చిన్నారుల చిత్తరువులు వన్నెవన్నెల పెన్నిధులు
చిన్నారుల చిత్తరువులు వన్నెవన్నెల పెన్నిధులు
Published Thu, Feb 16 2017 11:43 PM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM
ఓఎన్‌జీసీ ఈడీ దేబశీష్ సన్యాల్∙కేంద్రీయ విద్యాలయలో చైల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : వివిధ రాష్ట్రాలకు చెందిన కేంద్రీయ విద్యార్థులు గీసిన వర్ణచిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ దేబశీష్ సన్యాల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఓఎన్‌జీసీ బేస్‌కాంప్లెక్స్ ఆవరణలోని కేంద్రీయ విద్యాలయలో 12వ ఆల్‌ఇండియా కేంద్రీయ విద్యాలయ చైల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లోని ప్రతి చిత్రాన్నీ ప్రజలను ఆలోచింప చేసేలా తీర్చిదిద్దారన్నారు. విద్యార్థులకు మెమెంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు.
223 విద్యాలయాల నుంచి 4,371 చిత్రాలు
ఎగ్జిబిషన్‌లో 29 రాష్ట్రాల్లోని 223 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు 4,371 చిత్రాలను ఎగ్జిబిషన్‌కు పంపించారు. తరగతుల వారీగా ఐదు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూపులో 30మందికి మెడల్స్‌ను అందిస్తారు. ఆయిల్ అండ్ ఎకతాలిన్ పెయింటింగ్‌్సను ప్రత్యేకంగా విభజించి 25మందికి మెడల్స్‌ను అందజేయనున్నారు. టాప్‌టెన్ స్కూళ్లను ఎంపిక చేసి, పాఠశాలకు, డ్రాయింగ్ ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా మెమెంటోలు అందిస్తారు. సేవ్ గర్‌్లచైల్డ్, సేవ్ ఎన్విరాన్‌మెంట్, సేవ్ ట్రీ సేవ్ లైఫ్, నేషనల్ ఇంటిగ్రిటీ మొదలగు అంశాలపై ప్రస్తుత టెక్నాలజీతో చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. మధుబని పెయింటింగ్, ట్రైబల్, అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌లు సైతం ఆకట్టుకున్నాయి. కేంద్రీయ విద్యార్థులతో పాటు ది ఫ్యూచర్‌కిడ్స్, డెఫనే స్కూళ్ల విద్యార్థులు ఆర్టు ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఓఎన్‌జీసీ డీజీఎం(సివిల్) వైయూబీరావు, విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.కె.ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ సిన్హా, డ్రాయింగ్ టీచర్ కె.సుబ్బారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement