తనహళ, లక్ష్మణసంద్ర, కైదాల తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. ఈక్రమంలో తెల్లవారు జామున దేవాలయం ముందు ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచి మొక్కులు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులను నియంత్రించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 4.45 గంటలకు మడి కట్టుకున్న భక్తులు కుమ్మంజిపాళ్య గ్రామానికి చెందిన నాగరాజు, రంగయ్యనపాళ్య గిరిష్ పూజలు నిర్వహించి నిప్పుల్లో దిగి నడిచి వెళ్లారు. వారి వెనక క్యూలో నిలబడి ఉన్న వందలాది మంది ఒక్క సారిగా ముందుకు రాగా తోపులాట జరిగింది. సుమారు 70 మంది భక్తులు నిప్పుల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు అప్రమత్తమై గుండంలో పడినవారిని బయటకు తీసి వాహనాల్లో తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 13 మందిని బెంగళూరులోని విక్టోరియా తరలించారు. తుమకురు గ్రామీణ ఎమ్మెల్యే బీ.సురేష్‌గౌడ, మాజీ ఎమ్మెల్యే హెచ్.నింగప్ప, టిపి సభ్యుడు శివకుమార్, తుమకూరు ఉప విభాగం అదికారి తబ్సుమ్ జహెరా, తహశీల్దార్ కాంతరాజు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. తుమకూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.రఫిక్ ఆహ్మద్ ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ప్రాణ హాని లేదన్నారు. ఎమ్మెల్యే సురేష్‌గౌడ మాట్లాడుతూ ఈ ప్రమాదం దేవాదాయశాఖ, జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మోహన్‌రాజు ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం దేవాలయం వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందని అధికారులను ఆరా తీశారు. -
జాతరకు నాలుగు వేల బస్సులు
జాతరలో ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి అవసరమైతే మరిన్ని బస్సుల ఏర్పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మేడారంలో బస్టాండ్ ప్రారంభం ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మహా జాతరను పురస్కరించుకుని ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్టాండ్, క్యూ రెరుులింగ్స్ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో కొద్దిదూరం ప్రయూణించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతరకు విస్తృత ఏర్పాట్లు.. మేడారంలో బస్సులు నిలిపేందుకు సుమారు 50 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశామని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నందున ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. జాతర సమయంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతోపాటు బస్టాండ్ లో మరుగుదొడ్లు, విద్యుత్, ఎల్ఈడీ స్క్రీన్లు, కళాకారులతో సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రన్నింగ్ కండీషన్లో ఉన్న బస్సులనే జాతరకు ఎంపిక చేశామ ని, 12వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించామని వివరించారు. ఇందులో 7,300 మంది డ్రైవర్లు, 2,500 మంది కండక్టర్లతో పాటు రెండు వేల మంది టెక్నికల్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ జాతరకు 20 లక్షల మంది భక్తులను మేడారానికి తరలిస్తామనే అంచనా ఉందన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా మరమ్మతుకు గురైతే సరిచేసేందుకు పలు ప్రాంతాల్లో మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఈసారి కొత్తగా హైదరాబాద్ నుంచి జాతరకు ఏసీ బస్సులు నడుపుతున్నామన్నారు. 14 నుంచి ప్రత్యేక బస్సులు ప్రైవేట్ వాహనాల్లో రావడం కంటే ఆర్టీసీ బస్సుల్లో మేడారం వస్తే గద్దెల సమీపానికి చేరుకునే అవకాశముంటుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని, ఈ బస్సులు 21వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. వనదేవతలకు మొక్కులు మేడారంలో బస్టాండ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నా రు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబుతో పాటు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన వనదేవతలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఆర్ఎం యాదగిరి, డీఎం మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. నష్టాల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి జనగామ : తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా 500 బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రె డ్డి తెలిపారు. మేడారం పర్యటనను పురస్కరించుకుని జనగామలో శుక్రవారం ఆయన కాసేపు ఆగారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడవని 13 గ్రామాలకు పునరుద్ధరిస్తామన్నారు. 2004లో మరమ్మతుకు వచ్చిన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారులను సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. నష్టా ల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తెలంగాణలోని 95 డిపోల్లో తాగునీటి సౌకర్యంతోపాటు మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
జాతరకు సర్వం సిద్ధం
10వ తేదీలోగా పనుల పూర్తికి నాది పూచీ భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం ట్రాఫిక్ ఇబ్బందులు రావొద్దనే ‘వన్ వే’ జాతర విధుల్లో 12వేల మంది పోలీసులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం : మంత్రి ఐకే.రెడ్డి ఇప్పటికే జాతర వాతావరణం : మంత్రి చందూలాల్ మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష ములుగు : తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారి జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సి ద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి బుధవారం మేడారం వచ్చిన ఆయన తొలుత అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా పనుల వివరా లు ఆరా తీశారు. జాతర పనులను జనవరి 31వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినా.. భక్తు ల రద్దీ కారణంగా సాధ్యం కాలేదని తెలిపారు. అరుుతే, కొన్ని శాఖల పనులు పూర్తి కాగా.. మిగిలినవి 10వ తేదీ వరకు పూర్తి చేయనున్న ట్లు వెల్లడించారు. పనులు పూర్తి చేరుుంచే పూచీ తనదని శ్రీహరి పేర్కొన్నారు. ఈసారి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. 10వ తేదీన నీళ్లు వదలాలి.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా ఈ నెల 10వ తేదీన లక్నవరం నీళ్లను జంపన్న వాగులోకి వదలాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నీళ్లు జంపన్నవాగుకు 13వ తేదీ వరకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఇక 16వ తేదీ సాయంత్రం నిల్వ ఉన్న నీటిని పూర్తిగా కిందికి పంపించి శుభ్రమైన నీటిని మళ్లీ అందించాలని సూచించారు. స్వరాష్ట్రంలో జరుగుతున్న తొలిజాతర అరుునందున విజయవంతమయ్యేలా అధికార యంత్రాంగం కృషి చేయూలని ప్రభుత్వం తరపున కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. కాగా, సారి ప్రత్యేకంగా జాతర తర్వాత వారం పాటు జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉండి పారిశుద్ధ్యం, తదితర పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం జాతర వివరాలు తెలిపేలా జేసీ జీవన్ ప్రశాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను ఆవిష్కరించారు. పుష్కరాల తరహాలో షటిల్ : డిప్యూటీ సీఎం శ్రీహరి ఖమ్మం, ఏటూరునాగారం నుంచి వచ్చే భక్తుల వాహనాలను తాడ్వాయి సమీపంలో నిలిపి షటిల్ బస్సుల ద్వారా పుష్కరాల మాదిరిగా మేడారం తరలిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. జాతర పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక హన్మకొండ-ములుగు మీదుగా వచ్చే ప్రైవేట్ వాహనాలను పస్రా మీదుగా నార్లాపూర్‌కు తరలిస్తామని అన్నారు. తిరుగుప్రయాణంలో నార్లాపురం-దూదేకులపల్లి మీదుగా భూపాలపల్లికి మళ్లిస్తామని వివరించారు. దీని వల్ల కొంత దూరం పెరి గినా భక్తులు ఇబ్బంది పడొద్దన్న భావనతోనే ‘వన్ వే’ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 3,605 బస్సులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 24గంటల విద్యుత్ సరఫరా కోసం కమలాపురం-తాడ్వాయి ఫీడర్ సిద్ధం చేశామని వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ ఆధ్వర్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రతీ మేడారం జాతరలో పోలీ సులు, ఇతర అధికారులు.. జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారని పలువురు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఐకే.రెడ్డి.. గత జాతరలో సమైక్యాంధ్ర పోలీసులు ఉన్నారని.. ఈసారి మన పోలీసులే అరుునందున అలా జరగదని పేర్కొన్నారు. ఇంతలో కడియం శ్రీహరి జోక్యం చేసుకుని జర్నలిస్టులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తామని తెలిపారు. ఆరు నెలల క్రితమే ప్రణాళిక : ఐకే.రెడ్డి మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మామూలు సమయాల్లో సైతం భక్తులు వస్తున్న కారణంగా మేడారంలో పర్మినెంట్‌గా ఈఓ కార్యాలయాన్ని ఏర్నాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈసారి జాతరకు కోటి 25లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఇప్పటికే మేడారంలో జాతర వాతావరణం నెలకొందని తెలిపా రు. అలాగే, భక్తుల అవసరాలకు అన్ని సౌకర్యాల క ల్పన కూడా దాదాపుగా పూర్తరుుందన్నారు. కాగా, మేడారం జాతర పునరుద్దరణ కమిటీలో కేవలం ఒక్కరే గిరిజనుడికి అవకాశం కల్పించడంపై ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ కమిటీ ఏర్పాటుకు రిజర్వేషన్లు ఉంటాయని, నిబంధనల ప్రకారమే పునరుద్ధరణ కమిటీ నియమించామని అన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ. డీఐజీ మల్లారెడ్డి. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ పాటిల్, ఏఎస్పీ విశ్వజిత్. ఆర్డీఓ మహేందర్‌జీ, ఐటీడీఏ పీఓ అమేయ్‌కుమార్, ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
3605 బస్సులు
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం → 20 లక్షల మంది {పయాణికులను చేరవేయడం లక్ష్యం → రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్లు → {పత్యేక బస్సులకు త్వరలో చార్జీల {పకటన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులను పెద్ద ఎత్తున చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తుండగా.. ఇందులో 20 లక్షల మంది బస్సుల్లో ప్రయూణించే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అరుుతే, రాష్ట్ర విభజన నేపథ్యంలో బస్సుల సంఖ్య తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో జాతరకు సరిపడా బస్సులను నడిపించడం సంస్థకు సవాల్‌గా మారనుంది. 2014 జాతర సందర్భంగా ఆర్టీసీ 3,331 బస్సులను ఏర్పాటు చేసింది. గతంతో పోల్చితే ఈసారి దాదాపు 300 బస్సులను ఎక్కువగా నడిపించనుంది. 17, 18వ తేదీల్లో మేడారం వైపు భక్తులు పోటెత్తుతారు. అనంతరం 19, 20 తేదీల్లో మూకుమ్మడిగా లక్షల మంది భక్తులు తిరుగుపయనమవుతారు. ఈ నాలుగు రోజులు ఆర్టీసీకి కీలకం. ⇒ మేడారంలో క్యూలైన్ల వద్ద 700 మంది సెక్యూరిటీ ⇒ సిబ్బందిని నియమిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ⇒ తాడ్వాయి వద్ద ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి టికెట్లు ⇒ జారీ చేసేందుకు 40 టిమ్స్ బృందాలు ఉంటారుు. ⇒ జాతరకు వచ్చే రూట్లో ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాల్లో ⇒ పైలట్ వాహనాలు, క్రేన్లు వినియోగించనున్నారు. హన్మకొండ : సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు వనజాతర జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ జాతరకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ.. పది జిల్లాల్లో 51 బస్ పాయింట్ల నుంచి 3605 బస్సులను నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో 2014 జాతర సందర్భంగా 3,331 బస్సులును ఏర్పాటు చేసింది. గతంతో పోల్చితే ఈసారి దాదాపు మూ డు వందల బస్సులను ఎక్కువగా నడిపించనుంది. అంతేకాదు భక్తుల రద్దీని బట్టి మరో నాలుగు వందల బస్సులు నడిపించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా నాలుగు వేల బస్సులను జాతర కోసం ప్రత్యేకం గా కేటాయిస్తున్నారు. వీటి ద్వారా జాతరకు వచ్చే భక్తుల్లో ఐదొంతుల మంది అంటే.. 20 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారం రోజులు రద్దీ ఎక్కువ సమక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతంది. ఇందులో 17వ తేదీన సారలమ్మను గద్దెకు తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. అయితే, అంతకంటే ముందుగానే భక్తులు మేడారం వచ్చి ఇక్కడ గుడారాలు వేసుకుని ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు నడిపించనుంది. ముఖ్యంగా 17, 18వ తేదీల్లో మేడారం వైపు భక్తులు పోటెత్తి వస్తారు. అనంతరం 19, 20వ తేదీల్లో మూకుమ్మడిగా లక్ష ల మంది భక్తులు తిరుగుపయనమవుతారు. ఈ నాలుగు రోజులు బస్సుల రాకపోకలు సాఫీగా జరిగేలా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో క్యూలైన్ల వద్ద ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా 700 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో టిక్కెట్లు జారీ చేసేందుకు తాడ్వాయి వద్ద ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏకకాలంలో టిక్కెట్లు జారీ చేసేందుకు 40 టిమ్స్ బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. మార్గమధ్యంలో ఎటువంటి ఇబ్బందీ రాకుండా అనుభవజ్ఞులైన డ్రైవర్లకే జాతర విధులు కేటాయిస్తున్నారు. ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాల్లో పైలట్ వాహనాలు, క్రేన్లు వినియోగించాలని నిర్ణయించారు. జిల్లా నుంచి 2,195 బస్సులు సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో జిల్లా ప్రజానీకం మొత్తం మేడారంలోనే ఉంటుంది. దీంతో వరంగల్ జిల్లా నుంచి మొత్తం 26 పాయింట్ల ద్వారా 2,195 బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ఏటూరునాగారం, మంగపేట పాయింట్ల నుంచి ఖమ్మం రీజియన్‌కు చెందిన బస్సులను వినియోగిస్తున్నారు. నిజామాబాద్ రీజియన్‌కు చెందిన బస్సులను ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, పస్రా, గోవిందరావుపేట, తాడ్వాయి, గణపురం పాయింట్లకు కేటాయించారు. మిగిలిన బస్ పాయింట్ల నుంచి వరంగల్ రీజియన్‌కు చెందిన బస్సులు అందుబాటులో ఉంటాయి. -
13 నుంచి పైడితల్లి జాతర
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను అక్టోబర్ 13 నుంచి నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు జగనున్న ఉత్సవాలు నవంబర్ 11న ముగుస్తాయి. ఈ మేరకు పైడితల్లి ఆలయ ఈవో భానురాజ సోమవారం విలేకరులకు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, నవంబర్ 3న తెప్పోత్సవం, 10న ఉయ్యాల కంబాల, 11న చండీయాగం, పూర్ణాహుతి, దీక్ష విరమణ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
వార సంతలకు ‘మావోల’ బ్రేక్!
సంతలకు రావొద్దని వ్యాపారులకు హెచ్చరిక దుమ్ముగూడెం: తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో నిర్వహిస్తున్న వార సంతలను ఆపివేయాలని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని అటవీ ప్రాంతంలోగల గొల్లపల్లి, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధి దండకారణ్యంలో నిర్వహిస్తున్న ఈ సంతల్లోకి వ్యాపారులు అడుగుపెట్టొద్దంటూ హెచ్చరించారు. దీంతోపాటు అటవీ ప్రాంతంలోని రహదారులను దిగ్బంధించడానికి వెయ్యి మంది మిలీషియా సభ్యులను రంగంలోకి దింపి కందకాలు తవ్వడానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు సమాచారం. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పోలీసు బలగాలను దింపడంతోపాటు బేస్ క్యాంపుల ఏర్పాటు చేస్తోంది. జనవరిలో సరిహ ద్దులో ఉన్న ధర్మపేటలో బేస్‌క్యాంపు ఏర్పాటు చేసిన పోలీసులు తర్వాత గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలకనగూడ వద్ద మరో బేస్ క్యాంపు ఏర్పాటుచేసి ముందడుగు వేశారు. మావోలకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందిస్తున్నారనే నెపంతో వారిని సంతలకు రావద్దని బుధవారం సాయంత్రం హెచ్చరించినట్లు తెలిసింది. ధర్మపేట, గొల్లపల్లి, కిష్టారం, ఎలకనగూడ, బూరుగులంక సంతలను పూర్తిగా నిలిపివేయాలని హెచ్చరిస్తూ కొందరు వ్యాపారుల వద్ద ఉన్న సరుకులను మావోలు గ్రామాల్లో దింపినట్లు తెలిసింది. దండకారణ్యంలోని ఖనిజ సంపదను, వన సంపదను లూటీ చేయడానికే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బేస్‌క్యాంపులు ఏర్పాటుచేసి దమనకాండ సృష్టించడానికి ప్రయత్నిస్తోందని సీపీఐ(మావోయిస్టు) కిష్టారం ఏరియా పేరుతో లేఖ విడుదల చేశారు. -
నెల పండుగ ప్రారంభం
మొదలైన నూకాంబిక కొత్త అమావాస్య జాతర పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పీలా ఆలయ పరిసరాల్లో సందడి అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి నూకాంబిక కొత్త అమావాస్య జాతర గురువారం రాత్రి ప్రారంభమైంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఈ నెల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం కొత్త అమావాస్య పండుగ నిర్వహించి సాయంత్రం 5.00 గంటలకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేస్తారు.ఉగాదిని పురస్కరించుకొని శనివారం మళ్లీ దర్శనభాగ్యం కల్పిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారి ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జాతరను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రాష్ర్ట ప్రభుత్వం తరపున తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పీలా దంపతులను ఆలయంలోకి మేళతాళాలతో ఆహ్వానించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.సుజాత, భక్త జనమండలి చైర్మన్ బి.ఎస్.ఎం.కె. జోగినాయుడులు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, పండగ ప్రత్యేకాధికారి ఎన్.వి.మూర్తి ఆధ్వర్యంలో దేవాదాయశాఖ సిబ్బంది, డీఎస్పీ పురుషోత్తం ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పీలా మహాలక్ష్మినాయుడు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పీలా శ్రీనివాసరావు, అవంతి మహేష్, గుత్తా ప్రభాకర్ చౌదరి, బుద్ధ నాగజగదీష్, డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ సత్యవతి, కశింకోట ఎంపీపీ సుబ్బలక్ష్మి, మలసాల కుమార్, కాయల మురళి పాల్గొన్నారు. పట్టు వస్త్రాల సమర్పణ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలను పంపారని తెలిపారు. నెలరోజుల పండగకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆలయ పరిసరాలలో అదనంగా మూడెకరాలను సమీకరించి మరింత అభివృద్ధి పనులు చేపడతామన్నారు. -
నేటి నుంచి పెద్దగట్టు జాతర
ఐదు రోజులపాటు లింగమంతులస్వామి ఉత్సవాలు.. సూర్యాపేట: నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. వంద ఏళ్ల చరిత్ర గల ఈ జాతరను రెండేళ్ల కొకసారి ఐదు రోజులపాటు జరుపుకొంటారు. తెలంగాణ తోపాటు, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆది వారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే ఈ జాతర.. 12వ తేదీ మకర తోరణం తరలింపుతో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి జాతర కావడంతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు ఇతర ప్రముఖలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ జాతరకు సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. -
అడవి తల్లి ఒడిలో ఆదివాసీ పండగ
ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే నాగోబా జాతరకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 19 నుంచి 27 వరకు జరిగే ఈ జాతరలో తమ ఆరాధ్య దైవమైన నాగోబాను ఘనంగా పూజించేందుకు ఆదివాసీలు సిద్ధమయ్యారు. ఇందుకోసం కేస్లాపూర్‌లోని నాగోబా (శేష నాగు) ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆదిలాబాద్‌తో పాటు మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే వివిధ తెగల ఆదివాసీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ జాతరలో ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్నీ విశేషాలే. జాతర సందర్భంగా కేస్లాపూర్ అటవీ ప్రాంతం జనసంద్రం అవుతుంది. పగలు రాత్రి ప్రత్యేక పూజలతో మార్మోగుతుంది. చుట్టపక్కల వందలాది దుకాణాలు వెలుస్తాయి. ఎక్కడెక్కడో నుంచి వచ్చే ఆదివాసీలంతా ఒక చోటికి చేరిన సందర్భంగా మంచిచెడ్డ మాట్లాడుకుంటారు. పెళ్లిళ్లు కూడా నిశ్చయమౌతుంటాయి. ఏడూర్లు తిరుగుతారు ఒక ప్రణాళిక బద్ధంగా ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులంతా కేస్లాపూర్‌లోని పటేల్ నివాసం వద్ద సమావేశం అవుతారు. అన్ని అంశాలు చర్చించాక జాతరపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎడ్లబండి (ఛకడ)లో కటోడా (పూజారి), ప్రధాన్ (పూజలకు సలహాదారుడు)లు కలిసి ముందుగా మహాపూజలకు అవసరమైన కుండల తయారీకి కుమ్మరులకు ఆదేశం ఇస్తారు. అనంతరం ఏడు రోజుల పాటు కటోడా, ప్రధాన్‌లు కలిసి ఎడ్ల బండ్లపై మేస్రం వంశీయులున్న ఏడు గ్రామాలను సందర్శిస్తారు. జాతర నిర్వహణపై కబూర్ (ప్రచారం) అందిస్తారు. గోదావరి జలయాత్ర నాగోబాను అభిషేకించేందుకు గోదావరి నది నుంచి జలాలను తీసుకొస్తారు. అందుకోసం సుమారు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదికి కాలినడకన వెళతారు. ఈ మార్గాన్ని రూపొందించేందుకు మరోమారు సమావేశమవుతారు. ఎప్పుడూ ఒకే దారిలో కాకుండా, ఏటా ఒక్కో ప్రాంతం నుంచి ఈ జల యాత్ర సాగుతుంది. ఈసారి నార్నూర్ -జైనూర్ - సిర్పూర్ - జన్నారం మండలాల మీదుగా హస్తిన సమీపంలోని మడుగు వద్ద ఉన్న గోదావరి నదికి చేరుకుంటారు. వెంట తీసుకువెళ్లిన ఉప్పుడు బియ్యాన్ని వండుకుని నైవేద్యం (సేసా)న్ని పెట్టి, సామూహిక భోజనాలు చేసిన అనంతరం గంగా జలాన్ని తీసుకుని నాగోబా ఆలయానికి కాలినడకన బయలు దేరుతారు. ఇంద్రాదేవికి పూజలు తిరుగు ప్రయాణంలో ఆచారం ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నెలకొని ఉన్న ఇంద్రా దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈసారి ఈనెల 15న ఇంద్రా దేవి పూజలు జరుగుతున్నాయి. అదేరోజు కేస్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న మర్రిచెట్టు (వడమర్ర)కు చేరుకుంటారు. మరుసటి రోజు రాత్రి... చనిపోయిన మేస్రం వంశీయుల పేరుతో తూం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మూడు రోజుల పాటు వివిధ రకాల పూజలు జరుపుతారు. అనంతరం ఈనెల 19న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలు.. డోల్, పెప్రే, కాలికోంల చప్పుళ్ల నడుమ గంగా జలంతో ఆలయానికి చేరుకుంటారు. కొత్త కోడళ్ల పరిచయాలు మేస్రం వంశీయుల ఆడ పడుచులు, అల్లుళ్లు ముందుండి ఈ ప్రత్యేక పూజలన్నీ చేయిస్తారు. మహాపూజ రాత్రి 10 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మేసం వంశీయుల కుటుంబాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న కోడళ్లను మేస్రం వంశం పెద్దలకు పరిచయం (బెట్టింగ్) చేయించి నాగోబాను చూపుతారు. వారి సంప్రదాయం ప్రకారం ఈ బెట్టింగ్ జరిగాకే ఆ మహిళలు నాగోబాకు పూజలు చేయడానికి ఆర్హులవుతారు. ఇరవై రెండు పొయ్యిలు మహా పూజలు, బెట్టింగ్‌ల మరుసటి రోజు ఈనెల 20న ఆలయం వెనుక ఉన్న పేర్సపెన్ (పెద్ద దేవత) కు పూజలు చేస్తారు. ఈ పూజలను కేవలం పురుషులు మాత్రమే నిర్వహిస్తారు. పూజలు జరుగుతున్న సమయంలో ప్రధాన్‌లు సాంప్రదాయ వాయిద్యాలను వాయిస్తుంటారు. తర్వాత మట్టితో భాన్ దేవత విగ్రహాలను తయారు చేసి పూజలు చేస్తారు. 21న గోవాడ్ (ప్రత్యేక కట్టడం) వద్ద మేస్రం వంశీయుల్లో ఉన్న 22 కితల (మేస్రం వంశంలోనే వివిధ వర్గాలు) వారిగా సంప్రదాయ పూజలు చేస్తారు. కుండల్లో వంటకాలను తయారు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. గోవాడ్‌లో కితల వారీగా 22 పొయ్యిలు ఏర్పాటు చేసుకుని సాంప్రదాయ వంటకాలను తయారు చేసి, కితల వారిగా సహపంక్తి భోజనాలు చేస్తారు. బేతాల్ నృత్యాలు దర్బార్ అనంతరం ఆదివాసీల బేతాల్ పూజ ఉంటుంది. కులపెద్దలు బేతాల్ నృత్యాలు చేస్తారు. కర్రసామును పోలిన ఈ నృత్యాలు అందరిని అలరిస్తాయి. అనంతరం మండగాజిలింగ్ పూజలతో నాబోబా జాతర ముగింపు జరుగుతుంది. ఈ మండగాజిలింగ్లో జాతరకు వచ్చిన కానుకలు, నైవేద్యాలను కితల వారిగా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక నృత్యాలతో జాతర ముగుస్తుంది. జాతరకు వెళ్లాలంటే.. ఆదిలాబాద్ నుంచి (32 కి.మీ) ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వారికి 44 వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్ మండల కేంద్రం నుంచి, ఇంద్రవెల్లి కంటే ఐదు కిలో మీటర్ల ముందు ముత్నూర్ నుంచి కేస్లాపూర్‌కు రోడ్డు సౌకర్యం ఉంది. -
రైతు ఖాతాకు ‘మాఫీ’ చిల్లు
గిట్టుబాటు లేకున్నా బయట మార్కెట్లో విక్రయించేందుకు మొగ్గుతున్న రైతన్న ధాన్యం విక్రయాలు, రైతుల సమస్యలపై పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్య వైఖరి ధాన్యం అమ్మిన డబ్బులు బ్యాంకుల కైవసం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రుణ మాఫీ అంశంపై నాన్చుడు ధోరణి అన్నదాతలను అనేక కష్టాల పాలుజేస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తామని.. ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించనక్కరలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెప్పటంతో.. రుణాలు చెల్లించకుండా రుణ మాఫీపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పుడు అదే శాపంగా పరిణమిస్తోంది. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీరనందున రైతులు డిఫాల్టర్లుగా మారి కొత్త రుణాలు పొందడానికి అనర్హులయ్యారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి సాగు చేసిన రైతులు.. ఇప్పుడు పండించిన ధాన్యం విక్రయించగా వచ్చిన సొమ్ము బ్యాంకు ఖాతాలకు వస్తుండటంతో.. ఆ డబ్బును కాస్తా బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో చేతికి చిల్లిగవ్వ రాక.. బయట అప్పులు తీర్చటం మాట దేవుడెరుగు కనీసం కుటుంబ పోషణ ఎలా అన్నది అన్నదాతకు జవాబు లేని ప్రశ్నగా మారింది. గిట్టుబాటు లేకున్నా బయటకే మొగ్గు... రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సర్కారు చెప్తుండటంతో.. చాలా మంది రైతులు అక్కడకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. విక్రయించగా వచ్చిన ధాన్యానికి డబ్బు నగదు రూపంలో ఇవ్వకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మరుక్షణమే.. ఆయా బ్యాంకులు సంబంధిత రైతుల పాత అప్పుల కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కొందరు రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకు అధికారులతో చర్చించాల్సింది పోయి.. రుణం తీసుకోని బ్యాంకుల్లో కొత్తగా ఖాతా ప్రారంభించాలని ఉచిత సలహా ఇస్తుండటం విశేషం. ఈ పరిస్థితుల్లో చాలా మంది రైతులు గిట్టుబాటు ధర లభించకపోయినా సరే బయట మార్కెట్లో విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని గిట్టుబాటు ధర ఇవ్వకుండా వ్యాపారులు నిలువునా మోసం చేస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము తప్పని పరిస్థితుల్లో బయట మార్కెట్లో విక్రయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. పౌరసరఫరాల శాఖ నిర్లిప్తత... రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 15.17 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంట సాగుచేశారు. తద్వారా 58.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో వెలుగు గ్రూపు సభ్యుల ద్వారా 591 కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 433, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ద్వారా 45 చొప్పున మొత్తం 1,069 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే రైతుల ఇబ్బందులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కనీసం ఏ జిల్లాలో ఎంత పంట పండిందో కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది నుంచి సరైన వివరాలు కూడా సేకరించలేదంటే వారి పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఎండబెట్టుకునేందుకు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ శాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయమై చొరవ తీసుకుని తరచూ సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో అంతిమంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి నెలకొంది. -
‘పట్టు’ కోల్పోతున్న రైతులు
పలమనేరు: పలమనేరు మండలం నూనేవారి పల్లెకు చెందిన చెంగన్నగౌడు కుటుం బం పట్టు పురుగుల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. ఎకరా విస్తీర్ణంలో మ ల్బరీ సాగు చేస్తున్నారు. బోరులో నీటి మట్టం తగ్గడంతో అతికష్టం మీద పం టకు అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏ డాదిగా పట్టుగూళ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దానికితోడు పంటల దిగుబడి కూడా తగ్గుతోంది. ప్రస్తుతం ఆ రైతు వందమట్టి మేపగా 45 కిలోల గూళ్లొచ్చాయి. వీటిని మార్కెట్‌కు తీసుకొస్తే రూ.10వేలు వచ్చింది. ఇందులో ఖర్చు రూ.ఏడు వేలు పోతే నెల కష్టం మూడు వేలు మాత్రమే మిగిలింది. ఇదే మండలంలోని కన్నమాకులపల్లెకు చెం దిన శివ కూడా మార్కెట్‌కు గూళ్లను తీసుకొచ్చాడు. ధరలు తగ్గుముఖం పట్టడంతో ఏ మాత్రమూ గిట్టుబాటు కావ డం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ పట్టు రైతును కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తాయి. ఉత్పత్తులు తగ్గుతున్నాయి.. పలమనేరు మార్కెట్‌కు సంబంధించి 2011-12 సంవత్సరంలో 360 టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, 2013కు 207 టన్నులు, ప్రస్తుతం 200 టన్నులకు పడిపోయింది. ఇదే పరిస్థితి ఇతర మార్కెట్లోనూ ఉంది. కర్ణాటకలోని రాంనగర్ లో రోజుకు 30 టన్నుల పట్టుగూళ్లు వ చ్చేవి. అలాంటిది ఏడు టన్నులు కూడా రావడం లేదు. అక్కడా అదే పరిస్థితి. ధరలు తగ్గడానికి కారణాలివే.. ధరలు తగ్గడానికి కారణం సిల్క్ వీవింగ్ వ్యాపారులు ముందుకు రాకపోవడమే. దీపావళి సందర్భంగా దేశంలోని సేట్లు వ్యాపార లావాదేవీలను నిలుపుదల చేశారు. ఆషాఢ మాసంతో పెళ్లిళ్ల సీజన్ లేక స్థానిక మార్కెట్లో పట్టుకు డిమాం డ్ తగ్గింది. ఇదే సమయంలో వాతావరణ మార్పుల కారణంగా పంట కూడా దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. తగ్గుతున్న మల్బరీ సాగు విస్తీర్ణం, పంట దిగుబడి.. జిల్లాకు సంబంధించి 26,400 మంది రైతులు 27 వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఇందులో కుప్పం డివి జన్‌లో 10 వేల ఎకరాలు, పలమనేరు డివిజన్లో 9,500 ఎకరాలు సాగవుతోంది. ఎక్కువ మంది రైతులు ఈ ప్రాంతాల్లోనే పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటి 40 శాతం మంది రైతులు పంటను సాగు చేయలేదు. మిగిలిన వాళ్లు కొద్దోగొప్పో సాగుచేసినా వాతావరణ పరిస్థితుల కా రణంగా పంట దిగుబడి తగ్గింది. మా మూలుగా దిగుబడి తగ్గినపుడు ధర పె రగాల్సింది పోయి తగ్గుముఖం పట్టడం రైతులను ఆందోళనపరుస్తోంది. -
జనజాతర
వెంకటగిరిటౌన్: వెంకటగిరి పోలేరమ్మ జాతరకు గురువారం జనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు రావడంతో పట్టణం కిక్కిరిసింది. ఉదయం వర్షం కారణంగా ఓ మోస్తారుగా వచ్చిన జనం 10 గంటల తర్వాత తండోపతండాలుగా రాసాగారు. ఎన్నడూ లేని విధంగా దేవస్థానం నుంచి బజారువీధి మీదుగా ఆంజనేయస్వామి గుడి, మార్కెట్‌వీధి దాటి సుమారు కిలోమీటర్ పైగా ఉచిత దర్శనం క్యూలైన్ నిలిచింది. గ్రామీణుల రాకతో వెంకటగిరి-రాపూరు రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డులో సందడి నెలకొంది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ఘనంగా ముగిసింది. దండాలమ్మా పోలేరమ్మ అంటూ అమ్మవారిని వేడుకుంటూ భక్త కోటి భక్తి పారవశ్యంలో తరించారు. భక్తుల కోలాహలం, యువకుల కేరింతల మధ్య ఊరేగింపు కనుల పండువగా సాగింది. ఊరేగింపు సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్న తపన భక్తుల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. బాణసంచా కాల్పుల మధ్య పోలేరమ్మ తల్లి ఊరేగింపు ముందుకు సాగింది. రెండురోజులుగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు జాతరకు హాజరయ్యారు. వేకువజామున అమ్మవారిని జీనుగులవారి వీధి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన తాత్కాలిక గుడిలో కొలువుదీర్చారు. సాయంత్రం 5.30 గం టల వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం 4కు దున్నపోతును బలిచ్చాక గ్రామ పొలిమేర్ల వద్ద పొలి కార్యక్రమం జరిగింది. అశేష జనవాహిని మధ్య నిమజ్జనం సాయంత్రం అశేష జనవాహిని మధ్య అమ్మవారి నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. బజారువీధి, రాజావీధి, శివాలయంవీధుల మీదుగా ఊరేగింపు జరిగింది. పోలేరమ్మను చివరిగా మిద్దెలపై నుంచి పట్టణంలోని మహిళలు, చిన్నారులు దర్శించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మల్లమ్మగుడి సమీపంలో అమ్మవారి నిమజ్జనం జరి గింది. పోలేరమ్మ మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గట్టి బందోబస్తు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ సెంథిల్ కుమార్ దిశానిర్దేశంలో ఏఎస్పీ రెడ్డి దామోదర్ పర్యవేక్షణలో గూడూరు డీఎస్సీ చౌడేశ్వరి, సీఐ నరసింహరావు, ఎస్ఐలు పీవీ నారాయణ, వేణుగోపాల్‌లు బందోబస్తు నిర్వహించారు. నె ల్లూరు డీఆర్ ఉత్తమ్ అధినేత ధనుంజయరెడ్డి అన్నదానం నిర్వహిం చగా వెంకటగిరి స్టేట్‌బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తాండవ చంద్రశేఖర్, కార్వేటి లక్కరాజు, కె.వెంకటరమణయ్య, ఎన్.పాపయ్యనాయుడు, మంచి మహేష్, అనిల్, కె.నరసింహరావు, ఏజీ సాయికిరణ్, చల్లా శివకుమార్, గోల్లగుంట రా ములు ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
అడవికి నిప్పు
అడవికి నిప్పు పచ్చదనం.. ప్రకృతి రమణీయత మారుపేరు నల్లమల. అణువణువునా హరితవర్ణం పర్చుకున్న అడవి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎర్రని మంటలతో పొగలు కక్కింది. కొమ్మల మాటున సేదతీరిన పక్షులు.. గుహల్లో కునుకుతీసిన జంతువుల హాహాకారాలతో శ్రీశైలం-దోర్నాల మధ్య అటవీ ప్రాంతం అగ్నిగుండాన్ని తలపించింది. , కర్నూలు