డోన్: కొందరు యువకుల చేష్టలు విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. ద్విచక్రవాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఫలానా తాలుకా అంటూ బోర్డులు తగిలించుకోవడం.. ఏదో గనకార్యం చేసినట్లు దూసుకుపోవడం ప్యాషన్‌గా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు వేసుకుని తిరగడం ఎక్కువయ్యాయి.
డోన్ పట్టణంలో కొందరు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తాలుకా అని, మరికొందరు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తాలుకా అని, ఇంకొందరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ తాలుకా అని నేమ్ప్లేట్లు రాయించుకుని రోడ్లపై హల్చల్ చేస్తున్నారు.
ఈ వాహనాలకు రిజి్రస్టేషన్ నంబర్లు ఉండేచోట ఫలానా వ్యక్తి తాలుకా అని తాటికాయ అంత అక్షరాలతో రాసుకుని తిరుగుతుండటంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి వెర్రి మరింత ముదిరిపోకముందే పోలీసు, ఆర్టీఓ అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment