కాంగ్రెస్‌ నాయకులు పారిపోతుండ్రూ... | Congress Leaders Flee | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సమావేశాలంటే..కాంగ్రెస్‌ నాయకులు పారిపోతుండ్రు

Published Sat, Mar 31 2018 12:48 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Congress Leaders Flee - Sakshi

భువనగిరి : అసెంబ్లీ సమావేశాలంటే కాంగ్రెస్‌ నాయకులు భయపడి పారిపోతుండ్రని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీబీనగర్‌ మండల కేంద్రంలో రూ. 3.64 కోట్లతో చేపట్ట నున్న సీసీరోడ్లు, అండర్‌ డ్రెయినేజీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద ఎమ్మె ల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్‌ నాయకుల తీరు పదో తరగతి విద్యార్థులు పరీక్ష కు ఎగ్గొట్టేలా ఉందని ఎద్దేవా చేశారు. 2014లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను మూడేళ్లో అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. హామీ ఇవ్వని అనేక సంక్షే మ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు. రైతులు పండించిన ధరను వారే నిర్ణయించుకోవడానికి రైతుల సమన్వయ సమి తులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అధిక నిధులు కేటా యించినట్టు చెప్పారు. గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా 44 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం చేయనున్నట్టు తెలిపారు. బీబీనగర్‌లో ఎస్సీ ఫంక్షన్‌ హాల్‌కు అవసరమైతే మరి న్ని నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

నిధులను సద్వినియోగం చేసుకోవాలి  – ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి 
బీబీనగర్‌కు మంజూరైన సుమారు రూ.4 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సూచించారు. 70ఏళ్ల కాలంలో ఎన్నడూ రాని నిధులు ఒకేసారి వచ్చినందున గ్రామ అభివృద్ధికి ఖర్ఛు చేయాలని సూచించారు. అంతకు ముందు కొండమడుగు మెట్టు నుంచి బీబీనగర్‌ వరకు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డప్పులు, బాణాసంచా కాల్చి మం త్రికి స్వాగతం పలికారు. కళాకారులు నిర్వహించిన ఆట, పాట అందరినీ అలరించాయి. సమావేశంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ మందుల సామేల్, డీఆ ర్‌ఓ రావుల మహేదంర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డా. జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ కొలుపుల అమరేందర్, భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పంతులు నాయక్, ఎంపీపీ గోలి ప్రణితా పింగల్‌రెడ్డి, నాయకులు సుధాకర్, నరేందర్‌రెడ్డి,వెంకన్నగౌడ్, వెంకట్‌ కిషన్, మండలాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి కేటీఆర్‌ సాయం – ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
భువనగిరి నియోజకవర్గంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న మండలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే భూ దాన్‌పోచంపల్లికి రూ. 3 కోట్లు ఇవ్వడం సంతోషకరం అన్నారు. బీబీనగర్, భూదాన్‌పోంచంపల్లి, వలిగొండ, భువనగిరి మండలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరిన వెంటనే మంత్రి కేటీఆర్‌ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారన్నారు. 

గ్రామాల్లో అభివృద్ధి పరుగులు – ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రా మాల్లో అభివృద్ధి పరిగెడుతుందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తెలిపారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ కొత్తగా రాష్ట్రంలో 4,380 గ్రామ పంచాయతీలు 147 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌పవర్‌ను కల్పించినట్టు తెలిపారు. జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్‌ మంజూరైందని, ఎస్సీ స్టడీ సర్కిల్‌ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement