‘ఒక మహిళ చిత్రకారిణిగా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.కాని టాటూ ఆర్టిస్ట్‌గా ఉంటానంటేఆశ్చర్యంగా చూస్తారు’ అంటుంది అర్చన భానుషాలి.దేశంలో ఉత్తమ మహిళా టాటూ ఆర్టిస్ట్‌గా గుర్తింపు ΄పొం దిన అర్చనమగవాళ్లు రాజ్యమేలే ఈ రంగంలో తన ఉనికిని సగర్వంగా చాటుతోంది.
ఈ రంగంలో మగవారు విపరీతంగా ఉన్నారు. ఆడవాళ్ల ప్రవేశం అంత సులభం కాదు. కాని నేను పంతంతో ఈ స్థాయికి వచ్చాను. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. మీకు లక్ష్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ కష్టం చాలా చేయాలి. ఇవాళ నేను ఈ రంగంలో గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా మంచి రాబడి ΄పొం దుతున్నాను. – అర్చన
శివరాత్రి సందర్భంగా ‘శివ్ అండ్ శక్తి కాస్మిక్ డాన్స్’ అనే సబ్జెక్ట్‌ను పచ్చబొట్టుగా వేసింది అర్చన భానుషాలి. శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తున్న ఆ పచ్చబొట్టులో జీవం ఉట్టి పడుతోంది. అర్ధనారీశ్వరుడి చిత్రం కూడా పచ్చబొట్టుగా వేస్తుందామె. ఇవే కాదు ఆమె బొమ్మల్లో మన సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నాలు కనపడతాయి.
శివాజీ వంటి వీరులూ, అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారులు కూడా కనపడతారు. పచ్చబొట్టును ఒక విశృంఖల చిహ్నంగా కాకుండా వ్యక్తిత్వ ప్రకటనగా మార్చడం వల్లే అర్చనకు మంచి పేరొచ్చింది. అందుకే ఆమె ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా టాటూ ఆర్టిస్ట్‌లలో బెస్ట్ ఆర్టిస్ట్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా గౌరవం ΄పొందుతోంది.
కమర్షియల్ ఆర్టిస్ట్‌గా
అర్చన కుటుంబానిది గుజరాత్ అయినా ముంబైలో స్థిరపడింది. అర్చన ఏడేళ్ల వయసు నుంచే వయసుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తూ బొమ్మలు వేసేది. దాంతో ఇంట్లోప్రో త్సహించారు. అయితే ఇంటర్ వయసు వచ్చే సరికి గుజరాతీలలో అమ్మాయిలకు పెళ్లి చేసి పంపాలనే తొందర ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని వెంటపడితే అప్పుడే వద్దని చెప్పి ముంబై జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో మూడేళ్ల డిప్లమా చేసింది కమర్షియల్ ఆర్ట్‌లో.
ఆ తర్వాత లండన్ వెళ్లి ఒక సంవత్సరం కోర్సు చదవాలని అనుకుంది. ఆ కోర్సుకు అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుండగా టీవీలో ఒక షో చూసింది. అందులో ప్రఖ్యాత అమెరికన్ టాటూ చిత్రకారిణి కేట్ వాన్ డి తన క్లయింట్‌లకు అద్భుతంగా టాటూలు వేయడం చూపించారు. ‘నేను పేపర్ మీద వేసేది ఈమె ఒంటి మీద వేస్తోంది. నేనెందుకు ఇలా వేయకూడదు’ అనుకుంది అర్చన. ఆమె యాత్ర మొదలైంది.
‘మా అమ్మానాన్నలు నేను టాటూ ఆర్టిస్ట్‌గా మారతానంటే కంగారు పడినా ఆ తర్వాతప్రో త్సహించారు. దాని వల్ల టాటూ వేయడంలో కోర్సు చేశాను. నాకు బొమ్మలు వచ్చు కనుక చాలా త్వరగా పని నేర్చుకున్నాను. మేము గుజరాతీలం. ఒకరి కింద పని చేయడం కంటే సొంత బిజినెస్ ఉండటాన్నే ఇష్టపడతాం. అందుకే ‘ఏస్ టాటూజ్’ పేరుతో ముంబైలో మా నాన్న నా కోసం టాటూ స్టూడియో ఏర్పాటు చేశాడు’ అంటుంది అర్చన. అయితే అసలుప్రో త్సాహం భర్త నిఖిల్ నుంచి, అత్తా మామల నుంచి లభించింది. ‘మా అత్తగారు నన్ను బాగాప్రో త్సహిస్తారు. పెళ్లయ్యాక నా మొదటి పచ్చబొట్టును ఆమెకే వేశాను’ అంది అర్చన.
Comments
Please login to add a commentAdd a comment