బంగారం ఎత్తుకుని గద్దెల వద్ద గంటలు కొడుతున్న మంత్రులు పొంగులేటి, సీతక్క తదితరులు
ఏటూరునాగారం/ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం జాతరకు చేసిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తామని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను సోమవారం దర్శించుకున్న అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు.
జాతరకు డబ్బు లేదనకుండా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వం జాతరకు మూడు వేల బస్సులను నడిపితే.. ఈ ప్రభుత్వం ఆరువేల బస్సులు నడుపుతోందన్నారు. ఇప్పటివరకు వనదేవతలను 17 లక్షల మంది మహిళలు దర్శించుకున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ రానంతమంది ఈసారి జాతరకు వచ్చిపోతున్నారని, వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. క్రమశిక్షణ, స్వీయ రక్షణతో జాతరకు వచ్చివెళ్లాలని, వాహనాలను ఓవర్‌టేక్ చేసి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment