
మాట్లాడుతున్న నాయకులు
మందమర్రి : చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకుడు సంజయ్‌కుమార్ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జె.రవీందర్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.850 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు చేపట్టారని అన్నారు. అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. నాయకులు మల్లేశ్, నర్సింగ్, భట్టు రాజ్‌కుమార్, వాసాల శంకర్, తోట సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment