
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతర శనివారం సాయంత్రం ముగిసినప్పటికీ ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ముగిసిన క్రమంలో అమ్మవార్ల గద్దెల ఐలాండ్ వరకు భక్తుల వాహనాలకు అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్సులు కూడా ఐలాండ్ వరకు వెళ్లాయి. కలెక్టర్ కృష్ణ ఆదిత్య కుటుంబ సభ్యులు అమ్మవార్లను దర్శించుకున్నారు.