నేటి నుంచి పెద్దగట్టు జాతర | Today's fair to draw attention | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పెద్దగట్టు జాతర

Published Sun, Feb 8 2015 6:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

Today's fair to draw attention

  • ఐదు రోజులపాటు లింగమంతులస్వామి ఉత్సవాలు..  
  • సూర్యాపేట: నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. వంద ఏళ్ల చరిత్ర గల ఈ జాతరను రెండేళ్ల కొకసారి ఐదు రోజులపాటు జరుపుకొంటారు. తెలంగాణ తోపాటు, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఆది వారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణతో ప్రారంభమయ్యే ఈ జాతర.. 12వ తేదీ మకర తోరణం తరలింపుతో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి జాతర కావడంతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు ఇతర ప్రముఖలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ జాతరకు సుమారు 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement