రాంగోపాల్‌పేట్: వివిధ శాఖల అధికారులు, వాలింటీర్లు, భక్తులు, పోలీసుల సహకారంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతర విజయవంతమయిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రంగం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని నెలల నుంచి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.‡ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతం కావాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఉదయం సతీసమేతంగా ఆయన ఆలయంలో పూజలు చేశారు.