గోదావరిఖని శివారులో గోదావరి వంతెన సమీపంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు.............
సమ్మక్క జాతరలో రూ.20 వేలు చోరీ
కోల్‌సిటీ : గోదావరిఖని శివారులో గోదావరి వంతెన సమీపంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు ఓ భక్తుడి నుంచి రూ.20 వేలు దోచుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా మద్దిపల్లి గ్రామానికి చెందిన మద్దిపెల్లి మల్లయ్య అనే బియ్యం వ్యాపారి జాతరకు వచ్చాడు. తన జేబులో ఉన్న రూ.20 వేలు గుర్తుతెలియని వ్యక్తులు సినీఫక్కీలో దోచుకుపోయారు. డబ్బులు చోరీ కావడం పై ఆందోళనకు గురైన బాధితుడు జా తరలోని కంట్రోల్ రూం పోలీసులకు తెలిపాడు. జాతరలో దొంగలు తిరుగుతున్నారనే విషయం తెలిసిన పోలీ సులు అప్రమత్తమయ్యారు. అనుమా నం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.