ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో సుమారు 32 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండగట్టులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను వేములవాడ డిపో మేనేజర్ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే బస్సు కండీషన్‌లోనే ఉందని.. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.