number plate
-
ఇదో రకం పిచ్చి..!
డోన్: కొందరు యువకుల చేష్టలు విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. ద్విచక్రవాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఫలానా తాలుకా అంటూ బోర్డులు తగిలించుకోవడం.. ఏదో గనకార్యం చేసినట్లు దూసుకుపోవడం ప్యాషన్‌గా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు వేసుకుని తిరగడం ఎక్కువయ్యాయి. డోన్ పట్టణంలో కొందరు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తాలుకా అని, మరికొందరు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తాలుకా అని, ఇంకొందరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ తాలుకా అని నేమ్ప్లేట్లు రాయించుకుని రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ఈ వాహనాలకు రిజి్రస్టేషన్ నంబర్లు ఉండేచోట ఫలానా వ్యక్తి తాలుకా అని తాటికాయ అంత అక్షరాలతో రాసుకుని తిరుగుతుండటంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి వెర్రి మరింత ముదిరిపోకముందే పోలీసు, ఆర్టీఓ అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
నంబర్ ప్లేట్ లేకుంటే చీటింగ్ కేసా?
సాక్షి, హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపిన ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. చార్మినార్ పోలీసులు తనపై తప్పుడు సెక్షన్ల కింద దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో వసుందర్చారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి..‘పిటిషనర్‌పై ఉన్న ఒకే ఒక ఆరోపణ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపటం. ఆ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ నేరం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్ 420 పరిధిలోకి రాదు. అంతేకాకుండా, సెక్షన్ 80(ఏ) కింద శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ అభియోగాలు మోపారు. వాహనాల పరి్మట్ కోసం దరఖాస్తు చేయడం, మంజూరు విధానం గురించి ఈ సెక్షన్ చెబుతుంది. కాబట్టి, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినా సెక్షన్ 80(ఏ)కి వర్తించదు. పిటిషనర్ నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే నిబంధనల ప్రకారం పోలీసులు జరిమానా విధించాలి లేదా కేసు నమోదు చేయాలి. ఈ కారణంగా పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లను రద్దు చేస్తున్నాం’అని పేర్కొన్నారు. -
14 ఏళ్ల ట్యాక్స్ ఒకేసారి చెల్లించాలట!.. కొత్త రూల్
భారత్ (BH) సిరీస్ నంబర్ ప్లేట్లను ఎంచుకునే వ్యక్తులపై రవాణా శాఖ గణనీయంగా పన్ను భారాన్ని మోపింది. ఇంతకు ముందు రెండు సంవత్సరాలకు ఒకసారి పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు 14 ఏళ్లకు ఒకేసారి పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్లను ప్రవేశపెట్టడంతో భారత ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చేసింది. రహదారి, రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ద్వారా 2021 నుంచి రవాణాశాఖ బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్స్ జారీ చేస్తోంది. ఉద్యోగరీత్యా రాష్ట్రాలు మారే వ్యక్తులు ఈ సిరీస్ నెంబర్స్ కొనుగోలు చేశారు. ఈ నెంబర్ ప్లేట్స్ కోసం వాహనదారులు కేంద్ర రోడ్డు రవాణా శాఖకు చెందిన పరివాహన్ వెబ్సైట్లోకి వెళ్లి బీహెచ్ నంబర్ ప్లేటు కోసం అప్లై చేసుకోవచ్చు.దేశంలో ఇప్పటి వరకు బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్స్ కలిగిన వాహనాలు 731 ఉన్నట్లు సమాచారం. ఈ వాహనదారులు ఇప్పుడు ఒకేసారి 14 సంవత్సరాలకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపుల కోసం 60 రోజుల వ్యవధి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.ఏ వాహనానికి ఎంత ట్యాక్స్‌రూ.10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన వాహనాలకు 8 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ధర కలిగిన వాహనాలకు 10 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలకు 12 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రభుత్వం మారగానే సీఎం కార్లకు కొత్త నంబర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారిన వెంటనే పాలనలో అనేక మార్పులు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఒక వాహనానికి గల బీబీ-0023 అనే నంబర్ ప్లేటును తొలగించారు. దీనిలో బీబీ అంటే అంటే భూపేష్ బఘేల్ (మాజీ ముఖ్యమంత్రి). అలాగే 23 అతని పుట్టినరోజు. దీని ప్రకారం నంబర్ ప్లేటును బీబీ-0023గా రూపొందించారు. ముఖ్యమంత్రి సచివాలయం అందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నంబర్ ప్లేట్ మార్చారు. నూతన సీఎం విష్ణు దేవ్ సాయి కారుకు వచ్చిన కొత్త నంబర్ సీజీ-03-9502. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో సీజీ-02 నంబర్ ఉండేది. మాజీ సీఎం బఘేల్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు ప్రత్యేక నంబర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ నంబర్లను సమూలంగా మార్చారు. అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన కాన్వాయ్‌లో ఉన్న వాహనాలను కూడా మార్చారు. నాడు సీఎం తన కాన్వాయ్‌లోని మిత్సుబిషి పజెరో వాహనాన్ని తొలగించారు. ఛత్తీస్‌గఢ్‌లో సీజీ-01, సీజీ-02, సీజీ-04 రిజిస్ట్రేషన్‌ను రాయ్‌పూర్ ఆర్టీఓ పర్యవేక్షిస్తుండగా, సీజీ-03 రిజిస్ట్రేషన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరగడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది? -
నంబర్ ప్లేట్‌కే రూ.141 కోట్లు.. కారు విలువ ఎంతంటే..
అతడో ధనవంతుడు.. పైగా ఓ పెద్ద కంపెనీని యజమాని.. కార్లంటే ఎంతో ఇష్టం.. నచ్చిన కారు నంబర్‌ప్లేట్ కోసం ఎంతైనా ఖర్చుచేసేందుకు సిద్ధం.. అయనే భారత మూలాలున్న దుబాయిలో నివసిస్తున్న అబుసల్హా(బల్విందర్‌సింగ్ సాహ్నీ). ఆయనకు నచ్చిన కారు నంబర్‌ప్లేట్‌కు ఏకంగా రూ.141 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కార్లపై తనకున్న ఆసక్తి ఎలాంటిదో ఈ కథనంలో తెలుసుకుందాం. దుబాయిలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న బల్విందర్‌సింగ్ సాహ్నీ(అబుసల్హా) రాజ్ సాహ్ని గ్రూప్ సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్స్, ఇండస్ట్రీయల్ వస్తువులు, ప్రాపర్టీ డెవలప్మెంట్ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బల్విందర్‌సింగ్ సాహ్నీకి కార్లంటే చాలా ఇష్టం. ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన రోల్స్ రాయిస్ విడుదల చేసిన ఖరీదైన కార్లలోని కల్లినన్స్, ఫాంటమ్ VIII సెడాన్ వంటి మోడళ్లు సాహ్నీ గ్యారేజ్‌లో ఉన్నాయి. అతడి వద్ద ఎన్నో అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ కార్లు ఉన్నట్లు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కార్లతో పాటు తనకు నచ్చిన నంబర్ప్లేట్లను ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేయడం తనకు అలవాటని తెలిపారు. అత్యంత ఖరీదైన లైసెన్స్ ప్లేట్లు తనవద్ద ఉన్నాయన్నారు. వీటిలో కొన్ని కార్ల వాస్తవ ధరకంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఇదీ చదవండి: రద్దీ కోచ్‌లు.. మురికి మరుగుదొడ్లు.. వీడియోలు వైరల్ సాహ్నీ వద్ద రూ.6 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లే ఉన్నట్లు చెప్పారు. కానీ వాటికి సింగిల్ డిజిట్(1), కొన్నింటికి డబుల్ డిజిట్ నంబర్‌ప్లేట్ తీసుకున్నట్లు చెప్పారు. అయితే అందుకు ఒక్కోకారుకు దాదాపు రూ. రూ.60 కోట్లు నుంచి రూ.84 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సాహ్నీ సుమారు రూ.10 కోట్లు వెచ్చించి రోల్స్‌రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేశారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌కు ఏకంగా సుమారు రూ.141 కోట్లు వెచ్చించినట్లు తెలిసింది. ఆ నంబర్‌ప్లేట్‌పై ‘DUBAI D 5’ అని ఉంటుంది. తన వద్ద సింగిల్ డిజిట్ నంబర్‌తో మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కూడా ఉన్నట్లు చెప్పారు. బెంట్లీ రూపొందించిన ఖరీదైన కస్టమ్ ఫర్నిచర్ సైతం తన ఇంట్లో ఉందని సాహ్నీ అన్నారు. -
వామ్మో! రూ. 122 కోట్లకు అమ్ముడైన కారు నెంబర్ ప్లేట్
కారు ధర అంటే లక్షల్లో ఉంటుందని, ఇంకా ఖరీదైన లగ్జరీ కార్లు అయితే కోట్ల రూపాయల వరకు ఉంటాయని అందరూ వినే ఉంటారు. అయితే ఇటీవల ఒక నెంబర్ ప్లేట్ ఏకంగా రూ. 122 కోట్లకు అమ్ముడైంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దాని పూర్తి వివరాలేంటి అనేది ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, దుబాయ్‌లో మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలంలో ‘పీ 7' (P 7) అనే ఓ వీఐపీ కారు నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయింది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 122. 6 కోట్లు. ఇంత ధరకు అమ్ముడుపోవడంతో ఇది ప్రపంచంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇంత డబ్బు చెల్లించి ఈ నెంబర్ ప్లేట్ ఎవరు సొంతం చేసుకున్నారనే విషయం వెల్లడి కాలేదు. అయితే ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుని 'వంద కోట్ల భోజనాల వితరణ నిధి' (1 Billion Meals Endowment) కార్యక్రమానికి అందించనున్నట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా ఆహార సాయం కోసం భారీ దాతృత్వ నిధిని సేకరించేందుకు ఈ బిలియన్ మీల్ ఎండోమెంట్ కార్యక్రమం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. (ఇదీ చదవండి: కృతి కర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!) ప్రపంచంలోని చాల దేశాల్లో ప్రకృతి వైపరిత్యాలు, ఇతరత్రా కారణాల వల్ల మరణించే వారికంటే రోజూ ఆకలి బాధతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో ఆకలిపై యుద్ధం చేయడానికి ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమిరేట్ ఆక్షన్స్, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ సంయుక్తంగా ఈ వేలాన్ని నిర్వహించాయి. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) వేలంలో పీ7 మాత్రమే కాకుండా ఏఏ19, ఏఏ22, ఏఏ80, ఓ71, ఎక్స్36, డబ్ల్యూ78, హెచ్31, జెడ్37, జే57, ఎన్41 వంటి 10 నెంబర్ ప్లేట్స్ విక్రయించారు. ఇందులో వై900, క్యూ22222, వై6666 లాంటి స్పెషల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఏఏ19 నంబర్ ప్లేట్ ఈ వేలంలో 4.9 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోగా.. ఓ71 నంబర్ ప్లేట్ 1.50 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించారు. -
Telangana: మన కార్లపై భారత్ సిరీస్ ఎప్పుడు? దీంతో లాభలేంటి..?
సాక్షి, హైదరాబాద్: తరచూ బదిలీలతో వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్న వారి వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ సిరీస్ అమలులో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అమలులోకి తీసుకురాగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు నిరాకరిస్తోంది. కేంద్ర నిర్ణయంలోని కొన్ని అంశాలపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు పెండింగులో ఉండటంతో.. ఎంతో ఉపయుక్తంగా ఉండాల్సిన భారత్ సిరీస్ రాష్ట్రంలో అసలు అమలులోకే రాకపోవటం ఇబ్బందిగా మారింది. అర్హతలుండీ ఎంతో మంది వాహనదారులు ఈ అవకా శాన్ని వినియోగించుకోలేక పోతున్నారు. అసలు భారత్ సిరీస్ అంటే? దేశవ్యాప్తంగా తరచూ బదిలీ అయి వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన వాళ్లు వారి వెంట ఆయా వాహనాలను తీసుకెళ్లినప్పుడు రిజి స్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఏడాది పాటు పాత నంబర్ ప్లేట్‌తోనే ఉండే వీలున్నప్పటికీ, తర్వాత ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంటుంది. లేని పక్షంలో అక్కడి రవాణా చట్టాల ప్రకారం పెనా ల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అలాంటి వారికి ఇబ్బంది లేకుండా, దేశవ్యాప్తంగా కామన్‌గా వినియోగించుకునేలా కేంద్ర రవాణాశాఖ భారత్ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో తెలంగాణ టీఎస్ బదులు భారత్ సిరీస్‌గా బీహెచ్ అన్న అక్షరా లుంటాయి. ముందు సంవత్సరం, తర్వాత బీహెచ్ అక్షరాలు ఆ తర్వాత 4 అంకెలు రెండు ఆంగ్ల అక్షరాలుంటాయి. ఉదా: 22బీహెచ్ 1234ఏబీ. ఇక్కడే అభ్యంతరం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, డిఫెన్స్ ఉద్యోగులు, కనీసం నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఈ సీరీస్ తీసుకునేందుకు అర్హులు. కొత్త వాహనం కొన్నప్పుడు డీలర్‌కు తగిన డాక్యుమెంట్లు అందించటం ద్వారా ఈ నంబర్ సీరీస్ తీసుకోవచ్చు. కారు కొన్నప్పుడు 15 ఏళ్లకు లైఫ్ ట్యాక్సు చెల్లిస్తుంటారు. ఆ కారు ధర ఆధారంగా.. రూ.5 లక్షల లోపు విలువ ఉన్నవాటికి 3%, రూ.5 – 10 లక్షల మధ్య ఉన్నవాటికి 14%, రూ.10 లక్షలు– రూ.20 లక్షల మధ్య ఉన్న వాటికి 17%, రూ.20 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాటికి 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డీజిల్ కారు అయితే దానికి 2% ఎక్కువగా, బ్యాటరీ కారు అయితే దానికి 2% తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అదే భారత్ సిరీస్ తీసుకుంటే, ఒకేసారి ఆ రోడ్ ట్యాక్స్ మొత్తం చెల్లించకుండా, ఆ మొత్తాన్ని రెండేళ్ల చొప్పున భాగాలుగా చేసి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పన్ను మొత్తాన్ని రాష్ట్రాలు విధిస్తున్న దానితో సంబంధం లేకుండా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ధారించింది. రూ.10 లక్షల లోపు విలువ ఉన్న కారుకు 8 శాతం, రూ.10 లక్షలు– రూ.20 లక్షల మధ్య విలువ ఉన్న కారుకు 10 శాతం, రూ.20 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్న కారుకు 12% గా నిర్ధారించింది. రాష్ట్రాల అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా ఇలా పన్నుల మొత్తాన్ని కేంద్రం నిర్ధారించింది. ఇవి తెలంగాణలో విధిస్తున్న పన్నుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభు త్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని అధికారులు చెబుతున్నారు. పన్ను చెల్లింపు ఎలా ఈ సమస్యపై కేంద్ర–రాష్ట్రప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చి పరిష్కారం దిశగా ప్రయత్నం ప్రారంభించలేదు. దీంతో భారత్ సిరీస్‌కి తెలంగాణలో ఇప్పటికీ శ్రీకారం చుట్టలేదు. ఆ సిరీస్ తీసుకున్న ఇతర ప్రాంతాల వారు జనవరి నుంచి రెండో విడత పన్ను చెల్లించాల్సి ఉంది. బదిలీ పై రాష్ట్రానికి వచ్చిన ఆ సిరీస్ ఉన్నవారు ఇక్కడ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగా ఈ సిరీస్‌కు ఆమోదం లేనందున పన్ను చెల్లింపు ఎలా అన్న సమస్య ఉత్పన్నమవుతోంది. -
షారుక్ ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్, మెరిసిపోతున్న మన్నత్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలో ఒకరు. ఇక ముంబైలోని ఆయన నివాసం ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. అక్కడ చూడదగిన ప్లేస్‌లో షారుఖ్ నివాసం మన్నత్ ఒకటి. సుమారు రూ. 200 కోట్లతో అన్ని హంగులతో షారుక్ తనకు నచ్చినట్టుగా మన్నత్నని నిర్మించుకున్నాడు. ఇందులో షారుక్ ఇంటి నెంబర్ ప్లేటు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మన్నత్‌కు మరింత మెరుపు తీసుకువచ్చేందుకు గతంలో వజ్రాలతో ఉన్న నెంబర్ ప్లేట్‌ని చేపించాడు షారుక్. పూర్తిగా వజ్రాలతో పొదిగిన ఈ ప్లేట్‌పై మన్నత్ అని నల్లటి అక్షరాలతో రాసి ఉంటుంది. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? అయితే భద్రత దృష్ట్యా ఈ నేమ్ ప్లేట్ తీసేశారు. తాజాగా మరోసారి షారుఖ్ తన ఇంటికి డైమండ్ నేమ్ ప్లేట్ పెట్టించాడు. దాదాపు 35 లక్షలతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్ తయారు చేయించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఆ ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఈ వజ్రాల నేమ్ ప్లేట్‌ని చూసేందుకు మరోసారి ప్రజలు షారుఖ్ ఇంటికి క్యూ కడుతున్నారు. మన్నత్‌ను సందర్శించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో షారుఖ్ ఇంటి డైమండ్ నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. After 2 months #Mannat new gate design is unveiled and it's super awesome. What do you think guys? 😍#GauriKhan #ShahRukhKhan pic.twitter.com/w2VcF2AEl9 — Team Shah Rukh Khan Fan Club (@teamsrkfc) November 19, 2022 -
యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మృతి
మైసూరు: కారు ఢీ కొని 82 ఏళ్ల మాజీ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఆరేకే కులకర్ణి మైసూరు యూనివర్సిటీ మానస గంగోత్రి క్యాంపస్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం ఆయన్ను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆయన కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు. ఐతే ఆ వాహనానంపై నెంబర్ ప్లేట్ లేదని పోలీసుల తెలిపారు. కులకర్ణి తన రోజువారి నిత్యచర్యలో భాగంగా వాకింగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం బారిన పడినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఆ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆ వాహనం ఆయన్ను కావాలనే ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులు దీన్ని ప్రీ ప్లాన్ మర్డర్‌గా అనుమానిస్తున్నారు. ఎందుకంటే సీసీఫుటేజ్‌లో కులకర్ణి కరక్ట్‌గా రోడ్డుకి పక్కగా ఉన్న కావాలనే కారు రోడ్డు లైన్‌ని క్రాస్ చేసి మరి ఢీ కొట్టినట్టు వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు అధికారులు. దీంతో అధికారులు ఈ యాక్సిడెంట్‌ని హత్యగా కేసుగా నమోదు చేసుకుని, ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ చంద్రగుప్త తెలిపారు. తమ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. కులకర్ణి మూడు దశాబ్దాలకు పైగా ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేసి 23 ఏళ్ల క్రితం రిటైర్ అయినట్లు తెలిపారు. (చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి..) -
వెహికల్ నెంబర్ ప్లేట్ నిబంధనలకు కేంద్రం సవరణలు
న్యూఢిల్లీ: భారత్ సిరీస్ (బీహెచ్) వాహన రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా నిబంధనల్లో సవరణలను కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలను భారత్ సిరీస్ కిందకు మార్చేందుకు అనుమతించనుంది. ప్రస్తుతం కొత్త వాహనాలే బీహెచ్ సిరీస్ కింద నమోదుకు అవకాశం ఉంది. బీహెచ్ సిరీస్ నిబంధనల్లో సవరణలతో కూడిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రవాణా, రహదారుల శాఖ విడుదల చేసింది. బీహెచ్ సిరీస్ కింద నమోదైన వాహనాన్ని ఒక వ్యక్తి మరో వ్యక్తికి విక్రయించినప్పుడు.. ఇదే సిరీస్ కింద అర్హత ఉన్నా, లేకపోయినా కొనుగోలుదారు పేరిట వాహన రిజిస్ట్రేషన్ సాఫీ బదిలీకి అనుమతించే నిబంధనను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కింద ఉన్న వాహనాలు పన్ను చెల్లించడం ద్వారా బీహెచ్ సిరీస్‌కు మారొచ్చు. చట్టంలోని 48వ నిబంధనకు సవరణను ప్రతిపాదించారు. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం నివాసం ఉండే చోట లేదంటే పనిచేసే ప్రాంతం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల పరిధిలో వాహన రిజిస్ట్రేషన్ల సాఫీ బదిలీకి, ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాల మధ్య మారే వారు.. వాహనాల రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా బీహెచ్ సిరీస్‌ను గతేడాది సెప్టెంబర్‌లో బీహెచ్ సిరీస్‌ను కేంద్ర రవాణా శాఖ తీసుకురావడం గమనార్హం. చదవండి👉 'ఫాస్టాగ్' కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
Number Plates: దొరికితే వదిలేదే లే!
సాక్షి, కర్నూలు: పోలీసులు తనిఖీ చేస్తున్నారట.. ఫొటో తీసి నంబర్ ప్లేట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏం చేద్దాం.. ప్లేట్‌ను వంచేద్దాం లేదా చివర్లను విరగ్గొడదాం లేదా ప్లేటే తీసేద్దాం అప్పుడెలాంటి జరిమానాలు రావు. ప్రస్తుతం కొంతమంది వాహనదారులు చేస్తున్న ఆలోచన ఇదీ. ప్రమాదాల నియంత్రణకు చర్యలు రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు పోలీసులు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాఅంతటా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అయినప్పటికీ కొందరు యథేచ్ఛగా రహదారి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇందులో ఎక్కువశాతం ద్విచక్ర వాహన చోదకులే ఉంటున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను విస్మరించిన వారికీ నష్టాలు తప్పవని తనిఖీల సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇలాంటి వాహనాలు చోరీకి గురైనప్పుడు గుర్తింపు అసాధ్యంగా మారుతోంది. రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో వాహన చోదకుడు నష్టపోతే ఫిర్యాదు చేయడం కూడా ఇబ్బందికరమే. జిల్లాలో సుమారు 10 శాతం మేర వాహనాలు నంబర్ ప్లేట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్నట్లు పోలీసుల అంచనా. నంబర్ ప్లేట్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోయినా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. విరిగిందన్న సాకుతో.. ప్రస్తుతం వాహనాలన్నింటికీ హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ నంబర్ ప్లేట్లు విరిగిపోతున్నాయి. ఫలితంగా వాహన నంబర్లను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. దీన్ని అనుకూలంగా మార్చుకుని కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా ప్లేట్‌ను విరగ్గొట్టడం చేస్తున్నారు. దీనివల్ల నిబంధనలు అతిక్రమించినప్పుడు వాహనాలకు జరిమానా విధించాలన్నా, కేసులు సమోదు చేయాలన్నా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వాహనాలన్నీ విధిగా నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. హైసెక్యురిటీ నంబర్ ప్లేట్ ఉండి విరిగిపోయినా, దెబ్బతిన్నా వాటిస్థానంలో కొత్త ప్లేట్ బిగించుకోవాలని సూచిస్తున్నారు. మోటారు వాహన చట్టం నిబంధనలకు లోబడి సిరీస్, అంకెలు అన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి లేకుంటే జరిమానాలు విధిస్తున్నారు. చదవండి: (వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం) నంబర్ ప్లేట్‌తోనే వాహనం గుర్తింపు రిజిస్ట్రేషన్ ఆధారంగా ఏర్పాటు చేసుకునే నంబర్ ప్లేట్‌తోనే వాహనాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని విస్మరిస్తున్న పలువురు వాహన చోదకులు ఉల్లంఘనుల జాబితాలో చేరుతున్నారు. కనీస నిబంధనలు పాటించక చిక్కుల్లోకి వెళ్తున్నారు. నంబర్ ప్లేట్ రహితంగా, ఇష్టారీతిన నంబర్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకుని వాటిపై ప్రయాణిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. వందల సంఖ్యలో జనాలు ఈ జాబితాలో చేరుతుండటం గమనార్హం. వారం రోజుల వ్యవధిలో ఉల్లంఘనలకు పాల్పడిన 7,932 మందిపై ఈ–చలానాలు విధించి రూ.21.26 లక్షలు జరిమానా వసూలు చేశారు. వారంలో కనీసం వందకు పైగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు తనిఖీల్లో పోలీసులకు పట్టుబడుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో సుమారు 75 ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా పట్టుబడ్డాయి. అలాగే ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకున్నవి 150 దాకా పట్టుకున్నారు. నిర్దేశిత వ్యవధి దాటినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు కూడా తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. కనిష్టంగా వెయ్యి జరిమానా.. నంబర్ ప్లేట్ లేకపోవడం, సరిగా అమర్చుకోకపోవడం, రిజిస్ట్రేషన్ అయినప్పటికీ అక్షరాలు, అంకెలు కనిపించకుండా మార్పులు చేయడం, వెనుకవైపు ప్లేట్‌ను తీసివేయడం, ప్లేట్‌ను వంపు చేయడం తదితర అంశాలు తనిఖీల్లో వెలుగుచూస్తున్నాయి. ఉల్లంçఘనలకు పాల్పడిన వారికి కనిష్టంగా వెయ్యి జరిమానా విధిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేకపోయినా, రాంగ్ రూట్లో ప్రయాణించినా సిగ్నల్ జంపింగ్ చేసినా, రికార్డులు అందుబాటులో లేకపోయినా, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రం లేకపోయినా రూ.1000, లైసెన్స్ లేకపోతే రూ.500, హెల్మెట్ లేకపోతే రూ.100, నోఎంట్రీకి రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారు. ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యం ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదారులపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాం. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం రోడ్డుపైకి వచ్చినా పోలీసులు వాటిని జప్తు చేస్తారు. ఇష్టారీతిన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోకుండా తనిఖీల్లో పట్టుబడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. – ఎస్పీ, సిద్ధార్థ్ కౌశల్ -
ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి షాక్ అయిన పోలీసులు: ఫోటోలు వైరల్
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల రీత్యా వాహానాల రిజిస్ట్రేషన్ నిబంధనలు నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు అన్ని కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలు వాహనదారులు చేస్తున్న తప్పిదాలు, రిజిస్ట్రేషన్ నంబర్ విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి విషయాల్లో సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక వ్యక్తి కారుకి ఉండే నెంబర్ ప్లేట్ మీద నెంబర్ బదులు ఏం రాయించుకున్నాడో ఫోటోలు ట్వీట్ చేశారు సదరు కారు యజమాని నెంబర్ ప్లేట్ మీద రిజస్టేషన్ నెంబర్ని విచిత్రంగా హిందీలో తండ్రిని పిలిచే విధంగా 'పాపా' అనే అర్థం వచ్చేలా పెట్టుకున్నాడు. ఈ నెంబర్ ప్లేట్‌తోనే కారులో దర్జాగా తిరిగేస్తున్నాడు సదరు వ్యక్తి. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు సదరు కారు యజమానిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ స్థానంలో ఇలా పేర్లు ఉండకూడదంటూ సదరు యజమానికి జరిమాన విధించారు. ఈ మేరకు పోలీసులు ట్విట్టర్లో ...1987 చిత్రం "ఖయామత్ సే ఖయామత్ తక్"లోని నాన్న మీద ప్రేమతో కూడిన ప్రసిద్ధ పాట "పాపా కెహతే హై"ఉంటుందని చెప్పారు. అందులో మాదరి మా నాన్న పేరు కారు మీద రాస్తాను అంటే కుదరదన్నారు. అలాంటి రిజిస్ట్రేషన్ ప్లేట్లకు జరిమాన విధించబడుతుందని కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. సదరు వాహన యజమానికి జరిమాన విధించడంతో రిజస్ట్రేషన్ నెంబర్ సరిచేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు రిజిస్ట్రేషన్ నెంబర్ సరిచేయక ముందు, సరిచేసుకున్నాక కారు నెంబర్ ప్లేట్‌కి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. पापा कहते हैं बड़ा नाम करेगा, गाड़ी के प्लेट पर पापा लिखेगा, मगर ये तो कोई न जाने, कि ऐसी प्लेट पर होता है चालान.. ट्वीट पर शिकायत प्राप्त करने के बाद #UttarakhandPolice ने गाड़ी मालिक को यातायात ऑफिस बुलाकर नम्बर प्लेट बदलवाई और चालान किया। pic.twitter.com/oL4E3jJFAV — Uttarakhand Police (@uttarakhandcops) July 12, 2022 (చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. ) -
బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్లపై నజర్; 18 నుంచి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలను నగర ట్రాఫిక్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్‌తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నేర కార్యకలాపాలకు దోహదపడేవిగానూ పరిగణిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను గుర్తిస్తే 90102 03626కు ఫిర్యాదు చేయాలన్నారు. (క్లిక్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి) -
ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవాలని..
బంజారాహిల్స్: ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్‌పై మాస్క్ కప్పడమే కాకుండా ఒక నెంబర్‌పై బ్లాక్ స్టిక్కర్‌ను తగిలించిన వాహనదారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 12న బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ శాంతి కుమార్ తాజ్‌కృష్ణా చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా టీఎస్ 09 ఈవై 4858 నెంబర్ బజాజ్ పల్సర్‌పై ఓ వాహనదారుడు వెళ్తుండగా ఆపారు. వాహన నెంబర్ ప్లేట్‌పై మాస్క్ కప్పడమే కాకుండా ఓ నెంబర్‌పై బ్లాక్ స్టిక్కర్ తగిలించడంతో ఇదేమిటని ప్రశ్నించాడు. తాను ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినట్లు వాహనదారుడు వెల్లడించాడు. ఈ వాహనంపై పోలీసులు ఆరా తీయగా జియాగూడ దుర్గానగర్ కాలనీకి చెందిన కరన్ కోట్ నాగేకర్ సందీప్‌గా గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ప్లేట్’ మార్చి.. అమ్మేసి...
మిర్యాలగూడ టౌన్: ఓ రాష్ట్రంలో కార్లు దొంగిలించేవాళ్లు. ఇంజిన్, నంబర్ ప్లేట్ మార్చి ఇంకో రాష్ట్రంలో అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. కొంతకాలంగా దందా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.24 కోట్ల విలువ గల 20 కార్లు, ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను మంగళవారం నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో దొంగిలించి నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బోత్యాతండాకు చెందిన రమావత్ సిరి నాయక్, హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన కొడిమళ్ల పరిపూర్ణాచారి, మెదక్ జిల్లాకు చెందిన నర్సింహ.. ఫైనాన్స్ వాహనాల వేలం పాట వద్ద పరిచయమయ్యారు. వేలంలో వాహనాలు దక్కించుకొని అమ్ముకునే వారు. వీళ్లకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బొప్పా ఘోష్ పరిచమయ్యాడు. ఢిల్లీ, స్వరాష్ట్రంలో దొంగిలించిన కార్లకు ఇంజిన్, నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ ధరకు నర్సింహ, పరిపూర్ణాచారి, నాయక్ ముఠాకు ఘోష్ అమ్మేవాడు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన పులాయిత్ అలీఖాన్, సికింద్రాబాద్‌కు చెందిన కలీంఖాన్, శైలేందర్ సింగ్, అంజద్ హుస్సేన్, మంచిర్యాల ఆర్టీఏ ఏజెంట్లుగా పని చేస్తున్న ఎండీ షకీల్, ఎండీ షఫీఉల్లాఖాన్ ముఠాకు కూడా కార్లు అమ్మేవాడు. ఇలా రెండు ముఠాలకు కలిపి ఢిల్లీలో అపహరించిన 16 కార్లను ఘోష్ అమ్మాడు. మిర్యాలగూడ వాసి ఫిర్యాదుతో.. పశ్చిమ బెంగాల్ నంబర్ ప్లేట్‌తో ఉన్న రెండు కార్లను సిరినాయక్, పరిపూర్ణాచారి ఇటీవల మిర్యాలగూడకు చెందిన వీరస్వామికి అమ్మి కొంత డబ్బు తీసుకున్నారు. మిగిలిన డబ్బులు ఎన్ఓసీ (ఈ వాహనంపై ఎలాంటి కేసులు, ఫైనాన్స్ లేదు) వచ్చాక ఇవ్వమని చెప్పారు. వాళ్లు మిగతా డబ్బుల కోసం రాకపోవడంతో అనుమానం వచ్చి వీరస్వామి పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. సిరినాయక్, పరిపూర్ణాచారిలను పోలీసులు విచారించగా డొంక కదిలింది. చోరీ చేసిన కార్లకు ఘోష్ నకిలీ ఎన్ఓసీ పంపగా మంచిర్యాల ఆర్టీఏ ఏజెంట్లుగా పనిచేస్తున్న ఎండీ షకీల్, ఎండీ షఫీఉల్లాఖాన్.. మంచిర్యాల ఆర్టీఏ అధికారులతో మాట్లాడి సుమారు 5 నుంచి 8 వాహనాలకు తెలంగాణ నంబర్ ప్లేట్లు వచ్చేటట్లు మార్చారు. పోలీసులు మొదటి ముఠా నుంచి 7, రెండో ముఠా నుంచి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. -
దొరకనే దొరక్కూడదు! నంబర్ ప్లేట్ మార్చి చివరికి...
సాక్షి హైదరాబాద్: ‘‘ఇటీవల హస్తినాపురంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులు వాడిన కారు దొంగిలించిందే. సేమ్ మోడల్, రంగు ఉన్న కారు నంబర్‌ను ఆన్లైన్లో వెతికి, నకిలీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను తయారు చేశారు. ఆపై దీన్ని కొట్టేసిన కారుకు తగిలించి..ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీలోని ఫుటేజ్ ఆధారంగా కారు నంబర్ సేకరించిన పోలీసులు.. ఆ అడ్రస్‌కు వెళితే అక్కడున్నది నిందితులు కాకపోవటంతో పోలీసులు ఖంగుతిన్నారు.’’ .. ఇలా దొంగలు రూటు మార్చారు. రెక్కీ నిర్వహించి నేరాలకు పాల్పడే నిందితులు ఆప్డేట్ అయ్యా రు. విచారణలో పోలీసుల దృష్టి మళ్లించేలా కొత్త ప్ర ణాళికలు అమలు చేస్తున్నారు. దొరకొద్దు, దొరికినా ఆలస్యంగా దొరకాలి. ఈ లోపు చోరీ చేసిన సొత్తును తరలించాలి. మొత్తానికి రికవరీ లేకుండా చూసుకుంటామని విచారణలో నిందితులు తెలుపుతుండటంతో పోలీసులు షాక్ తింటున్నారు. నకిలీ హెచ్ఎస్ఆర్పీ తయారీ.. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగలు ముందుగా రాజమండ్రిలోలో ఓ కారును దొంగిలించారు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ వాహనాల ఏజెంట్లు, బ్రోకర్ల వాట్సాప్ గ్రూప్‌లలో నిందితులు చేరారు. సేమ్ కలర్, మోడల్ కారు కనిపించగానే.. దాని నంబర్‌తో నకిలీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)ని తయారు చేయించి.. దాన్ని దొంగిలించిన కారుకు తగిలించారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలు ఉపయోగించిన కారును గుర్తించిన పోలీస్‌లు నంబర్ ప్లేట్ ఆధారంగా రాజమండ్రికి వెళ్లిపోయారు. తీరా అక్కడికెళ్లాక కారు, దాని యజమాని అక్కడే ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. కారు బంపర్ ఎలా ఉంది? నంబర్ ప్లేట్ మార్చేసి నిందితులు కన్ఫ్యూజ్ చేశారని తెలుసుకున్న పోలీస్‌లు.. నంబర్ ప్లేట్ కాకుండా కారుకు ఇంకా ఏం గుర్తులున్నాయని పరిశీలించారు. బంపర్ ఎలా ఉంది? వీల్ క్యాప్స్ ఎలా ఉన్నాయి? ఫాగ్ లైట్లు ఎలా ఉన్నా యి? డెంట్లు ఉన్నాయా? వంటి ఇలా 360 డిగ్రీల కోణంలో కార్‌ను పరిశీలించి.. చోరీ కేసులో నిందితులు వినియో గించింది ఈ కార్ కాదని నిర్ధారణకు వచ్చారు. ఆపైన కారు అసలు యజమాని ఫోన్ నంబర్‌ను డేటా ఆధారంగా నిందితుడు ఇతగాడు కాదని తెలుసుకున్నారు. ఆపై అసలు నిందితుల కోసం వేట మొదలుపెట్టి.. చివరికి పట్టుకున్నారు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు.. విచారణ సమయంలో పోలీస్‌లను కన్ఫ్యూజ్ చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. చోరీకి వచ్చేటప్పుడు ఎల్బీనగర్ పరిసరాల్లోని 20 గల్లీల్లో తిప్పి ఓఆర్ఆర్ ఎక్కారు. ఆ తర్వాత మళ్లీ గల్లీలు తిరుగుతూ దేవాలయానికి చేరుకొని చోరీకి పాల్పడ్డారు. అనంతరం నేరుగా ఏపీకి వెళ్లకుండా సాగర్ హైవేలపై గంటల కొద్ది తిరిగారు. 4–5 గంటల తర్వాత నేరస్తులు విజయవాడ రోడ్ మీదుగా పరారయ్యారు. -
అది ఇల్లీగల్ కాదు.. విక్కీ కౌశల్ మీద వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు
Police Clarify On Indore Resident Complaint Against Vicky Kaushal : బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌పై ఇండోర్‌కు చెందిన జైసింగ్ యాదవ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విక్కీ, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న లుకా చుప్పి 2. ఈ సినిమా చిత్రీకరణలో వాడిన బైక్ నంబర్ ప్లేట్ తనదే అని పోలీసులను ఆశ్రయించాడు. 'విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రంలో హీరో నడిపే ద్విచక్రవాహనానికి ఉన్న నంబర్ వాస్తవానికి నాది. ఈ విషయంపై చిత్రబృందానికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ, అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహన నంబర్ వేరొకరు వాడటం చట్ట వ్యతిరేకం. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా' అని తెలిపాడు. జైసింగ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అయితే సినిమా షూటింగ్లో విక్కీ ఉపయోగించిన నంబర్ ప్లేట్‌కు బోల్ట్ బిగించడం వల్ల పొరపాటు జరిగిందని పోలీసులు తెలిపారు. యాదవ్ ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు సినిమా సెట్స్‌కు చేరుకున్న బంగంగా సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర సోనీ మాట్లాడుతూ 'ఈ దర్యాప్తులో నంబర్ ప్లేట్‌పై అమర్చిన బోల్ట్ వల్ల పొరపాటు జరిగింది. బోల్ట్‌ను గట్టిగా బిగించడంతో 1 నంబర్ 4 లాగా కనిపిస్తుంది. అందుకే జైసింగ్ అపార్థం చేసుకున్నాడు. సినిమా సీన్లో ఉపయోగించిన ఆ నంబర్ ప్లేట్ మూవీ ప్రొడక్షన్ వారికి చెందినది. కాబట్టి ఇందులో చట్ట విరుద్దం ఏం లేదు.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: 'హీరో వాడిన బైక్ నంబర్ నాది' పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు -
'నా నంబర్ ప్లేట్ ఎలా వాడతారు?' హీరో విక్కీ కౌశల్‌పై ఫిర్యాదు
యంగ్ హీరో విక్కీ కౌశల్, బ్యూటిఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం లుకా చుప్పి 2. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్ లీకైంది. ఇందులో హీరో.. చీరకట్టులో ఉన్న సారా అలీ ఖాన్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. ఈ సన్నివేశంపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఆగ్రహం చేశాడు. కారణం.. విక్కీ నడుపుతున్న బైక్ నంబర్ ప్లేట్ తనదే కావడంతో చిత్రయూనిట్‌పై మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా నంబర్ ప్లేట్ వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'ఆ బైక్ సీన్లో వాడిన నంబర్ ప్లేట్ నాది. ఈ విషయం సదరు చిత్రయూనిట్‌కు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నా అనుమతి తీసుకోకుండా అలా నంబర్ ప్లేట్ వాడుకోవడం మాత్రం చట్టరీత్యా నేరం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు తగు చర్యలు తీసుకుంటారు' అని యాదవ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ ఘటనపై లుకా చుప్పి 2 చిత్రబృందం ఏమని స్పందిస్తారో చూడాలి! -
చావు తెలివంటే ఇదే.. ట్రిపుల్ రైడింగ్.. హెల్మెట్ లేదు.. మూతికి ఉండాల్సిన మాస్కేమో!
సాక్షి, జీడిమెట్ల : పోలీస్ చలానాల నుంచి తప్పించుకోవాలంటే మూతికి ఉండాల్సిన మాస్క్‌ను బండికి పెట్టుకోవాలి. అప్పుడే ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్లలో ఇష్టం వచ్చినట్లు వెళ్లొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొంతమంది యువకులు ఇలా బైక్ నంబర్ ప్లేట్‌ను మాస్క్‌తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తిరుతున్నారు. ఇలాంటి వారు ఏదైనా ప్రమాదం చేసి తప్పించుకుంటే దొరకడం కష్టంగా మారుతుంది. ఇటువంటి వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ఇది ప్రమాదమేనని ప్రజలు అంటున్నారు. చింతల్లో నంబర్ ప్లేట్‌కు మాస్కు పెట్టి యువకులు ఇలా ట్రిపుల్ రైడింగ్‌లో వెళ్తున్నారు. అసలే కోవిడ్ మహమ్మారి మరోసారి రెక్కలు విప్పేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. ఇంకోవైపు రాష్ట్రంలో రోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలబారినపడి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువకులు తమకేం కాదులే అన్న విపరీత ధోరణితో అటు వైరస్‌ను , ఇటు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. చదవండి: నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు.. హైదరాబాద్ నగరంలో గతంలో దర్శనమిచ్చిన ‘మాస్కు’ నెంబర్ ప్లేట్లు.. -
ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు ..
MAN Using Face Mask On Number Plate: కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోనేలేదు.. ఇంతలోనే కొంతమంది వాహనదారులకు మరో వైరస్ సోకింది.. మూతికి ఉండాల్సిన మాస్కు బండి నంబర్ ప్లేటుకు చేరింది.. తలకు ఉండాల్సిన హెల్మెట్ హ్యాండిల్‌కు షిఫ్ట్ అయ్యింది. దీంతో చేతిలో ఉన్న కెమెరాతో వాహనదారుల నంబర్ ప్లేట్స్‌పై క్లిక్మనిచే ట్రాఫిక్ పోలీసులకు తల నొప్పి మొదలైంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు రయ్యిమంటూ దుసుకుపోతున్నా ఏం చేయలేని దుస్థితి పోలీసులది.. గురువారం అత్తాపూర్‌లో కనిపించింది ఈ దృశ్యం.. చదవండి: ఆఫీసుకు హాయ్.. ఇంటికి బైబై.. కారణం ఇదే! -
నంబర్ ప్లేట్‌పై ‘అప్నా టైమ్ ఆయేగా’.. ఇక నీ టైం అయిపోయింది!
సాక్షి, నల్లకుంట: నంబర్ ప్లేట్‌పై నంబర్ కనిపించకుండా ట్రాఫిక్ వయోలెన్స్‌కు పాల్పడిన ఓ మైనర్‌పై కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం ఓయూ ఎన్సీసీ ఎక్స్ రోడ్స్ వద్ద నల్లకుంట సెక్టార్–2 పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విద్యానగర్ చర్చి కాలనీకి చెందిన ఓ మైనర్ (16) హీరో మ్యాస్ట్రో ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. వాహనం నంబర్ ప్లేట్‌పై నల్లటి తొడుగు ఉండడంతో ఆ వాహనాన్ని వెంబడించిన పోలీసులు విద్యానగర్ చర్చి వద్ద నిలిపి వేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో పోలీసులు పంపించే ఈ చలానాల నుంచి తప్పించుకోవడానికి వెనుక నంబర్ ప్లేట్‌పై మాస్క్ లాంటి నల్లటి ఓ తొడుగును తొడిగాడు. దానిపై ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే స్లోగన్ రాశాడు. ఆర్సీ చెక్ చేయగా వాహన నంబర్ టీఎస్11ఈసీ 7505 అని ఉంది. ఇక ఏముంది అప్నా టైమ్ ఆయేగా కాదు ఇప్పుడు పోలీసుల టైం వచ్చిందంటూ మోటారు వాహన చట్టం ప్రకారం నల్లకుంట పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. -
‘వైట్’పై ఎల్లో జర్నీ.. ఏమిటీ వైట్ ప్లేట్..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కొన్ని ట్యాక్సీ వాహనాలు, క్యాబ్‌లు మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. పన్నులు ఎగవేసేందుకు ఎల్లో నెంబర్ ప్లేట్ స్థానంలో వైట్ నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నాయి. ఆర్టీఏలో వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని..ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా త్రైమాసిక పన్నులు, రాష్ట్రాల సరిహద్దులు దాటినప్పుడు అంతర్రాష్ట్ర పన్నులు చెల్లించి తిరిగే రవాణా వాహనాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికే కోవిడ్ కారణంగా ట్రావెల్స్ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా ఈ తరహా ఉల్లంఘనల వల్ల మరింత నష్టపోవలసి వస్తోందని ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 వేల వాహనాలు ఇలా వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని తిరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని వాహనాలు రవాణా రంగానికి చెందినవిగానే నమోదు చేసుకున్నప్పటికీ అంతర్రాష్ట్ర పన్నుల ఎగవేత కోసం వైట్ నెంబర్ ప్లేట్‌ను వినియోగిస్తున్నాయి. కోవిడ్‌తో సంక్షోభం... గత 16 నెలలుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పర్యాటక, ఐటీ రంగాలు పూర్తిగా స్తంభించడం, ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రవాణా కోసం వినియోగించే అన్ని రకాల ట్యాక్సీలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, తదితర వాహనాల నిర్వాహకులు త్రైమాసిక పన్నుల నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈఎంఐలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న తాము పన్నులు కట్టలేమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రవాణాశాఖ త్రైమాసిక పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచి్చనట్లుగానే ఈ ఏడాది కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు ట్రావెల్స్ సంస్థల ఆందోళన ఇలా కొనసాగుతుండగా కొంతమంది మాత్రం మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి వైట్ నెంబర్ ప్లేట్‌పై తిరగడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఏ నిర్లక్ష్యం... ఎల్లో నెంబర్ ప్లేట్‌పైన తిరగవలసిన వాహనాలు అందుకు విరుద్దంగా వైట్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకొని ప్రయాణికులను తరలిస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే వేలాది వాహనాలు ఇలా తిరుగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఏమిటీ వైట్ ప్లేట్... వ్యక్తిగత వాహనాల కోసం రవాణాశాఖ వైట్ నెంబర్ ప్లేట్‌ను కేటాయించింది. దీనిపైన నలుపు రంగులో వాహనం నెంబర్ నమోదై ఉంటుంది. ఈ వాహనాలపైన ఒకేసారి జీవితకాల పన్ను రూపంలో చెల్లిస్తారు. ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాలు మాత్రం వాణిజ్య వాహనాలుగా నమోదై ఉంటాయి. వీటికి పసుపు రంగు నెంబర్‌ప్లేట్ (ఎల్లో ప్లేట్)పైన నలుపు రంగంలో నెంబర్లు నమోదై ఉంటాయి. ఈ వాహనాలు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఈ పన్ను మొత్తం ఉంటుంది. -
నంబర్ ప్లేట్ వంచితే క్రిమినల్ కేసు: ట్రాఫిక్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకోవడానికి జనాలు ఎలాంటి వింత వింత వేషాలు వేస్తున్నారో కొద్ది రోజుల క్రితమే చెప్పుకున్నాం. చలానా పడకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన కాలును నంబర్ ప్లేట్‌కు అడ్డంగా పెట్టి.. ఎలా బుక్కయ్యిందో చూశాం. సాధారణంగా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్ అధికారులు 1,000 రూపాయలలోపే జరిమానా విధిస్తారు. కానీ సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్‌ని కనిపించకుండా కాలు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ అధికారులు ఏకంగా 2,800 రూపాయలు చలానా విధించారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్‌ని మీమ్‌గా ఉపయోగించి చేసిన ఈ ట్వీట్ తెగ వైరలయ్యింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త మీమ్‌తో ముందుకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచితే బెండు తీస్తామని.. క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సారి దీనికి రామ్ ‘రెడీ’ సినిమాను ఎంచుకున్నారు. బ్రహ్మానందం, రామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబినేషన్లో వచ్చే సీన్‌ను మీమ్‌గా వాడారు. నంబర్ ప్లేట్ వంచి ప్రయాణం చేస్తున్న ఓ బైక్ ఫోటోతో పాటు ఈ మీమ్‌ని షేర్ చేశారు. ఆ బైక్ ఓనర్ గురించి పబ్లిక్- ‘‘వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండి’’ అంటే.. బైక్(బ్రహ్మానందం).. ‘‘వాడి పాపాలకి నేను పోయేలా ఉన్నాను సార్’’ అంటూ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలుతోంది. నవ్వు తెప్పిస్తూనే.. జనాల్లో ఆలోచన కలిగేలా ట్వీట్ చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచడం/దాచడం నేరం. ఇందుకు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడును. pic.twitter.com/iGr6C21XSX — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 8, 2021 చదవండి: ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..! -
ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ఉండేది ఎందుకు.. మనం జాగ్రత్తగా.. సేఫ్‌గా గమ్యం చేరడానికి. హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. తాగి డ్రైవ్ చేయకండి వంటి నిమయాలన్ని మన సేఫ్టి కోసం పెట్టినవే. కానీ జనాలు మాత్రం రూల్స్ ఉల్లంఘిస్తూ.. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతారు. ఇక చలానాల నుంచి తప్పించుకోవడానికి జనాలు వేసే వేషాలు.. పడే పాట్లు చూస్తే.. వీళ్లు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు అనిపిస్తుంది. గతంలో కేబుల్ బ్రిడ్జి మీద ఓ కుటుంబం నంబర్ ప్లేట్ మీద చున్నీ వేసిన ఘటన చూశాం. ఇక మరి కిందరు టీఎస్ తర్వత వచ్చే ఆల్ఫాబెట్ సిరీస్ కనపడకుండా స్టిక్కర్ అంటించడం.. మూతికి పెట్టుకోవాల్సిన మాస్క్ నంబర్ ప్లేట్‌కు పెట్టడం... ఇక బండి మీద వెనక కూర్చున్న ఆడవారు చున్నీ, చీర కొంగుతో బైక్ నంబర్ ప్లేట్ కనపడకుండా చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఎన్ని వేషాలు వేసినా.. ఒక్కసారి ట్రాఫిక్ వారి కంట్లో పడితే.. తాటా తీయడం మాత్రం ఖాయం. అంతేకాదండోయ్.. మనకు అర్థం అయ్యేలా చేయడానికి సూపర్ హిట్ సినిమాల నుంచి మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి మీమ్‌ను షేర్ చేయగా.. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ‘‘చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం. విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలో ఓ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తికి మాత్రమే హెల్మెట్ ఉంది. ఇక ట్రిపుల్ రైడింగ్‌కి చలానా పడుతుంది. దాంతో బైక్ మీద కూర్చున్న మహిళ అతి తెలివితో నంబర్ ప్లేట్ సరిగా కనపడకుండా ఉండేందుకుగాను తన కాలిను దాని మీద పెట్టింది. ఇది కాస్తా ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది. ఇంకేముంది వారు రంగంలోకి దిగి బైక్ నంబర్ ప్లేట్‌ని గుర్తించి.. 2,800 రూపాయల చలానా విధించారు. (చదవండి: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?) కావాలని వాహనం సమాచారం దాచినందుకు 500 రూపాయలు.. ప్రమాదకర డ్రైవింగ్‌కు 1,000 రూపాయలు.. ట్రిపుల్ డ్రైవింగ్‌కు 1,200.. వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేనందుకు గాను 100 రూపాయల చొప్పున మొత్తం 2,800 రూపాయల చలానా విధించారు. ఇక వీరి ఫోటోతో పాటు షేర్ చేసిన మీమ్ సూపర్. అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ సీన్‌ని వీరికి అన్వయిస్తూ.. ‘‘నువ్వేమో 1,300 రూపాయలు కాపాడాలని కాలు పెట్టావ్.. కానీ నువ్వు చేసిన పనికి ఇంకో 1500 రూపాయలు ఎక్కువ పడ్డాయి’’ అంటూ క్రియేట్ చేసిన మీమ్ సూపర్బ్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
రాంగ్ రైడింగ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారుప్రాంతాల్లో వాహనాలకు సరైన నంబర్ ప్లేట్ లేకుండా చక్కర్లు కొడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలనియంత్రణతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ల మోత నుంచి తప్పించుకునేందుకు ప్లేట్ నంబరింగ్ సరైనది లేకుండానే రోడ్లపై సవారీ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలకు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సైడ్ మిర్రర్లు లేకుండా వాహనం నడపడం... ఇలా వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఈ–చలాన్ జారీ చేద్దామని చూస్తున్న పోలీసులకే మస్కా కొడుతున్నారు. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి వాహనదారుల ఉల్లంఘనుల భరతం పడుతున్నారు. ఇలా నేరుగానే ప్లేట్ నంబర్ సరిగాలేని వాహనాలను పట్టుకొని వారిని పోలీసులు అడుగుతుండడంతో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నామని ఒప్పుకుంటున్నారు. మరికొందరేమో నేరాలు చేస్తున్న వారు కూడా సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలను వాడుతున్నట్టుగా గుర్తించారు. అయితే చాలా మంది ట్రాఫిక్ ఉల్లంఘనులు సీసీటీవీ కెమెరాలకు చిక్కుతున్నా సరైన నంబర్ ప్లేట్ లేకపోవడంతో చలాన్లు జారీ చేయనివి లక్షల్లోనే ఉన్నాయని తెలిసింది. గతేడాదితో పొలిస్తే పది వేలు ఎక్కువే... గతేడాది జనవరి నుంచి జూలై వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో చేసిన ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా 28,508 సరైన నంబర్ ప్లేట్ లేని వాహనదారులపై జరిమానా విధించారు. ఈ ఏడాది అదే ఏడు నెలల్లో ఏకంగా 38,896 వాహన ఉల్లంఘనుల భరతం పట్టారు. నాలుగు నంబర్లు ఉండాల్సిన వాహనానికి మూడు ఉండడం, ఒకవేళ నంబర్లు సరిగా ఉన్న నంబర్ ప్లేట్‌ను వంచడం, కొన్ని అంకెలను మార్చి నంబర్ ప్లేట్ ఉపయోగించడం తదితరాలు గుర్తించారు. వెంటనే సదరు వాహనాల పూర్తి వివరాలు సేకరించి సరైన నంబర్ ప్లేట్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. వీరు మళ్లీ అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.