
సాక్షి, జగిత్యాల : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ విషాదకర ఘటనలో 60 మంది మృతి చెందగా, క్షతగాత్రులను కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. కాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనాలు...
దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం
కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు
నిర్లక్యం ఖరీదు!
Comments
Please login to add a commentAdd a comment