10వ తేదీలోగా పనుల పూర్తికి నాది పూచీ భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం ట్రాఫిక్ ఇబ్బందులు రావొద్దనే ‘వన్ వే’
జాతర విధుల్లో 12వేల మంది పోలీసులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం : మంత్రి ఐకే.రెడ్డి
ఇప్పటికే జాతర వాతావరణం : మంత్రి చందూలాల్ మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
ములుగు : తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారి జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సి ద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి బుధవారం మేడారం వచ్చిన ఆయన తొలుత అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా పనుల వివరా లు ఆరా తీశారు. జాతర పనులను జనవరి 31వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినా.. భక్తు ల రద్దీ కారణంగా సాధ్యం కాలేదని తెలిపారు. అరుుతే, కొన్ని శాఖల పనులు పూర్తి కాగా.. మిగిలినవి 10వ తేదీ వరకు పూర్తి చేయనున్న ట్లు వెల్లడించారు. పనులు పూర్తి చేరుుంచే పూచీ తనదని శ్రీహరి పేర్కొన్నారు. ఈసారి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు.
10వ తేదీన నీళ్లు వదలాలి..
భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా ఈ నెల 10వ తేదీన లక్నవరం నీళ్లను జంపన్న వాగులోకి వదలాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నీళ్లు జంపన్నవాగుకు 13వ తేదీ వరకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఇక 16వ తేదీ సాయంత్రం నిల్వ ఉన్న నీటిని పూర్తిగా కిందికి పంపించి శుభ్రమైన నీటిని మళ్లీ అందించాలని సూచించారు. స్వరాష్ట్రంలో జరుగుతున్న తొలిజాతర అరుునందున విజయవంతమయ్యేలా అధికార యంత్రాంగం కృషి చేయూలని ప్రభుత్వం తరపున కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. కాగా, సారి ప్రత్యేకంగా జాతర తర్వాత వారం పాటు జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉండి పారిశుద్ధ్యం, తదితర పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం జాతర వివరాలు తెలిపేలా జేసీ జీవన్ ప్రశాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను ఆవిష్కరించారు.
పుష్కరాల తరహాలో షటిల్ : డిప్యూటీ సీఎం శ్రీహరి
ఖమ్మం, ఏటూరునాగారం నుంచి వచ్చే భక్తుల వాహనాలను తాడ్వాయి సమీపంలో నిలిపి షటిల్ బస్సుల ద్వారా పుష్కరాల మాదిరిగా మేడారం తరలిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. జాతర పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక హన్మకొండ-ములుగు మీదుగా వచ్చే ప్రైవేట్ వాహనాలను పస్రా మీదుగా నార్లాపూర్‌కు తరలిస్తామని అన్నారు. తిరుగుప్రయాణంలో నార్లాపురం-దూదేకులపల్లి మీదుగా భూపాలపల్లికి మళ్లిస్తామని వివరించారు. దీని వల్ల కొంత దూరం పెరి గినా భక్తులు ఇబ్బంది పడొద్దన్న భావనతోనే ‘వన్ వే’ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 3,605 బస్సులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 24గంటల విద్యుత్ సరఫరా కోసం కమలాపురం-తాడ్వాయి ఫీడర్ సిద్ధం చేశామని వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ ఆధ్వర్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రతీ మేడారం జాతరలో పోలీ సులు, ఇతర అధికారులు.. జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారని పలువురు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఐకే.రెడ్డి.. గత జాతరలో సమైక్యాంధ్ర పోలీసులు ఉన్నారని.. ఈసారి మన పోలీసులే అరుునందున అలా జరగదని పేర్కొన్నారు. ఇంతలో కడియం శ్రీహరి జోక్యం చేసుకుని జర్నలిస్టులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తామని తెలిపారు.
ఆరు నెలల క్రితమే ప్రణాళిక : ఐకే.రెడ్డి
మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మామూలు సమయాల్లో సైతం భక్తులు వస్తున్న కారణంగా మేడారంలో పర్మినెంట్‌గా ఈఓ కార్యాలయాన్ని ఏర్నాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈసారి జాతరకు కోటి 25లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఇప్పటికే మేడారంలో జాతర వాతావరణం నెలకొందని తెలిపా రు. అలాగే, భక్తుల అవసరాలకు అన్ని సౌకర్యాల క ల్పన కూడా దాదాపుగా పూర్తరుుందన్నారు. కాగా, మేడారం జాతర పునరుద్దరణ కమిటీలో కేవలం ఒక్కరే గిరిజనుడికి అవకాశం కల్పించడంపై ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ కమిటీ ఏర్పాటుకు రిజర్వేషన్లు ఉంటాయని, నిబంధనల ప్రకారమే పునరుద్ధరణ కమిటీ నియమించామని అన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ. డీఐజీ మల్లారెడ్డి. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ పాటిల్, ఏఎస్పీ విశ్వజిత్. ఆర్డీఓ మహేందర్‌జీ, ఐటీడీఏ పీఓ అమేయ్‌కుమార్, ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జాతరకు సర్వం సిద్ధం
Published Thu, Feb 4 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement