పాత చీరలకు కొత్త గిరాకీ
బాల్కొండ : రైతులు తమ పంటలను అడవి పందులు, కోతులు, ఉడుతల బారి నుంచి కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు పాత చీరలను కొనుగోలు చేసి పంటల చుట్టూ కడుతున్నారు. దీంతో పాత చీరలకు కొత్త గిరాకీ ఏర్పడుతోంది. ఆదివారం ఎస్సారెస్పీ కాలనీలో నిర్వహించే సంతలోకి ఆదిలాబాద్ జిల్లా రైతులు తరలి వచ్చి పాత చీరలను కొనుగోలు చేశారు. ఒక్కో చీర రూ. 15 పలికింది. కొందరు రైతులు 100 కుపైగా చీరలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పంటల రక్షణకు పాత చీరలు ఉపయోగపడుతున్నాయని రైతులు పేర్కొన్నారు. ప్రధానంగా మక్క పంటను అడవి పందులనుంచి కాపాడుకోవడానికి చీరలు ఉపయోగ పడుతున్నాయని, చీరల రంగును చూసి అవి బెదిరి పోతున్నాయని పేర్కొంటున్నారు.