కమ్మని అరటి..తినేందుకు పోటీ!
కోడుమూరు రూరల్: యువకులంతా ఆబగా అరటిపండ్లు తింటున్నారేమిటి అనుకుంటున్నారా.. ఇది ఒక సరదా పోటీ. శ్రీచౌడేశ్వరీ దేవి తిరుణాలను పురస్కరించుకొని కోడుమూరులో శనివారం నిర్వహించారు. అల్లీనగరానికి చెందిన బాలు అనే యువకుడు 41అరటిపండ్లు తిని మొదటి స్థానంలో నిలువగా, చనుగొండ్లకు చెందిన తిప్పయ్య.. 33 అరటిపండ్లు తిని రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. తిరుణాల్లో భాగంగా 5కిలోమీటర్ల పరుగుపందెం నిర్వహించారు. రైనాపురం నరసింహుడు, చనుగొండ్ల గోపాల్, రుద్రప్ప.. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందారు. కబడ్డీ పోటీలను సైతం నిర్వహించారు. విజేతలకు గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ కేఈ.మల్లికార్జునగౌడ్..బహుమతులు ప్రదానం చేశారు.