టాటూ ట్రెండ్‌: ఒళ్లంతా పచ్చబొట్లే.. ఏమంటే ఇదో ఫ్యాషన్‌ | Tattoo Trending: People More crazy With Tattoos | Sakshi
Sakshi News home page

Tattoo: యంగస్టర్స్‌లో విపరీతమైన క్రేజ్‌

Aug 8 2021 12:54 PM | Updated on Aug 8 2021 2:20 PM

Tattoo Trending: People More crazy With Tattoos - Sakshi

సాక్షి, జగిత్యాల: ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్‌గా మారింది. నాడు పచ్చబొట్టు నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. టాటూ అంటే యంగస్టర్స్‌లో విపరీతమైన క్రేజ్‌. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరమంతా టాటూస్‌ డిజైన్‌ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు నచ్చిన వ్యక్తుల ఫొటోస్‌ టాటూగా వేయించుకుంటున్నారు. ఇన్నర్‌ ఫీలింగ్స్, ఆలోచన విధానాన్ని బట్టి టాటూస్‌ను సెలెక్ట్‌ చేసుకుంటున్నారు. కొందరు స్టైల్‌ కోసం టాటూ వేయించుకుంటుండగా మరికొందరు తమకు నచ్చిన వ్యక్తులు, నాయకుల ఫొటోలతో పాటు దేవతల ఫొటోలు టాటూగా వేయించుకుంటున్నారు.

ప్రెజెంట్‌ ట్రెండ్‌కు తగ్గట్టుగా రకరకాల టాటూ డిజైన్‌లు అందుబాటులోకి వచ్చాయి. సింపుల్‌ టాటూ నుంచి రకరకాల బొమ్మల టాటూలు వేయించుకుంటున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్‌ డిఫరెంట్‌ వెరైటీస్‌లో టాటూస్‌ వస్తుండటంతో టాటూ లవర్స్‌ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం గ్రీన్‌ కలర్‌ టాటూస్‌ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్‌ కలర్‌ కాంబినేషన్స్‌లో టాటూస్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకుంటూ మురిసిపోతున్నారు యూత్‌.

యూత్‌ ఫ్యాషన్‌గా టాటూ..
ప్రస్తుతం యూత్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్న టాటూ యంగ్‌స్టర్స్‌కు ఫ్యాషన్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, ఆరాధించే దేవతల ఫొటోలు టాటూగా వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. తమ ఫీలింగ్స్‌ను ఎదుటి వ్యక్తులకు తెలిపేందుకు టాటూ వేయించుకుంటున్నారు. 

డిఫరెంట్‌ కలర్స్‌ అండ్‌ డిజైన్స్‌..
గతంలో కేవలం గ్రీన్‌ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్‌ వెరైటీస్‌ అండ్‌ కలర్‌ కాంబినేషన్స్‌లో టాటూస్‌ వేస్తున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్‌ టాటూస్‌ యూత్‌ను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. సింపుల్‌ టాటూ నుంచి మల్టీకలర్‌తో డిఫరెంట్‌ డిజైన్స్‌లో లైఫ్‌లాంగ్‌ గుర్తుండేలా టాటూ వేయించుకోవడం ప్రెజెంట్‌ డేస్‌లో క్రేజ్‌గా మారింది.

అభిమానంతోనే..
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అంటే నాకు కొండంత అభిమానం. అందుకే ఆయన ఫొటో నా గుండెల మీద టాటూగా వేయించుకున్నాను. ఎప్పటికీ ఆయన అడుగు జాడల్లో నడవడమే నా లక్ష్యం. అందుకే టాటూ వేయించుకుని నా అభిమానాన్ని చాటాను.
– రఘువీర్‌గౌడ్‌ ముంజాల

ఫ్యాషన్‌గా ఉండటం ఇష్టం
స్టైలిష్‌గా ఉండటమంటే నాకిష్టం. అందుకు తగ్గట్టుగానే ఫ్యాషన్‌ బిజినెస్‌ను ఎంచుకున్నాను. నా వ్యాపారానికి ఫ్యాషన్‌గా ఉండటం అవసరం. ప్రస్తుత ట్రెండ్‌తో పాటు నా పర్సనాలిటీ కూడా అందుకు తగ్గట్టుగా ఉండటంతో టాటూ వేయించుకున్నాను.
– పవన్‌సింగ్‌ ఠాకూర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement