Jagitial district
-
ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్–ఖమ్మం వరకు ఎన్‌హెచ్–563, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ, రైలు మార్గాల నిర్మాణం, టర్మరిక్ బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నిధులు.. ఇలా ఎన్నో ఇచ్చాం.. వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేసి, మరెన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, రైలు, గోదాంలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని, అబ్ కీ బార్ 400 పార్ అని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో రైతులను, సంక్షేమ పథకాలతో మహిళలను, రుణాలిచ్చి యువతను ఆదుకున్నామని తెలిపారు. పసుపు మద్దతు ధర, టర్మరిక్ బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణకు రూ.6,400 కోట్లు వెచ్చించామన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరును ఎండగట్టారు. ఆ పార్టీలు తెరచాటు మిత్రులని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులు లక్ష్మణ్, సత్యనారాయణరావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, నిర్మల్ ఎమ్మెల్యే పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. రజాకార్ సినిమా చూడండి వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి, పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్లకు ఆర్థికసాయం చేస్తున్న వాళ్లను వదిలేద్దామా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం. రాముని పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు గజగజ వణుకుతున్నరు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముని గుడిని కట్టింది బీజేపీయే. మా పార్టీ బరాబర్ శ్రీరాముని పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి. తెలంగాణ ప్రజాలారా... ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి. నిజాం సమాధి వద్ద మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ సోదరులను కట్టేసి, ఈ సినిమా చూపించండి. – ఎంపీ బండి సంజయ్ ఐదో ఆర్థిక శక్తిగా మన దేశం ప్రధాని మోదీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలను దారికి తెచ్చిన ఘనత ఆయనదే. మోదీ వల్లే దేశంలో సుస్థిరత, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇటీవల సీఏఏ అమలు చేశారు. త్వరలో ఎన్ఆర్సీ, యూసీసీ కోడ్‌ను కూడా అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. – ఎంపీ ధర్మపురి అర్వింద్ దేశ ప్రజలందరూ ప్రధాని కుటుంబమే ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటున్న విపక్షాలకు సిగ్గులేదు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబమే. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి, ప్రధానికి కానుకగా ఇద్దాం. పదేళ్ల యూపీఏ హయాంలో జరగని స్కాం లేదు. బీఆర్ఎస్ కాళేశ్వరం నుంచి కరెంటు వరకు అవినీతిమయం చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
రైలొచ్చింది.. 21 కి.మీ దూరంలో ఉన్నది!
కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్తపల్లి– మనోహరాబాద్ లైన్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే సిద్దిపేట వరకు రైలొచ్చింది. మిగిలిన రూట్లలోనూ పనులు స్పీడందుకున్నాయి. సిద్దిపేట తర్వాత గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల స్టేషన్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు జారీ చేసింది. ప్లాట్‌ఫాంలు, భవనాలు, గదులు, అప్రోచ్ రోడ్లు, లైటింగ్, విద్యుత్ యార్డు తదితర పనుల కోసం టెండర్లు జారీచేశారు. మొత్తం టెండరు విలువ రూ. 5,30,27,277గా అధికారులు పేర్కొన్నారు. ఈనెల 25న మధ్యాహ్న 3 గంటలకు టెండరు ముగింపు గడువుగా తెలిపారు. పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని టెండరులో సూచించారు. 21 కి.మీ. దూరంలో పాత కరీంనగర్.. సిరిసిల్ల–సిద్దిపేట మధ్యలో 30 కి.మీ దూరానికి ట్రాక్ వేసేందుకు దాదాపు రూ.440 కోట్ల వ్యయంతో జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే బిడ్డింగులు పిలిచింది. తాజాగా సిరిసిల్ల, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్లలోనూ స్టేషన్ నిర్మాణాలకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలవడంతో ఈ మార్గంలో జరుగుతున్న పనుల వేగానికి నిదర్శనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను హైదరాబాద్‌తో కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైను ప్రస్తుతం సిద్ధిపేట వరకు పూర్తయింది. ఇటీవల సిద్ధిపేటను రైలు కూడా పలకరిచింది. సిద్దిపేట తర్వాతి స్టేషన్ గుర్రాలగొంది కేవలం 10 కి.మీ దూరంలో ఉంటుంది. గుర్రాలగొంది– చిన్నలింగాపూర్ మధ్య దూరం 11 కి.మీ. చిన్నలింగాపూర్–సిరిసిల్ల మధ్య 9.కి.మీ దూరం వస్తుంది. గుర్రాలగొంది సిద్దిపేట జిల్లా కాగా, చిన్నలింగాపూర్ సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. ఈ లెక్కన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గం పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించేందుకు కేవలం 21.కి.మీల దూరంలో ఉంది. 77 కి.మీ. మేర పూర్తయిన మార్గం.. మనోహరాబాద్ –కొత్తపల్లి (కరీంనగర్) వరకు మొత్తం 151.36 కిలో మీటర్లు బ్రాడ్‌గేజ్‌లైన్. ఈ మార్గంలో ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ (77కి.మీ) వరకు లైన్ పూర్తయింది. ఇక్కడి నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న సిరిసిల్ల స్టేషన్ (106.88 కి.మీ) వరకు ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. అక్కడ నుంచి కరీంనగర్ వరకు (151.36 కి.మీ) అంటే దాదాపు 44.48 కి.మీ వరకు ట్రాక్ పనులు సాగాలి. ఇవి 2025 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్లలో కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. దక్షిణ మధ్యరైల్వే అడిగిన భూమిని అటవీ భూమిని ఇచ్చేందుకు ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ అనుమతించారు. భూసేకరణ విషయంలో రైల్వే అధికారులతో సిరిసిల్ల–కరీంనగర్ కలెక్టర్లు కూడా పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మార్గం పూర్తయితే జగిత్యాల, పెద్దపల్లి వాసులకు ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లేందుకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు నేపథ్యం ఇదీ.. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2006–07లో 151 కి.మీ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం రూ.1,167 కోట్ల అంచనా వ్యయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత ఈ మార్గం ఆర్థికంగా భారమని చెప్పి రైల్వేశాఖ సుముఖత చూపలేదు. మొత్తం బడ్జెట్లో 1/3 వంతు ఖర్చుతోపాటు 100 శాతం భూమిని సేకరించి ఇవ్వడం, ఈ మార్గంలో ఐదేళ్లపాటు వచ్చే నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. దీంతో 2016లో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. ఈప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
మద్యం తాగి.. పలుమార్లు రైతు పైనుంచి ట్రాక్టర్ని.. ఘోర విషాదం..
పెద్దపల్లి: మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినడం లేదు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఓ రైతును బలితీసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబారిపేటకు చెందిన ముడిమడుగుల పోచయ్య(50) తన వ్యవసాయ పొలం దున్నడానికి మంగళవారం అదే గ్రామానికి చెందిన జాడి బానయ్యను పిలిచాడు. అతను అతిగా మద్యం తాగి, ఆ మత్తులో ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. వెనక ఉన్న పోచయ్యను గమనించకుండా వేగంగా నడపడంతో ట్రాక్టర్ అతన్ని తొక్కుకుంటూ వెళ్లింది. ఈ సంఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న బానయ్య పలుమార్లు ట్రాక్టర్‌ను మృతదేహం పైనుంచి తిప్పడంతో నుజ్జునుజ్జయి, తల, మొండెం, కాళ్లు, చేతులు వేటికవే పూర్తిగా తెగిపోయాయి. పొలం దున్నడం పూర్తయిన తర్వాత పోచయ్య కనిపించడం లేదని అతని కుమారుడు సతీశ్‌కు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతకగా ఆచూకీ లభించలేదు. రాత్రి సమయంలో పొలంలో వెతకగా రక్తం, పోచయ్య శరీర భాగాలు కొద్దిగా కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు బుధవారం పొలంలో పూర్తిగా తెగిపడిన మృతుడి శరీర భాగాలను బయటకు తీయించి, పోస్టుమార్టం చేయించారు. పోచయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం తాగి, ట్రాక్టర్ నడిపి, పోచయ్య మృతికి కారణమైన బానయ్యపై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
అమెరికాలో ప్రధాని మోదీతో జగిత్యాలవాసి.. ఆయన ఎవరంటే?
జగిత్యాల జోన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అక్కడే స్థిరపడ్డ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు నలమాసు ఓంకార్ కూడా పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో సాంకేతిక అంశాలపై ప్రధానితో ఆయన చర్చించారు. అయితే, హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎంఫిల్ చేసిన ఓంకార్ సుమారు 30 ఏళ్ల కిత్రం అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆయన శానిఫ్రాన్సిస్కోలోని గ్లోబల్ చిప్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన -
ఊర చెరవు పండుగ.. సర్పంచ్‌లకు కష్టాలు!
జగిత్యాల: నెర్రెలు బారిన చెరువుకు కళ వచ్చిందని సంతోషించాలా..? లేక, ఊర చెరువు పండుగకు తప్పనిసరి పరిస్థితుల్లో చెరువు నింపాల్సి రావడానికి బాధపడాలా..? ఇదిగో ఈ మీమాంసే సర్పంచులను వేధించింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లిలో.. ఊర చెరువు పండుగ చేసేందుకు సిద్ధమైనా.. చెర్లో నీళ్లు లేకపోవడంతో అక్కడి సర్పంచ్ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏకంగా ట్యాంకర్ తెచ్చి చెరువును నీటితో నింపే దృశ్యాలు.. ఇప్పటికే అప్పుల బాధతో బిల్లులు కూడా రాక ఇబ్బందులు పడుతున్న సర్పంచుల కష్టాలను కళ్లకు కట్టింది. అయితే, ప్రకృతి సిద్ధంగా నిండాల్సిన చెరువుకు ఎన్ని ట్యాంకర్స్ నీళ్లు పోస్తే మాత్రం నిండుతుంది చెప్పండి. అందుకే, ఏవో కొన్ని నీళ్లతో నింపి.. ఊరచెరువు పండుగను మమ అనిపించారు అక్కడి ప్రజాప్రతినిధులు. -
జగిత్యాల పెద్దాసుపత్రి వైద్యుల నిర్లక్ష్య వైఖరి
-
కాలు పోయినా కళను వీడలేదు.. నాట్యం నేర్చుకుని ప్రశంసలు పొందింది
-
తాళాల పంచాయతీ.. ‘ఇది కుట్ర ప్రకారమే జరిగింది..’
జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
జగిత్యాల : కొండగట్టు ఆలయంలో చోరీ
-
రూ.14 లక్షల సుపారీ.. బావమరిది హత్యకు బావ కుట్ర..
కోరుట్ల: ఆర్థిక లావాదేవీలు.. వృత్తిపరమైన పోటీని తట్టుకోలేక ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి సహా నలుగురు సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసి 2 కార్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. బుధవారం కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన ధనకంటి సంపత్(35) ఆర్ఎంపీగా పనిచేసూ్తనే చిట్టీలు, ఫర్నీచర్ షాపు నిర్వహించేవాడు. సంపత్ సొంత బావమరిది, రాయికల్‌కు చెందిన సంకోజి విష్ణువర్ధన్(32) తన బావమరిది అజయ్(28)తో కలిసి చిట్టీలు, ఫర్నీచర్ షాపు నడపడంలో సంపత్‌కు ఆర్థికంగా సాయం చేశాడు. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. ఫర్నీచర్ షాపు, చిట్టీల వ్యవహరంలో సంపత్‌కు అతడి బావమరిది విష్ణువర్ధన్, అజయ్‌కు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వీటితోపాటు తన కుటుంబంలో విష్ణువర్ధన్ తరచూ జోక్యం చేసుకోవడం సంపత్‌కు కంటగింపుగా మారిది. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌తోపాటు అజయ్‌ను అడ్డుతొలగిస్తే అత్తగారి ఆస్తి మొత్తం తనకు కలిసివస్తుందన్న దురాశ సంపత్లో కలిగింది. రెండేళ్ల క్రితం విష్ణువర్ధన్ అనారోగ్యానికి గురికాగా, సంపత్ వైద్యం అందించి కావాలని ఓవర్‌డోస్ ఇంజక్షన్లు ఇచ్చి హత్యకు యత్నించాడు. ఆ తర్వాత విష్ణువర్ధన్ కోలుకోగా తన ప్రయత్నం ఫలించలేదని భావించిన సంపత్.. నాలుగు నెలల క్రితం ఓ హత్యాయత్నం కేసులో నిందితుడైన పైడిమడుగు గ్రామానికి చెందిన క్యాతం శేఖర్(26)ను కలిసి విష్ణువర్ధన్, అజయ్‌తోపాటు వృత్తిలో పోటీగా ఉన్న పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్‌ను హత్య చేయడానికి తనకు సహకరించాలని కోరాడు. రూ.14లక్షల సుపారీకి ఒప్పందం.. క్యాతం శేఖర్ పైడిమడుగుకు చెందిన మేదిని శ్రీకాంత్(28), కోరుట్లకు చెందిన విత్తనాల నాగరాజు(40), ఆకుల అశోక్‌తో కలిసి విష్ణువర్ధన్, అజయ్, రాజేందర్‌ను చంపడానికి రూ.14 లక్షల సుపారీకి సంపత్తో ఒప్పందం చేసుకున్నాడు. తొలుత రాజేందర్‌ను చంపితే రూ.4లక్షలు, తర్వాత విష్ణువర్ధన్, అజయ్‌ను చంపితే మిగిలిన రూ.10 లక్షలు ఇస్తానని సంపత్తో ఒప్పందం చేసుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదిరిన తర్వాత డబ్బులు చెల్లించడంలో సంపత్ జాప్యం చేశాడు. డిసెంబర్ 5వ తేదీన సంపత్తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్న ఆకుల అశోక్, మేదిని శ్రీకాంత్.. హత్య కుట్రలో ఒకరైన పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్ ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి బయటకు పిలిచారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. దీంతో ఇరుగుపొరు రావడంతో అశోక్, శ్రీకాంత్ అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆర్ఎంపీ రాజేందర్, సంకోజి విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఎస్సైలు చిర్ర సతీశ్, శ్యాంరాజ్, సుధీర్‌రావు, రాంచంద్రం.. సుపారీ ఒప్పందం చేసుకుని హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, మేదిని శ్రీకాంత్, ఆకుల అశోక్, విత్తనాల నాగరాజు, క్యాతం శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ, కోరుట్ల సర్కిల్ పరిధిలో పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సొంత బావమరిదితోపాటు మరో ఇద్దరి హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, సుపారీ గ్యాంగ్ సభ్యుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్పోన్లు స్వా«ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించి, ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీసులకు రివార్డు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐ వివరించారు. చదవండి: భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు.. -
కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు: బండి సంజయ్
-
ఈసారి కేసీఆర్ సెంటిమెంట్ వర్క్ ఔట్ కాదు: బండి సంజయ్
సాక్షి, కోరుట్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కుట్రలను తెలంగాణ వాసులు గమనిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం జిగిత్యాల జిల్లాలో ఉన్న బండి సంజయ్.. కేసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఆయన మళ్లీ తెలంగాణలో సెంటిమెంట్‌ని రగిల్చి ప్రజల మనసు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పోందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ తన పాలనలో సాగించిన ఆగడాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు మీకు తగిన బుద్ధి చెబుతారంటూ విరుచుపడ్డారు. దేశంలో ఎక్కడ ఆరోపణలు వచ్చినా సీబీఐ వస్తుందన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ యాగం చేసినా ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్తో కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అంతేగాదు జగిత్యాల పర్యటనలో ముందుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. (చదవండి: ముథోల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో బండి సంజయ్?) -
Velichala Jagapathi Rao: టైగర్ జగపతిరావు ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురంధరుడు.. మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్సీ వెలిచాల జగపతిరావు (87) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. అహర్నిశలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ టైగర్ జగపతిరావుగా పేరు పొందారు. 1935లో రామడుగు మండలం గుండి గ్రామంలో జన్మించిన జగపతిరావుకు ఇద్దరు కుమారులు వెలిచాల రాజేందర్రావు, రవీందర్రావు, కూతురు శోభ ఉన్నారు. 1970లో రాజకీయ అరంగేట్రం.. వెలిచాల జగపతిరావుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. 1970లోనే గుండి సహకార సంఘం చైర్మన్‌గా.. అనంతరం గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ► సహకార సంఘాల సేవలను విస్తరించేందుకు 1972–77 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా విశేష సేవలందించారు. ► 1972లోనే జగిత్యాల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా, 1978–84 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగారు. ► 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించినా అధిష్టానం ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార గుర్తుపై గెలిచి సంచలనం సృష్టించారు. ► తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా తెలంగాణ లెజిస్టేచర్స్ ఫోరం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ► ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా చేపట్టి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ► 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జగపతిరావు కవిగా కూడా సుపరిచితులు. ► తెలంగాణ స్వరాష్ట్రం కావాల్సిందేనని కుండబద్దలు కొట్టి గణాంకాలతో సహా పలు పత్రికలకు వ్యాసాలు రాసిన ఆయన.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తప్పులు ఎత్తిచూపడంలో వెనుకంజ వేయలేదు. ► మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా ఎన్నికైన జగపతిరావు ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు, కరీంనగర్లో మార్క్‌ఫెడ్ సంస్థకు ఆస్తులను కేటాయించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ► 2017లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమానికి తన భార్య పేరిట రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. కరీంనగర్‌లోని తన ఇంటి వద్ద ప్రత్యేకంగా 5 వేల పూల మొక్కలతో బొటానికల్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. కరీంనగర్ అభివృద్ధి ఆయన చలవే.. ముక్కుసూటి మనిషిగా పేరొందిన వెలిచాల జగపతిరావు కరీంనగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1994 జనవరి 12న నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని కరీంనగర్ పర్యటనకు తీసుకువచ్చి రాంనగర్, అంబేడ్కర్ నగర్, కోర్టు చౌరస్తా, కోతిరాంపూర్‌లోని నాలుగు వాటర్ ట్యాంక్‌ల నిర్మాణంతోపాటు ఫిల్టర్ బెడ్లను నిర్మించి సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో ప్రజలకు నీటి సమస్య తప్పింది. తెలంగాణ విముక్తి కోసం నిజాం రజాకార్ల చేతిలో తొలి అమరుడైన అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయం ముందు ఏర్పాటు చేసి.. అప్పటి సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ► రాంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌కు విశాలమైన మైదానం కేటాయింపుతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థలు, కళాశాలల (సైన్స్ కళాశాల)కు స్థలాలు, అనేక క్లబ్‌ల నిర్మాణానికి స్థలాల కోసం నిధులు కేటాయించిన ఘనత జగపతిరావుకే దక్కుతుంది. విద్యుత్తు సమస్యను నివారించేందుకు దుర్శెడ్ వద్ద 220 కేవీ సబ్ స్టేషన్ దూరదృష్టితో ఆనాడే ప్రారంభించడం గమనార్హం. ► 1970లో రాజకీయ అరంగ్రేటం చేసిన జగపతిరావు ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, బుగ్గారం, కరీంనగర్ స్థానాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెండు సార్లు గెలిచారు. మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా ఐదు సంవత్సరాలు పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఒకసారి గెలిచారు. ► జగపతిరావు మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మేయర్ వై.సునీల్‌రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతోపాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. జగపతిరావు అంత్యక్రియలు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
జగిత్యాల జిల్లాలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు
-
మోరపల్లిలో మహిళ హత్య.. మద్యం తాగించి.. అత్యాచారం చేసి..!
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో బుధవారం మరో హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి శివారులోని ఊరు చెరువులో చేపలు పట్టేం దుకు బుధవారం ఉదయం మత్స్యకారులు వెళ్లారు. అక్కడ ఓ మహిళ (సుమారు 35) మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బుధ వారం వేకువజామున హత్యకు గురైనట్లు సంఘటన స్థలంలో కనిపిస్తున్న ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడి నుంచో ఓ మహిళను తీసుకొచ్చి మద్యం తాగించి అత్యాచారం చేసి.. ఆమె ప్రతి ఘటించడంతో గొంతుకోసి, తలపై బాది చంపినట్లు అనుమానిస్తున్నారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో అదృశ్యమైన మహి ళల కేసుల నమోదుపై ఆరా తీస్తున్నారు. లైంగిక దాడికి గురైన మహిళ ఎవరు, ఆమెపై అత్యాచారం చేసిన వారెవరు? అనే విషయాలేవీ ప్రస్తుతం తెలియరాలేదని డీఎస్పీ చెప్పారు. -
పాపకు ప్రాణమున్నా పోయిందన్నారు.. చివరి నిమిషంలో ట్విస్ట్
జగిత్యాల: ఐదు రోజుల శిశువు. అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంది. కాపాడుకోవడానికి రూ.లక్ష కుమ్మరించారు తల్లిదండ్రులు. అయినా ‘పాప ప్రాణం పోయింది.. తీసుకెళ్లండి’ అన్నారు డాక్టర్లు. దీంతో ఆశలొదులుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ప్రేమ ఆ పసిగుడ్డు గుండెను కరిగించిందేమో.. శ్మశానంలో ఉండగా కదలికలొచ్చాయి. ప్రాణంతోనే ఉందని గుర్తించి, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వేణుకు సంగీతతో వివాహం జరిగింది. ప్రసవానికి సంగీత తల్లి ఊరైన కోరుట్లకు వెళ్లింది. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏప్రిల్ 27న పాపకు జన్మనిచ్చింది. పాప ఉమ్మ నీరు తాగిందని, ఆరోగ్య సమస్యలున్నాయని అక్కడే చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో... కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రూ. లక్ష వరకు ఫీజు వేసిన ఆస్పత్రి, పాప బతికే పరిస్థితి లేదని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించింది. పాపలో చలనం లేకపోవడంతో చనిపోయిందని భావించి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ పాప కదలడం గుర్తించిన తల్లిదండ్రులు.. వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో సంగీత–వేణు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పలు ప్రాంతాల్లో భూకంపం
జగిత్యాల/రామగుండం/మొగుళ్లపల్లి/మల్హర్/మంచిర్యాలటౌన్: రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో ఆదివారం స్వల్పంగా భూమి కంపించింది. 3 నుంచి 5 సెకన్లపాటు కంపించడంతో ఆయా జిల్లాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యా రు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సాయం త్రం 6.48 గంటల సమయంలో 5 సెకన్లపాటు భూమి కంపించింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, బీర్పూర్, రాయికల్, గొల్లపల్లి మండలాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరు గులు తీశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, అంతర్గాం, ముత్తారం మండలాల్లో భారీ శబ్దాలు రావడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయి. జయశంకర్ భూపాలపల్లి మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు రంగాపురంలో రాత్రి 7 గంటల సమయంలో భూమి 3 సెకన్ల పాటు.. మల్హర్ మండలం కుంభపల్లి, దుగ్గొండి మండలం రేకంపల్లిలో, కొత్తపల్లి(బి), మానేరు పరీవాహక ప్రాంతంలో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 2 సెకన్లపాటు భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలో... మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ ఆదివారం సాయంత్రం 6:48 గంటల సమయంలో 3 సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ, ఐబీ ప్రాంతం, నెన్నెల మండలం చిత్తాపూర్, జంగాల్‌పేటలో, హాజీపూర్ మండలం నర్సింగాపూర్‌లో, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, దండేపల్లి, భీమారం మండలాల్లోనూ భూమి కంపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా భూమి కంపించి రిక్టర్ స్కేల్‌పై 4.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. అక్టోబర్ 23న కూడా వీటిల్లోని కొన్నిప్రాంతాల్లో భూకంపం సంభవించింది. వారం తర్వాత మళ్లీ భూమి కంపించడం తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
ముగ్గురు యువతుల ఆత్మహత్య
జగిత్యాల(కరీంనగర్): జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గుట్టవద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి వివాహం అవ్వగా, మరో యువతి ఇంటర్ చదువుతోంది మృతులు గంగాజల దేవి, మల్లిక, వందనలుగా పోలీసులు గుర్తించారు. వారి ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: లైవ్ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ -
ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలి
మెట్పల్లి: ముత్యంపేట నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతులు కదం తొక్కారు. మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు క్వింటాలుకు రూ.15వేల మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాతోపాటుగా జిల్లా నలుమూలలనుంచి ఈ మహాధర్నాకు రైతులు తరలివచ్చి అక్కడి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సక్రమంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చిన టీఆర్ఎస్..గద్దెనెక్కిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోకపోగా మూసివేసిందని దుయ్యబట్టారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం.. చక్కెర ఫ్యాక్టరీని తెరిస్తే వరి స్థానంలో చెరుకు పంటను సాగు చేయడానికి ఇక్కడి రైతాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల ధర్నా సమాచారం అందుకున్న కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్ వారి వద్దకు చేరుకున్నారు. రైతులు ఆయనకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. -
శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పించండి
సారంగాపూర్(జగిత్యాల): తిరుపతిలోని శ్రీవారి దర్శనం కోసం టికెట్లు కావాలంటూ ఓ భక్తుడి ఫోన్‌కు స్పందించి పనయ్యేలా చూశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన సాయిని తిరుపతి స్రవంతి దంపతులు, వారి ఇద్దరు కుమారులు, తల్లినర్సమ్మతో కలసి శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని తెలియకపోవడంతో ఈనెల 2న కరీంనగర్ నుంచి రైల్లో బయల్దేరేందకు టికెట్లు మాత్రమే రిజర్వు చేయించుకున్నారు. ఈ నెల 1న వీరికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న తిరుపతి ఆన్లైన్ టికెట్ల కోసం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేయగా..స్పందించిన ఆయన వారి వివరాలను వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపమని చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి ఈనెల 3న శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించారు. దర్శనం అనంతరం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ మెసేజ్ ద్వారా తిరుపతి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
లాభసాటి బిజినెస్, మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్
జగిత్యాలటౌన్: మహిళల మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్‌లు నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ట్రెండుతో పాటు మహిళల ఆసక్తి, అభిరుచికి తగిన విధంగా అనేక రంగులు, డిజైన్లు, మెటీరియల్ ఒకేచోట లభిస్తుండటంతో బొటిక్‌లకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక షాపులో మెటీరియల్ కొనుగోలు చేసి దానికి లైనింగ్ మరోచోట, స్టిచింగ్ ఇంకో చోట ఇలా పలు దుకాణాలు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాల నిర్వహణతో బిజీగా మారిన మహిళలకు వన్‌స్టెప్ సర్వీస్ అందజేస్తున్న బొటిక్‌లు వరంగా మారాయి. మెటీరియల్, లైనింగ్, డిజైనింగ్‌తో పాటు స్టిచింగ్ కూడా ఒకేచోట లభిస్తుండటంతో మహిళలు బొటిక్‌లకు క్యూ కడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, పార్టీలు, సందర్భం ఏదైనా బొటిక్కు వెళ్లి అకేషన్ డీటేల్స్ చెప్తే చాలు మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి కంప్యూటర్ డిజైనింగ్ మగ్గం వర్క్ ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా రెడీ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడం బొటిక్‌ల ప్రత్యేకత. అభిరుచికి అనుగుణంగా.. గతంలో కస్టమర్లు మ్యాచింగ్ బ్లౌజులు మాత్రమే అడిగేవారు. ప్రస్తుతం మారుతున్న మహిళల ఆలోచన, అభిరుచికి అనుగుణంగా మగ్గం వర్క్, బోట్‌నెక్, కంప్యూటర్ బ్లౌజులకు గిరాకీ పెరిగింది. అకేషన్ డీటేల్స్ చెప్తే ఏది వేసుకుంటే బాగుంటుందో సజెస్ట్ చేయడమే కాకుండా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ సెలెక్షన్, డిజైన్, మగ్గం వర్క్‌తో ట్రెండీ బ్లౌజెస్ రెడీ చేసి ఇస్తాం. అందుబాటు ధరల్లో అనుకున్న డిజైన్లు అనుకున్న సమయానికి డెలివరీ ఇస్తున్నాం. బొటిక్ నిర్వహణతో స్వయం ఉపాధితో పాటు పదిమందికి పని కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – ప్రణీత, బొటిక్ నిర్వాహకురాలు మహిళల అభిరుచిని బట్టి బోట్‌నెక్, మగ్గం వర్క్, కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజెస్ అందుబా టులో ఉన్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ ధరలు రూ.1400 నుంచి రూ.10వేల వరకు ఉండగా, బోట్‌నెక్ బ్లౌజులకు రూ.400 నుంచి రూ. వెయ్యి చార్జ్ చేస్తున్నారు. కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజులకు రూ.500 నుంచి రూ.3వేల వరకు మెటీరియల్ డిజైన్ బట్టి ధర నిర్ణయిస్తారు. -
తెలంగాణలో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా
డబ్ల్యూడీసీడబ్ల్యూ పటాన్చెరువు అంగన్వాడీల్లో 32 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. పటాన్ చెరువు పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 32 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్–08, అంగన్వాడీ ఆయా–24. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరాఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: https://mis.tgwdcw.in or https://wdcw.tg.nic.in యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడీల్లో 57 పోస్టులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 57 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్లు–08, అంగన్వాడీ ఆయాలు–45, మినీ అంగన్వాడీ టీచర్లు– 04. ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఆలేరు–18, భువనగిరి–14, మోత్కూర్–10, రామన్నపేట–15. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై, స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 26.08.2021 నుంచి 28.08.2021 వరకూ. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: https://wdcw.tg.nic.in డీహెచ్ఎస్, జగిత్యాలలో 10 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన జగిత్యాల జిల్లా హెల్త్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–04, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫార్మసిస్ట్–05. ► సివిల్ అసిస్టెంట్ సర్జన్: అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► ల్యాబ్ టెక్నీషియన్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఫార్మసిస్ట్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డీఎంఎల్టీ/బీఎస్సీ(ల్యాబ్ టెక్నీషియన్) ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జగిత్యాల చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://jagtial.telangana.gov.in మేనేజ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► పోస్టుల వివరాలు: డైరెక్టర్(అగ్రికల్చర్ మార్కెటింగ్)–01, రీసెర్చ్ అసోసియేట్ (అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్)–01, రీసెర్చ్ అసోసియేట్(నాలెడ్జ్ మేనేజ్మెంట్)–01, జూనియర్ స్టెనోగ్రాఫర్–01, అసిస్టెంట్ క్యాషియర్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్–500030, హైదరాబాద్, తెలంగాణ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://www.manage.gov.in టీఎస్ పోస్టల్ సర్కిల్లో 55 స్పోర్ట్స్ కోటా పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ► పోస్టుల వివరాలు: పోస్టల్ అసిస్టెంట్–11, సార్టింగ్ అసిస్టెంట్–08, పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్–26, ఎంటీఎస్–10. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత స్థానిక భాష వచ్చి ఉండాలి. ► వయసు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ► క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్ తదితరాలు. ► క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ► ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: https://tsposts.in -
జగిత్యాలలో కలకలం: శవాన్ని బతికిస్తామని క్షుద్రపూజలు
జగిత్యాల క్రైం: ఓ వైపు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రజల్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ దంపతులు ముందుకు రావడం.. మృతుని కుటుంబ సభ్యులు వారి మాటలు నమ్మడమే ఇందుకు నిదర్శనం. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్షుద్రపూజలు చేస్తే చనిపోయిన వ్యక్తి బతుకుతాడని, ఇందుకు పోలీసులు అడ్డుపడడం తగదని ఆగ్రహిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి మరీ నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామానగర్‌కు చెందిన ఒర్సు రమేశ్, అనిత భార్యాభర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు. 15 రోజుల క్రితం వారు తమ ఇంటి సమీపంలోని కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులతో గొడవపడ్డారు. అంతు చూస్తానంటూ రాజు ఆ సమయంలో రమేశ్‌ను బెదిరించాడు. కొద్దిరోజుల తర్వాత రమేశ్ ఇంట్లో దుర్గమ్మ పండుగ చేసుకున్నారు. మరుసటిరోజున రమేశ్ పిలవకుండానే అతని ఇంటికి పుల్లేశ్ భోజనం కోసం వెళ్లాడు. అప్పటికే భోజనం అయిపోగా.. కాసేపు ఆగితే వండిపెడతామని రమేశ్ చెప్పాడు. అయితే పుల్లేశ్ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందాడు. చేతబడి చేశారని ఆరోపిస్తూ.. కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర చేతబడి చేయడంతోనే రమేశ్ చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు ఆ దంపతులను కట్టేసి కొట్టారు. దెబ్బలు భరించలేక తానే చేతబడి చేశానని.., సగం చంపానని, క్షుద్రపూజ చేసి బతికిస్తానని రాజు చెప్పాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు పూజాసామగ్రి తీసుకొచ్చారు. పూజ చేసేందుకు పుల్లేశ్ దంపతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజు, సుభద్రలను అదుపులోకి తీసుకున్నారు. అయితే రమేశ్ సగం ప్రాణంతో ఉన్నాడని, అతని మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించి పరీక్షించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు.. పుల్లేశ్ మంత్రం వేస్తే రమేశ్ బతికి వస్తాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కరీంనగర్–జగిత్యాల రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కానీ రాత్రి 7 గంటల వరకు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆ 2 గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామాలు మరోసారి స్వచ్ఛంద లాక్డౌన్ వైపు కదులుతున్నాయి. వెల్గటూర్ మండలం ఎండపల్లి (జనాభా 4,200) గ్రామంలో జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు లాక్డౌన్ విధించారు. తాజాగా మల్యాల మండలం మద్దుట్ల (జనాభా 2,000)లోనూ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఇటీవల రోజూ వందకుపైనే కేసులు నమోదవుతున్నాయి. మద్దుట్లలో రెండ్రోజుల్లో 32, ఎండపల్లిలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రెండు గ్రామాల సర్పంచ్‌లు గ్రామాల్లో లాక్డౌన్ విధిస్తూ తీర్మానాలు చేశారు. మద్దుట్లలో ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 7 నుంచి 8 వరకు సడలింపులనిచ్చారు. ఇతర సమయాల్లో బయటకు వెళ్తే రూ.5 వేల జరిమానా విధిస్తున్నారు. ఎండపల్లిలో ఉదయం 7 నుంచి 9 వరకు మాత్రమే సడలింపు అమల్లో ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తున్నారు. మాస్క్ ధరించకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. -
కరీంనగర్(జగిత్యాల): 3 గజాల స్థలం.. ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది
-
ప్రేమించటం లేదని యువతిపై కత్తి దాడి.. అనంతరం..
సాక్షి, జగిత్యాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించటం లేదని ఓ యువతిపై కత్తితో దాడి చేశాడో యువకుడు. అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన జాబితాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మేడిపల్లి మండలం, మన్నెగూడెంకు చెందిన రాజ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. సదరు యువతి అతడి ప్రేమను అంగీకరించలేదు. దీంతో పగ పెంచుకున్న రాజ్ కుమార్ శనివారం ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలవ్వగా.. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి : ఈపాస్‌ల కోసం ఏకంగా ట్రంప్, అమితాబ్‌లను వాడేశారు.. -
క్వింటాల్‌కు రూ. 10 వేలు: రైతుల సంబరం!
సాక్షి, జగిత్యాల: పసుపు పంట క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతుండటంతో రైతులు సంబరపడి పోతున్నారు. వర్షాలు, చీడ పురుగుల కారణంగా పసుపు దిగుబడి సగానికి తగ్గినప్పటికీ ధర ఆశాజనకంగా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డుకు రోజుకు సుమారు 200 క్వింటాళ్ల పసుపు వస్తోంది. సోమవారం మెట్పల్లి మార్కెట్లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.8,800 ధర పలికింది. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు నిత్యం 25 వేల క్వింటాళ్ల వరకు పసుపు వస్తుండగా సోమవారం అత్యధికంగా 50 వేల క్వింటాళ్లకు పైగా పంటను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. క్వింటాల్ పసుపునకు అత్యధికంగా రూ.10,555 ధర పలకడం విశేషం. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే రెట్టింపయ్యింది ఈసారి పసుపు ధర గతం కంటే రెట్టింపు పలుకుతోంది. రైతులు మార్కెట్లో అమ్ముకునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు చేరువైంది. ధర మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. -
ఆడపిల్ల పెళ్లికి కానుకగా రూ.5,016..
ఆడపిల్లా.. అంటూ ఇప్పటికీ ముఖం చిట్లించే వారెందరో! కానీ ఈ ముగ్గురూ ఆడపిల్ల పుట్టుకను పండుగ చేస్తున్నారు. ఓ సర్పంచ్ ఆడపిల్ల పుడితే రూ.5 వేలు కానుకగా ఇస్తుంటే.. ఇంకో సర్పంచ్ ఆడపిల్లకు కట్నంగా రూ.5,016 అందజేస్తున్నారు. ఇంకో వైద్యురాలు ఆడపిల్ల పుడితే ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నారు. ఈ ముగ్గురి పరిచయం.. ఆడబిడ్డ కట్నం రూ.5,016 ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ సర్పంచ్ నేరెళ్ల హేమలత మహిళా ప్రజాప్రతినిధిగా గ్రామాన్ని ప్రగతిపథంలో నడపడమే కాదు.. ఆ ఊళ్లో పుట్టే ప్రతి ఆడపిల్లకు అండగా నిలవాలనుకున్నారు. ఈ క్రమంలో ఏ ఇంట ఆడబిడ్డ పెళ్లి జరిగినా కట్నంగా రూ.5,016 ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 36 యువతులకు చెక్కులను అందించారు. ఇటీవలే ఒకేసారి గ్రామంలో 67 మందికి కరోనా పాజిటివ్ రాగా పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి బాధితులకు పౌష్టికాహారం అందించారు. వలసకూలీలకు బియ్యం, నిత్యావసర సరుకులను అందచేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఆడబిడ్డలకు పెండ్లి కానుకతో పాటు, తోటివారికి తోచిన సాయం చేస్తానని సర్పంచ్ హేమలత చెబుతున్నారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఆదర్శంగా నిలుస్తున్న బీబ్రా సర్పంచ్ దహెగాం(సిర్పూర్): ఆడపిల్ల పుడితే తల్లి పేరిట రూ.5వేలు కానుకగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుమురంభీం జిల్లా దహెగాం మండలం బీబ్రా గ్రామ సర్పంచ్ బండ కృష్ణమూర్తి. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన వెంటనే తన సొంత డబ్బును పోస్టాఫీసులో మాతృమూర్తి పేరిట డిపాజిట్ చేస్తున్నారీయన. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెప్పే ఈయన.. ఆడపిల్లను తల్లిదండ్రులకు బరువుగా భావించకూడదంటారు. 2020 జూన్ 2న, తన తల్లిదండ్రులైన బండ సుదర్శన్–సులోచనల పెళ్లిరోజును పురస్కరించుకుని గ్రామ పంచాయతీలో మొదటి కాన్పుగా ఆడపిల్ల పుడితే రూ.5 వేలు చిన్నారి తల్లి పేరిట డిపాజిట్ చేస్తానని ఈయన గ్రామస్తుల ముందు ప్రకటించి.. అలాగే చేస్తున్నారు. ‘అపూర్వ’ సాయం భైంసాటౌన్(ముథోల్): ఆడపిల్ల అని తెలిస్తే.. గర్భంలోనే చిదిమేస్తున్న తల్లిదండ్రులను చూసి చలించిన ఆమె.. తనవంతుగా ఆడశిశువును బతికించే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చేవారికి ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నారు. భైంసాకు చెందిన డాక్టర్ అపూర్వ.. భర్త డాక్టర్ రజనీకాంత్‌తో కలిసి భైంసాలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. 2016 నుంచి తమ ఆస్పత్రిలో కాన్పు చేసుకున్న వారికి ఆడబిడ్డ పుడితే ఎలాంటి రుసుం లేకుండా ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికి 400 ఉచిత ఆపరేషన్లు చేశామని అంటున్నారీమె. ‘గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే చాలామంది అబార్షన్ చేయిస్తున్నారు. వైద్యవృత్తిలో ఉన్నందుకు మా వంతుగా ఆడపిల్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నా’మని చెప్పారు డాక్టర్ అపూర్వ. -
ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం
-
ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం
జగిత్యాల: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమెకు ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన కల్వకుంట్ల కవిత కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రాజారాంపల్లి వద్దకు రాగానే జగిత్యాల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కారు కొద్దిగా తగిలింది. అప్రమత్తమైన కవిత కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రవిశంకర్ కార్లలోనే ఉన్నారు. అయితే వారికి గాయాలు కాలేదని.. సురక్షితంగా బయటపడ్డారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. -
కాల్వలతో కాదు.. పైపులతో పారిద్దాం
ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందుతుంది. ప్రధాన కాల్వల నుంచి పిల్ల కాల్వల ద్వారా సాగునీరు రైతుల పొలాలకు చేరుతుంది. అయితే ముందుగా తమ క్షేత్రానికి నీరు అందాలనే ఆత్రంలో పిల్ల కాల్వలకు, గట్లకు గండికొట్టడం ద్వారా నీళ్లు మళ్లిస్తుంటారు. ఫలితంగా రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. పైపెచ్చు కాల్వల ద్వారా సాగునీటిని అందించే క్రమంలో దాదాపు 30 శాతం వరకు నీరు వృథా అవుతుంది. అలాకాకుండా మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందినట్లుగా... పైపుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందితే ఎలాగుంటుంది? అద్భుతం కదూ! నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు ఇలాగే పైపుల ద్వారా నీరందనుంది. పంటకు నీరు పెట్టాలనుకుంటే చేనుకు సమీపంలోని వాల్వ్‌ను స్వయంగా రైతులు తిప్పుకోవచ్చు. ఈ రెండు లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి సాగవుతోంది. పైపుల ద్వారా సాగునీరు అందడం వల్ల పంట మార్పిడికి అవకాశం ఏర్పడనుంది. రైతులు వరికి బదులు అరుతడి, వాణిజ్య పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాగునీటిని తీసుకొచ్చే పైపులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ను అనుసంధానిస్తే సరిపోతుంది. పైపుల ద్వారా సరఫరా కాబట్టి నీటి వృథా గణనీయంగా తగ్గుతుంది. దీనికి డ్రిప్ తోడైతే... ప్రతి చుక్కా సద్వినియోగం కానుంది. చివరి ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన ఈ పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణాలు యుధ్ద ప్రాతిపదికన జరుగుతుండగా, ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టారు. ప్యాకేజీ–20లో బినోల సమీపంలోని ఎస్సారెస్పీ ఫోర్‌షోర్ నుంచి అప్రోచ్ చానల్, 17.82 కిలోమీటర్ల టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో సారంగాపూర్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.935 కోట్లతో చేపట్టిన ఈ పనులు 85 శాతం వరకు పూర్తయ్యాయి. సారంగాపూర్ పంప్‌హౌస్ నుంచి నిజాంసాగర్ కెనాల్‌కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు మార్గాల్లో పైప్లైన్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే 7 వేల నుంచి 8 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదే పైప్‌లై¯Œ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. భూసేకరణ తప్పుతుంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30 శాతం వరకు ఉండగా... పైప్‌లై¯న్‌తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్‌లై¯న్‌తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చనే అంచనాతో ఈ పనులు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమలవుతున్న ఈ వ్యవస్థను మోడల్‌గా తీసుకొని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. పంప్‌హౌస్‌లో సిద్ధమైన మోటార్లు పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇలా... ఎస్సారెస్పీ ఫోర్‌షోర్ నుంచి నిజాంసాగర్ కెనాల్లోకి చేరే నీటిని రెండు భాగాలుగా విభజించి నీటిని తరలించేలా పైప్‌లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒక పైప్‌లైన్ వ్యవస్థను మెట్పల్లి సెగ్మెంట్‌గా, మరో పైప్‌లైన్ వ్యవస్థను గడ్కోల్ సెగ్మెంట్‌గా విభజించి పనులు చేపట్టారు. ఫోర్‌షోర్ నుంచి నీటిని తరలించే క్రమంలో నిజాంసాగర్ కెనాల్‌ను 23.10 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులు, గడ్కోల్ సెగ్మెంట్‌కు నీటిని సరఫరా చేసే అప్రోచ్ చానల్, టన్నెల్, పంప్‌హౌస్ నిర్మాణ పనులను ప్యాకేజీ–21 కింద చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ.807 కోట్లతో చేపట్టగా, రూ.372 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ లభ్యత నీటిని తీసుకుంటూ మెట్పల్లి సెగ్మెంట్లో కొంత భాగానికి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్పల్లి సెగ్మెంట్లో 1.15 లక్షల ఎకరాలు (11.7 టీఎంసీ), గడ్కోల్ సెగ్మెంట్లో 85 వేల ఎకరాలకు(8 టీఎంసీ) నీరందించేలా ప్యాకేజీ–21(ఎ) కింద పనులను రూ. 2,950.31 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటికే 1,430కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. తొలి ప్రాధాన్యతగా మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలోని ప్రధాన పైప్‌లైన్ వ్యవస్థను పూర్తి చేసి దీనికింద ఈ వానాకాలంలోనే 20 వేల ఎకరాలకు పైపుల ద్వారా నీటిని అందించేలా పనులు జరుగుతున్నాయి. మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడ్కోల్ సెగ్మెంట్ పరిధిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికింద భూసేకరణ సమస్యలు ఉండటంతో దీని పనులను రెండో ప్రాధాన్యం కింద పెట్టుకున్నారు. నీటి తరలింపు ఇలా... తొలి ప్రాధాన్యంగా తీసుకున్న మెట్పల్లి సెగ్మెంట్ కింద 1.15 లక్షల ఎకరాల్లో 20 వేల ఎకరాలకు ఈ వానాకాలంలో నీటి తరలించేలా ప్రస్తుతం పైప్‌లైన్ వ్యవస్థ సిధ్దమైంది. నిజాంసాగర్ కాల్వల నుంచి వచ్చే 650 క్యూసెక్కుల నీటిని పైప్లైన్లోకి తోసేలా మెంట్రాజ్‌పల్లి (డిచ్పల్లి మండలం)లో పంప్‌హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 10 మోటార్ల ద్వారా నీటిని 92 మీటర్ల మేర లిఫ్టు చేసి నిర్ణీత నీటిని 3 మీటర్ల డయాతో ఉండే ఒకే ఒక్క పెద్ద ఎంఎస్ పైప్‌లోకి తరలించేలా పంప్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌస్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. దీనికి విద్యుత్‌ను అందించే సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు వేగిరం చేశారు. ఈ పైప్లైన్లోకి నీటిని తరలించే క్రమంలో ఎలాంటి చెత్తాచెదారం రాకుండా మూడు దశల్లో నీటిని ఫిల్టర్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన పైప్‌లైన్ నుంచి నీటిని వివిధ జోన్ల కింది ఆయకట్టుకు తరలించేలా మరో చిన్న పైప్‌లైన్ వ్యవస్థ, ఈ వ్యవస్థ నుంచి జోన్ల పరిధిలోని ఆయకట్టుకు నీటిని అందించేలా మరో పిల్ల పైప్‌లైన్ వ్యవస్థను మూడు రకాల పైపులతో సిధ్దం చేస్తున్నారు. పైప్‌లైన్ వ్యవస్థలో భాగంగా నిర్మిస్తున్న మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ ప్రధాన పైప్‌లైన్ 3 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు ఉండే ఎంఎస్ పైపుల వ్యవస్థ కాగా, ఈ పైప్‌లైన్ నుంచి నీటిని 900 మిల్లీమీటర్ల నుంచి 350 మిల్లీమీటర్లు ఉండే డీఐ పైపులు, అటునుంచి 315–40 మిల్లీమీటర్లు ఉండే హెచ్డీపీఈ పైపుల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలో 88.17 కిలోమీటర్ల మేర ఎంఎస్ పైపుల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇందులో 75.37 కిలోమీటర్ల వ్యవస్థ పూర్తయింది. 192 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్‌లో 114 కిలోమీటర్లు, 3,319 కిలోమీటర్ల హెచ్డీపీఈలో 1,052 కిలోమీటర్లు మేర పూర్తి చేశారు. పెద్ద పైపులైన్ నుంచి డీఐ, హెచ్డీపీఈ పైపులకు నీటిని తరలించే క్రమంలో ఓఎంఎస్ చాంబర్, డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే ఎంతమేర నీటిని తరలించాలి, ఏ ప్రాంతానికి నీటిని తరలించాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర నీటిని తరలించేలా పైప్‌లైన్ వ్యవస్థ 95 శాతం పూర్తవగా, మార్చి చివరికి 100 శాతం పనులు పూర్తి చేయనున్నారు. కొన్ని అడ్డంకులు... ఈ పైప్‌లైన్ పనులకు ప్రధానంగా భూసేకరణ లేకున్నా... రైతులు సాగు చేస్తున్న భూముల్లోంచే పైపులు వేయాల్సి ఉంది. భూమిని తవ్వి 1.20 మీటర్ల దిగువన పైపులు వేయాలి. ఆ లైన్లు వెళుతున్న మార్గాలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న భూములే కావడంతో పనులకు రైతులు అడ్డుపడుతున్నారు. వ్యవసాయ పనులు సాగని రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మాత్రమే పైపులు వేయాల్సి వస్తోంది. దీంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులు వెళ్లే భూములకు నష్టపరిహారం చెల్లిస్తే యాసంగి సీజన్లో పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ సహా ప్రజాప్రతినిధులు కోరినా ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో రైతుల సమ్మతి దొరికిన చోటే పనులు కొనసాగించాల్సి వస్తోంది. దీనికి తోడు ఓఎంఎస్ ఛాంబర్స్, డిస్ట్రిబ్యూటరీ ఛాంబర్స్ నిర్మాణాలకు గుంట కన్నా తక్కువ భూమే అవసరమవుతున్నా, దాన్ని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఇక రెండు చోట్ల రైల్వే క్రాసింగ్, నేషనల్ హైవే క్రాసింగ్‌లు వెళుతున్నాయి. మరోవైపు నిజాంసాగర్ కాల్వల వెడల్పుకు దాని పరిధిలోని భూ ఆక్రమణలు, పంటల సాగు ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. ఈ చాంబర్లు ఎలా పనిచేస్తాయంటే.. చివరి ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ఓఎంఎస్ (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్) చాంబర్ ఏర్పాటు చేస్తుండగా, ఈ ఛాంబర్లోకి వచ్చిన నీటిని 3 నుంచి 6 ఔట్లెట్ పైపుల ద్వారా బయటకు పంపించేలా ఏర్పాట్లుంటాయి. ఔట్లెట్ పైపుల ద్వారా నీటిని తరలించే వాల్వ్‌లను పూర్తిగా సాంకేతిక సహాయంతోనే ఆపరేట్ చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎంతమేర నీటిని తరలిస్తున్నారన్నది తెలుసుకునేలా దీనిలో వాటర్ మీటర్, ప్రెషర్ మీటర్లు అమర్చారు. దీనికి అవసరమయ్యే విద్యుత్‌కై సోలార్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన 20 వేల ఎకరాల పరిధిలోనే 1,892 ఓఎంఎస్ చాంబర్స్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి ఔట్లెట్ ద్వారా తరలించే ఒక్కో పైప్‌లైన్‌కు దిగువన ప్రతి 3 ఎకరాలకు నీటిని అందించేలా మళ్లీ 5–7 వరకు చిన్న పైపుల ద్వారా నీటిని తరలించేందుకు డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాంబర్స్‌లో ఉండే పైపులన్నింటికీ వాల్వ్‌లను బిగించారు. అవసరమైతేనే నీటిని వాడుకునేలా ఈ వాల్వ్‌లు ఉపయోగపడతాయి. వాటిని రైతులే ఆపరేట్ చేసుకుంటారు. -
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి ఎమ్మెల్యే
జగిత్యాల: కరోనా మహమ్మారి రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. రెండో దశలో ప్రజాప్రతినిధులు కూడా టీకాలు వేసుకోనున్నారు. అయితే సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా తీసుకున్నారు. జగిత్యాలలోని జిల్లా ప్రధాన తన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు అత్యంత జాగ్రత్తతో టీకా వేశారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు సూచించారు. మొదట కోవిడ్ వారియర్స్ ఉన్న వారికి టీకా వేసిన అనంతరం ప్రాధాన్య క్రమంలో అందరికీ టీకాలు వేస్తారని ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. వైద్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలో కరోనా రోగులకు చికిత్స అందించి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహా రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు 5 వేల ప్రైవేటు దవాఖానల్లో టీకా పంపిణీ మొదలైంది. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ వేసుకోనున్నారు. రెండో దశలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా టీకా తీసుకోనున్నారు. -
అవినీతి జరిగితే కోర్టుకెళ్లు..
సాక్షి, జగిత్యాల: ప్రతి మంచి పనిని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ లో నూతనంగా నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. అవినీతి ముఖ్యమంత్రి జైలుకు వెళ్లక తప్పదంటున్న బండి సంజయ్.. అవినీతి జరిగితే కోర్టుకు వెళోచ్చని సూచించారు. (చదవండి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు) అవినీతి లేని రాష్ట్రం ఒక్క తెలంగాణానేనని స్పష్టం చేశారు. చేయచేతకాదు, చేస్తే ఓర్వ లేరని, దుర్మార్గంగా మాట్లాడతారని ఆరోపించారు. వేలాది టీఎంసీల నీరు ప్రతిఏటా వృధాగా పోతుంటే కళ్ళప్పగించి చూశారే తప్ప.. ఎవరు ప్రాజెక్టు నిర్మించలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మిస్తే అవినీతి అంటారని విమర్శించారు. విమర్శించే ముందు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు, పంప్ హౌస్‌లను చూడాలని మంత్రి హితవు పలికారు. (చదవండి: ఆహా.. అల్లం చాయ్.. ఇంకేం కావాలి: కవిత) -
నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..
సాక్షి, మల్యాల(చొప్పదండి): బిగ్‌బాస్ షోలో కనబడితే చాలు అనుకునే వేలాది మందికి రాని అవకాశం గంగవ్వ తలుపు తట్టింది. చాంపియన్ కావాలనే సంకల్పంతో అడుగుపెట్టే వారికి భిన్నంగా తన ఇంటి కల నెరవేరితే చాలు అనుకుంటూ ఆ షోలో అడుగుపెట్టింది. రూ.లక్షలు కావాలనే కోరిక లేదు.. ఇల్లు కట్టుకుంటే చాలు అనే కల తప్ప.. ఆ మాటే చెప్పింది బిగ్‌బాస్ షోలో.. గంగవ్వ ఇంటి కల నెరవేరుస్తా అని బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మాట ఇవ్వడంతో తాను అనుకున్నది సాధించినంత సంబరపడింది. రియాల్టీ షో.. నటన అంటే తెలియదు.. తెలిసిందల్లా తనకు తోచింది చేసుడే.. నిర్మలమైన హృదయం.. కల్మషం లేని మనసు.. అందరూ మంచిగ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం.. అక్షరం నేర్వకపోయినా కష్టాలు, కన్నీళ్లు జీవిత పాఠాలు నేర్పాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అందరూ గంగవ్వ కోసం బిగ్‌బాస్ చూశారనడంలో అతిశయోక్తి లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల నుంచి తెలుగువారు లక్షలాది మంది ఆమెకు అభిమానులయ్యారు. బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చిన యూ ట్యూబ్ స్టార్ గంగవ్వకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమె షోను వీడుతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన గంగవ్వ బిగ్‌బాస్ షోలో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇల్లు కోసం పైసలత్తయంటే పోయిన.. అవ్వగారి ఊరు పొలాస నుంచి అత్తగారి ఊరు లంబాడిపల్లికి అచ్చిన అంటే ఇంకో ఊరుకు పోలే. ఎప్పుడూ పొలం, ఇల్లు, చెట్టు, పుట్ట తప్ప ఏం తెల్వదు. మై విలేజ్ షో శ్రీరాం శ్రీకాంత్ తీసిన 200 సినిమాల్ల చేసిన. నేను పలుకబలుపం పట్టుకోని బడికిపోలే. సదువురాదు. శ్రీకాంత్ చెప్పింది చేసుడే వచ్చు. బిగ్బాసోళ్లు అడుగుతుండ్రు బిగ్‌బాస్‌కు పోతవా గంగవ్వ అని శ్రీకాంత్ అడిగిండు. మూడు నెలలు ఉంటవా మరి అని అంటే ఉంటా.. ఇల్లు కట్టుకునేందుకు ఉంట అని చెప్పిన. ఇగ ఏం ఆలోచించలేదు. బిగ్‌బాస్ పోత. ఇల్లు కట్టుకునేందుకు ఎన్ని రోజులైన ఉంటా అన్న. బిగ్‌బాస్‌కు పోవాల్నా అని నా బిడ్డలను అడిగిన.. పో అవ్వ అన్నరు. పోతే పైసలత్తే బిడ్డలకు కూడా ఇయ్యచ్చని అనుకొని పోయిన. కారంటైన్ చెయ్యంగ మైండ్ కరాబైంది.. ఇక్కడి నుంచి పెయినంక.. కారంటైన్ అని ఒకటే రూంల 18 రోజులు ఉంచిన్రు. గప్పుడే మైండ్ అంత కరాబైంది. ఇంక బిగ్‌బాస్‌ల ఎంట్ల ఉంటదో అనిపించింది. కండ్లకు బట్టకట్టి బిగ్‌బాస్ షోకు తీసుకపోయిండ్రు. అక్కడికి పోయిన రోజే చెప్పిన నాకు ఇల్లు లేదు సారు.. మీరిచ్చే పైసలతోని ఇల్లు కట్టుకుందామని ఆశతో వచ్చిన అన్న. రెండు వారాలకే ఇంటి మొకాన పానం కొట్టుకునుడు మొదలైంది. కొడుకు, బిడ్డలు, మనవలు, మనవరాండ్లు ఎట్ల ఉన్నరో అని మనాది వడ్డది. ఇగ ఇంటిమీద రందితో జరం అచ్చింది. సూదులు ఇచ్చిండ్రు. మందులు ఇచ్చిండ్రు. మంచిగ సూసుకున్నరు. ఎవలన్న తప్పు సేత్తె తిట్టెదాన్ని.. బిగ్‌బాస్ ఇంట్లకు పోయినాక అందరు నన్ను గంగవ్వ అనుకుంట మంచిగ సూసుకున్నరు. ఆట ఆడినప్పుడు ఒక్కలుగూడ నన్ను ఏం అనలేదు. ఎవలన్న తప్పు సేత్తె నేనే తిట్టెదాన్ని. అవ్వ.. అవ్వ అనుకుంట అందరూ నా సుట్టే తిరిగెటోళ్లు. అఖిల్ కాళ్లు ఒత్తుకుంట.. ఎట్ల ఉంది అవ్వ అనుకుంట నాతోనే ఉండెటోడు. బిగ్‌బాస్ ఇంట్ల నన్ను ఏం పని చెయ్యనియ్యలేదు. కానీ బిగ్‌బాస్ ఇంట్ల నుంచి ఎటూ పోరాదు. తెల్లందాక ఎప్పుడు ఏవో ఆటలు ఆడాలి. నిద్ర పోవుడు లేదు. బువ్వ తిందామంటే తినబుద్ది కాలేదు. ఓ టీవీ లేదు. గడియారం లేదు. చెట్టు కనవడది.. పుట్ట కనవడది.. ఎప్పుడు తెల్లారిందో.. ఎప్పుడు రాత్రయిందో తెల్వకపోతుండె. ఎట్లయినా ఇల్లు కట్టుకోవాలే అనే ఆలోచనతో అక్కడనే ఉండాలె అనుకున్న. కానీ ఎప్పుడు నలుగుట్ల తిరిగిన గదా అంత పెద్ద బంగుళాలో ఉండలేకపోయిన. నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట.. బిగ్‌బాస్ ఇంట్ల అందరు నాతోని మంచిగున్నరు. కానీ నాకు నా ఇంటి రంది వట్టుకొని రెండుసార్లు జరమచ్చింది. మొదటిసారి జరమచ్చినప్పుడు నా కొడుకును తీసుకచ్చి సూపెట్టినంక రెండు వారాలు ఉన్న. ఇగ వానలకు నా ఇల్లు ఏమైందో.. నా మనవలు, మనవరాండ్లు, బిడ్డలు ఎట్లున్నరో అని రందైంది. బిగ్‌బాస్ ఇల్లు పెద్దగ మంచిగుంది. నాకే ఏసీ వడలేదు. తిండి తినబుద్ది కాలే. నిద్ర పట్టలేదు. గందుకే బయటకు వచ్చిన. నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రని పిలగాండ్లు చెప్తున్నరు. -
గర్భం దాల్చిన మైనర్ బాలిక
జగిత్యాల : ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసి ఆమె మృతికి కారణమైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో చోటుచేసుకుంది. బాలికకు పురిటినొప్పులు రావడంతో బాలిక తల్లి ఇంట్లోనే స్వంత వైద్యం చేసింది. ఈ ఘటనలో బాలికతో పాటు శిశువు కూడా మరణించగా రెండు రోజుల క్రితం మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు శవాలను వెలికితాశారు. బాలిక మృతికి పరోక్షంగా కారణమైన ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఉదంతంపై స్థానికులతో పాటు దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి) -
2 వేల ఏళ్లనాటి శాసనాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు వేల ఏళ్లకు పూర్వపు రెండు అపురూప శాసనాలు జగిత్యాల జిల్లాలో వెలుగుచూశాయి. ఇందులో ఒకటి గతంలోనే చరిత్రకారులు గుర్తించారు. రెండోది దానికి చేరువలోనే లభించిన కొత్త శాసనం. శాతవాహనుల తొలి రాజధాని కోటలింగాలకు సమీ పంలోనే ఇవి లభించడం విశేషం. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం మొక్కట్రావుపేటలోని మునులగుట్టపై ఇవి చెక్కి ఉన్నాయి. ఈ గుట్టపై జైనుల స్థావరాలున్నాయని ప్రముఖ చరిత్రకారులు పరబ్రహ్మశాస్త్రి గతంలో పేర్కొనగా, బౌద్ధుల ఆవాసాలని జితేంద్రబాబులాంటి మరికొందరు పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు రాజారాంసింగ్ ఇక్కడ శాసనమున్నట్టు గతంలో పేర్కొన్నారు. తాజాగా స్థానిక యువకుడు సముద్రాల సునీల్ వీటిని గుర్తించారని, అవి శాతవాహనులకు సంబంధించినవేనని చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రాకృత భాష, బ్రాహ్మీలిపిలో ఉన్న ఈ శాసనాల్లో ఒకదానిలోని అక్షరాలు బాగా చెరిగిపోయాయి. ఇందులో ఒకవైపు స్వస్తికం, మరోవైపు బౌద్ధంలోని త్రిరత్న గుర్తులున్నాయి. ఇది బుద్ధపాదాలను దానం చేసినపుడు వేయించిన శాసనంగా భావిస్తున్నారు. రెండో శాసనంలో ‘మణికరస సామిరేవస ధమథానం... సివప ఖరితస వాపి’అన్న అక్షరాలున్నాయి. మణికారుడు (వజ్రాల వ్యాపారి) సామిరేవుని ఆదేశంతో సివప అనే వ్యక్తి ఆ ధర్మస్థలంలో బావిని తవ్వించాడన్న అర్థంలో ఉన్నట్టు చెప్పారు. -
‘రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు’
సాక్షి, జగిత్యాల: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. సోమవారం ఆయన జగిత్యాల రూరల్‌లోని చల్గల్, పోరండ్ల పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వరి ఎక్కువ పండుతుందని చెబుతున్నారని.. ఇదేం కొత్త కాదని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేనప్పుడు కూడా అంతే పండిందని వ్యాఖ్యానించారు. ఇందులో కేసీఆర్ చేసిందేమిలేదని రైతులు కష్టపడి పండిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి పరిమితులు లేవని.. ఎన్ని మెట్రిక్ టన్నులైన ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు పండించిన ప్రతి వడ్లగింజని కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు. తెలంగాణలోనే ప్రోక్యూర్మెంట్ అవుతుందని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. గత ఏడాది ఒక్క పంజాబ్‌లోనే కోటి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ( ఎఫ్‌సీఐ) కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. కరోనా సమయంలో రవాణా సౌకర్యం తక్కువ ఉందని, హమాలి కొరత ఉందని అన్నదాతల పొట్ట కొట్టడం బాధాకరమన్నారు. వలస కూలీల భోజన సౌకర్యం కోసం కేంద్రం రూ.599 కోట్లు మంజూరు చేసిందని..అది కూడా అమలు చేయడంలేదని.. కేవలం కార్డు లేనివారికి రూ.500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. వలస కూలీల కోసం ఇచ్చిన నిధులు, కోవిడ్ ఆసుపత్రుల అభివృద్ధి కోసం ఇచ్చిన 15 వేల కోట్ల నిధులు నుంచి రూ.1500లను పంచుతున్నారని మండిపడ్డారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడానికి ట్రైన్ సదుపాయం కోసం కేంద్రం 85 శాతం భరిస్తే.. రాష్ట్ర ప్రభుతాన్ని 15 శాతం భరించమంటే ఇబ్బంది పడుతుందని ఆయన విమర్శించారు. -
చిన్నారిపై అఘాయిత్యం
మేడిపెల్లి(వేములవాడ)/కోరుట్ల: ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం పసునూర్‌లో గురువారం సాయం త్రం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన బెజ్జంకి గంగారెడ్డి అలియాస్ గంగారాం (50) 3 నెలల క్రితం పంచాయతీ పారిశుధ్య కార్మికుడిగా విధుల్లో చేరాడు. కాగా, స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారితోపాటు ఆమె అక్క, మరో బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా గంగారాం వారికి చాక్లెట్లు కొనిస్తానని నమ్మించాడు. అతడిని నమ్మిన ఆచిన్నారులు అతడి వెంటవెళ్లారు. అందులో ఎనిమిదేళ్ల చిన్నారిని గ్రామపంచాయతీ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇది గమనించిన అంగన్వాడీ టీచర్ చిన్నారి ఇంటికెళ్లి తల్లికి విషయం చెప్పింది. సర్పంచ్ సహకారంతో పోలీసులకు సమాచారం అందించగా మెట్పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, కోరుట్ల సీఐ రాజశేఖరరాజు, మేడిపెల్లి ఎస్సై శ్రీనివాస్ రాత్రి పసునూర్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు బెజ్జంకి గంగారాంను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖరరాజు తెలిపారు. -
దుబాయ్‌లో జగిత్యాల వాసి దుర్మరణం
దుబాయ్ : దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతి చెందిన వ్యక్తిని జగిత్యాల వాసి గంగాధర్‌గా అధికారులు గుర్తించారు. దుబాయిలోని ఓ కంపెనిలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గంగాధర్ ఈ నెల 5న మృత్యవాత పడినట్లుగా సమాచారం. వివరాలు..జగిత్యాల జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన గంగాధర్ దుబాయ్‌లోని సోనాపూర్ సప్లై కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కంపెనీలో పని చేసే ఎంప్లాయిస్‌ని పనిలో దింపి తిరిగి వస్తుండగా బస్సు బొల్తాపడి డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గంగాధర్ మంటల్లో చిక్కుకుని మరణించాడు. గంగాధర్ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు బోరున విలపించడంతో అక్కడ విషాదం అలుముకుంది. మృతి చెందిన గంగాధర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్, దుబాయ్‌లోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా విపుల్, సీఎం కేసీఆర్‌లు, నిజామాబాద్ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్‌లను మంద భీంరెడ్డి ట్విటర్ ద్వారా కోరారు. -
ఎడ్లబండ్లు యాడికిపాయే!
సాక్షి, కొండగట్టు(జాగిత్యాల) : గ్రామాల్లో ఒకప్పుడు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే రవాణా సౌకర్యాం కోసం ఎండ్లబండి మీదనే ప్రయాణాలు సాగించే వారు. బంధువుల ఇంటికి, ఇతర గ్రామాలకు వెళ్లాలన్న అప్పటి గ్రామీణ ప్రజలకు ఎండ్లబండిని ముఖ్య ఆధారం చేసుకునేవారు. దీంతో బండిలో ప్రయాణం చేసేందుకు పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తు వెళ్లేవారు.పొలం పనులకు, ఇతరత్ర పనులకు ఎడ్లబండిని వినియోగించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఇంటికో కారు, ద్విచక్రవాహనం ఉన్నాయి. గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులోకి రావడంతో ఎండ్లబండి ప్రయాణం కనుమరుగైంది. అనాటి ఎండ్లబండి ప్రయాణం నేటికి మర్చిపోని తీపి జ్నాపకం. ముడిసరుకుల రవాణాకు ఎండ్లబండినే ఉపయోగించేవారు. వ్యవసాయంపై వచ్చిన పంటధాన్యాన్ని తమ ఇండ్లలోకి బండ్ల ద్వారానే తరలించేవారు. ప్రస్తుతం అంతా యంత్రాల మయంగా మారింది. ఆ కాలంలో యంత్రాలు లేకపోవడంతో వరిధాన్యాలకు ఎండ్ల బండ్లను ఉపయోగించేవారు. కాలుష్యం ఉండేది కాదు ఆకాలంలో బండ్ల ద్వారా రవాణా ఉండటం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండేది కాదు. నేడు ట్రాక్టర్లు, వ్యాన్లు, లారీలు, డీసీఎం వంటి వాహనాలతో ఎంతో కాలుష్యం వెలువడుతోంది. దీంతో బండ్ల ఆదరణ తక్కువయింది. గ్రామానికి ఒకటైనా కానరావడం లేదు. ఆరోజుల్లో ప్రయాణం సురక్షితంగా ఉండేది. తీర్థయాత్రలకు సైతం కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు ఎండ్ల బండిలోనే వెళ్లేవారు. దీంతో వారి అనుభూతులు ఆప్యాయతలు తెలుపుకునేవారు. దీంతో కాలుష్యం కాకుండా ప్రమాదాలు కూడా అయ్యేవి కావు. మొత్తానికి రానున్న రోజుల్లో ఎండ్లబండ్ల పుస్తకాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొననుంది. -
‘కేఎఫ్’ కావాలి.. కరీంనగర్లో కలపండి!
సాక్షి, జగిత్యాల: బీర్బల్ కథలు వినే ఉంటారు. ‘బీర్’బాబుల లేఖ ఎప్పుడైనా చదివారా? వేసవిలో మందుబాబుల దాహం తీర్చే ‘బీర్’కాయల కోసం జగిత్యాల వాసులు ఏకంగా తమ జిల్లాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కిక్కిచ్చే ‘కింగ్‌ఫిషర్’ కోసం కరీంనగర్ జిల్లాకు మారిపోతామంటున్నారు! తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ లోంచి బయటపడ్డ ఉత్తరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ జిల్లాను తిరిగి కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కోరుతూ జగిత్యాల వాసుల పేరుతో ‘బీర్’కాయుడెవరో ఈ లేఖ రాశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇది బయటపడింది. తమకెంతో ఇష్టమైన బీర్ జగిత్యాల జిల్లాలో లభ్యంకానందున తమ జిల్లాను కరీంనగర్లో కలిపేయాలని లేఖలో కోరారు. కింగ్‌ఫిషర్(కేఎఫ్) బీర్‌ను అందుబాటులో ఉంచాలని పనిలో పనిగా అభ్యర్థించారు. ఈ లెటర్ చదివి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. అయితే ఈ లేఖ బ్యాలెట్ బాక్స్‌లో రాలేదని, ఇదంతా ఫేక్ అని స్థానికులు అంటున్నారు. -
వార్ వన్‌సైడే..!
సాక్షి, జగిత్యాల: ‘పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో ఒకటికి బదులు 12 ఈవీఎంలతో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. గెలుపు కూడా ప్రత్యేకంగా ఉండాలి’ అని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత పిలుపునిచ్చారు. ఏ సభ చూసినా వార్ వన్ సైడ్లా కనిపిస్తోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగం గా బుధవారం జగిత్యాలలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. ‘నేను పాతాళంలో ఉన్నా.. వెతికి పట్టుకుని ఓటేస్తారని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని నమ్ముకుని వచ్చా ను. ఎంపీగా నా పనితీరు బాగుందనిపిస్తే నన్ను గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే ఢిల్లీలో కొట్లాడుతానని, గల్లీలో సేవ చేస్తానని పేర్కొన్నారు. దేశ చరిత్రను మలుపు తిప్పాలంటే మనపాత్ర ఉండా లని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిం దేమీ లేదని కవిత విమర్శించారు. దేశంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, దేశం కూడా ముందుకు సాగాలంటే కాంగ్రెస్, బీజేపీని పక్కకు పెట్టాలని కోరారు. 29 రాష్ట్రా ల్లో 24 గంటల కరెంట్ ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మనకు వచ్చినట్లు దేశమంతా కరెంట్ రావాలని చెప్పారు. 16 సీట్లొస్తే తెలంగాణకు లాభం తెలంగాణ రాష్ట్ర మోడల్ అభివృద్ధి దేశంలో జరగాలంటే 16 సీట్లు టీఆర్ఎస్కు రావాలని, రేపు ఢిల్లీలో మన మాట చెల్లుబాటు అవుతుందని కవిత చెప్పారు. మట్టి పనికైనా మనోడు ఉండాలని, అలాంటిది తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలంటే గులాబీ జెండానే ఎగరాలన్నా రు. 12 మంది ఎంపీలం గెలిస్తే ప్రతి పనికి అందరం కట్టకట్టుకుని ఢిల్లీకి పోయి పనులను సాధించుకున్నామని చెప్పారు. 60 ఏళ్లలో ఎన్న డూ రానన్ని రైల్వే లైన్లు రాష్ట్రానికి వచ్చాయ న్నారు. బీజేపీకి సీట్లు వస్తే మోదీకే లాభం, కాంగ్రెస్‌కు సీట్లు వస్తే రాహుల్‌కు లాభం, టీఆర్ఎస్కు సీట్లు వస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుందన్నారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుంటే కేవలం తెలంగాణలో మాత్రమే వారికి పింఛన్ అందుతుందన్నారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ బీజేపీ చేసింది తక్కువ, అబద్ధాలు ఎక్కువ అని కవిత విమర్శించారు. ప్రధాని మోదీ నుంచి అభ్యర్థి వరకు అందరూ అబద్ధాలే మాట్లాడుతారని చెప్పారు. మోదీ నిజామాబాద్ వచ్చి ఇక్కడ కరెంట్ లేదు అంటే ఏడవాలో నవ్వాలో కూడ అర్థం కాలేదని అన్నారు. బీజేపీకి భారతీయ ఝూటా పార్టీ అని పేరు పెట్టామన్నారు. కాంగ్రెస్‌కు విజన్ లేదు.. బీజేపీ సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలను ప్రచారం చేస్తోందని కవిత మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి పెన్షన్లలో రూ.800 ప్రధాని మోదీ ఇస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో వారు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటివి మస్తుగా పుట్టించారన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు విజన్ లేదని, బీజేపీలో నిజం చెప్పే నాయకులు లేరని, అందుకే కేసీఆర్‌కు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. భలే టేస్టీగున్నాయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత జగిత్యాల రోడ్‌షో నిర్వహించారు. ప్రసంగం మధ్యలో ఓ హోటల్ వద్దకు వెళ్లి.. అటుకులు తిన్నారు. ‘అరే.. అటు కులు భలే టేస్టీగా ఉన్నాయే..’అంటూ తిరిగి వెళ్లి తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
12 ఈవీఎంలతో కొత్త చరిత్ర సృష్టిస్తా: కవిత
జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల్లో 12 ఈవీఎంలతో విజయం సాధించడంలో కొత్త చరిత్ర సృష్టిస్తానని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల అధికారులు ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలను వాడాల్సిన అవసరమేర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో బుధవారం కవిత రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..ఎన్నికల్లో తాము చెప్పిన హామీలన్నీ అమలు చేశామన్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో ఇస్తామన్న హామీ మేరకు పెంచిన పెన్షన్‌ను మే 1 నుంచి ఇస్తామని వెల్లడించారు. గజ్వేల్ స్థాయిలో జగిత్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఐదేండ్లలో ఇంత అభివృద్ధి సాధించాం.. మరి గడచిన 70 ఏండ్లలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లేకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో పోరాడాలంటే టీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చెప్పే విషపూరిత మాటలు నమ్మవద్దని అన్నారు. -
ఇక 19 మండలాలు..
జిల్లా ఇకనుంచి 19 మండలాలతో పరిపాలన సాగించనుంది. ఇప్పటికే 18 మండలాలతో ఉన్న జిల్లాలో కొత్తగా ఒడ్డెలింగాపూర్ చేరింది. జిల్లా ఆవిర్భావం అనంతరం.. జగిత్యాల నుంచి జగిత్యాల రూరల్, సారంగాపూర్ మండలం నుంచి బీర్పూర్, ధర్మపురి నుంచి బుగ్గారం మండలాలను ఏర్పాటు చేశారు. 32 గ్రామాలతో ఉన్న రాయికల్ మండలకేంద్రం ఇటీవల మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఎప్పటినుంచో రాయికల్ మండలాన్ని విభజించి.. రెండు మండలాలు చేయాలనే డిమాండ్ ఉన్నా.. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో మంగళవారం టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల ప్రచారసభలో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను కొత్త మండలం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాయికల్(జగిత్యాల): పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాలో కొత్త మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా ప్రకటించారు. ఎన్నోఏళ్లుగా ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు ఎంపీ కల్వకుంట్ల కవిత, కలెక్టర్ శరత్‌కు వినతిపత్రాలు అందించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను మండలకేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత హామీ ఇవ్వగా.. ఆ మేరకు సీఎం కేసీఆర్ నిజామాబాద్ వేదికగా ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రాయికల్ మండలంలో 27 గ్రామాలు ఉండేవి. ఇటీవల రాయికల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. మరోవైపు ఆరు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. రాయికల్ పోను ఆ సంఖ్య 32కు చేరింది. ఒడ్డెలింగాపూర్ మండలంలో 14 గ్రామాలు? రాయికల్ మండలంలో 32 గ్రామాలు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒడ్డెలింగాపూర్లోకి 14 గ్రామాలు వెళ్లనున్నాయి. వీటిలో ఆల్యనాయక్‌తండా, బోర్నపల్లి, చింతలూరు, దావన్‌పల్లి, ధర్మాజీపేట, జగన్నాథపూర్, కైరిగూడెం, కట్కాపూర్, కొత్తపేట, మంక్త్యానాయక్తండా, ఒడ్డెరకాలనీ, తాట్లవాయి, వస్తాపూర్ గ్రామాలు ఒడ్డెలిం గాపూర్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. సీఎం, ఎంపీకి కృతజ్ఞతలు జగిత్యాల నియోజకవర్గంలోనే రాయికల్ మండలంపై ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ చూపడంతోపాటు రాయికల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. కొద్దిరోజుల వ్యవధిలోనే రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని మండలకేంద్రంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. మండల ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎంపీ కవితకు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. – సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే గిరిజనులు అభివృద్ధి చెందుతారు ఒడ్డెలింగాపూర్ గ్రామాన్ని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక మండలంగా ప్రకటించడంతో మండల పరిధిలో ఉన్న 14 గ్రామాల గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ పనులపై సమయబావంతో పాటు అన్ని రకాల సేవలు అందుతాయి. దీనికి సహకరించిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు. – పాలకుర్తి రవి, సర్పంచ్ -
నిధులున్నా.. నిర్లక్ష్యం
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థికసంఘం ద్వారా గత డిసెంబర్లో రూ.9.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. జగిత్యాలకు రూ.4.20కోట్లు, మెట్‌పల్లికి రూ.2.25కోట్లు, కోరుట్లకు రూ.2.89కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానవాటికలు, మార్కెట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిధులు మంజూరై రెండు నెలలు గడిచినప్పటికీ జగిత్యాల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ఇంకా ఈ పనులను మొదలుపెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. టెండర్ దాటని వైనం రెండు మున్సిపాలిటీల్లో ఈ పనులకు సంబం ధించి ఇంకా టెండర్దశ కూడా పూర్తి కాలేదు. మెట్పల్లిలో పదిరోజుల క్రితం ఆన్లైన్ టెండర్లు పిలిచిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రావడంతో దానిని అక్కడితోనే నిలిపివేశారు. జగిత్యాలలో మాత్రం అక్కడి అధికారులు ఇంకా టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించకపోవడం గమనార్హం. అధికారుల తీరుపై విమర్శలు... వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మార్చిలోనే విడుదలవుతుందనే కచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ అధికారులు పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేయకుండా జాప్యం ప్రదర్శించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో టెండర్ ప్రక్రియతోపాటు కౌన్సిల్ ఆమోదం వంటి వాటిని పూర్తి చేసి ఈ నెలలో కోడ్ రాక ముందే పనులను మొదలుపెట్టారు. కానీ జగిత్యాల, మెట్పల్లిలో అధికారులు అలా చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల కోడ్ మే 27 వరకు ఉంటుంది. ఆ లోపే మండల, జిల్లా పరిషత్‌లతోపాటు మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది సాధ్యం కాని పక్షంలో జూన్ నెలలో నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. దీనిని బట్టి చూస్తే మరో మూడు, నాలుగు నెలల పాటు ఈ పనులకు మోక్షం కలిగే అవకాశం లేదు. మొ త్తానికి అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో పనులు కాక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక కారణాలతోనే జాప్యం సాంకేతిక కారణాలతోనే టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలేకపోయాం. గతంలో ఉన్న కమిషనర్ ఎక్కువ రోజులు సెలవులో ఉండడం..ప్రస్తుతం ఉన్న కమిషనర్ పేరు మీద డిజిటల్ కీ రావడంలో జాప్యం జరిగింది. ‘కీ’ వచ్చిన వెంటనే టెండర్లను పిలిచాం. కాని అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది రాక ముందే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయ డానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. కోడ్ అనంతరం పనులు మొదలుపెడతాం. – అరుణ్, ఏఈ, మెట్పల్లి -
రోడ్డును పట్టించుకునేదెవరూ ?
సాక్షి, బుగ్గారం: ధర్మపురి నుంచి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారిపై నేరెళ్ల గ్రామ సమీపంలోని గుట్ట వద్ద రహదారి పూర్తిగా శిథిలమైంది. దీంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. రహదారి అంతా గుంతలమయంగా మారడంతో రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారి గుంతలమయం కావడమే కాకుండా, మూల మలుపు ప్రాంతం కూడా కావడంతో గతంలో ఇదే ప్రాంతంలో వాహనాలు నియంత్రణ కోల్పోయి పలు ప్రమాదాలు సంభవించాయి. పలుమార్లు వాహనాలు బోల్తా పడడంతో పాటు కొంతమంది చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. -
27 పంచాయతీలకు నలుగురే..!
సాక్షి, గొల్లపల్లి: మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. 27 పంచాయతీలకు కేవలం నలుగురే ఉండడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్త సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. వారు వచ్చారు కానీ వారికి సహకరించేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. పూర్తిస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతో పంచాయతీలకు వచ్చే నిధులు, వాటి ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసే వాళ్లు లేరు. కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్‌లు ఇన్చార్జి అధికారులపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. దీంతో వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక, పనులు ముందుకు సాగక పాలన కుంటుపడుతోంది. దీంతో సర్పంచ్‌లు పనులు చేయలేక ఖాళీగా కూర్చుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొత్త కార్యదర్శులు వచ్చేదెన్నడు.. మండలంలో కొత్తగా 2 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నూతన పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకం చేపట్టింది. అయితే కోర్టు కేసు కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కొత్త కార్యదర్శులు ఇంకా గ్రామాలకు రాలేదు. కార్యదర్శుల కొరతతోపాటు భవనాలు లేక చిన్న గదుల్లో పాలన సాగిస్తున్నారు. కార్యదర్శులు లేకపోవడంతో సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గాలు దృష్టి సారించడం లేదు. పంచాయతీలకు కావాల్సిన నిధులపై అవగాహన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. మొన్నటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడంతో అభివృద్ధి పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం సిబ్బంది కొరతతో అభివృద్ధి జరగడం లేదు. అదనపు బాధ్యతలు మండలంలో 27 గ్రామ పంచాయతీలకు కేవలం ముగ్గురు కార్యదర్శులు, ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. దీంతో వారిపై పనిభారం భారీగా పడింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి మల్లేషం అబ్బాపూర్, ఆత్మకూర్, దమ్మన్నపేట, లక్ష్మీపూర్, రంగదామునిపల్లి, చిల్వాకోడూర్, బొంకూర్, వెన్గుమట్ల, ఇస్రాజ్‌పల్లికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి.మల్లేశంకు దట్నూర్, చెందోళి, భీంరాజ్‌పల్లి, తిర్మాళాపూర్(పీడి), అగ్గిమల్ల, గంగాదేవిపల్లి, రాఘవపట్నం, లొత్తునూర్‌కు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తిరుపతికి రాపల్లి, నందిపల్లి, వెంగళాపూర్, శంకర్రావుపేట, తిర్మాళాపూర్(ఎం), బీబీ రాజ్‌పల్లి, గొల్లపల్లి, జూనియర్ అసిస్టెంట్ రమేశ్ గోవింద్‌పల్లి, గుంజపడుగు, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో పని చేస్తున్నారు. వీరంతా ఇన్ని పంచాయతీలు ఎలా పర్యవేక్షిస్తున్నారో వారికే తెలియాలి. కొత్త పంచాయతీరాజ్æ చట్టంలో అనేక మారులను తీసుకొచ్చారు. కార్యదర్శికి 30 రకాల బాధ్యతలు అప్పగించారు. దీంతో గ్రామీణ ప్రజలు సమస్యల పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యదర్శులను నియమించాలి ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలి. అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇన్చార్జి కార్యదర్శులతో గ్రామంలో పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. కార్యదర్శి ఉంటేనే నిధులు, విధులు మాకు తెలుస్తాయి. అప్పుడే గ్రామ పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించాలి. – పురంశెట్టి పద్మ, సర్పంచ్, అబ్బాపూర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఉన్నవారికి అదనపు గ్రామాల బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నాం. కొత్త కార్యదర్శులు వచ్చేవరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇన్చార్జీలు కొనసాగుతారు. – నవీన్‌కుమార్, ఎంపీడీవో, గొల్లపల్లి -
అభివృద్ధిపై ఆశలు
సాక్షి, బుగ్గారం: ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బుగ్గారం ప్రాంతం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందిన ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయినా బుగ్గారం గ్రామం, దాని చుట్టుపక్కల గ్రామాలు చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేదు. తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కేంద్రాన్ని ధర్మపురికి మార్చారు. దీంతో ఇక అభివృద్ధి ఉండదని గ్రామస్తులు అనుకున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం మొదటిసారి కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఈ పునర్విభజనలో భాగంగా ధర్మపురి మండలంలో అంతర్భాగంగా ఉన్న బుగ్గారంను ధర్మపురి మండలంలోని 8 గ్రామాలు, గొల్లపల్లి మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మొత్తం 11 గ్రామాలతో నూతన మండలకేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో బుగ్గారంలో తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ తదితర కార్యాలయాలు నెలకొల్పారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మండల ప్రజాపరిషత్ సంబంధమైన పనులు మాత్రం ధర్మపురిలోని ఎంపీపీ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దరిమిలా పాత ప్రాదేశిక స్థానాల్లో మార్పులు జరిగి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ బుగ్గారం మండలంలో ఈసారి మండల ప్రజాపరిషత్ ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మండలం నుంచి నూతనంగా జెడ్పీ స్థానం కూడా ఖరారు చేశారు. 11 గ్రామాలు.. 6 ఎంపీటీసీ స్థానాలు బుగ్గారం మండలంలో మొత్తం 11గ్రామాలకు గానూ 6ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 21,716 కాగా.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం మొత్తం మండల ఓటర్లు 16,493. ఇంతకుముందు ధర్మపురి మండల పరిధిలో ఉన్నప్పుడు బుగ్గారంలోని 8 గ్రామాలకు గానూ 5 ఎంపీటీసీ స్థానాలుండేవి. ప్రస్తుతం గొల్లపల్లి నుంచి కలిసిన మూడు గ్రామాలైన శెకెల్ల, యశ్వంతరావుపేట, గంగాపూర్ గ్రామాలతో మరో ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయడంతో మండలంలో మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు మండలం నుంచి ఈసారి జెడ్పీటీసీ స్థానం కూడా ఏర్పడడంతో స్థానిక సంస్థల పాలన ప్రజలకు మరింత చేరువై సమర్థవంతంగా కొనసాగే అవకాశం ఉంటుందని నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ధర్మపురి కేంద్రంగా కొనసాగిన పంచాయతీల పాలనా వ్యవహారాలు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం మండలకేంద్రం నుంచే గ్రామాల పాలనా వ్యవహారాల పర్యవేక్షణ జరుగుతుంది. దీంతో మండలంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగి గ్రామాల ముఖచిత్రం మారే అవకాశాలున్నాయి. జెడ్పీ నిధులు కూడా నేరుగా మండలానికే రానుండడంతో అభివృద్ధిలో వేగం పెరిగే అవకాశాలుంటాయని నాయకులంటున్నారు. యువత ఆసక్తి త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ బలాబలాలను గురించి లెక్కలు వేసుకుంటూ స్థానిక ప్రజల వద్ద అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన అభ్యర్థులు, రిజర్వేషన్ అనుకూలించనివారిలో కొంతమందికి ప్రస్తుతం ఖరారు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కలిసి వస్తుండడంతో మళ్లీ ఎన్నికల సమరంలో దిగడానికి సిద్ధమౌతున్నారు. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక మంది ఔత్సాహికులు తమతమ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొంతమంది యువకులు, నాయకులు తమకు పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. తమకున్న కుల బలం, ఇతర అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. కేవలం 6 ఎంపీటీసీ స్థానాలతో ఏర్పడ్డ చిన్న మండలం కావడంతో మరికొంతమంది ఎంపీపీ స్థానంపై కన్నేశారు. ఇదిలా ఉండగా.. మండలంలోని ఎంపీపీ, జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పలు పార్టీల పెద్దలు మండలంలోని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రజాదరణతోపాటు అంగబలం, ఆర్థిక బలం కలిగిన నాయకుల కోసం పార్టీలు అన్వేషణ సాగిస్తున్నాయి. -
ప్రభుత్వ క్యాంటిన్ ‘వ్యాపార’మంత్రం..
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో క్యాంటీన్ సేవలు విచిత్రంగా ఉన్నాయి. ఆస్పత్రిలోని రోగులు, బంధువుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్ అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది. ఆస్పత్రి వైపు చిన్నదారి ఏర్పాటు చేసిన నిర్వాహకుడు.. బయట వైపు రెండు షట్టర్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఏళ్లుగా ఒకరికే టెండర్ దక్కు తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రిలో చేరుతున్న రోగులు, వారి బంధు వులు ఛాయ్, టిఫిన్ కోసం బయట హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకరికే..! దాదాపు పదేళ్ల క్రితమే క్యాంటీన్ నిర్వహణకు టెండర్ వేశారు. అప్పటి నుంచి ఒక్కరే క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికొచ్చే రోగులు, బంధువులకే క్యాంటీన్ సేవలందించాలి. కానీ లోపలి వైపు చిన్నదారం మాత్రమే ఏర్పాటు చేసి బయటి వైపు షట్టర్లు వేసి బేకరీ నిర్వహిస్తూ వ్యాపారం చేపడుతున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంగా అవతరించిన అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు వస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో మరింతగా పెరిగిపోయింది. రోగులకు ఆస్పత్రిలో సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నప్పటికీ టీలు, టిఫిన్లు మాత్రం కరువయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించిన క్యాంటీన్లో అన్ని రకాల టీలు, టిఫిన్లు ఉండాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. కానీ క్యాంటీన్లో మాత్రం టీలు, టిఫిన్లు దొరకడం లేదు. రాత్రి వేళల్లో బంధువులకు భోజనం దొరకడం లేదు. ఈ క్యాంటీన్లో బేకరి నిర్వహించడంతో విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా ఒకరికే కాంట్రాక్ట్ కొనసాగిస్తున్నారని అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం టెండర్ నిర్వహిస్తే నడిబొడ్డు కావడంతో అందులో జిల్లా ఆస్పత్రిగా పేరు పొందడంతో మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది. కానీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో ఒకసారే టెండర్ నిర్వహిస్తాం. ప్రస్తుతం అతనే నిర్వహిస్తున్నాడు. టీ, టిఫిన్లు ఏర్పాటు చేయాల్సిందే. సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సదామోహన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఉత్తమ కలెక్టర్‌కు సన్మానం
సాక్షి, మెట్‌పల్లిరూరల్: జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌ను మెట్పల్లి మండల సర్పంచ్‌లు బుధవారం శాలువాలు, పూలగుఛ్చంతో సన్మానించారు. జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ అందించే ఉత్తమ కలెక్టర్ అవార్డుకు ఎంపికయినందుకు ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం కన్వీనర్ ఆకుల రాజరెడ్డి, బద్దం శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, జంగిటి అంజయ్య, శంకర్ నాయక్, డీపీవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు -
ఇలా అయితే.. ఆటలు సాగేదెలా..
సాక్షి, పెగడపల్లి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు, వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మండలంలోని మెజార్టీ పాఠశాలల్లో ఈ రెండు సౌకర్యాలు లేక విద్యార్థులు వికాసానికి దూరమవుతున్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బాల్యంలోనే దాన్ని వెలికితీస్తే వారిలో నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి. కానీ ఆప్రతిభను తీసి ప్రోత్సహించే వారులేరు. విద్యార్థుల్లో దాగి ఉన్నా ప్రతిభను గుర్తించి వారిని ఆయా క్రీడల్లో సుశిక్షితులుగా చేయాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆట స్థలాలు కూడా ఉండలి. కానీ చాలా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, మైదానం లేక పోవడంతో వారికున్న ప్రతిభ మరుగున పడిపోవడమే కాకుండా చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వారిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వారికి తగిన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే వారులేరు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి తగిన శిక్షణ ఇస్తే మేము కూడా ఆటల్లో రాణిస్తామని విద్యార్థులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మండలంలో ఒకే ఒక్కరు మండలంలో 6 యూపీఎస్, 6 హైస్కూల్లున్నాయి. మండలంలోని నంచర్ల పాఠశాలలో మినహా మరెక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. బతికపల్లి, పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులున్నా భర్తీ కావడం లేదు. గతంలో ఈపాఠశాలల్లో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లి ఏళ్లు గడుస్తున్న వారి స్థానంలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచన కూడా చేయడం లేదు. మిగితా పాఠశాలల్లో అసలు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల మంజూరు లేదు. పీఈటీల సమస్య ఇలా ఉంటే విద్యార్థులకు తెలిసిస ఆటలు ఆడుకుందామని ఉన్న అందుకు సరిపడు ఆటస్థలం కరువైంది. అన్ని పాఠశాలల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేసి విద్యార్థులు క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మండలంలోని బతికపల్లి, నంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రతి ఏటా సంబంధిత అధికారులను ఈవిషయమై కోరుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆయా పాఠశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతులు కల్పించాలి ఆటలు ఆడాలని ఉన్నా స్థలంతో పాటు సరైన శిక్షణ లేక క్రీడల్లో రాణించ లేక పోతున్నాం. సరైన శిక్షణ ఉంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలి. చాలా చోట్ల పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ లేదు. గ్రౌండ్ స్థలం కేటాయించి వసతులు కల్పించాలి. – రాగళ్ల హరీశ్ బతికపల్లి ప్రోత్సాహం కరువు ఆటలు ఆడేందుకు ఆసక్తి ఉన్నా ఆడించే వారులేరు. దీనికితోడు మైదానం కూడా లేదు. ఆటల్లో ప్రోత్సాహం కరవైంది. క్రీడలకు కావాల్సిన వసతులు లేక క్రీడల్లో రాణించలేక పోతున్నాం. ఫలితంగా ఆటలకు దూరమవుతున్నాం. మాకు వ్యాయామ ఉపాధ్యాయుడు, మైదానం ఏర్పాటు చేయాలి. – రాజ్‌కుమార్ 10వ, తరగతి పెగడపల్లి సమాచారం సేకరిస్తున్నాం పాఠశాలల్లో మైదానాలు ఏర్పాటు, పీఈటీల నియామకంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. యూడైస్ నివేదిక ఆధారంగా హెచ్ఎంల ద్వారా పాఠశాలల్లో పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. ఆటస్థలం, పీఈటీల కొరతపై వివరాలు యూడైస్ నివేదికలో చేర్చుతాం. – శ్రీనివాస్, ఎంఈవో -
ఆదుకునే హస్తం కోసం..!
ఆరేళ్ల ప్రాయంలోనే అప్లాస్టిక్ ఎనీమియా (ఎముకల గుజ్జు మార్పిడి ) అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడాలని పేదవారైన ఆ తల్లిదండ్రులు తమగోడు వెళ్లబోసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం హుస్నాబాద్‌కు చెందిన వావిలాల సంతోష్ కుమారుడు వావిలాల ఆదిత్య (6)అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నాడు. తమ కుమారుడి చికిత్సకు దాదాపు రూ.20 లక్షలు కావాల్సి ఉండగా, కట్టు బట్టలతో మిగిలిన ఆ తల్లిదండ్రుల మనో వేదన మాటల్లో చెప్పలేనిది. సమయం గడుస్తున్న కొద్ది మరణానికి చేరువవుతున్న తమ కుమారుడిని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు సాయమందించే దయా హృదయుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సింగపూర్ తెలుగుసమాజం అధ్యక్షులు కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి చొరవతో విరాళాలు ఇవ్వడానికి గ్రూపు సభ్యులు ముందుకొచ్చారు. లక్షా ముప్పై వేల రూపాయలను చిన్నారి తండ్రికి విరాళంగా అందించారు. ఇప్పటి వరకు విరాళాలు అందించిన వారందరికి వావిలాల సంతోష్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆదిత్య చికిత్సకు మరింత డబ్బు అవసరం అవ్వడంతో ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయగలిగితే దయచేసి చిన్నారి తల్లి అకౌంట్‌నెంబర్‌కి పంపించాలని, ఫోన్ నెంబర్ +91 96662 88820లో సంప్రదించాలని కోరారు. -
అగ్రస్థానం అనుమానమే..?
సాక్షి, జగిత్యాల: పదోతరగతి ఫలితాల్లో జిల్లా వరుసగా రెండుసార్లు అగ్రస్థానంలో నిలిచింది. గతంలో కలెక్టర్ శరత్ చొరవతో చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం సత్పలితాలనిచ్చింది. ఈనెల 16న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈసారి కూడా రాష్ట్రంలో మళ్లీ అగ్రస్థానంలో నిలిస్తే ముచ్చటగా మూడోసారి(హ్యాట్రిక్) నంబర్‌వన్‌గా నిలిచే అవకాశం దక్కుతుంది. అయితే గతంలో మాదిరిగా ఉత్తేజం కార్యక్రమానికి కలెక్టర్ నిధులు మంజూరు చేయకపోవడంతో స్థానిక దాతల నుంచి నెట్టుకొచ్చారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు ఎక్కువగా ఎన్నికల విధుల్లో ఉండడం.. కొన్ని పాఠశాలల్లో సిలబస్ కూడా పూర్తికాకపోవడం నంబర్‌వన్ సాధించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వరుసగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌వన్‌గా నిలుస్తోంది. 2016–17 విద్యాసంవత్సరం పదోతరగతి ఫలితాలలో జిల్లా 97.35 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. మరుసటి సంవత్సరం 2017–18 ఫలితాల్లోనూ 97.56 ఉత్తీర్ణతశాతంతో జగిత్యాల జిల్లా రెండోసారి రాష్ట్రంలో అగ్రభాగాన నిలిచింది. వీరిలో బాలికలు 98శాతం ఉత్తీర్ణత కాగా బాలురు 97 శాతం ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 201 ప్రభుత్వ పాఠశాలల్లో 117 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఉత్తేజంతో ఊపు.. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కలెక్టర్ శరత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉత్తేజం కార్యక్రమంతో పది విద్యార్థులకు పాఠశాల సమయానికి గంట ముందు, తర్వాత స్టడీఅవర్స్‌లో చదువుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఆ సమయంలో వారికి స్నాక్స్ అందించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ నిధులతోపాటు విస్త్రృతమైన ప్రచారంతో దాతలు ముందుకు రావడంతో సాయంత్రం వేళ విద్యార్థుల ఆకలి తీరింది. ఫలితంగా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది. మాస్ కాపీయింగ్ మరకలు గతేడాది మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షాసమయంలో జిల్లాలోని కొడిమ్యాల మండలంలో జరిగిన మాస్‌కాపీయింగ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు ఎన్నడు లేని విధంగా ఏకంగా ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం కలకలం రేపింది. జిల్లాను ఫలితాల్లో నంబర్‌వన్‌గా ఉంచాలనే ఒత్తిడితో కొన్ని చోట్ల ఉపాధ్యాయులు మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తేజం అంతంతే! గత రెండేళ్లుగా జిల్లాలో పదోతరగతి విద్యార్థుల కోసం చేపట్టిన ఉత్తేజం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. కలెక్టర్ శరత్ రెండేళ్లపాటు ఉత్తేజం కోసం ఏటా సుమారు రూ.15 లక్షలు కేటాయించారు. వీటితోపాటు ఆయా మండలాలు, గ్రామాల్లో స్థానిక నాయకులు, దాతల నుంచి విరాళాలు భారీగా వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించలేదు. కేవలం గ్రామస్థాయిల్లో దాతల విరాళాలతో నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా లభించిన ప్రచారం, ప్రోత్సాహం ఈ దఫా కరువైనట్లు కనిపిస్తోంది. దీనికితోడు ఈసారి ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిమగ్నమవడం.. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఇప్పటి వరకు సిలబస్ పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి హ్యాట్రిక్ సాధించడం కష్టతరంగా మారింది. -
ఓటుకు చికెన్ ముక్క
సాక్షి, జగిత్యాలజోన్: ఎన్నికలు వచ్చాయంటే ఆ ఊర్లో వింత రాజకీయం నడుస్తోంది. నామినేషన్ వేసింది మొదలు.. ఎన్నిక ముగిసేవరకూ పోటీలో ఉన్న అభ్యర్థులు ఆ ఊళ్లో ఉన్న ప్రతి కుటుంబానికీ చికెన్ పంపిస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు.. గత రెండుమూడు సార్లు జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పంచారు. ఆయా ఎన్నికల్లో ఈ చికెన్ ముక్కలే ఓట్లను ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు. ఆ గ్రామమే జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్. 2006లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓసారి గర్వంద గంగయ్య, గర్వంద గంగాధర్ పోటీ పడ్డారు. ఓట్లు వేయాలని ఇంటింటికీ నాలుగైదు సార్లు తిరిగారు. అందరూ ఓట్లేస్తామని ఇద్దరికీ చెప్పారు. కానీ.. అభ్యర్థులు ఒకరికి తెలియకుండా మరొకరు చికెన్‌ను ఓట్ల రాజకీయంలో వాడుకున్నారు. ఇంటింటికీ అరకిలో చికెన్ చొప్పున తమ గుర్తులను పెట్టి, ఓటర్లు నిద్ర లేవకముందే తలుపు ముందు పెట్టారు. ఓటర్లు చేసేదిలేక అభ్యర్థులు పంపిన చికెన్‌ను వండుకుని తిన్నారు. మూడు వేల మంది ఉన్న ఆ గ్రామంలో ఎన్నిక జరగగా.. కేవలం ఎనిమిది ఓట్లతోనే గర్వంద గంగయ్య గెలుపొందాడు. 2014లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సైతం పన్నాల సరిత, పన్నాల విమల పోటీపడి చికెన్ ముక్కలతోనే ప్రచారం ప్రారంభించారు. ఇద్దరు అభ్యర్థులు పోటీపడి చికెన్ పంచినా.. ఎక్కువసార్లు చికెన్ పంపిన పన్నాల సరితకు పట్టం కట్టారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సైతం పోటీపడుతున్న అభ్యర్థులు ‘ఇంటింటికి చికెన్..’ రాజకీయాన్నే ఉపయోగించారు. ఇంటింటికీ చికెన్ లక్ష్మీపూర్ ప్రస్తుతం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. బరిలో ఉన్న ఇద్దరు ప్రధాన అభ్యర్థులు సైతం ఇంటింటికీ చికెన్ పంపిస్తున్నారు. తెల్లారిందంటే చాలు.. ఇళ్లగుమ్మం ముందు చికెన్ పొట్లం కనిపిస్తోంది.. అయితే ఓటర్లు మరింత తెలివి ఉపయోగిస్తున్నారు. ‘శీతాకాలంలో చికెన్ రుచి ఉండడం లేదు. మేమే ఓ మేకను లేదా గొర్రెను కోసుకుంటాం.. దాని ఖరీదు ఇవ్వండి..’ అంటూ కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువకుల బృందాలు షరతు పెడుతుండటంతో అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. ఇంకొంతమంది చికెన్ పొట్లంతోపాటు మద్యం బాటిళ్లు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘నీ చికెన్ ఒక్కసారే వచ్చింది. ఎదుటి అభ్యర్థి రెండుమూడు సార్లు పంపించారు. నువ్వుకూడా మరోసారి పంపించు. అయితేనే ఓటేస్తాం.. అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. -
కన్నీటిపేట
-
కొండంత విషాదం.. పాపం పసివాడు
మొన్ననే రాఖీ కట్టిన తమ్ముడు ప్రమాదంలో విగతజీవుడయ్యాడు. తమ్ముడితో వెళ్లిన అమ్మ చావుబతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బతుకుదెరువు కోసం నాన్నేమో దుబాయ్‌కు పోయిండు.. ఏం చేయాలో తెలియని ఆ అక్కాచెల్లెళ్లు.. ‘లేరా తమ్ముడూ ఆడుకుందాం’ అంటూ ఏడుస్తున్న ఘటన హృదయాల్ని పిండేస్తోంది.. సాక్షి, కొండగట్టు: గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ఊరు కన్నీటి ప్రవాహంగా మారింది. ఎవరిని కదిలించినా కన్నీళ్లు తప్ప.. మాటలు రావడం లేదు. వెక్కివెక్కి ఏడ్చేవాళ్లు కొందరు.. తమ వాళ్లను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని వారిని ఓదార్చేవాళ్లు ఇంకొందరు.. ప్రమాద బాధిత శనివారంపేటలో ఎవరిని కదిలించినా ఇదే దృశ్యాలు. కొండగట్టు రోడ్డు ప్రమాదంలో ఈ ఊరి నుంచే ఏకంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారి హర్ష అంత్యక్రియలు తల్లితండ్రులు లేకుండానే పూర్తయ్యాయి. గ్రామానికి చెందిన గాజుల లత, అశోక్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు హర్ష(2). అశోక్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లగా.. లత గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆమె జగిత్యాలకు బస్సులో బయల్దేరింది. అంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిపింది. ప్రమాదంలో హర్ష మరణించగా.. అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. అప్పటి వరకు తమతో ఆడుకున్న హర్ష ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో అతడి అక్కలు తట్టుకోలేకపోయారు. తమ్ముడు కావాలి అంటూ ఏడుస్తున్న ఆ చిన్నారులను ఆపడం ఎవరితరం కావడం లేదు. గల్ఫ్‌లో ఉన్న తండ్రికి కుమారుడి మరణ వార్త ఎలా తెలియజేయాలో తెలియక మధన పడ్డ కుటుంబ సభ్యులు చివరకు ఆ బాలుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. గల్ఫ్‌లో ఉన్న ఆ తండ్రి, ఆసుపత్రిలో ఉన్న ఆ తల్లి తన ముద్దుల కొడుకును కడసారి చూసుకోలేకపోయారు. ఆ తల్లి కోలుకొని తన కొడుకు ఎక్కడా అని అడిగితే ఏమని చెప్పాలని బంధువులు బోరుమంటున్నారు. రాఖీ పౌర్ణమీ సందర్భంగా తన అక్కలు రాఖీ కడితే హర్ష కాళ్లు మొక్కి డబ్బులు కూడా ఇచ్చాడని ఆ ఫొటోలు ఇవే అంటూ చూపిస్తూ వారు కంటతడి పెట్టారు. -
కొండగట్టు ప్రమాదం: 60కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, జగిత్యాల : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ విషాదకర ఘటనలో 60 మంది మృతి చెందగా, క్షతగాత్రులను కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. కాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత కథనాలు... దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు నిర్లక్యం ఖరీదు! -
కొండంత విషాదం... కడసారి చూపుకోసం..
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): ఆపద్దర్మ మంత్రులు వచ్చారు.. పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వెళ్లారు. అధికారులు వచ్చారు.. సహాయక చర్యలు పరిశీలించి వెళ్లారు. వైద్య సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కానీ మృతి చెందినవారిని అందరూ గాలికొదిలేశారు. మృతి చెందిన వారి బంధువులెవరు.. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులేంటని పట్టించుకున్న నాదుడే లేడు. అయినవారి కడసారి చూపు కోసం ఫ్రీజర్ బాక్స్(ఐస్ బాక్స్)లో పెట్టే ఆర్థిక స్థోమత లేక మృతదేహాలను మంచు గడ్డలతో కప్పి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి కొడిమ్యాల మండల ప్రజలు చలించపోతున్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలో విషాదాన్ని నింపింది. ఈ మండలానికి చెందిన వారే సుమారు 49 మందికి పైగా మృత్యువాతపడ్డారు. దీంతో ఈ మండలంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం పరాయి దేశానికి వలస వెళ్లారు. కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ వారు మరణించిన విషయం తెలుసుకొని కడసారి చూపుకోసం హుటాహుటిని స్వస్థలానికి బయలుదేరారు. వారు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో లేక.. ఉన్నా వాటికి అద్దె కట్టే ఆర్థిక స్థోమత లేక.. అధికారులు పట్టించుకోకపోవడంతో మంచు గడ్డలతో మృతదేహాలని కప్పిపెట్టారు. కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 57 మంది దుర్మరణం -
ఆర్టీసి చరిత్రలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు
-
దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలైన విషయంతెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదం దేశ చరిత్ర అతిపెద్ద ప్రమాదం. ఇంత వరకు ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగిన బస్సు ప్రమాదం దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ సందర్భంగా దేశంలో జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదాల వివరాలు ఒక సారి పరిశీలిద్దాం. తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మరింత మంది ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వద్ద బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది ప్రయాణికులు మరణించారు. 15మందికిపైగా ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్డు చాలా వరకు ఘాట్ రోడ్డు ఉండడంతో పెద్ద ప్రమాదాలే జరిగాయి. జమ్మూ కశ్మీర్ కశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 51 మంది మరణించారు. మరికొంత మంది ఆచూకి లభించలేదు. గుజరాత్ గుజరాత్‌లోని వడోదరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 47 మంది దుర్మరణం పాలైయ్యారు. గుజరాత్ చరిత్రలో ఇదే అతిపెద్ద రోడ్డు ప్రమాదం. తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద సంభవించిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం. బస్సు కల్వర్డును ఢీ కొట్టడంతో పెట్రోల్ ట్యాంక్ లీకవ్వడంతో సెకన్లపాటు సమయంలోనే బస్సులో పూర్తిగా మంటలు వ్యాపించడంతో 45 మంది సజీవదహనమయ్యారు. జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్లో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది మృతి చెందారు. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 370 మీటర్ల ఎత్తునుంచి చినాబ్ నదిలోకి పడిపోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి ప్రమాదాల కశ్మీర్లో చాలానే జరిగాయి. లోయప్రాంతం కావడంతో ప్రయాదాలు జరగడం సాధారణంగా మారింది. మహారాష్ట్రా మహారాష్ట్రాలో 2008లో జరిగిన బస్సు ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు మరణించారు. నాసిన్‌కు భక్తులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 39 మంది భక్తులు చనిపోగా.. 40 మంది గాయాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది భక్తులు మరణించారు. నేపాల్‌కి చెందిన భక్తులు ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా బస్సు ఆలకనందా నదిలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ మూసాయిపేట వద్ద జరిగిన బస్సు-రైలు ప్రమాదంలో 26 మంది స్కూల్ విద్యార్ధులు మృతి చెందారు. ప్రమాదంలో చనిపోయినవారంతా పది నుంచి పదిహేనేళ్లలోపు వారే. బస్సు పాఠశాలకు వెళ్తుండగా రైల్వే లెవలింగ్ క్రాస్ లేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. బస్సు కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. -
బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. గతంలో ఇదే చోట ఓ లారీ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదమప్పుడే అధికారులు ఈ ఘాట్ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. కేవలం బైక్స్‌ను మాత్రమే అనుమతించేవారు. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుకు ప్రత్యామ్నయంగా బైపాస్ రోడ్డు కూడా ఉంది. కానీ గత మూడు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలను మళ్లీ అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్డు నుంచి హైవేపైకి కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రత్యమ్నాయ రోడ్డు ఉపయోగిస్తే మరో ఐదు కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతోనే ఆర్టీసీ అధికారులు డిజీల్‌కు కక్కుర్తిపడి బస్సులను షార్ట్‌కట్‌గా భావించిన ఘాట్‌రోడ్డు రూట్లో నడిపిస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా ఆర్అండ్బీ నిబంధనలకు విరుద్దంగా ఉందని గతంలోనే అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపుల గోడను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఆ గోడ నిర్మాణం చేబడితే ఈ ఘోర ప్రమాధం సంభవించేది కాదని, వారి నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 57మంది ప్రాణాలు కోల్పోయారు. -
అంజన్న భక్తులకు విషాదం
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలు దేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కొండగట్టు ఘాట్ రోడ్డు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కొండగట్టుకు వచ్చిన హనుమాన్ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు హనుమాన్ భక్తుల తాకిడి ఎక్కుగా ఉంది. దర్శనం చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో అధిక సంఖ్యలో బస్సెక్కారు. దీంతో ఓవర్లోడైన బస్సు అదుపు తప్పి లోయలో పడ్డట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొండగట్టులో బస్సెక్కిన భక్తులకు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే బస్సు జగిత్యాల హైవే ఎక్కేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణీకులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమ ఇష్టదైవం దగ్గరకు వచ్చిన భక్తులు ఊహించని ప్రమాదంలో మరణించారు. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అప్పటివరకు తమతో కలిసి ప్రయాణం చేసిన వారిలో చాలా మంది నిర్జీవులుగా మారడంతో బాధితుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది. జగిత్యాల ఆసుపత్రి ప్రాంగణం బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. -
కొండగట్టలో ఘోర రోడ్డు ప్రమాదం ఫోటోలు
-
కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే?
సాక్షి, కొండగట్టు: ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 57 మందికిపైగా మృతి చెందగా, మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండగట్టులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను వేములవాడ డిపో మేనేజర్ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే బస్సు కండీషన్లోనే ఉందని.. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘాట్ రోడ్డుపై సైన్ బోర్డులు ఉన్నప్పటికి ఈ ప్రమాదం జరగడం బాధకరం అని పేర్కొన్నారు. బస్సు శనివారంపేట నుంచి కొండగట్టుకు బయలుదేరిందని తెలిపారు. బస్సులో ఎక్కువ శాతం మంది స్థానికులు ఉన్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం స్థానికుల సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. (ఈ విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం!
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 101 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. 44 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదు మృతదేహాలు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కొండగట్టు అంజన్న స్వామి భక్తులు. దేశ ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువగా 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు ఆపద్ధర్మ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు చెప్పారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదం చాలా బాధాకరం: రవాణ మంత్రి కొండగట్టు రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఆపద్ధర్మ రవాణ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కొండపై తొలిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. తను ఘటనాస్థలికి బయలు దేరుతున్నానని, ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద వివరాలను ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామన్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి కొండగట్టు ఆర్టీసీ ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి : కొండగట్టు రోడ్డుప్రమాదంపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. (ఈ విషాదానికి సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ధర్మపురిలో కాల్పులు..ఒకరి మృతి
ధర్మపురి: ఎల్లమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తిని ధర్మపురిలో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. రామగుండంకు చెందిన పోడేటి సత్యనారాయణగౌడ్ (51) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం బంధువులతో కలసి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమాలాపూర్‌లో ఎల్లమ్మ బోనాల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాత్రి 10 గంటలకు తమ బంధువులు భైరవేని రాకేశ్, వెంకటేశ్, బావమరిది రాజు, నోముల వెంకటేశ్‌లతో కలసి ధర్మపురిలో ఉన్న సత్య వైన్స్ వద్దకు వెళ్లారు. వాహనం దిగి షాపు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే వైన్స్ మూసి ఉంది. తిరిగి వాహనం ఎక్కుతుండగా అక్కడే మాటు వేసి ఉన్న నల్లదుస్తులు ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దీంతో సత్యనారాయణ ఛాతీ, మెడపై తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. -
అంగట్లో అంగన్వాడీ పోస్టులు
దళారీ : హలో.. హలో సార్.. నమస్తే..! మహిళా శిశుసంక్షేమాధికారి నరేందర్ : నమస్తే.. ఎవరు? దళారీ : సార్ నేను....మాట్లాడుతున్న. నరేందర్ : హా.. చెప్పండి. దళారీ : నాకు అంగన్వాడీ పోస్టు కావాలి. మీరెంత అంటే అంత. మూడు ఇస్తా... ఐదు అయినా పర్వాలేదు..(రూ.లక్షల్లో)! ఎలాగైనా చూడండి. నరేందర్ : అసలు నువ్వెవరు? ఎవరితో మాట్లాడుతున్నవో తెలుసా..? ఇలాంటి పిచ్చి తమాషాలు చేస్తే జైలుకు పోతవ్. దళారీ : సార్.. స్వారీ..! ఈ సంభాషణ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు అంగట్లో అమ్మకానికి ఉన్నాయనే ఆరోపణలకు బలం చేకూరుస్తోం ది. ఎంతకు అమ్ముడుపోతున్నాయో కూడా ఈ సంభాషణలో పేర్కొనడం గమనార్హం. పారదర్శకంగా పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దళారులు మాత్రం అభ్యర్థులకు వల వేయడం మానడం లేదు. రిజర్వేషన్లు.. స్థానికత.. విద్యార్హతను బట్టి పోస్టుల భర్తీ ఉంటుందని పదేపదే స్పష్టం చేసినా... దళారులు మాత్రం, ఎలాగైనా పోస్టులిప్పిస్తామని అభ్యర్థులను నమ్మిస్తున్నారు. టీచర్‌కు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు, ఆయా పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందిని నమ్మించి.. లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా జగిత్యాల ఆర్డీవో, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి అధికారి నరేందర్‌కే ఫోన్ చేసి బేరమాడే ప్రయత్నం చేశారంటే.. దళారులు ఏ మేరకు బరి తెగించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాక్షి, జగిత్యాల : జిల్లాలో 29 అంగన్వాడీ టీచర్లు.. 97 ఆయాల పోస్టుల భర్తీకి ఈ నెల 12న నోటిఫికేషన్ వెలువడింది. 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా నేటితో ముగియనుంది. రెండు వారాల్లో పోస్టులు భర్తీకానున్నాయి. పోస్టుల భర్తీకి సమయం దగ్గరపడుతుండడంతో దళారులు తమ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటు అభ్యర్థులకు గాలం వేయడంతో పాటు అధికారులనూ మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో పోస్టులిప్పిస్తామనీ హామీ ఇచ్చారు. తాజాగా.. జగిత్యాల మండల పరిధిలోని ఓ గ్రామంలో తన భార్యకు పోస్టు కోసం పార్టీ మారేందుకూ ఓ వ్యక్తి సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాలో ధర్మపురి, జగిత్యాల, మల్యాల, మెట్పల్లిలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1037 మెయిన్ అంగన్వాడీ, 28 మినీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 7,588 మంది గర్భిణులు, 6,658 మంది బాలింతలు ఉన్నారు. ఆరు నెలల నుంచి ఏడాది వయసు పిల్లలు 7,693 మంది, ఏడాది నుంచి 3 ఏళ్ల వయసు పిల్లలు 25,924, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలు 15,709 మంది, మొత్తం 63,572 మంది చిన్నారులు ఆయా కేంద్రాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. వీటి పరిధిలో 29 మేజర్.. రెండు మినీ అంగన్వాడీ టీచర్లు, 97 ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో.. సమీప కేంద్రాల నిర్వాహకులకు నిర్వహణ బాద్యతలు అప్పగించారు. అయితే ఇన్‌చార్జీలతో చాలాచోట్ల వాటి నిర్వహణ గాడి తప్పింది. దీంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల హాజరుశాతం తగ్గింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులు భావించారు. ఈ మేరకు ప్రాంతాల వారీగా పోస్టుల్లో రిజర్వేషన్లు కేటాయించారు. వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరించారు. పదో తరగతి ఉత్తీర్ణత, 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు, వివాహితురాలై ఆ ఊరి కోడలై ఉండడం, వికలాంగులకూ పలు నిబంధనలు సడలిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సైతం ఆన్లైన్లోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. రంగంలోకి దళారులు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అంగన్వాడీ టీచర్ లేదా ఆయా పోస్టు ఇప్పిస్తామంటూ దళారులు రంగప్రవేశం చేశారు. రిజర్వేషన్లపై అవగాహన లేని అభ్యర్థులతో బేలారు మొదలుపెట్టారు. టీచర్ పోస్టు ఇప్పిస్తామని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఆయా పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే పోస్టులు వరించేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసి.. అర్హులైన వారికే పోస్టులు ఇచ్చేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగానే కలెక్టర్ శరత్, జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖ అధికారి నిబంధనల మేరకు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా.. త్వరలోనే జరగనున్న పోస్టుల భర్తీలో అధికారులు పాటిస్తున్న పారదర్శకత చివరి వరకూ అలాగే కొనసాగుతుందో, లేదో చూడాలి. -
ఉపాధ్యాయుడిపై విచారణ
మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం కొండాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పాకాల చరణ్ తనను క్లాస్‌టీచర్ రవీందర్ హనుమాన్ దీక్ష తీసుకోవడంపై అసభ్యంగా మాట్లాడి.. పాఠశా ల నుంచి వెళ్లగొట్టారని పేర్కొంటూ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎం ఈవో పాఠశాలలో విచారణ చేపట్టారు. స్థా నికులు, విద్యార్థుల కథనం ప్రకారం చరణ్ హ నుమాన్‌దీక్ష తీసుకున్నాడు. ఎప్పటిలాగే బుధవా రం పాఠశాలకు వెళ్లగా ఉపాధ్యాయుడు రవీం దర్ ‘నాలుగురోజులుగా పాఠశాలకు ఎం దుకు రావడం లేదు. హనుమాన్ దీక్ష అవసర మా..? యూనిఫాం వేసుకుని రా..’ అంటూ గద్దించా రు. దీంతో బయటకు వచ్చిన చరణ్ తోటి దీక్షస్వాములకు చెప్పడంతో వారు ఉపాధ్యాయుడి ని నిలదీశారు. ఎస్సై కిరణ్‌కుమార్ పాఠశాలకు వచ్చి ఆందోళన చేయవద్దని, ఏమైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిం చారు. దీంతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన స్వాములు.. అనంతరం ఎస్సైకి ఫిర్యాదు చేశా రు. దీనిపై ఎంఈవో గౌతంకృష్ణారావు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని విచారించారు. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ పాఠశాలకు ఎం దుకు రావడం లేదని మందలించినందుకే కక్షకట్టి ఇలా చేస్తున్నాడని పేర్కొన్నారు. ఎంఈవో వెంట డీఈవో కార్యాలయ ఏడీ ఆంజనేయులు ఉన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని ఎంఈవో తెలిపారు. -
మీకు ఓట్లడిగే హక్కులేదు!
సాక్షి, జగిత్యాల/మెట్పల్లి: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితకు, ఆయన బంధువైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదు. జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడి రెండున్నరేళ్లు దాటినా దాని పునరుద్ధరణ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఇద్దరూ విఫలమయ్యారు. రాబోయే ఎన్నికల్లో వీరికి బుద్ధిచెప్పాల్సింది మీరే’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం సాయంత్రం నిర్మల్ జిల్లా మీదుగా మెట్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఖాదీ ప్రతిష్ఠాన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తంకుమార్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంత ప్రజలు, రైతులు తమ బతుకులు బాగుపడతాయని భావించారన్నారు. నాలుగేళ్లు కుంభకర్ణుడిలా మొద్దునిద్రపోయిన సీఎం కేసీఆర్ ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో రైతుల గురించి ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న సీఎం ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడు రైతులపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చొరవ తీసుకోలేదన్నారు. ‘సమైక్య రాష్ట్రంలో తాను గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏటా లక్ష ఇళ్లు నిర్మించామని, ఆ సమయంలో మేం కట్టిన ఇళ్లను అగ్గిపెట్టెలా ఉన్నాయని ఎద్దేవా చేసిన సీఎం కేసీఆర్ పెద్ద వరండా, గొర్లు, బర్లు కట్టుకునేలా ఖాళీ స్థలంతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి కట్టించి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ‘దళితులకు ఇస్తామన్న మూడెకరాలైనా ఇచ్చారా?’ అని ప్రజలను అడిగారు.తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో సెక్యులర్ పాలన రావాలంటే ఢిల్లీలో మోదీని గద్దె దింపాలని.. దానికి ముందు చిన్న మోదీ కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలన్నారు. శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. నాలుగేళ్లు దున్నపోతులా నిద్రపోయిన కేసీఆర్ ఇప్పుడు లేచి రైతు సమస్యలంటూ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త నాటకం ఆడుతున్న కేసీఆర్ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వంద రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటామని చెప్పిన ఎంపీ కవిత హామీని నిలబెట్టుకోకపోగా నడిచే ఫ్యాక్టరీని మూసేసి రైతులను మోసం చేసిందన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి ఒడిలో కూర్చునే రకమన్నారు. మతం పేరిట రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపడం ఆయన నైజం అని విమర్శించారు. రాష్ట్రంలో కేటీఆర్ లేడు.. ఫీటీఆర్ లేడు.. అసద్ లేడు.. ఫసద్ లేడు’ అని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు మాట్లాడుతూ... సర్వే చేయించుకుని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 106 సీట్లు వస్తాయని చెబుతున్న కేసీఆర్ మళ్లీ బస్సు యాత్రకు ఎందుకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. అవన్నీ బోగస్ సర్వేలు కావడం.. కాంగ్రెస్ బస్సు యాత్రకు విశేష స్పందనకు భయపడే మళ్లీ కొత్త యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు విమర్శించారు. ఎంపీ కవిత.. అన్ని పండగలను అయ్య జాగీరుగా భావిస్తుందన్నారు. బతుకమ్మ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కవిత షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదన్నారు. ఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే కష్టాలు పోతాయనుకుంటే ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గుండె పగిలి చనిపోతోన్నా.. ఏమీ పట్టనట్లు సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేయలేదని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు నాగార్జున సాగర్, వరద కాలువలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎవరు స్థాపించారో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సారెస్పీ నుంచి 14 టీఎంసీల నీటిని అక్రమంగా మిడ్‌మానేరుకు తరలించి పెద్దపల్లి జిల్లా రైతులకు నీరందకుండా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలను కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపుల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేశామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అన్నిరకాల నిత్యావసర వస్తువులు అందిస్తామని చెప్పారు. అంతకు ముందు.. మెట్పల్లి ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద బస్సు యాత్రకు స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యేలు కొమొరెడ్డి రాములు, జ్యోతక్కల ఆధ్వర్యంలో కార్యకర్తలు సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అ«ధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అ«ధ్యక్షురాలు నేరెళ్ల శారద, రాష్ట్ర అధికార ప్రతినిధి రమ్యారావు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, బొమ్మ వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, నాయకులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, మెట్పల్లి: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చౌలమద్దిలో జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం ప్రతాపరెడ్డి(30) తన వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ప్రేమజంటను బెదిరించి అత్యాచారం
-
జగిత్యాల జిల్లాలో దారుణం : యువతిపై ముగ్గురి అత్యాచారం
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. ప్రేమికుడితో కలిసి వెళ్తున్న యువతిని బెదిరించి హత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ప్రియుడిని చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల హుస్నాబాద్‌కు చెందిన ప్రేమికులు బైక్‌పై వెల్లడాన్ని అదే గ్రామానికి చెందిన వంశీ, రాజష్లతోపాటు మరో యువకుడు వీడియో తీశారు. తమకు లొంగకపోతే వీడియోని ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్దనున్న సెల్‌ఫోన్, నగదును లాక్కున్నారు. ఇంటికి చేరుకున్న యువతి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది. గ్రామస్తులు, స్థానికులు ముగ్గురిలో ఇద్దరిని పట్టుకొని నడిరోడ్డుపై కట్టేసి చితక బాదారు. మరొకరు పరారీలో ఉన్నారు. యువతి పరువు పోతుందనే కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబసభ్యులు తెలిపారు. -
చల్గల్లో దొంగల హల్చల్
జగిత్యాల: జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం చల్గల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన నాలుగిళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 40 తులాల బంగారం, 20తులాల వెండి, రూ.50 వేల నగదు దొంగిలించుకెళ్లారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎంపీ కవిత తీరుకు నిరసనగా మెట్పల్లి బంద్
సాక్షి, మెట్పల్లి : తమ పట్ల ఎంపీ కవిత అవమానకరంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి బంద్‌కు చెరకు రైతులు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని కోరుతూ ఎంపీకు వినతిపత్రం ఇవ్వడానికి యత్నిస్తే పట్టించుకోలేదని చెరకు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. -
జనగాంలో పారిపోయి జగిత్యాలలో దొరికాడు
►ప్రియురాలి సహాయంతో ఛేదించిన పోలీసులు ►వివిధ వేషధారణల్లో గ్రామంలోకి చందు ►ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు సాక్షి, రాయికల్, (జగిత్యాల) : పోలీసులకు సవాల్‌గా మారిన పారిపోయిన ఖైదీ.. అంతర్‌జిల్లాల దొంగ అత్తినేని చంద్రమోహన్ ఉరఫ్ చందును గురువారం జగిత్యాల జిల్లా రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన అత్తినేని చంద్రమోహన్ ఉరఫ్ చందు తన ప్రియురాలిని కలవడం కోసం గ్రామ శివారులోకి వచ్చాడు. అప్పటికే గ్రామస్తులకు సమాచారం చేరవేసిన పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ప్రియురాలే పట్టించింది చిన్నప్పటి నుంచి చందు జల్సాలకు అలవాటుపడ్డాడు. చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఖరీదైన వస్తువులు కొంటూ ప్రియురాలికి గిఫ్ట్‌లుగా ఇచ్చేవాడు. ఇదే క్రమంలో తాను ప్రియురాలితో దిగిన ఫొటోలు వాట్సప్‌లో పెట్టి అందరికీ షేర్చేసేవాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె చందును ఎలాగోలా పోలీసులకు పట్టించాలని వలపన్నింది. ఓ దొంగతనం కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చందును గతనెల 16న అక్కడి పోలీసులు వాహనంలో హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ బిర్యానీ తిన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరారు. సిబ్బంది నిద్రలోకి జారుకున్న విషయం గమనించిన చందు జనగామ మండలం యశ్వంతరావుపూర్ పెట్రోల్‌బంక్ సమీపం వద్దకు వాహనం రాగానే మూత్రవిసర్జన చేయాలని చంద్రమోహన్ ఎస్కార్ట్కు చెప్పాడు. దీంతో అతన్ని వాహనం నుంచి కిందకు దింపారు. ఈ క్రమంలో చేతులకు బేడీలు ఉన్నప్పటికీ ఎస్కార్ట్‌ను తోసేసి మెరుపువేగంతో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు చందును పట్టుకోడానికి జనగామ, కరీంనగర్, జగిత్యాల పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. రాయికల్ మండలంలోని ఓ గ్రామంలో ప్రియురాలితో సంబంధం ఉందని తెలుసుకొని గత వారం రోజుల నుంచి గ్రామంలో నిఘా పెట్టడంతో పాటు గ్రామంలో యువకులతో ఎప్పటికప్పుడు ఆయన సమాచారాలపై ఆరా తీయడం ప్రారంభించారు. చివరకు ప్రియురాలే ప్రియుడిని పట్టించింది. చిన్నతనం నుంచే.. రాయికల్ మండలంలోని అయోధ్య గ్రామానికి చెందిన చందు జల్సాల కోసం దొంగగా అవతారమెత్తాడు. రాయికల్ ఠాణాలో దొంగతనంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. చందుకు 17 ఏళ్ల వయస్సులోనే మండలంలోని సింగరావుపేట గ్రామంలో 7.2.2014న పుప్పాల సుజాత–రాజిరెడ్డి ఇంట్లో దొంగతనంకు పాల్పడి అరకిలో వెండి, 9 తులాల బంగారం, మైతాపూర్ గ్రామంలో 12.04.2014న పడిగెల గంగారెడ్డి ఇంట్లో 3 తులాల బంగారం, అల్లీపూర్ గ్రామంలో 13.06.2014న అత్తినేని లింగారెడ్డి ఇంట్లో 6 తులాల, శంకర్ ఇంట్లో 4 తులాల బంగారం దొంగిలించి స్నేహితులతో కలిసి జల్సాలు చేసుకునేవాడు. రాయికల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కోర్టుకు అప్పగించగా మేజర్ కాకపోవడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు దొంగతనాలు చేయగా ఆయనను చాకచక్యంగా అక్కడి పోలీసులు పట్టుకొని 48 తులాల బంగారాన్ని రికవరి చేశారు. ఆయనను విచారణ నిమిత్తం స్టేషన్లో తీసుకోగా పోలీసుల కన్నుగప్పి అక్కడి నుంచి పరారై హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఖైరతాబాద్‌లో సైతం చోరీకి పాల్పడ్డాడు. ఆయన వద్ద నుంచి మూడు తులాల బంగారాన్ని రికవరి చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై కిరణ్ తెలిపారు. అనంతరం చందును సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించారు. టెక్నాలజీలో దిట్ట... చందుకు చదువు అబ్బకపోయినా టెక్నాలజీ వినియోగించడంలో మాత్రం పూర్తిస్థాయిలో ఆరితేరాడు. ఎన్నోసార్లు పోలీస్‌స్టేషన్ నుంచి పరారయ్యాడు. దీంతో అక్కడి పోలీసుల ఉద్యోగాలు సైతం చందు వల్ల పోవడంతో ఎలాగైనా చందును పట్టుకోవాలనే కసి పోలీసుల్లో పెరిగింది. ముఖ్యంగా చందు వాట్సప్, ఐఎంవో, ఫేస్బుక్ కాలింగ్ ద్వారా ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఎవరికి చిక్కకుండా తన పనులను చేసుకునేవాడు. ఇటీవల పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంతో ఆ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో పోలీసులు ఆయన వాడుతున్న ఫేస్బుక్, ఐఎంవో, వాట్సప్ కాలింగ్‌లపై నిఘా పెట్టడంతో చందు ఉన్న ప్రదేశాలను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. అంతేకాకుండా గ్రామంలోకి స్త్రీవేషాధారణ, హనుమాన్ దీక్ష వేషాధారణతో వచ్చి ప్రియురాలితో గడిపేవాడని గ్రామస్తులు తెలిపారు. ఏదేమైనా అంతర్‌జిల్లాల దొంగ దొరకడంతో ఇటు పోలీసులు, అటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
కలెక్టరేట్ ‘న్యాక్’లో వద్దు
జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా కలెక్టరెట్ కార్యాలయాన్ని న్యాక్ భవనంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని, మరోసారి పరిశీలించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేశారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాక్ భవనం జగిత్యాలకు 10కిలోమీటర్ల దూరంలో ఉండడంతోపాటు రహదారి సౌకర్యం సరిగ్గా లేదన్నారు. అంతేకాకుండా న్యాక్ విద్యార్థులకు సైతం ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు. ధరూర్ క్యాంపులో సుమారు 100 ఎకరాలు అందుబాటులో ఉందని, అక్కడ ఉన్న క్వాటర్స్‌లోనే కలెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందని వివరించారు. ఎస్సారెస్పీ సర్కిల్ ఆఫీసులోనే 200 మంది వరకు విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం మరోసారి ఆలోచించి కలెక్టర్ కార్యాలయాన్ని ఎస్సారెస్పీ క్వాటర్లలో ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, దామోదర్‌రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.