పూజల్లో పాల్గొన్న టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, చేవేళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పూజల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చేవెళ్ళ ఎంపీ. రంజిత్‌రెడ్డిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది.
నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరువీధుల్లో స్వామివారి వాహన సేవల్లో పాల్గొని ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతం తోమాల అర్చన అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎల్‌ఏసీ కమిటీ ఉపాధ్యక్షులు వెంకట్‌రెడ్డి, రవి ప్రసాద్, కోమటిరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment