Singer Mangli Lands In Controversy After Her Mahashivratri Song - Sakshi
Sakshi News home page

Singer Mangli : మంగ్లీ పాటపై వివాదం.. ఆచారాలను పక్కన పెట్టారంటూ భక్తుల ఆగ్రహం

Feb 21 2023 6:15 PM | Updated on Feb 21 2023 6:44 PM

Singer Mangli Lands In Controversy After Her Mahashivratri Song - Sakshi

ప్రముఖ సింగర్‌ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది.ఫోక్‌ సింగర్‌గా గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్‌ సింగర్‌గా కొనసాగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె పాడిన పాటలు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరోసారి మంగ్లీ పాడిన ఓ పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో‘భం భం భోలే’ అనే సాంగ్‌ని చిత్రీకరించారు.

ఈ పాటకు సంబంధించిన వీడియోను మంగ్లీ శివరాత్రి స్పెషల్ సాంగ్‌గా రిలీజ్‌ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆలయం లోపల వీడియోలు, ఫోటోలు తీసేందుకు అనుమతి లేదు. అలాంటిది గర్భగుడిలో మంగ్లీ అండ్‌ టీం షూటింగ్‌ ఎలా చేస్తారంటూ కొందరు పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు వీరికి పర్మీషన్‌ ఎలా ఇచ్చారంటూ నిలదీస్తున్నారు.ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున గర్భగుడిలో ఈ పాట చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సాంగ్‌లో ఆలయ అర్చకులు కూడా కనిపిస్తుండటంతో చాన్నాళ్లుగా వస్తున్న ఆచారాలను ఎలా పక్కన పెడతారంటూ భక్తులు కన్నెర్ర జేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement