బండలాగుడు పోటీలతో జాతరకు వన్నె
బండలాగుడు పోటీలతో జాతరకు వన్నె
Published Wed, Jan 18 2017 10:40 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి
–ముగిసిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) ఎంతో చారిత్రాత్మకమైనవనీ, బండలాగుడు పోటీలు జాతరకు మరింత వన్నె తెచ్చిపెట్టాయని ఎమ్మెల్యే డాక్టర్ బి.జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి బివి మోహన్‌రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు బుధవారం ముగిసాయి. చివరి రోజు సీనియర్ సైజు వృషభాల పోటీలు జరిగాయి. ఇందులో వెల్దుర్తి మండలం కొత్తకోటకు చెందిన డాక్టర్ గురునాథ్ నాగయ్య వృషభాలు 20 నిమిషాల్లో 2487.3 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతి(రూ.60,000)ని కైవసం చేసుకున్నాయి. బెళగల్ మండలం ఎనకండ్లకు చెందిన బోయకాటి బోడెన్న వృషభాలు ద్వితీయ(రూ.50,000), కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మల్లికార్జున రెడ్డి వృషభాలు తృతీయ(రూ.35,000), అదే పట్టణానికి చెందిన చంద్ర ఓబుళరెడ్డి వృషభాలు నాల్గవ(రూ.25,000), బెళగల్ మండలం గుండ్రేవులకు చెందిన కోడెల కిష్టన్న వృషభాలు ఐదవ (రూ.15,000) బహుమతిని సాధించాయి.
సబ్ జూనియర్ విభాగంలో..
సబ్ జూనియర్ విభాగంలో కర్నూలు వీఆర్‌నగర్‌కు చెందిన గీతామృతచౌదరి వృషభాలు ప్రథమ బహుమతి(రూ.40,000). ఉయ్యాలవాడ మండలం తడమలదిన్నెకు చెందిన పేరెడ్డి సుబ్బారెడ్డి వృషభాలు ద్వితీయ(రూ.30,000), వెల్దుర్తి మండలం బాపురానికి చెందిన నడిపి సోమిరెడ్డి వృషభాలు తృతీయ(రూ.20,000), అనంతపురం జిల్లా తాడిచెర్లకు చెందిన బీమిరెడ్డి లవకుమార్ వృషభాలు నాల్గవ(రూ.10,000), బెళగల్ మండలం పోల్‌కల్‌కు చెందిన మహేంద్రనాయుడు వృషభాలు ఐదవ బహుమతి(రూ.5,000) కైవసం చేసుకున్నాయి.
న్యూ కేటగిరి విభాగంలో..
న్యూ కేటగిరిలో సంజామలకు చెందిన గుండం చిన్నారెడ్డి, ఓబులరెడ్డి వృషభాలు ప్రథమ బహుమతి(రూ.30,000), ఆదోని మండలం బైచిగేరికి చెందిన బ్రహ్మానందరెడ్డి వృషభాలకు ద్వితీయ( రూ.20,000), సంజామల మండలం కొత్తూరుకు చెందిన డీఎస్‌ఎస్‌రెడ్డి వృషభాలు తృతీయ(రూ.15,000), అనంతపురం జిల్లాకు చెందిన వెంకటరెడ్డి, చింతల రాముల వృషభాలు నాల్గవ (రూ10,000), నంద్యాల మండలం పి.కొట్టాలకు చెందిన డీ.కేశవరెడ్డి వృషభాలు ఐదవ బహుమతి( రూ.5,000) పొందాయి.
పాలపళ్ల విభాగంలో..
పాణ్యం మండలం ఎస్.కొత్తపల్లెకు చెందిన కేఎస్‌ఎస్ రెడ్డి వృషభాలు ప్రథమ (రూ.25,000),. ప్యాలకుర్తికి చెందిన జాకీర్ వృషభాలు ద్వితీయ (రూ.20,000), ఐజ మండలం తుప్పత్రాళ్లకు చెందిన బుడ్డన్న వృషభాలు తృతీయ (రూ.15,000), ఆదోని మండలం చిన్న పెండేకల్‌కు చెందిన చిన్ననాగిరెడ్డి–వీరలింగేశ్వరస్వామి వృషభాలు నాల్గవ(రూ.10,000),కోడుమూరు మండలం కొత్తపల్లికి చెందిన పెద్దరాముడు వృషభాలు ఐదవ బహుమతి(రూ.5,000)ని కైవసం చేసుకున్నాయి. విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్ బి.జయనాగేశ్వరరెడ్డి నగదు, షీల్డులను బహుకరించారు. పోటీల నిర్వహకులను సన్మానించారు. నిర్వాహకులు కొండయ్యచౌదరి, హరిప్రసాద్‌రెడ్డి, మిఠాయి నరసింహులు, రాందాస్‌గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముగతి ఈరన్నగౌడ్, మార్కెట్ ఛైర్మెన్ సంజన్న, ఎంపీపీలు చిన్న నరసింహారెడ్డి, శంకరయ్య, కౌన్సిలర్లు రంగస్వామిగౌడ్, రామకృష్ణ, పరశురాముడు, రంగన్న, జయన్న పాల్గొన్నారు.
Advertisement