అమెరికా నుంచి భారత్‌ తిరిగొచ్చిన... 1,400 పై చిలుకు కళాకృతులు | US Returns Over 1,400 Looted Artefacts Worth $10 Million To India | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి భారత్‌ తిరిగొచ్చిన... 1,400 పై చిలుకు కళాకృతులు

Published Sat, Nov 16 2024 11:26 AM | Last Updated on Sat, Nov 16 2024 11:46 AM

US Returns Over 1,400 Looted Artefacts Worth $10 Million To India

భారత్‌ నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలించిన 1,400కు పైగా పురాతన కళాకృతులను అమెరికా తాజాగా తిరిగి అప్పగించింది. వీటి విలువ కోటి డాలర్ల పై చిలుకే. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన కళాకృతులను మాతృదేశాలకు స్వాదీనం చేసే చర్యల్లో ఇది భాగమని మన్‌హాటన్‌ జిల్లా అటార్నీ కార్యాలయంలోని యాంటిక్విటీ స్మగ్లింగ్‌ విభాగం తెలిపింది. భారత్‌ నుంచి లండన్‌కు తరలించిన దేవ నర్తకి శిల్పం వంటి అపురూప కళాకృతులు వీటిలో ఉన్నాయి. 

దీన్ని శాండ్‌స్టోన్‌లో అత్యంత సుందరంగా మలిచారు. వీటిని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ తదితర చోట్ల భద్రపరిచి ఉంచారు. నాన్సీ వెయినర్‌ వంటి అమెరికా స్మగ్లర్లతో పాటు భారత్‌కు చెందిన పలువురు గ్యాంగ్‌ లీడర్లను ఇప్పటికే అరెస్టు చేశారు. యాంటిక్విటీ విభాగం ఇప్పటిదాకా 46 కోట్ల డాలర్ల విలువైన 5,800కు పైగా కళాకృతులను స్మగ్లర్ల నుంచి స్వా«దీనం చేసుకుంది. 16 మందికి పైగా స్మగ్లర్లకు శిక్షలు పడేలా చూసింది. 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement