sammakka-saralamma
-
మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతర శనివారం సాయంత్రం ముగిసినప్పటికీ ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగిసిన క్రమంలో అమ్మవార్ల గద్దెల ఐలాండ్ వరకు భక్తుల వాహనాలకు అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సులు కూడా ఐలాండ్ వరకు వెళ్లాయి. కలెక్టర్ కృష్ణ ఆదిత్య కుటుంబ సభ్యులు అమ్మవార్లను దర్శించుకున్నారు. -
నిధులున్నా.. పనులేవీ...
మొదలుకాని జంపన్నవాగు చెక్‌డ్యాంల నిర్మాణం జాతర సమయంలోనే హడావుడి గతంలో స్నానఘట్టాల్లోనూ ఇదే తీరు ఆలస్యమైతే మరో రెండేళ్లు నిరీక్షణే.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా జంపన్నవాగులో నిర్మించాల్సిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గత ఏడాది డిసెంబర్ లో ఈ చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం పాలన అనుమతి మంజూరు చేసింది. జాతర సమయానికే పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నెల గడిచినా ఇంత వరకు ఉలుకూపలుకు లేదు. ఈ పనులు చేపట్టాల్సిన చిన్ననీటి పారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. హన్మకొండ : తాడ్వారుు మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు జంపన్న వాగులో తప్పనిసరిగా స్నానం చేస్తారు. ఈ వాగు ఒడ్డునే తల నీలాలు సమర్పిస్తారు. జంపన్నవాగులో వర్షాకాలం మినహా మిగిలిన సమయాల్లో స్నానం చేసేందుకు సరిపడా నీరు ప్రవహించదు. జాతర జరిగే సమయంలో లక్నవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా జంపన్నవాగులోకి చేరిన నీటిలో భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఇసుక కట్టలతో తాత్కాలిక చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు 2016 జాతర కల్లా జంపన్నవాగులో పుణ్యస్నాణాలు చేసేందుకు వీలుగా జంపన్నవాగులో చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 13.96 కోట్ల నిధులు మంజూరు చేస్తూ 2015 డిసెంబరు 21న ఉత్తర్వులు జారీ చేసింది. యుద్ధప్రతిపాదికన చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించి జాతర సమయానికి కల్లా పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జాతర ముగిసినా.. జంపన్నవాగుపై ఊరట్టం, పడిగాపూర్, రెడ్డిగూడెం, మేడారం వద్ద నాలుగు చెక్‌డ్యాంలు నిర్మిం చాల్సి ఉంది. జాతర సమయానికి నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించినా ఉత్తర్వులు విడుదలైన రోజు నుంచి జాతర వరకు అందుబాటులో ఉన్న 57 రోజుల వ్యవధిలో టెండర్లు నిర్వహించినా పనులు పూర్తి చేయలేమని చిన్ననీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేశారు. జాతర ముగి సిన తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. జా తర ముగిసి నెల గడుస్తున్నా ఇంతవరకు చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ఉలుకుపలుకు లేకుండా పోయింది. జాతర ముగిసి నెల దాటిన టెండర్ల నిర్వహించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈ చెక్‌డ్యాంల టెండర్లు ని ర్వహించేందుకు సాంకేతిక మంజూరు కోసం ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గతంలో ఇదే తంతు 2014 మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగు వెంట ఊరట్టం, రెడ్డిగూడెం సమీపంలో స్నానఘట్టాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు రెండు విడతల్లో చేపట్టాలని పేర్కొంది. దీని ప్రకారం జాతరకు ముందు రెడ్డిగూడెం, ఊరట్టం కాజ్వే వద్ద తొలి విడత పనులు చేపట్టారు. జాతర ముగిసిన తర్వాత ఊరట్టం కాజ్వే, చిలకలగుట్ట వద్ద రూ.10 కోట్లతో చేపట్టాల్సిన పనులను ప్రారంభించలేదు. రెండేళ్ల తర్వాత 2016 జాతర సందర్భంగా మంజూరైన నిధులతోనే రెండో విడత స్నానఘట్టాల పనులు పూర్తి చేశారు. గతంలో స్నానఘట్టాల విషయంలో జరిగినట్లుగానే చెక్‌డ్యామ్‌ల విషయంలో ఆలస్యం జరిగేందుకు ఆస్కారం ఉందని భక్తులు సందేహిస్తున్నారు. గతంలో పోల్చితే సమ్మక్క-సారలమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారాలు, సెలవు దినాల్లో వందల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ఈ వేసవిలో ప్రారంభమైతే వర్షకాలం వరకు పూర్తవుతుంది. చెక్‌డ్యామ్‌లలో నిల్వ ఉండే నీరు ఇటు రైతులకు ఉపయోగపడటమే కాకుండా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అక్కరకు వచ్చేది. -
వన దేవత.. జన జాతర
మేడారానికి పోటెత్తిన భక్తజనం ♦ ఒక్కరోజే 40 లక్షల మంది రాక ♦ గత రెండు నెలలుగా కోటి మంది సందర్శన ♦ నేటితో ముగియనున్న మహా జాతర సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం జనసంద్రమైంది.. వన దేవతలకు మొక్కుల కోసం వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. ‘సమ్మక్క కో.. సారక్క కో’ అంటూ భక్తుల జయజయధ్వానాలు.. శివసత్తుల పూనకాలతో దద్దరిల్లింది. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం(బెల్లం), ఎదురు కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు.. ఇలా తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ ప్రసాదం(బెల్లం) కోసం పోటీపడ్డారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ బంగారం ప్రసాదాన్ని భక్తులకు అందించలేదు. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువు దీరి ఉండడం.. పవిత్ర మాఘ శుద్ధ శుక్రవారం కావడంతో ఈ ఒక్కరోజే 40 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గత 2 నెలలుగా మేడారానికి ఇప్పటి వరకు కోటి మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు. నేటితో జాతర ముగింపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు 1.10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ గత జాతర కంటే ఈసారి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. జాతరకు 2 నెలల ముందు నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మొదలైన 17 నుంచి భక్తుల రాక బాగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నుంచి భక్తులు తరలివచ్చారు. గిరిజను లు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలకు మొక్కులు చెల్లించారు. నేటి(శనివారం) సాయంత్రం జాతర ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. వీఐపీల రాక.. భక్తులకు ఇబ్బందులు! వన దేవతలకు మొక్కులు సమర్పించేందుకు భక్తులు గురువారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో నిల్చున్నారు. శుక్రవారం ఉదయం వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండానే దర్శనం జరిగింది. గరిష్టంగా గంట సమయంలో దర్శనం ముగించుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి వీఐపీల రాక ప్రారంభం కావడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పలువురు మం త్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మేడారం చేరుకున్నారు. అయితే ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం తెలియగానే వీరంతా మేడారం గద్దెల వద్ద దర్శనానికి క్యూ కట్టారు. పోలీసులు, అధికారులు వీరికే ప్రాధాన్యం ఇవ్వడంతో భక్తులు రెండు గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. పలువురు ప్రజాప్రతినిధులు రెండుమూడు కార్లలో అనుచరులను వెంట బెట్టుకుని గద్దెల వద్దకు వెళ్లడంతో సాధారణ భక్తుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం కార్యాలయ స్టిక్కర్‌తో వచ్చిన కారు గద్దెల ముందే గంటలపాటు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎ. చందూలాల్, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీలు ఎ.సీతారాంనాయక్, పసునూరి దయాకర్, గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కల్వకుంట విద్యాసాగర్‌రావు, పుట్టా మధు, బి.శంకర్‌నాయక్, హన్మంత్ షిండే, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే బాబూమోహన్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ అనురాగ్‌శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు శుక్రవారం మొక్కులు సమర్పిం చుకున్నారు. అమ్మల దీవెనతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తా: మేయర్ రామ్మోహన్ మేడారం సమ్మక్క-సారలమ్మల దీవెనలతో హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తానని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం(92కిలోలు) సమర్పించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా బిడ్డనైన తాను హైదరాబాద్ నగర మేయర్‌గా ఎంపిక కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అశీర్వాదంతో పాటు మేడారం తల్లుల దీవెనలే కారణమన్నారు. సీఎం మేడారం పర్యటన రద్దు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడారం పర్యటన రద్దయింది. శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక హెలి కాప్టర్లో మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంది. సీఎం పర్యటనకు అధికార యం త్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. మేడారం పర్యటన తర్వాత వరంగల్‌లోని ఇంక్యుబేషన్ టవర్స్‌లో ఐటీ కాంప్లెక్స్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ జ్వరం కారణంగా సీఎం ఈ పర్యటనకు వెళ్లలేకపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. తల్లుల నీడలో ప్రసవం మహాజాతరలో జన్మించిన మరో సమ్మక్క మేడారం బృందం: మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలపై కొలువుదీరిన వేళ.. తల్లుల నీడలోనే ప్రసవించాలన్న ఓ మహిళ కల నెరవేరింది. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన కందుకూరి జ్యోతి తొమ్మిది నెలల గర్భంతో మేడారం వచ్చింది. అక్కడే ప్రసవిస్తే బాగుండు అనుకుంది. ఆమెకు శుక్రవారం పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు సమీపంలోని మెగా వైద్యశిబిరానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దీప్తి, కీర్తి, సిబ్బంది సుందరి, మనోహరరాణి పర్యవేక్షణలో జ్యోతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఆర్డీ నాగేశ్వర్రావు తెలిపారు. అమ్మల దర్శనం అదృష్టం తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి: బాలకృష్ణ ములుగు: సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన మేడారానికి వచ్చారు. దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు-కుంకుమలు, కొబ్బరికాయ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కోటి మంది హాజరయ్యే జాతరలో తాను ఓ భక్తుడిని కావడం సంతోషకరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ తరపున చందూలాల్ మొక్కులు అమ్మవారికి 56 కిలోల బంగారం సమర్పణ ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దవడంతో ఆయ న తరఫున గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ శుక్రవారం మొక్కు సమర్పించారు. 56 కిలోల బంగారం(బెల్లం) తులాభారం వేసి సమ్మక్క, సారలమ్మ తల్లులకు సమర్పించారు. అనంతరం అమ్మల గద్దెల నుంచి బంగారం తీసుకున్నారు. రెండు, మూడ్రోజుల్లో అమ్మవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందిస్తానని చందూలాల్ తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవతలను కోరుకున్నట్లు తెలిపారు. (ఫొటోల కోసం క్లిక్ చేయండి) -
అమ్మల దర్శనం.. అదృష్టం - బాలకృష్ణ
తల్లుల కరుణతో తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ములుగు (వరంగల్) : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. భార్య వసుంధరాదేవి, సోదరి ఉమామహేశ్వరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన మేడారానికి వచ్చారు. ఈ సందర్భంగా జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాక లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలకృష్ణ సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు-కుంకుమలు, కొబ్బరికాయ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కోటి మంది హాజరయ్యే జాతరలో తాను ఓ భక్తుడిని కావడం సంతోషకరమని అన్నారు.అనంతరం ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జాతర నిర్వహణ, చరిత్ర వివరాలు తెలుసుకున్నారు. -
సమ్మక్క జాతరలో రూ.20 వేలు చోరీ
సమ్మక్క జాతరలో రూ.20 వేలు చోరీ కోల్‌సిటీ : గోదావరిఖని శివారులో గోదావరి వంతెన సమీపంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు ఓ భక్తుడి నుంచి రూ.20 వేలు దోచుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా మద్దిపల్లి గ్రామానికి చెందిన మద్దిపెల్లి మల్లయ్య అనే బియ్యం వ్యాపారి జాతరకు వచ్చాడు. తన జేబులో ఉన్న రూ.20 వేలు గుర్తుతెలియని వ్యక్తులు సినీఫక్కీలో దోచుకుపోయారు. డబ్బులు చోరీ కావడం పై ఆందోళనకు గురైన బాధితుడు జా తరలోని కంట్రోల్ రూం పోలీసులకు తెలిపాడు. జాతరలో దొంగలు తిరుగుతున్నారనే విషయం తెలిసిన పోలీ సులు అప్రమత్తమయ్యారు. అనుమా నం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. -
నేడు జిల్లాకు సీఎం కేసీఆర్
హన్మకొండ అర్బన్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైంది. సీఎం కేసీఆర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. మేడారం జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడంతో పాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొం టారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఉదయం 11-50 గంటలకు బయలుదేరనున్న కేసీఆర్ బేగంపేట విమానాశ్రయూనికి చేరుకుని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు మేడారం వస్తారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండ నగర శివారు మడికొండకు చేరుకుంటారు. మడికొండలోని ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఇక్కడ జరిగే సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. -
3605 బస్సులు
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం → 20 లక్షల మంది {పయాణికులను చేరవేయడం లక్ష్యం → రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్లు → {పత్యేక బస్సులకు త్వరలో చార్జీల {పకటన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులను పెద్ద ఎత్తున చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తుండగా.. ఇందులో 20 లక్షల మంది బస్సుల్లో ప్రయూణించే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అరుుతే, రాష్ట్ర విభజన నేపథ్యంలో బస్సుల సంఖ్య తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో జాతరకు సరిపడా బస్సులను నడిపించడం సంస్థకు సవాల్‌గా మారనుంది. 2014 జాతర సందర్భంగా ఆర్టీసీ 3,331 బస్సులను ఏర్పాటు చేసింది. గతంతో పోల్చితే ఈసారి దాదాపు 300 బస్సులను ఎక్కువగా నడిపించనుంది. 17, 18వ తేదీల్లో మేడారం వైపు భక్తులు పోటెత్తుతారు. అనంతరం 19, 20 తేదీల్లో మూకుమ్మడిగా లక్షల మంది భక్తులు తిరుగుపయనమవుతారు. ఈ నాలుగు రోజులు ఆర్టీసీకి కీలకం. ⇒ మేడారంలో క్యూలైన్ల వద్ద 700 మంది సెక్యూరిటీ ⇒ సిబ్బందిని నియమిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ⇒ తాడ్వాయి వద్ద ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి టికెట్లు ⇒ జారీ చేసేందుకు 40 టిమ్స్ బృందాలు ఉంటారుు. ⇒ జాతరకు వచ్చే రూట్లో ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాల్లో ⇒ పైలట్ వాహనాలు, క్రేన్లు వినియోగించనున్నారు. హన్మకొండ : సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు వనజాతర జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ జాతరకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ.. పది జిల్లాల్లో 51 బస్ పాయింట్ల నుంచి 3605 బస్సులను నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో 2014 జాతర సందర్భంగా 3,331 బస్సులును ఏర్పాటు చేసింది. గతంతో పోల్చితే ఈసారి దాదాపు మూ డు వందల బస్సులను ఎక్కువగా నడిపించనుంది. అంతేకాదు భక్తుల రద్దీని బట్టి మరో నాలుగు వందల బస్సులు నడిపించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా నాలుగు వేల బస్సులను జాతర కోసం ప్రత్యేకం గా కేటాయిస్తున్నారు. వీటి ద్వారా జాతరకు వచ్చే భక్తుల్లో ఐదొంతుల మంది అంటే.. 20 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారం రోజులు రద్దీ ఎక్కువ సమక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతంది. ఇందులో 17వ తేదీన సారలమ్మను గద్దెకు తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. అయితే, అంతకంటే ముందుగానే భక్తులు మేడారం వచ్చి ఇక్కడ గుడారాలు వేసుకుని ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఫిబ్రవరి 14 నుంచి 21 వరకు నడిపించనుంది. ముఖ్యంగా 17, 18వ తేదీల్లో మేడారం వైపు భక్తులు పోటెత్తి వస్తారు. అనంతరం 19, 20వ తేదీల్లో మూకుమ్మడిగా లక్ష ల మంది భక్తులు తిరుగుపయనమవుతారు. ఈ నాలుగు రోజులు బస్సుల రాకపోకలు సాఫీగా జరిగేలా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో క్యూలైన్ల వద్ద ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా 700 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో టిక్కెట్లు జారీ చేసేందుకు తాడ్వాయి వద్ద ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏకకాలంలో టిక్కెట్లు జారీ చేసేందుకు 40 టిమ్స్ బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. మార్గమధ్యంలో ఎటువంటి ఇబ్బందీ రాకుండా అనుభవజ్ఞులైన డ్రైవర్లకే జాతర విధులు కేటాయిస్తున్నారు. ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాల్లో పైలట్ వాహనాలు, క్రేన్లు వినియోగించాలని నిర్ణయించారు. జిల్లా నుంచి 2,195 బస్సులు సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో జిల్లా ప్రజానీకం మొత్తం మేడారంలోనే ఉంటుంది. దీంతో వరంగల్ జిల్లా నుంచి మొత్తం 26 పాయింట్ల ద్వారా 2,195 బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ఏటూరునాగారం, మంగపేట పాయింట్ల నుంచి ఖమ్మం రీజియన్‌కు చెందిన బస్సులను వినియోగిస్తున్నారు. నిజామాబాద్ రీజియన్‌కు చెందిన బస్సులను ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, పస్రా, గోవిందరావుపేట, తాడ్వాయి, గణపురం పాయింట్లకు కేటాయించారు. మిగిలిన బస్ పాయింట్ల నుంచి వరంగల్ రీజియన్‌కు చెందిన బస్సులు అందుబాటులో ఉంటాయి. -
మణుగూరులో మతలబేంది..
మేడారం జాతర టెండర్ల ప్రక్రియను.. మేడారంలో లేదా, మండలం కేంద్రం తాడ్వాయిలో గానీ, డివిజన్ కేంద్రం ములుగులోనైనా, జిల్లా కేంద్రం వరంగల్‌లో నిర్వహించకుండా ఖమ్మం జిల్లా మణుగూరును ఎంచుకున్నారు. వరంగల్ మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. బెల్లం సేకరణ టెండర్ల ప్రక్రియను అధికారులు హడావుడిగా.. రహస్యంగా నిర్వహిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వన దేవతలను దర్శించుకునే భక్తులు మొక్కుల రూపంలో అమ్మవార్ల గద్దెల వద్ద బంగారం(బెల్లం) సమర్పిస్తారు. జాతర సమయంలో వేల క్వింటాళ్ల బెల్లం గద్దెల ప్రాంగణంలో పోగవుతుంది. ఇలా పోగైన బెల్లాన్ని అక్కడి నుంచి తొలగిస్తూ ఎప్పటికప్పుడు గద్దెల ప్రాంగణాన్ని శుభ్రపరచడం కష్టమైన పనిగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మొదటి సారిగా 2012 జాతర సమయంలో వనదేవతలను దర్శించుకున్న భక్తులకు బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని పాలనా యంత్రాం గం నిర్ణయించింది. గద్దెల వద్ద భక్తులు సమర్పించిన బెల్లాన్ని పోగు చేసి అక్కడి నుంచి తీసుకుపోవడం, భక్తులకు ప్రసాదంగా బెల్లాన్ని ఇవ్వడం పనులను టెండరు పద్ధతిలో ఏజెన్సీ ప్రాంతంలోని యువజన సంఘాలకు అప్పగించారు. అప్పటి జాతరలో బెల్లం పోగుచేసే టెండర్ పొందిన కాంట్రాక్టర్‌కు ఊహించిన విధంగా లాభాలు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన మరి కొంత మంది 2014 జాతర సమయంలో ఈ పనులను దక్కించుకునేందుకు ప్రయత్నించారు. రాజకీయంగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. గత జాతరలో బెల్లం సేకరణ పనులు దక్కించుకున్న బృందానికి ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవు. లాభదాయకమైన ఈ టెండరును పొందేందుకు వ్యూహాలు రచించారు. పోటీ లేకుండా పనులు దక్కించుకునేలా దేవాదాయ శాఖ అధికారులతో అవగాహన కుదుర్చుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు మరింత ముందుడుగు వేశారు. గత జాతరలో కేవలం రూ.1.60లక్షలకు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పెద్ద మొత్తంలో లాభాలు రావడంతో ఈ వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. పక్క జిల్లాలో టెండర్లు మేడారం జాతర టెండర్ల ప్రక్రియను.. మేడారంలోగానీ, మండలం కేంద్రం తాడ్వాయిలో గానీ, డివిజన్ కేంద్రం ములుగులో గానీ, జిల్లా కేంద్రం వరంగల్‌లో గానీ నిర్వహించకుండా ఖమ్మం జిల్లాను ఎంచుకున్నారు. మణుగూరు పట్టణం శివలింగాపూర్లోని శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయంలో బుధవారం(జనవరి 13న) బెల్లం పోగుచేసే టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మేడారంతో ఎలాంటి సంబంధమూలేని మణుగూరు లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే దేవాదాయ శాఖ అధికారులు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మాదిరిగా వరంగల్ జిల్లా కేంద్రంలో టెండర్లు నిర్వహిస్తే ఎక్కువ మంది పోటీపడేవారని, దీని వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం వచ్చేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మేడారం జాతర ఏర్పాట్ల పనుల కోసం ఇప్పటివరకు నిర్వహించిన టెండర్లన్నీ ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో నిర్వహించారు. దేవాదాయ శాఖ బాక్సు టెండర్లను నిర్వహించినా జిల్లాలోనే జరిగాయి. ఇప్పడు టెండరు ప్రక్రియ ఒకేసారి పక్క జిల్లాకు మార్చడం చర్చనీయాంశంమైంది. మరోవైపు హడావుడిగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. మేడారం జాతర జరిగే తేదీ ఏడాది క్రితమే నిర్ణయమైంది. ఇన్నాళ్లూ పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు... జాతర దగ్గరపడుతున్న సమయంలో టెండరు ప్రక్రియను చేపట్టారు. అంతా వారంలోపే పూర్తయ్యేలా హడావుడిగా పూర్తి చే స్తుస్తుండడంతో దేవాదాయ శాఖపై విమర్శలు వస్తున్నారుు. -
జన జాతర
జిల్లాలోని పలు ‘మినీ మేడారం’ జాతరలలో గురువారం భక్తులు పోటెత్తారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం; బయ్యారం మండలంలోని నంది మేడారం, నామాలపాడు; మణుగూరు మండలంలోని తోగ్గూడెం; కామేపల్లి మండలంలోని పండితాపురంలో ‘మినీ మేడారం’ వేడుకలు జరిగాయి. బొజ్జాయిగూడెం (ఇల్లెందు), న్యూస్‌లైన్: ‘మినీ మేడారం’ బొజ్జాయిగూడెం వనంలో గురువారం మధ్యాహ్నం నుంచే జనం పోటెత్తారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క ఆగమనంతో భక్తులు భక్తిపరవశులయ్యారు. గురువారం సాయంత్రం గంటలు 5:05 గంటలకు సమ్మక్కను గిరిజన పూజారులు, వడ్డెలు బొజ్జాయిగూడెం సమీపంలోని ముసలమ్మ గుట్టల నుంచి వనానికి తీసుకొచ్చారు. అనేకమంది భక్తులు బంగారం (బెల్లం) చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు నెరవేర్చాలని దేవతను వేడుకుంటూ గద్దెల వద్దనున్న చెట్టుకు ముడుపులు కట్టారు. మరికొంత మందరు జంతువులను బలి ఇచ్చారు. ఇం కొందరు తల నీలాలు సమర్పించారు. సమ్మక్క రాక కోసం గంటలతరబడి నిరీక్షిం చారు. జాతరలోని దుకాణాలు కిటకిటలాడాయి. కొందరు భక్తులు పూనకాలతో తూలారు. ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తోగ్గూడెంలో.. మణుగూరు: మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామ సమీపంలోని రథం గుట్ట అటవీ ప్రాంతం జనసంద్రమైంది. సమ్మక్కను గురవారం సాయంత్రం గిరిజన పూజారులు గద్దెనెక్కించారు. జాతరకు మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. వైఎస్సార్ సీపీ నేత పాయం దంపతులు పూజలు చేశారు. -
వనజాతరకు ప్లాస్టిక్ ముప్పు
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : ప్రతి రెండేళ్లకోసారి అత్యంత ఘనంగా జరిగే మేడా రం జాతరను ప్లాస్టిక్ ముప్పు వెంటాడుతోంది. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యతో సమానంగా జాతరలో ప్లాస్టిక్ వాడకం పెరుగుతోంది. ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్న పాలిథిన్ కవర్లు, గ్లాసుల కారణంగా జాతర పరిసరాలు కలుషితమై పోతున్నాయి. వాటిని నియంత్రించలేక అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అన్నిటికీ పాలిథిన్ కవర్లే గత జాతరకు 80లక్షల మంది హాజరైనట్టు అంచనా. మూడు రోజులపాటు జరిగిన జాతరలో కొబ్బరికాయలు తీసుకెళ్ల డం నుంచి అన్నింటికీ పాలిథిన్ కవర్లనే అధికంగా వినియోగించడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోయా యి. అలా పోగైన చెత్త అక్షరాలా ఇరవై టన్నుల పైమాటేనని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. ఈసారి మరింత పెరిగే అవకాశం ఈసారి మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయం గా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈసారి భక్తుల సంఖ్య కోటి దాటుతుందని అంచనావేస్తున్నారు. ఫలితంగా ప్లాస్టిక్ వినియోగం కూడా పెద్ద ఎత్తున ఉంటుందని, ఇదే జరిగితే ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టల్లా పేరుకుపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈసారి జాతరలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినట్టు చెబుతున్న అధికారులు దానిని పకడ్బందీగా అమలు చేయగలిగితే పాలిథిన్ కవర్ల వాడకాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పేపర్ బ్యాగులతో ప్లాస్టిక్‌కు చెక్ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను తరిమికొట్టేందుకు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని పర్యావర ణ ప్రేమికులు కోరుతున్నారు. జాతరలో ప్లాస్టిక్ వాడకానికి అడ్డుకట్ట వేయాలంటే మొదట పేపరు బ్యాగులను ప్రోత్సహించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే పేపరు, జూట్ బ్యాగులు, గ్లాసులు తయారుచేసే కుటీర పరిశ్రమల యజ మానులతో సమావేశం నిర్వహించాలి. కోటిమందికి పైగా సరిపడే బ్యాగులను తయారుచేయించాలి. ఇందుకోసం వారికి రుణ సదుపాయం కల్పించాలి. అంతేతప్ప జాతర సమయం సమీపిస్తున్న తరుణంలో అవగాహన సదస్సులు, ప్రకటనలు జారీచేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలనే వాడాలని నిర్వహించిన చైతన్య కార్యక్రమాలు, ప్రచారం కారణంగా ప్రజల్లో వచ్చిన మార్పును స్ఫూర్తిగా తీసుకుని ఆ దిశగా కృషిచేస్తే మంచి ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.