ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంది | purampokku tamil movie release on 15th | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంది

Published Sun, May 3 2015 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంది

ఆ ఇద్దరి నటన ఆకట్టుకుంది

టీనగర్: ఆర్య, శ్యాం నటన తననెంతో ఆకట్టుకుందని నటుడు విజయ్ సేతుపతి తెలిపారు. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో ఆర్య, విజయ్ సేతుపతి, శ్యాం, కార్తిక నటిం చిన చిత్రం పొరంబోకు’. ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ చిత్రంలో రైల్వే కలాసీగా నటించానని, ఇటువంటి క్యారెక్టర్‌ను మునుపెన్నడూ ఊహించలేదన్నారు. చిత్రంలో ఆర్య, శ్యాం నటించినప్పటికీ అన్ని క్యారెక్టర్లకు ప్రాధాన్యత ఉందన్నారు. పొరంబోకు అనే టైటిల్ మొదట్లో తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
 
 అయినప్పటికీ దర్శకుడు జననాథన్ ఏదో కారణం లేందే ఇటువంటి టైటిల్ సూచించరని భావించానన్నారు. ఆయన చెప్పిన వివరణ కూడా తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. జీవించడానికి పనికి వచ్చే స్థలమే పొరంబోకు అని, అయితే మనం దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నామని అన్నారు. చిత్రం షూటింగ్ సమయంలో ఆర్య, శ్యాం ఇరువురి నటన చూసి ఆశ్చర్యపడ్డానని, కార్తిక సాధారణ హీరోయిన్‌లా ఈ చిత్రంలో కనిపించరని, ఎంతో ధైర్యవంతంగా ఆమె క్యారెక్టర్‌లో జీవించారన్నారు. ఇది విభిన్న చిత్రంగా పేరు తెచ్చుకుంటుందని, జీవన సత్యాలను ఇందులో అందంగా చూపించారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement