శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పించండి  | Tickets For Srivari Darshan In Tirupati | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పించండి 

Published Sun, Sep 12 2021 4:41 AM | Last Updated on Sun, Sep 12 2021 4:41 AM

Tickets For Srivari Darshan In Tirupati - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): తిరుపతిలోని శ్రీవారి దర్శనం కోసం టికెట్లు కావాలంటూ ఓ భక్తుడి ఫోన్‌కు స్పందించి పనయ్యేలా చూశారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండల కేంద్రానికి చెందిన సాయిని తిరుపతి స్రవంతి దంపతులు, వారి ఇద్దరు కుమారులు, తల్లినర్సమ్మతో కలసి శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆన్‌లైన్లో ముందుగా టికెట్లు బుక్‌ చేసుకోవాలని తెలియకపోవడంతో ఈనెల 2న కరీంనగర్‌ నుంచి రైల్లో బయల్దేరేందకు టికెట్లు మాత్రమే రిజర్వు చేయించుకున్నారు.

ఈ నెల 1న వీరికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న తిరుపతి ఆన్‌లైన్‌ టికెట్ల కోసం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్‌ చేయగా..స్పందించిన ఆయన వారి వివరాలను వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ పంపమని చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి ఈనెల 3న శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించారు. దర్శనం అనంతరం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్‌ మెసేజ్‌ ద్వారా తిరుపతి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement