కిటకిటలాడుతున్న శివాలయాలు
Published Mon, Mar 7 2016 8:51 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఎటు వైపు చూసిన భక్తి పారమశ్యంతో శివ నామస్మరణతో ఆలయాలు కిక్కిరిస్తున్నాయి. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. పరమశివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
Advertisement
Advertisement