ఏటా పుష్కరమే..! బ్రహ్మ దేవుడి క్షేత్రం | Pushkar Fair Locally Kartik Mela Ajmer City | Sakshi
Sakshi News home page

ఏటా పుష్కరమే..! బ్రహ్మ దేవుడి క్షేత్రం

Published Mon, Oct 21 2024 10:26 AM | Last Updated on Mon, Oct 21 2024 10:26 AM

Pushkar Fair Locally Kartik Mela  Ajmer City

బ్రహ్మదేవుడంటే... ఈ సమస్త భూమండలంలో ఆలయం లేని దేవుడనే అసంతృప్తిని రాజస్థాన్‌ రాష్ట్రంలోని పుష్కర్‌ తీర్చింది. అజ్మీర్‌కి 11 కి.మీల దూరంలో పుష్కర్‌ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. పుష్కర్‌ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం కావడంతో ఈ పట్టణానికి కూడా అదే పేరు స్థిరపడింది. 

రాజస్థాన్‌ అంటేనే ఎడారులు, ఒంటెలు. ఇక్కడ ఏటా జరిగే క్యామెల్‌ ఫెయిర్‌ ప్రపంచ ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే వేడుకకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ప్రదేశం పేరు పుష్కరే కానీ వేడుకలు పుష్కరానికొకసారి కాదు ఏటా జరుగుతాయి.

పుష్కర్‌ మేళా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన వేడుక కావడంతో ఇది క్యామెల్‌ ఫెయిర్‌గా వాడుకలోకి వచ్చింది. పుష్కర్‌మేళా సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వారోత్సవాల్లో రాజస్థాన్‌ సంప్రదాయ సంగీత ప్రదర్శనలను, నాట్య ప్రదర్శనలతో΄ాటు సాముగారడీలు, పాములనాడించేవాళ్లు కూడా వస్తారు. స్థానిక హస్తకళలు, దుస్తుల దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ సీజన్‌లో పుష్కర్‌ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. 

పగలు ఏదో ఒక సమయంలో 22 డిగ్రీలకు చేరుతుంది, కానీ సూర్యకిరణాలు మబ్బును చీల్చుకుని మనిషిని తాకి వెచ్చదనాన్నివ్వడం కష్టమే. రాత్రి టెంపరేచర్‌ ఎనిమిది డిగ్రీలకు పడి΄ోతుంది. పాశ్చాత్యదేశీయులకు అనువుగా ఉంటుంది. ఈ ఏడాది వేడుకలు నవంబర్‌ 9 నుంచి మొదలై 15 వరకు కొనసాగుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement