ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను అక్టోబర్ 13 నుంచి నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు జగనున్న ఉత్సవాలు నవంబర్ 11న ముగుస్తాయి. ఈ మేరకు పైడితల్లి ఆలయ ఈవో భానురాజ సోమవారం విలేకరులకు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం, నవంబర్ 3న తెప్పోత్సవం, 10న ఉయ్యాల కంబాల, 11న చండీయాగం, పూర్ణాహుతి, దీక్ష విరమణ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
13 నుంచి పైడితల్లి జాతర
Published Mon, Sep 21 2015 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM
Advertisement