మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం
→ 20 లక్షల మంది {పయాణికులను చేరవేయడం లక్ష్యం
→ రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్లు
→ {పత్యేక బస్సులకు త్వరలో చార్జీల {పకటన
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులను పెద్ద ఎత్తున చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తుండగా.. ఇందులో 20 లక్షల మంది బస్సుల్లో ప్రయూణించే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అరుుతే, రాష్ట్ర విభజన నేపథ్యంలో బస్సుల సంఖ్య తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో జాతరకు సరిపడా బస్సులను నడిపించడం సంస్థకు సవాల్‌గా మారనుంది.
2014 జాతర సందర్భంగా ఆర్టీసీ 3,331 బస్సులను ఏర్పాటు చేసింది. గతంతో పోల్చితే ఈసారి దాదాపు 300 బస్సులను ఎక్కువగా నడిపించనుంది. 17, 18వ తేదీల్లో మేడారం వైపు భక్తులు పోటెత్తుతారు. అనంతరం 19, 20 తేదీల్లో మూకుమ్మడిగా లక్షల మంది భక్తులు తిరుగుపయనమవుతారు. ఈ నాలుగు రోజులు ఆర్టీసీకి కీలకం.
⇒ మేడారంలో క్యూలైన్ల వద్ద 700 మంది సెక్యూరిటీ
⇒ సిబ్బందిని నియమిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో
⇒ తాడ్వాయి వద్ద ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి టికెట్లు
⇒ జారీ చేసేందుకు 40 టిమ్స్ బృందాలు ఉంటారుు.
⇒ జాతరకు వచ్చే రూట్‌లో ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాల్లో
⇒ పైలట్ వాహనాలు, క్రేన్లు వినియోగించనున్నారు.
హన్మకొండ : సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు వనజాతర జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ జాతరకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ.. పది జిల్లాల్లో 51 బస్ పాయింట్ల నుంచి 3605 బస్సులను నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో 2014 జాతర సందర్భంగా 3,331 బస్సులును ఏర్పాటు చేసింది. గతంతో పోల్చితే ఈసారి దాదాపు మూ డు వందల బస్సులను ఎక్కువగా నడిపించనుంది. అంతేకాదు భక్తుల రద్దీని బట్టి మరో నాలుగు వందల బస్సులు నడిపించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా నాలుగు వేల బస్సులను జాతర కోసం ప్రత్యేకం గా కేటాయిస్తున్నారు. వీటి ద్వారా జాతరకు వచ్చే భక్తుల్లో ఐదొంతుల మంది అంటే.. 20 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వారం రోజులు రద్దీ ఎక్కువ
సమక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతంది. ఇందులో 17వ తేదీన సారలమ్మను గద్దెకు తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. అయితే, అంతకంటే ముందుగానే భక్తులు మేడారం వచ్చి ఇక్కడ గుడారాలు వేసుకుని ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు నడిపించనుంది. ముఖ్యంగా 17, 18వ తేదీల్లో మేడారం వైపు భక్తులు పోటెత్తి వస్తారు. అనంతరం 19, 20వ తేదీల్లో మూకుమ్మడిగా లక్ష ల మంది భక్తులు తిరుగుపయనమవుతారు. ఈ నాలుగు రోజులు బస్సుల రాకపోకలు సాఫీగా జరిగేలా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో క్యూలైన్ల వద్ద ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా 700 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో టిక్కెట్లు జారీ చేసేందుకు తాడ్వాయి వద్ద ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏకకాలంలో టిక్కెట్లు జారీ చేసేందుకు 40 టిమ్స్ బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. మార్గమధ్యంలో ఎటువంటి ఇబ్బందీ రాకుండా అనుభవజ్ఞులైన డ్రైవర్లకే జాతర విధులు కేటాయిస్తున్నారు. ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాల్లో పైలట్ వాహనాలు, క్రేన్లు వినియోగించాలని నిర్ణయించారు.
జిల్లా నుంచి 2,195 బస్సులు
సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో జిల్లా ప్రజానీకం మొత్తం మేడారంలోనే ఉంటుంది. దీంతో వరంగల్ జిల్లా నుంచి మొత్తం 26 పాయింట్ల ద్వారా 2,195 బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ఏటూరునాగారం, మంగపేట పాయింట్ల నుంచి ఖమ్మం రీజియన్‌కు చెందిన బస్సులను వినియోగిస్తున్నారు. నిజామాబాద్ రీజియన్‌కు చెందిన బస్సులను ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, పస్రా, గోవిందరావుపేట, తాడ్వాయి, గణపురం పాయింట్లకు కేటాయించారు. మిగిలిన బస్ పాయింట్ల నుంచి వరంగల్ రీజియన్‌కు చెందిన బస్సులు అందుబాటులో ఉంటాయి.
3605 బస్సులు
Published Thu, Jan 21 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
Advertisement
Advertisement