subbareddy
-
ఇదో రకం పిచ్చి..!
డోన్: కొందరు యువకుల చేష్టలు విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. ద్విచక్రవాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఫలానా తాలుకా అంటూ బోర్డులు తగిలించుకోవడం.. ఏదో గనకార్యం చేసినట్లు దూసుకుపోవడం ప్యాషన్‌గా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు వేసుకుని తిరగడం ఎక్కువయ్యాయి. డోన్ పట్టణంలో కొందరు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తాలుకా అని, మరికొందరు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తాలుకా అని, ఇంకొందరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ తాలుకా అని నేమ్ప్లేట్లు రాయించుకుని రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ఈ వాహనాలకు రిజి్రస్టేషన్ నంబర్లు ఉండేచోట ఫలానా వ్యక్తి తాలుకా అని తాటికాయ అంత అక్షరాలతో రాసుకుని తిరుగుతుండటంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి వెర్రి మరింత ముదిరిపోకముందే పోలీసు, ఆర్టీఓ అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
-
టీడీపీలో తిరుగుబావుటా
డోన్/పెనుకొండ/అనకాపల్లి/రాజమహేంద్రవరం రూరల్: టికెట్ల ప్రకటనపై టీడీపీలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని టీడీపీ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గీయులు డోన్‌లో పోటాపోటీ బలప్రదర్శన నిర్వహించగా, సీటు దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం భవిష్యత్ కార్యచరణ పేరుతో వేలాదిమందితో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ మూడేళ్ల పాటు పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని వివరించారు. 40 ఏళ్లుగా కోట్ల, కేఈ వర్గా లకు విధేయునిగా ఉన్నానే తప్ప వారికి ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాలు పార్టీ ఇన్చార్జిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే బాబు తనకు బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ప్రకటించడం దారుణమ న్నారు. బాబు తన గొంతు కోశారని కన్నీటి పర్యంతమయ్యారు. తన రెక్కల కష్టంతో పార్టీని బతికించానని, ఇప్పుడు ఎవరో వచ్చి ఫలాలు పొందాలనుకుంటే తాను చూస్తూ ఊరుకోబోనన్నారు. బీకే ఇంటి వద్ద ఉద్రిక్తత శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మె ల్యే బీకే పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. బీకేకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన వర్గీయులు పార్టీపరిశీలకుడితోపాటు ఇతర నేతలను ఘెరావ్ చే శారు. పార్థసారథికి సర్దిచెప్పేందుకు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ పరిశీలకుడు కోవెలపూడి రవీంద్ర, మరికొందరు నాయకులు పెనుకొండలోని బీకే ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీకే మద్దతుదారులు తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని వారు సర్దిచెప్పబోగా.. ఎంపీ టికెట్‌కు ఒప్పుకోబోమని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. రవీంద్రతోపాటు ఇతర నాయకులను చుట్టుముట్టారు. దీంతో రవీంద్ర, ఇతర నాయకులు వెనుదిరిగేందుకు యత్నించారు. అయినా వదలని బీకే వర్గీయులు వారి వెంట పడ్డారు. వాహనాలను చుట్టుముట్టి ముందుకు వెళ్లనీయకుండా ఘెరావ్ చేశారు. లోకేష్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవీంద్ర, ఇతరులు అక్కడి నుంచి జారుకున్నారు. దిలీప్‌చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోం టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలని, బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, çసమైక్య ఉద్యమ నేత ఆడారి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ ఇవ్వాలి, లేకుంటే తాను తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ సభలకు, పాదయాత్రలకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో మూడు బస్సులు తిప్పానని, ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సమావేశాలకూ బస్సులు తిప్పుతున్నానని చెప్పారు. ఆరు నెలల క్రితం చంద్రబాబుతో అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చర్చించానని, ఈసారి టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శొంఠ్యాన అప్పలరాజు, దాడి అప్పలనాయుడు, ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రకటించే వరకూ వేచి చూస్తా: గోరంట్ల టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తేనే రాష్ట్రం మళ్లీ బాగు పడుతుందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నగరంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో ఏం జరిగింది, ఇప్పుడు తన బలమేమిటనే విషయాలను పవన్ కళ్యాణ్ జెండా సభలో వివరించారని, పవన్ తన పార్టీని నెమ్మదిగా బలోపేతం చేసుకుందామని చెప్పారని, ముద్రగడ, జోగయ్యల గురించి తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటుపై అధినేతలు ప్రకటించే వరకూ వేచి చూస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్‌లను విడదీసేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. -
‘డోన్’టాక్..!
సాక్షి, నంద్యాల: అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి. ఆయనకే టికెట్ అంటూ గతంలో ప్రకటించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను కలిసేందుకు యత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. దీంతో సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే ఇలా నమ్మించి మోసం చేస్తారా.. అంటూ మండిపడుతున్నారు. ఫిబ్రవరి 1న శ్రీశైలం దేవస్థానానికి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన నారా లోకేశ్ టికెట్ కోసం అయితే తనతో మాట్లాడొద్దని ముఖం మీద చెప్పేయడమే కాకుండా... ఫిబ్రవరి 3న డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తారని అనుకూల మీడియా నుంచి పార్టీ లీకులు ఇవ్వడంపై సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. అదేరోజు ఉదయం విజయవాడకు వెళ్లిన ఆయన రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను అపాయింట్ కోరినా పట్టించుకోవట్లేదని సమాచారం. గతంలో చంద్రబాబు స్వయంగా టికెట్ ప్రకటించి ఇప్పుడు మోసం చేయడం ఏమిటని సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే మారిన సీన్ ! ఫిబ్రవరి 3న సుబ్బారెడ్డి విజయవాడ వెళ్లగానే సీటు నీకేనంటూ పార్టీ నుంచి సమాచారం రావడంతో సుబ్బారెడ్డి అనుచరులు పట్టణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. బైక్‌లతో హల్చల్ చేశారు. ఈ విషయాన్ని కోట్ల వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సుబ్బారెడ్డిని తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగపెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకోవడం గమనార్హం. వాడీవేడిగా విమర్శలు ! మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కోట్ల వర్గీయులు, సుబ్బారెడ్డి వర్గీయులు రెండు గ్రూపులుగా ఏర్పడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని సుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి చంద్రబాబును నమ్మి సుబ్బారెడ్డి మోసపోయారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. -
ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న సుమారు 3 లక్షల మందితో భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో 175/175 లక్ష్యంతో ఎన్నికల ప్రచారం సాగుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ఇచి్చన హామీలను అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా అమలుచేసి చూపించారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని భీమిలి బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమవుతారని చెప్పారు. పార్టీ క్యాడర్లో అసంతృప్తిని తొలగించడంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వైఎస్ జగన్ వివరిస్తారన్నారు. విశాఖ రాజధాని కావడం తథ్యం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యమని, దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే విశాఖ నగరం, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టిందని కొనియాడారు. కాదని చేప్పే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమిలి బహిరంగ సభకు ముందు ఈ నెల 21 నుంచి 23 వరకు ఉత్తరాంధ్రలో నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, దీనిని ప్రజలు చూస్తూ ఊరుకోరని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. తమ సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిస్తూ.. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. జూనియర్ ఎనీ్టఆర్ ఫ్లెక్సీలు ఎందుకు తీసేశారనేది టీడీపీ ఇష్టమని.. తమకు సంబంధం లేని అంశంపై తాను మాట్లాడనన్నారు. -
ఎంపీ సీటుపై వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్
-
పాలకొండలో గర్జించిన గిరిజనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిజనుల గడ్డ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు జనం పోటెత్తారు. గిరిజనులతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత పాలకొండ మండలం చినమంగళాపురంలో ఆర్బీకే, గ్రామ సచివాలయం భవనాలను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, కంబాల జోగులతో కలిసి వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. పాలకొండ వరకూ సాగిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వందలాది కార్యకర్తలు ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సాధికారతకు నేనే నిదర్శనం: ఎమ్మెల్యే కళావతి సీఎం జగన్ పాలనలో సామాజిక సాధికారత సాకారమైందనడానికి ఆదివాసీ మహిళనైన తానే నిదర్శనమని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. గత టీడీపీ పాలనలో ప్రసంగాలకే పరిమితమైన సామాజిక న్యాయం.. ఇన్నాళ్లకు జగనన్న ప్రభుత్వంలో సాకారమైందని చెప్పారు. 3 లక్షల ఎకరాల భూ పంపిణీ: ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో 3 లక్షల ఎకరాల భూమిని గిరిజనులకు పంపిణీ చేశారని, గతంలో చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 40 వేల ఎకరాలు కూడా ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. గిరిజనుల అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు, నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందన్నారు. బాబు మోసాలను గుర్తు చేసుకో.. ఫ్యాన్ గుర్తును తలచుకో.. అంటూ వేదికపై పాడిన పాట ఆకట్టుకుంది. దేశమంతా చర్చ : స్పీకర్ తమ్మినేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక సాధికారతకు సంబంధించి ఏపీలో జరుగుతున్న బస్సు యాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. గతంలో ఎన్నడూ వెలుగుచూడని 139 వెనుకబడిన కులాలను గుర్తించి 56 కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా నిధులు, విధులు, బాధ్యతలు ఇచ్చి వారి ఆత్మాభిమానాన్ని సీఎం జగన్ పెంచారన్నారు. ఏపీలో సామాజిక విప్లవం : మంత్రి మేరుగు దేశంలో మరే ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా సీఎం జగన్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం ద్వారా సాధికారత సాధించారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను అవమానించారని మంత్రి సీదిరి అప్పలరాజు గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఇంకెంత కాలం చంద్రబాబుకు బానిసలుగా ఉంటారని, బయటకు వస్తే విశాఖను పరిపాలన రాజధాని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎంపీలు గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, రెడ్డి శాంతి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతీరాణి పాల్గొన్నారు. -
బాబుకు మేలు చేయడమే మీ అజెండా
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడసెంట్రల్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఒక్క కార్యక్రమమైనా చేపట్టకపోగా, సొంత ప్రయోజనాల కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. టీడీపీని, మరిది చంద్రబాబును కాపాడటమే పనిగా పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యత్తి రీత్యా తాను వైద్యుడిని అయినప్పటికీ 1986లో ఏబీవీపీతో మొదలుపెట్టి.. పార్టీ అనుబంధ విభాగాల్లో 37 ఏళ్లుగా పని చేస్తున్నానని తెలిపారు. ఇప్పటిదాకా పని చేసిన వారంతా రాష్ట్రంలో పార్టీని అంతో ఇంతో బలోపేతం చేసేందుకు ప్రయత్నించారన్నారు. కానీ, పురందేశ్వరి మాత్రం పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ‘బీజేపీని అభివృద్ధి చేయడం కంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పాకులాడుతున్నారు. పొత్తులో భాగంగా ఒక్క ఎంపీ సీటు అయినా తీసుకుని అందులో పోటీ చేసి గెలిచి, ఏపీ కోటాలో కేంద్ర మంత్రి అయిపోదామన్నదే మీ తాపత్రయం. జనసేన పార్టీని ఉద్దేశ పూర్వకంగా టీడీపీ వైపు మళ్లించింది మీరు కాదా? టీడీపీతో పొత్తు లేకపోతే బీజేపీని వీడి, టీడీపీలో చేరేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నది నిజం కాదా? కాదని ప్రమాణం చేయగలరా?’ అని ఆయన నిలదీశారు. మీరు తప్పుకుంటేనే బీజేపీకి మేలు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ కులతత్వంతో ఏపీ బీజేపీని పూర్తిస్థాయిలో భ్రష్టు పట్టిస్తున్నారని సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీలో కార్యకర్తల మధ్య కులాల ప్రాధాన్యత ఎప్పుడూ ఉండేది కాదని, ఇప్పుడు పురందేశ్వరి 40% పదవులు ఆమె సొంత సామాజికవర్గం వారికి కట్టబెట్టారన్నారు. తద్వారా రాష్ట్ర బీజేపీలో కులాల చిచ్చు రేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వలాభం కోసం పార్టీలు మార్చే వారికి పెద్దపీట వేసి, పార్టీని నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘చంద్రబాబు అరెస్టు అయితే తెలుగుదేశం కార్యకర్తల కంటే ముందే పురందేశ్వరి ఖండించిన మాట వాస్తవం కాదా? టీడీపీ బలహీన పడుతున్న సమయంలో బీజేపీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి.. టీడీపీని ఎలా కాపాడుకోవాలో కుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టడం నిజం కాదా? లోకేశ్‌ను బీజేపీ జాతీయ నాయకుల దగ్గరికి దగ్గరుండి తీసుకువెళ్లడం ఎంతవరకు సమంజసం? పార్టీ కోసం శ్రమించే నాలాంటి వందలాది మంది నాయకులు మీ తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో ఇసుక స్కామ్ అంటూ హడావుడి చేసి.. జేపీ సంస్థ నుంచి ఆ ర్థిక ప్రయోజనాలు పొంది సైలెంట్ అయ్యారన్నది నిజం కాదా? మీరు, మీ కుటుంబ సభ్యులు మద్యం కంపెనీలతో బేరాలాడుతున్న మాట నిజమా.. కాదా? మీ రహస్య అజెండా మేరకే పని చేస్తుండటం అందరికీ కనిపిస్తోంది’ అని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ‘పార్టీ నేతలను నోరెత్తనీయడం లేదు. ఎవరైనా మాట్లాడితే బెదిరింపులు పాల్పడుతున్నారు. చివరికి సోము వీర్రాజు వంటి వారిపైనా వేధింపులకు దిగుతున్నారు. నిజాయితీగా పని చేస్తున్న వారిని పార్టీ నుంచి తరిమివేయాలని కుట్రలు చేస్తున్నారు. మీరు పని చేస్తున్నది మీ ఆస్తులను పెంచుకోవడానికి, మీ మరిది చంద్రబాబు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికేనని స్పష్టమవుతోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష స్థానం నుంచి మీరు తప్పుకుంటేనే బీజేపీకి మేలు జరుగుతుంది. పార్టీని కాపాడుకోవడానికి కార్యకర్తలు నడుం బిగించాలి’ అని పిలుపునిచ్చారు. -
విశాఖలో 12 ఫ్లైఓవర్ల నిర్మాణంపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి అధికారులను కోరారు. విశాఖ ట్రాఫిక్ నియంత్రణ అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలో విపరీతంగా పెరిగిన సరకు రవాణా, ప్రజారవాణా వాహనాల క్రమబద్ధీకరణపై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని కోరారు. విశాఖపట్నం–భోగాపురం ఆరులేన్ల రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని చెప్పారు. షీలానగర్–సబ్బవరం రోడ్డు పూర్తయితే నగరంపై ట్రాఫిక్ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. విశాఖ నగరం మీదుగా వెళ్లే హైవే–16పై వివిధ ప్రాంతాల్లో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ప్రధాన జంక్షన్లలో వ్యాపారులకు ప్రత్యామ్నాయస్థలాలు చూపి, జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. అగనంపూడి టోల్గేట్ అంశంపై అవసరమైతే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు. ఎన్ఏడీ, హనుమంతవాక జంక్షన్ల విస్తరణకు, నగరంలో ట్రక్ పార్కింగ్తో పాటు బస్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి వీలుపడదని, అర్థచంద్రాకారంలోనైనా రింగ్‌రోడ్డు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నరసింహనగర్‌లో కొండ తొలిచి అక్కడినుంచి హెల్త్ సిటీలో ఉన్న బీఎస్సార్ బీఆర్టీఎస్ టన్నెల్ నిర్మించే అంశమూ పరిశీలనలో ఉందన్నారు. నగరంలో ట్రాక్టర్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయన్నారు. విశాఖ నుంచి పాలన కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం దసరా నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావించామని, కానీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. పరిపాలన రాజధాని వసతులపై సీఎం వైఎస్ జగన్ వేసిన కమిటీ డిపార్ట్మెంట్ భవనాలు ఫైనలైజ్ చేసేవరకు సీఎం రావడం ఆలస్యమవుతుందన్నారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా తాము దొడ్డిదారిన వైజాగ్ రావల్సిన అవసరం లేదన్నారు. రైట్‌గా, రాయల్‌గా విశాఖకు వచ్చి ఇక్కడినుంచే తమ నాయకుడు పరిపాలన అందిస్తారని తెలిపారు. సమావేశంలో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కోలా గురువులు, దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
కడప పూర్వ మునిసిపల్ కమిషనర్ లవన్నకు జైలు శిక్ష, జరిమానా
సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్ : కోర్టు ధిక్కార కేసులో వైఎస్సార్ కడప జిల్లా పూర్వ మునిసిపల్ కమిషనర్, ప్రస్తుత శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్నకు హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు తీర్పు అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. మునిసిపల్ అధికారులు తన షాపులను, ఇంటిలోని పైభాగాన్ని కూల్చేస్తున్నారంటూ కడప జిల్లా, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పి.పద్మావతిబాయి హైకోర్టులో 2020లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారంటూ పద్మావతి హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అప్పటి మునిసిపల్ కమిషనర్ లవన్నను ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం తీర్పు వెలువరిస్తూ లవన్న కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తేల్చారు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకున్నా.. రాజ్యాంగ హక్కు అని తెలిపారు. కౌంటర్లో లవన్న తాను చేసిన పనికి క్షమాపణ కోరలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ద్వారా సమాజంలో కోర్టు ప్రతిష్టను దిగజార్చారంటూ పైవిధంగా తీర్పు చెప్పారు. -
ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్
శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, అజయ్ కీలక పాత్రల్లో బేబీ డమరి సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఎర్ర చీర’. సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్ కానుంది. సుమన్ బాబు దర్శకత్వం వహించారు. ‘‘అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూ΄పొందించాం. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు. -
ఏ పార్టీ కూడా వైఎస్సార్సీపీ దరిదాపులకు రాలేదు
సాక్షి, విశాఖపట్నం : పవన్‌కళ్యాణ్ ఎందుకు యాత్ర చేస్తున్నారో ఆయనకే తెలియదని, అందుకే ప్రజలు కూడా పవన్‌ను పట్టించుకోవడం మానేశారని టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన భీమిలి, విశాఖ పశ్చిమ, పెందుర్తి నియోజకవర్గాల అభివృద్ధి సమీక్షలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినితో కలిసి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో 9వ తేదీన వారాహి యాత్ర అని వస్తున్న వార్తలపై సుబ్బారెడ్డి మీడియాతో స్పందిస్తూ.. ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఒరిగేదేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వైఎస్సార్సీపీ దరిదాపులకు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏడాది కాలంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన, నిర్మాణ పనుల గురించి టీడీపీ నేతలకు నోరెందుకు పెగలడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరిగా శిలా ఫలకాల స్థాయిలో ఏ పనీ ఆగదని, అనుకున్న సమయానికి ప్రతి పనీ పూర్తిచేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సంకల్పమన్నారు. ఇటీవల వలంటీర్ ఒక వృద్ధురాల్ని హత్య చేశారంటూ బురద జల్లే కార్యక్రమాన్ని టీడీపీ ప్రారంభించిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తే.. నిందితుడిని వలంటీర్ విధుల నుంచి ఎప్పుడో తొలగించేశారని తెలిసి మిన్నకుండిపోయారని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు రావడమే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చంద్రబాబు జోక్‌లు వేస్తున్నారు : మంత్రి రజిని ఊరూరా తిరుగుతూ వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు వేస్తున్న పెద్ద జోక్‌లకు ప్రజలు పగలబడి నవ్వుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు అండ్ కో అడ్రస్ గల్లంతవుతుందన్న విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసన్నారు. ఆ విషయం తెలిసే.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంటే.. తమ హయాంలో ఏమీ చేయలేకపోయామన్న దుగ్ధతో టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
కనులపండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పూజల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చేవెళ్ళ ఎంపీ. రంజిత్‌రెడ్డిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరువీధుల్లో స్వామివారి వాహన సేవల్లో పాల్గొని ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతం తోమాల అర్చన అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎల్ఏసీ కమిటీ ఉపాధ్యక్షులు వెంకట్‌రెడ్డి, రవి ప్రసాద్, కోమటిరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : ఈనెల 11 నుంచి 15 వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవాలు
-
భక్తుల సర్వదర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం : టీటీడీ చైర్మన్
-
శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పించండి
సారంగాపూర్(జగిత్యాల): తిరుపతిలోని శ్రీవారి దర్శనం కోసం టికెట్లు కావాలంటూ ఓ భక్తుడి ఫోన్‌కు స్పందించి పనయ్యేలా చూశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన సాయిని తిరుపతి స్రవంతి దంపతులు, వారి ఇద్దరు కుమారులు, తల్లినర్సమ్మతో కలసి శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆన్లైన్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని తెలియకపోవడంతో ఈనెల 2న కరీంనగర్ నుంచి రైల్లో బయల్దేరేందకు టికెట్లు మాత్రమే రిజర్వు చేయించుకున్నారు. ఈ నెల 1న వీరికి వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న తిరుపతి ఆన్లైన్ టికెట్ల కోసం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేయగా..స్పందించిన ఆయన వారి వివరాలను వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపమని చెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి ఈనెల 3న శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించారు. దర్శనం అనంతరం వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ మెసేజ్ ద్వారా తిరుపతి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పుడు జగన్ అభినందించారు.. ఆ స్ఫూర్తితోనే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సివిల్స్ పరీక్షలలో జాతీయ స్థాయిలో రిషికేశ్ రెడ్డి 95వ ర్యాంక్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఆయన తండ్రి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సాక్షిటీవీతో మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచి రిషి చదువులో ముందుండే వాడు. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వూ వరకు వెళ్లాడు. నాలుగో ప్రయత్నంలో అనుకున్న ర్యాంకు సాధించాడు. పులివెందుల నియోజకవర్గం నుంచి సివిల్స్ సాధించిన రెండో వ్యక్తి మా అబ్బాయి కావడం సంతోషంగా ఉంది. గతంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెష్ సాధించినప్పుడు వైఎస్ జగన్ అభినందించారు. ఆ స్ఫూర్తితోనే ఈసారి సివిల్స్‌లో 95వ ర్యాంకు సాధించాడని' సుబ్బారెడ్డి తెలిపారు. రిషి సడలని కృషి వేంపల్లె : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలి.. పది మందికి సేవ చేసే భాగ్యం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే చదివాడు. ఆ ఆశయం సాధించేవరకు విశ్రమించకుండా తల్లిదండ్రుల మాటను తప్పకుండా పాటించి విజయం సాధించారు. ప్రణాళికాబద్ధంగా చదివి సివిల్స్ పరీక్షలలో జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించారు. చిన్న నాటి నుంచి కలెక్టర్ కావాలనే కలను నెరవేర్చుకున్నారు. నాలుగుసార్లు పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యి తన కలను నెరవేర్చుకున్నారు వేంపల్లెకు చెందిన సింగారెడ్డి రిషికేశ్‌రెడ్డి. వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాత దంపతుల కుమారుడు రిషికేశ్‌రెడ్డి. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాలలో జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించాడు. (సివిల్స్ టాపర్ ప్రదీప్ సింగ్) కుటుంబ సభ్యులతో రిషికేశ్‌రెడ్డి ప్రస్తుతం వీరు కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. ఇతడు ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు వేంపల్లెలోని శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో చదివాడు. 6, 7 తరగతులు తిరుపతి విద్యానికేతన్ స్కూల్లోనూ, 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లో చదివాడు. 10వ తరగతిలో 537మార్కులు సాధించాడు. ఇంటర్ ఎంపీసీ విభాగంలో 961మార్కులు సాధించారు. ఎంసెట్, జేఈఈ పరీక్ష రాసి ఎంసెట్‌లో 116వ ర్యాంక్, జేఈఈలో జాతీయస్థాయిలో 153వ ర్యాంక్ సంపాదించాడు. జేఈఈ ర్యాంక్‌లో రిషికేశ్ ఢిల్లీ ఐఐటీలో సీటును దక్కించుకున్నాడు. సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని రిషికేశ్‌రెడ్డి తపన పడేవాడు. ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సు చేరాక.. ఎలాగైన ఐఏఎస్ కావాలనే తపన అతనిలో మొదలైంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెబుతున్న మాటలు నిరంతరం గుర్తు పెట్టుకునేవాడు. ఉన్నత స్థానం చేరాలని కలలుకనేవాడు. ఇంజినీరింగ్ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో రోజుకు 8గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాడు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీవీల్లో వచ్చే వివిధ ఆటల పోటీలను చూస్తుండేవాడు. 2015లో మొదటిసారి సివిల్స్ పరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. (సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు) 2016లో రెండవసారి పరీక్ష రాయగా ఎంపిక కాలేదు. తర్వాత ఎక్కడ మార్కులు తగ్గాయని.. వాటి లోపాలను విశ్లేషించుకుని అధిగమించే ప్రయత్నం చేశాడు. 2017లో సివిల్స్ పరీక్ష రాసి జాతీయస్థాయిలో 374వ ర్యాంక్ సాధించారు. ఇండియన్ రైల్వే సర్వీస్‌లో ఉద్యోగం పొందారు. ఏడాదిపాటు ట్రైనింగ్‌లో ఉంటూ పట్టువదలని విక్రమార్కుడిలా చదివి నాల్గవసారి సివిల్స్ పరీక్షను రాసి జాతీయస్థాయిలో 95వ ర్యాంక్ సాధించాడు. జిల్లా ఖ్యాతిని నిలిపి విజేతగా నిలిచాడు. మూడుసార్లు ప్రయత్నించి ర్యాంక్ రాలేదని నిరుత్సాహపడి ప్రయత్నాలను ఆపేయకూడదని.. మళ్లీ పట్టుదలతో ప్రయత్నం చేసి విజయం సాధించారు. -
పల్లె నుంచి పరీక్షల అధికారి వరకూ..
సాక్షి, కడప ఎడ్యుకేషన్: మనసుండాలే గాని మార్గముంటుందంటారు. చదువుకోవాలనే ధ్యాస ఆ వ్యక్తిని ఉన్నతాధికారి స్థాయికి తీసుకెళ్లంది. మన జిల్లాలోని వల్లూరు మండలం గంగాయపల్లెలో ఓ రైతు ఇంట జన్మించి బడి ముఖమే చూడకుండా 1 నుంచి 5 వరకు ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద చదివారు. తరువాత 6 నుంచి ప్రభుత్వ స్కూలులో చదివారు. ఆయనెవరో కాదు. మన రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి. టెట్, సర్వశిక్ష అభియాన్ బోర్డులకు కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి గంగాయపల్లె గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద ప్రాథమిక విద్య నేర్చుకున్నారు. చదువుపై ఆది నుంచి ఆసక్తి చూపేవరు.6 నుంచి 10వ తరగతి వరకు గంగాయపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివారు. కడపలోని రామక్రిష్ణా జూనియర్ కళాశాలో, డిగ్రీని కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో పీజీని శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్సీటీ పూర్తి చేశారు. ఈయన 2000లో విద్యను పూర్తి చేసి మొట్టమొదటి సారిగా సెకండ్‌గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత డీఎస్సీ రాసి 2001లో స్కూల్ అసిస్టెంట్ ఎంపికైయ్యారు. 2007లో జేఎల్ పరీక్షను రాసి జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. 2008లో ఏపీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించారు. డిప్యూటీ డీఈఓగా ఎంపికయ్యారు. సొంత జల్లా అయిన కడపకు వచ్చారు. అనంతరం 2012లో డీఈఓగా పదోన్నతిపై హైదరాబాదకు వెళ్లారు. తరువాత రాçష్ట్రం విడిపోవడంతో కృష్ణా జిల్లా డీఈఓగా బదిలీపై వచ్చారు. తరువాత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది విద్యాశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. దీంతోపాటు 2018 నుంచి ప్రభుత్వ పరీక్షల జాయింట్ డైరెక్టర్‌గా, సర్వశిక్ష అభియాన్ బోర్డు డైరెక్టర్‌గా కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి తల్లితండ్రులు బాలిరెడ్డి, సుబ్బమ్మలది వ్యవసాయ కుటుంబం. విద్యాశాఖలో మార్పులు సుబ్బారెడ్డి ప్రభుత్వ పరీక్షల రాష్ట్ర ఇన్చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విద్యాశాఖలో పలు సమూల మార్పులు తెచ్చారు. పదవ తరగతి విద్యార్థులకు మార్కుల జాబితాను ఫలితాలు వెలువడిన వెంటనే ఆన్లైన్ పెట్టించేలా చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయించడంలో కీలక భూమిక పోషించారు. గతంలో విద్యార్థి హాల్‌టికెట్ నెంబరు కొడితే కేవలం వ్యక్తిగత మార్చులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు స్కూల్ కోడ్ కొట్టగానే విద్యార్థులకు సంబంధించిన అందరి ఫలితాలు ఒకేసారి వస్తాయి. ఇదీ ఆయన కృషేనని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా 12 రకాల స్కూల్ మేనేజ్మెంట్కు సంబంధించిన 11,890 స్కూల్స్ గుర్తింపుతోపాటు అడిషి నల్ తరగతుల వివరాలను అన్లైన్లో నమోదు చేయించారు. ప్రైవేటు పాఠశాలల గుర్తిం పు వివరాలను కూడా ఆన్లైన్లో పెట్టించారు. పదవ తరగతి విద్యార్థులకు సం బంధించిన నామినల్ రోల్స్‌ను కూడా జూన్‌లోనే ఆన్లైన్ చేస్తున్నారు. గతంలో నవంబర్ నెలలో నామినల్ రోల్స్‌ను అన్లైన్ చేసేవారు. ఆలాంటిది ఇప్పడు జూన్‌లోనే చేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మహిళలు ఆర్థిక స్వావలంబనకు కుట్లు, అల్లికలు, మ్యూజిక్ వంటి వృత్తి విద్యా కోర్సలను సంబంధించిన శిక్షణా కేంద్రాన్ని కడపలో ఏర్పాటు చేయించారు. -
విజయవాడ లో వైఎస్సార్సీపీ కరపత్రాల పంపిణీ
-
బాబు జీవితమంతా హత్యారాజకీయాలే!
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చంద్రబాబు జీవితమంతా హత్యారాజకీయాలేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి పూనూరు గౌతంరెడ్డి, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో శుక్రవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 427 మంది వైఎస్సార్సీపీ నాయకులను హతమార్చారన్నారు. వెయ్యికి పైగా దాడులకు పాల్పడ్డారన్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ ప్రభుత్వం హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. జగన్‌ను అడ్డుతొలగించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. జగన్‌పై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనన్నారు. ఘటనపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాసంకల్పయాత్ర తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌కు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రచార కమిటీ నాయకులు తంగిరాల రామిరెడ్డి, కాలే పుల్లారావు, ఎస్ ఈశ్వరరెడ్డి, మురళీనాయక్, సాదు సత్యనారాయణ, కేసరి కృష్ణారెడ్డి, ఎంఎస్ బేగ్, లంకా బాబు, మల్లికార్జునరెడ్డి, యానాల వెంకటేశ్వరరావు, హరీష్‌మిత్ర, నాగరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశల హరివిల్లు
‘ఆకాశంలో ఆశల హరివిల్లు.. ఆనందాలే పూసిన పొదరిల్లు’ అంటూ ‘స్వర్ణకమలం’ చిత్రంలో భానుప్రియ చేసిన నృత్యాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఆ పాట కూడా పాపులర్ అయింది. తాజాగా ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. సత్యశ్రీ, సుబ్బారెడ్డి, చరణ్, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య తారలుగా క్రాంతి కిరణ్ దర్శకత్వంలో బి. సత్యశ్రీ నిర్మించారు. శ్రీనివాస్ మాలపాటి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ఎస్విఎన్ రావు, నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. క్రాంతి కిరణ్ మాట్లాడుతూ– ‘‘కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన మంచి ప్రేమకథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకీ చాన్స్ ఇచ్చిన సత్యశ్రీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘దర్శకుడు, కెమెరామెన్ రెమో, హీరో, హీరోయిన్ల సపోర్ట్ వల్లే ఈ సినిమా తీయగలిగాను.వారికి నా స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు సత్యశ్రీ. -
చంద్రబాబు వద్దకు కర్నూలు పంచాయితీ
అమరావతి: కర్నూలు పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. మంత్రి అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటుచేసిన విషయం తెలిసిందే. అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలోని కౌన్సిలర్లతో ఆయన ఇప్పటికే సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలంటూ సుబ్బారెడ్డి వారిని కోరారు. ఈ విబేధాల నేపథ్యంలో జిల్లా నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు. శనివారం ఆయన సమక్షంలోనే ఈ కర్నూలు పంచాయితీని పరిష్కారించనున్నారు. -
నిజాయితీ కలిగిన మేధావులకే ఓటు వేయాలి
► ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటిటౌన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి నిజాయితీతో పాటు మంచి మేధావిగా కూడా తనకు పరిచయం ఉందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సాక్షితో ఫోన్ లో మాట్లాడారు. త్వరలో జరగున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని అన్నారు. నిజాయితీతో కూడిన మేధావులకు ఓటు వేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘనేతగా, శాసన మండలి సభ్యుడిగా, విద్యాక్షేత్రాల శ్రేయస్సు కోరే వ్యక్తిగా తనకు పరిచయం ఉందన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై అధికారులతో, ప్రభుత్వ పాలకులతో నిర్భయంగా మాట్లాడగలరని అన్నారు. గతంలో పోచంరెడ్డి సుబ్బారెడ్డి శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు తను ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ వర్గానికి సంబధించి 172 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించి జవాబులు రాబట్టిన ఘనత ఆయన సొంతమన్నారు. అప్పటి ప్రభుత్వం ఆయనకు యునిసెఫ్ అవార్డును ప్రదానం చేసిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే నైజం ఆయన సొంతమన్నారు. శాసన మండలి సభ్యుడిగా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు అప్రెంటీస్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు, అప్రెంటీస్ రద్దు చేయించడానికి కృషి చేశారని గుర్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తుల్లో సుబ్బారెడ్డి ముందు వరుసలో ఉంటారన్నారు. మేధావి వర్గమైన ఉపాధ్యాయులు అందరూ పోచం రెడ్డి సుబ్బారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు పొలానికి నీళ్లు పెట్టడం కోసం మోటర్ ఆన్ చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు కరెంటు షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
ఎన్నికల హామీల సంగతేంటి బాబూ..?
-
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
బాగేపల్లి : గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. పట్టణంలోని నేషనల్ కళాశాల మైదానంలో ఎస్ఎన్ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, డీ దేవరాజు అరసు వైద్య కళాశాల సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. కరువు వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, గ్రామీణులు ఆర్థికంగా చాలా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి కోసమే గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి శిబిరాలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ, ఆర్ఎల్ జాలప్ప మాట్లాడుతూ.. ధనవంతులు తన ధనంలో కొంత సొమ్మును పేదల కోసం ఖర్చు చేయాలని సూచించారు. ఈ శిబిరంలో నరాల బలహీనత, కేన్సర్, పళ్ళు, మధుమేహం, గర్భకోశం, మానసిక వ్యాధులు తదితర వాటితో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రి కార్యదర్శి నాగరాజు, వైద్యులు శ్రీరాములు, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికప్పు కూలి దంపతుల దుర్మరణం
సిద్దవటం: వివాహబంధంతో ఒక్కటైన వారు మరణంలోనూ ఒక్కటై వెళ్లిపోయారు. సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున నివాస గృహం పైకప్పు(స్లాబు) కూలి ఎన్నంరెడ్డి సుబ్బారెడ్డి(65), భాగ్యమ్మ(58) అనే దంపతులు దుర్మరణం చెందారు. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీగా భాగ్యమ్మ పని చేస్తోంది. ఈమె భర్త సుబ్బారెడ్డి వ్యవసాయం చేసుకునేవారు. సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా పైకప్పు స్లాబు విరిగి నిద్రిస్తున్న వారిపై కూలింది. దీంతో సుబ్బారెడ్డి శిధిలాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను చికిత్స నిమిత్తం 108వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి కొద్దిసేపటికే భాగ్యమ్మ కూడా కన్నుమూసింది. రోజూ తెల్లవారుజామున 4గంటలకే నిద్రలేచే వారని, వర్షం కురుస్తుండటంతో సోమవారం నిద్రలేవలేదని, ఇంతలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ అన్సర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం కోసం సుబ్బారెడ్డి మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు రిమ్స్‌లో మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
ఢిల్లీలో సత్తా చాటుతాం
కడపసిటీ, న్యూస్‌లైన్: ఢిల్లీలో సీమాంధ్రుల సత్తా చాటుతామని బీసీ ఐక్య కార్యాచరణ ఛైర్మన్ సీఆర్ఐ సుబ్బారెడ్డి హెచ్చరించారు. నగరంలో బుధవారం ఏపీ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ద్వారా బయలుదేరింది. ఈ సందర్భంగా సీఆర్ఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని ఈనెల 4న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం సీమాంధ్ర జిల్లాల్లోని సుమారు 500 మంది ఢిల్లీకి పయనమైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని కులవృత్తుల వారితో ధర్నా చేపడతామన్నారు. బీసీ రిజర్వేషన్లను 25శాతం తగ్గించే ప్రక్రియను అడ్డుకుంటామన్నారు. ఢిల్లీకి కమిటీ నాయకులు వివి శ్యామ్‌ప్రసాద్, ఓబులేసు, పవన్, సుధాకర్, రామ్మోహన్, మునెయ్య, సమద్ బయలుదేరారు.