kartika
-
ఏటా పుష్కరమే..! బ్రహ్మ దేవుడి క్షేత్రం
బ్రహ్మదేవుడంటే... ఈ సమస్త భూమండలంలో ఆలయం లేని దేవుడనే అసంతృప్తిని రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ తీర్చింది. అజ్మీర్‌కి 11 కి.మీల దూరంలో పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. పుష్కర్ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం కావడంతో ఈ పట్టణానికి కూడా అదే పేరు స్థిరపడింది. రాజస్థాన్ అంటేనే ఎడారులు, ఒంటెలు. ఇక్కడ ఏటా జరిగే క్యామెల్ ఫెయిర్ ప్రపంచ ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే వేడుకకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ప్రదేశం పేరు పుష్కరే కానీ వేడుకలు పుష్కరానికొకసారి కాదు ఏటా జరుగుతాయి.పుష్కర్ మేళాప్రపంచ ప్రసిద్ధి చెందిన వేడుక కావడంతో ఇది క్యామెల్ ఫెయిర్‌గా వాడుకలోకి వచ్చింది. పుష్కర్మేళా సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వారోత్సవాల్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీత ప్రదర్శనలను, నాట్య ప్రదర్శనలతో΄ాటు సాముగారడీలు, పాములనాడించేవాళ్లు కూడా వస్తారు. స్థానిక హస్తకళలు, దుస్తుల దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ సీజన్లో పుష్కర్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పగలు ఏదో ఒక సమయంలో 22 డిగ్రీలకు చేరుతుంది, కానీ సూర్యకిరణాలు మబ్బును చీల్చుకుని మనిషిని తాకి వెచ్చదనాన్నివ్వడం కష్టమే. రాత్రి టెంపరేచర్ ఎనిమిది డిగ్రీలకు పడి΄ోతుంది. పాశ్చాత్యదేశీయులకు అనువుగా ఉంటుంది. ఈ ఏడాది వేడుకలు నవంబర్ 9 నుంచి మొదలై 15 వరకు కొనసాగుతాయి. -
న్యాయమైన ఆశయం
పెద్దవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చేసేది చూసి పిల్లలు అనుకరిస్తుంటారు. కొంతమంది అనుకరణతో ఆగిపోకుండా వాళ్లలాగే తామూ ఎదగాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన అమ్మాయే 23 ఏళ్ల కార్తీక గెహ్లాట్. తండ్రి ఉద్యోగరీత్యా డ్రైవర్. న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడం ఆయన పని. చిన్నప్పటి నుంచి నాన్న నడిపే కారులో ఎంతో హుందాగా ఉండే న్యాయమూర్తులను దగ్గర నుంచి చూసిన కార్తీక తను కూడా జడ్జీ కావాలనుకుంది. నేను పెద్దయ్యాక నల్లకోటు ఆఫీసర్ అవుతాను అని అనుకరించి చూపిస్తూండేది. అది చూసిన వారంతా చిన్నపిల్ల చేష్టలనుకునేవారు. కానీ నేడు కార్తీక జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో మంచి మార్కులతో 66 ర్యాంకు సాధించి పిల్లచేష్టలు కాదు, మరికొన్నేళ్లలో జడ్జి్జని కాబోతున్నానని చెప్పకనే చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జోద్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గెహ్లాట్ ముద్దుల కూతురే కార్తీక గెహ్లాట్. 31ఏళ్లుగా ప్రధాన న్యాయమూర్తులెందరికో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రాజస్థాన్ హైకోర్టులో పనిచేస్తున్న ఎంతోమంది జడ్జీలను, లాయర్లను చూస్తూ పెరిగిన కార్తీక తాను కూడా పెద్దయ్యాక జడ్జి కావాలనుకునేది. ఆరోతరగతిలో ఉండగా నల్లకోటు వేసుకుని న్యాయస్థానంలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆదిశగా అడుగులు వేస్తూ... జో«ద్‌పూర్‌లోని సెయింట్ ఆస్టిన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తరువాత జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల బిబిఏ.ఎల్ఎల్.బి. పూర్తిచేసింది. ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేసినప్పటికీ జడ్జీ అయ్యేందుకు 2019 నుంచి సన్నద్ధమవడం ప్రారంభించింది. ఒక పక్క సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతూనే, మరోపక్క పిలిమినరీ, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేది. కరోనా సమయంలో ఆఫ్‌లైన్ క్లాసులు అందుబాటులో లేకపోవడంతో, ఆన్లైన్ తరగతులకు హాజరవుతూ సిలబస్ పూర్తిచేసింది. ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, జిల్లా సెషన్స్ జడ్జి మండల్ ప్రసాద్ బోహ్రాల వద్ద లా గైడెన్స్, అడ్వకేట్ ధర్మేంద్ర వద్ద ఏడాదిన్నరపాటు టెక్నికల్ గైడెన్స్, మాజీ ఐఏఎస్ అధికారి, తన మాజీ స్కూలు ప్రిన్సిపాల్ వంటివారందరి సలహాలు సూచనలతో రోజుకి నాలుగు గంటలు కష్టపడి చదివేది. పరీక్ష తేది ప్రకటించిన తరువాత ప్రిపరేషన్‌ను పది నుంచి పన్నెండు గంటలకు పెంచింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టిపెట్టి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించింది. దీంతో తన చిన్ననాటి కల జడ్జీ కావడానికి మొదటి అడుగు వేసింది. నేను న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడాన్ని అప్పుడప్పుడు కార్తీక చూసేది. అలా చూస్తూ పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో ఒకరోజు నేను కూడా త్వరలో నల్లకోటు వేసుకుని జడ్జిని అవుతానని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కార్తీక మాత్రం అప్పటి నుంచి జడ్జిఅవ్వాలన్న కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతూనే ఉంది. వాళ్ల అమ్మకూడా∙తనని అన్ని విధాల సాయపడుతూ అండగా ఉండడంతో ఈ రోజు తన కలను సాకారం చేసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది జడ్జీలను వెనుకసీట్లోకూర్చోపెట్టి తిప్పాను. భవిష్యత్‌లో నా కూతురు కూడా వారిలా వెనుకసీట్లో కూర్చోబోతున్నందుకు సంతోషంగా ఉంది. – కార్తీక తండ్రి రాజేంద్ర గెహ్లాట్ పెళ్లికాదని భయపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లు లా చదువుతామంటే ఇష్టపడరు. లా చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావు అని భయపడతారు. ఇలాంటి అపోహలు పోవాలంటే ప్రతి ఒక్కరికి చట్టం గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. అప్పుడు తమ హక్కుల గురించి ధైర్యంగా పోరాడగలుగుతారు. నలుగురు సంతానంలో నేను ఒకదాన్ని. ప్రారంభంలో నా నిర్ణయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కష్టపడి చదవడం చూసి ప్రోత్సహించారు. వారి సహకారంతో ఈ రోజు ఇంతమంచి ర్యాంకును సాధించగలిగాను. నన్ను ప్రేరణగా తీసుకుని నా తోబుట్టువులు సైతం లా చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నా ప్రిపరేషన్లో ఆన్లైన్ యాప్స్‌తో పాటు, ఏకాగ్రతతో చదవడానికి సంగీతం చాలా బాగా ఉపయోగపడ్డాయి. – కార్తీక -
కార్తీక దీప
ప్రేమి విశ్వనాథ్ అంటే మనవాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, ‘కార్తీకదీపం’ సీరియల్ ‘దీప’ అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నల్లటి రూపంతో చిన్నితెర మీద ప్రముఖ నటిగా వెలుగొందుతున్న ప్రేమి విశ్వనాథ్ పుట్టినిల్లు కేరళలోని ఎర్నాకులం. మలయాళం టెలివిజన్‌లో ‘కరతముత్తు’ (తెలుగు కార్తీక దీపం) అనే సీరియల్ ద్వారా ప్రేమి అక్కడివాళ్లకు కార్తీకగా పరిచమయ్యింది. బ్లాక్బ్యూటీగా మనవారిచేత అభినందనలు అందుకుంటున్న దీప ఆఫ్‌స్క్రీన్‌లో ఫెయిర్‌గా ఉంటుంది. అంతే ఫెయిర్‌గా తన మనసులోని విషయాలను పంచుకుంటుంది. సీరియల్లో ఈ పాత్రను మీరెలా ఒప్పుకున్నారు? సినిమానే కాదు టెలివిజన్ పరిశ్రమ కూడా గ్లామర్‌నే చూపిస్తుంది. ఫెయిర్‌గా ఉండే హీరోయిన్సే ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తారు. అయితే, ఈ సీరియల్లోని ప్రధాన పాత్ర ఒంటి రంగు నలుపుగా ఉండటం ఇందులోని కాన్సెప్ట్. దాన్నే సవాల్‌గా తీసుకున్నాను. తెలుగు సీరియల్లో డాక్టర్ కార్తీక్ (నిరుపమ్ పరిటాల) భార్యగా నటించాను. మీ గురించి తెలుసుకోవచ్చా? మా అమ్మనాన్నలు విశ్వనాథ్, కాంచన. భర్త డా.టి.ఎస్.వినీత్ భట్. అతను ప్రముఖ ఆస్ట్రాలజర్. నేను లా చేశాను. కొచ్చిలో ఒక ప్రైవేటు సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసేదాన్ని. మా అన్నయ్య శివప్రసాద్ ఫొటోగ్రాఫర్, ఆర్టిస్ట్ కూడా. ఆ విధంగా నాకూ ఫొటోగ్రఫీ అబ్బింది. పెళ్లిళ్లకు ఫొటోలు తీసేదాన్ని. ఫొటోగ్రఫీ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. నేనో ట్రావెల్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాను. ‘కరతముత్తు’ (మలయాళం సీరియల్) లో కెమెరా ముందు నటించడానికి మా స్టూడియోలో కెమెరా ముందు చేసిన మోడలింగ్ బాగా ఉపయోగపడింది. ‘దీప’ గురించి చెప్పండి.. ‘కరతముత్తు’ సీరియల్ 2013లో మలయాళం టెలివిజన్‌లో మొదలయ్యింది. ఆ తర్వాత తెలుగులో 2017లో రీమేక్ అయ్యింది. ‘కరతముత్తు’లో నా పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుగులో దీప (కార్తీకదీపం) క్యారెక్టర్‌కి అంతే మంచి పేరొచ్చింది. ఈ సీరియల్ కోసం మేకప్‌కి, క్యాస్టూమ్స్కి కనీసం రెండు గంటలు పడుతుంది. నా కుటుంబం, స్నేహితులకు నేను తెలిసినప్పటికీ నాకు ఇంతగా గుర్తింపు వచ్చింది మాత్రం సీరియల్ ద్వారానే. ఈ సీరియల్ ద్వారా ఏషియానెట్ టెలివిజన్ అవార్డ్, స్టార్ మా పరివార్ అవార్డ్స్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఫ్యూచర్ గురించి ఫుల్ టైమ్ యాక్టర్‌గానే ఉంటాను. ఈ సీరియల్ ఉన్నంతవరకు ఇందులోనే కొనసాగుతాను. సీరియల్ రేటింగ్ పెరగడానికి స్టోరీ లైన్లో మార్పుల కోసం నేనూ చర్చలో పాల్గొంటుంటాను. కొత్త విషయాల గురించి తెలుసుకుంటుంటాను. ఆ తర్వాత అంటారా.. ఏదైనా వ్యాపారం కొనసాగిస్తాను. సినిమాల్లో యాక్ట్ చేయచ్చు. నేను డ్యాన్సర్‌ని కూడా. స్టేజ్ షోల మీద నృత్యప్రదర్శనలు కూడా ఇచ్చాను. -
ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంది
టీనగర్: ఆర్య, శ్యాం నటన తననెంతో ఆకట్టుకుందని నటుడు విజయ్ సేతుపతి తెలిపారు. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో ఆర్య, విజయ్ సేతుపతి, శ్యాం, కార్తిక నటిం చిన చిత్రం పొరంబోకు’. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ చిత్రంలో రైల్వే కలాసీగా నటించానని, ఇటువంటి క్యారెక్టర్‌ను మునుపెన్నడూ ఊహించలేదన్నారు. చిత్రంలో ఆర్య, శ్యాం నటించినప్పటికీ అన్ని క్యారెక్టర్లకు ప్రాధాన్యత ఉందన్నారు. పొరంబోకు అనే టైటిల్ మొదట్లో తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అయినప్పటికీ దర్శకుడు జననాథన్ ఏదో కారణం లేందే ఇటువంటి టైటిల్ సూచించరని భావించానన్నారు. ఆయన చెప్పిన వివరణ కూడా తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. జీవించడానికి పనికి వచ్చే స్థలమే పొరంబోకు అని, అయితే మనం దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నామని అన్నారు. చిత్రం షూటింగ్ సమయంలో ఆర్య, శ్యాం ఇరువురి నటన చూసి ఆశ్చర్యపడ్డానని, కార్తిక సాధారణ హీరోయిన్లా ఈ చిత్రంలో కనిపించరని, ఎంతో ధైర్యవంతంగా ఆమె క్యారెక్టర్లో జీవించారన్నారు. ఇది విభిన్న చిత్రంగా పేరు తెచ్చుకుంటుందని, జీవన సత్యాలను ఇందులో అందంగా చూపించారని అన్నారు. -
ప్రేక్షకుల గుండెల్లో ఉండాలి
అమ్మ రాధ నటించిన 200 చిత్రాలకు నేను నటించిన రెండు చిత్రాలు సమం అంటున్నారు నటి కార్తీక. ఈమె మలయాళం, తెలుగు, తమిళం, కన్నడం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోను నటిస్తున్నా తన కంటూ ఒక స్థాయికి చేరుకోలేదన్నది నిజం. ఒక స్టార్ హీరోయిన్ వారసురాలిగా పరిచయం అయినా ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం అవకాశాలు కూడా అంతగా లేవు. విడుదలకు సిద్ధం అవుతున్న వా, పొరంబోకు చిత్రాలే కార్తీక భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయని చెప్పవచ్చు. ఇటీవల వా చిత్ర విలేకరుల సమావేశంలో ఈ అమ్మడి ముచ్చట్లు... ప్రశ్న: వా చిత్రంలో మీ పాత్ర గురించి? జవాబు: ఇందులో సింధు అనే పాత్రలో నటించాను. చిత్రంలో నాకు ఫైట్ సన్నివేశాలాంటివి లేకపోయినా దిల్ వున్న పాత్ర చేశాను. అయితే తొలిసారిగా పూర్తిగా తమిళ సినిమా నాయకిగా నటించాను. హీరోయిన్గా చిత్రంలో పరిచయం పాటలో నటించాలని చాలా కాలంగా ఆశిస్తున్నాను. అలాంటిది ఈ చిత్రంలో నెరవేరింది. ప్రశ్న: కేవీ ఆనంద్, భారతీరాజా లాంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించారు. ఈ చిత్రాల్లో నూతన దర్శకుడితో చేసిన అనుభవం? జవాబు: ఒక నూతన దర్శకుడు కథను ఎంత బాగా చెప్పినా దాన్ని ఎలా తెరపై ఆవిష్కరిస్తారోనన్న సందేహం కలుగుతుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు రత్తం శివ కథ చెప్పినప్పుడే నా పాత్ర ఏమిటో ఊహించగలిగాను. చిన్న నటీనటులతో చిన్న కెమెరాతో ముందుగా చిన్న ట్రైలర్‌ను రూపొందించి చూపించారు. అది చాలా ఇంప్రెస్ చేయడంతో నేను వా చిత్రంలో నటించడానికి అంగీకరించాను. ప్రశ్న: చాలామంది హీరోయిన్ల తల్లులు వారి వెంట షూటింగ్‌లకు వస్తుంటారు. మీ అమ్మ మీతో పాటు షూటింగ్‌లకు రాదట. నిజమేనా? జవాబు: మీరు అన్నట్లుగానే చాలామంది హీరోయిన్ల తల్లులు షూటింగ్‌లకు వస్తుంటారు. ఏ ఏ సన్నివేశాల్లో చిత్రీకరిస్తున్నారు అని ఆరాలు తీస్తుంటారంటారు. అలా ఎవరు అనుకోకూడదనే మా అమ్మ షూటింగ్‌లకు రారు. ఒకవేళ దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం చూడాలనిపిస్తే షూటింగ్ ప్రారంభం రోజున వస్తారు. అయినా క్యారవాన్ వ్యాన్లోనే కూర్చొంటారు గాని షూటింగ్ స్పాట్‌కు రారు. అమ్మ అప్పట్లో తమిళం, తెలుగు భాషలలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. ఆమెకు పలువురు దర్శక నిర్మాతలు తెలుసు. వారంతా కథలు వినిపించడానికి వస్తుంటారు. వారితో కథా చర్చల్లో పాల్గొంటారు. ప్రశ్న: కో చిత్రం ఘన విజయం సాధించినా మీ మార్కెట్ పెరగలేదే? జవాబు: కో చిత్రం తరువాత తెలుగులో వరుసగా చిత్రాలు చేశాను. అమ్మకు తొలి చిత్రం తమిళంతోనే అమరింది. నేను తొలి చిత్రాన్ని తమిళంలోనే ఆశించాను. అయితే అది మన చేతుల్లో లేదని తెలిసిపోయింది. పదవ తరగతి చదువు పూర్తి కాగానే సినీ రంగ ప్రవేశం చేశాను. తెలుగులో నాగార్జున కొడుకు నాగచైతన్య సరసన జోష్ చిత్రం ద్వారా పరిచయం అయ్యాను. ఆయన నటన, డాన్స్‌లో శిక్షణ పొంది నటించడానికి వచ్చారు. నేను అలాంటివేవీ లేకుండానే నటించడానికి సిద్ధం అయ్యాను. అలాగే తమిళంలో నా చిత్రాలకు గ్యాప్ వచ్చి ఉండవచ్చు గాని తెలుగు, మలయాళం, కన్నడం అంటూ నేను వరుసగా నటిస్తూనే ఉన్నాను. అన్ని చిత్రాలలోనూ ముఖ్యపాత్రలు కావడంతో అధిక కాల్షీట్స్ కేటాయించాల్సి వస్తోంది. ఏడాదికి ఒక చిత్రం చేసినా అది ప్రేక్షకులకు నచ్చాలి. వారి గుండెల్లో నేను ఉండాలి. ప్రశ్న: అన్నకొడి చిత్రంలో నటించినందుకు బాధపడ్డారట? జవాబు: ఎవరలా అన్నది? ఆ చిత్రంలో నటించడం చాలా సంతోషం. కో చిత్రం తరువాత భారతీరాజా ఇచ్చినఅవకాశం అది. కో చిత్రం తరువాత ఎవరూ ఊహించని పాత్రను అన్నకొడి చిత్రంలో చేశాను. నటనలో శిక్షణ పొందలేదన్న లోటు ఆ చిత్రంలో నటించడంతో తీరింది. ఉదయ చంద్రిక అనే తన తల్లిని రాధగా మార్చిన భారతీరాజా దర్శకత్వంలో నటించడం నా భాగ్యం. ప్రశ్న: మీ అమ్మ రాధ పలు చిత్రాల్లో నటించారు. ఒక నటిగా మీకు అలాంటి ఆశ ఉందా? జవాబు: సూపర్ హీరోల నుంచి కామెడీ నటుల వరకు పలువురి సరసన నటించిన నటి మా అమ్మ. ఎవరి సరసన నటించినా అమ్మను అంగీకరించారు, ఆదరించారు. ఆ కాలం వేరు. అందుకే అమ్మ సులభంగా 200 చిత్రాలు పూర్తి చేశారు. ఆ రోజుల్లో రెండు నెలల్లో మూడు నాలుగు చిత్రాలు నటించేవారు. ఇప్పుడు ఒక చిత్రం పూర్తి చేయడానికి ఏడాది పడుతోంది. అలా చూస్తే అమ్మ నటించిన 200 చిత్రాలు నేను చేసిన రెండు చిత్రాలకు సమం. -
బొమ్మాళీ తమ్ముడు
‘అల్లరి’ నరేశ్ హీరోగా బి.చిన్ని దర్శకత్వంలో అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’ అనే టైటిల్’ను ఖరారు చేశారు. మోనాల్ గజ్జర్, కార్తీక తదితరులు నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సిరి సినిమా వారి ప్రోడక్షన్ నెం.2 స్టిల్స్