హీరోలిద్దరు - హీరోయిన్ ఒక్కరే
హీరోలిద్దరు - హీరోయిన్ ఒక్కరే
Published Mon, Dec 9 2013 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
యువ నటులు ఆర్య, విజయ్ సేతుపతి పురంబోకు చిత్రంలో నటించనున్నారు. వీరిద్దరిలో ఒక పోలిక ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆర్య, సేతుపతి ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తారు. రాజారాణి హిట్‌తో నూతనోత్సాహంతో ఉన్న ఆర్య, వరుస విజయాలతో దూసుకుపోతున్న సేతుపతి కలిసి నటించే చిత్రం అంటే తప్పకుండా మంచి అంచనాలుంటాయి. అలాంటి చిత్రమే పురంబోకు. యుటివి మోషన్ సంస్థ సమర్పణలో జాతీయ ఉత్తమ దర్శకుడు జననాథన్ తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టి బినరి ప్రొడక్షన్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పురంబోకు. ఈ చిత్రం కోసం ఆర్య, విజయ్‌సేతుపతిపై ఫోటో షూట్ ఇటీవల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు జననాథన్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని వేరే హీరోలతో తెరకెక్కించాలని అనుకున్నానని అయితే వారి మధ్య ఈగో కారణంగా అది జరగలేదని పేర్కొన్నారు. ఆర్య, విజయ్‌సేతుపతి హీరోలుగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అయినట్లు చెప్పారు. ఫోటోసెషన్ తరువాత కెమిస్ట్రీ అనే ది హీరో హీరోయిన్ల మధ్య కాదు, ఇద్దరు హీరోల మధ్య వర్కౌట్ అవుతుందని ఆర్య, సేతుపతిని చూస్తే అర్థం అయ్యిం దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశా రు. చిత్రంలో ఇద్దరు హీరోలున్నా హీరోయిన్ మాత్రం ఒక్కరే ఉంటారని, ఆ నటి ఎంపిక జరుగుతోందని తెలిపారు. షూటింగ్ ను జనవరి నుంచి కులుమనాలిలో జరపనున్నట్లు దర్శక, నిర్మా త జననాథన్ వెల్లడించారు.
Advertisement
Advertisement