
ఆంక్షలు 12 గంటలే
ఢిల్లీ: కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకురానున్న సరి-బేసీ నెంబర్ ప్లేట్ ఫార్ములాలో ఆంక్షలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 12 గంటలు అమలులో ఉండనున్నాయి. వాహన కాలుష్యం పై మంగళవారం సీఎం కేజ్రీవాల్ మంత్రులు, అధికారలు సమీక్ష నిర్వహించారు. సరి-బేసి నెంబర్ ప్లేట్ ఫార్ములాకు సంబంధించిన విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో విషపూరితమైన వాయుకాలుష్యాన్ని నివారించేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను అమలుచేస్తున్నట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
సరి-బేసి నెంబర్ ప్లేట్ ఫార్ములాలో ముఖ్యాంశాలు:
► సోమ, బుధ, శుక్రవారాల్లో బేసి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డుమీదకు అనుమతి.
►మంగళ , గురు, శనివారాల్లో సరి సంఖ్య నెంబర్ ప్లేటు ఉన్న వాహనాలను రోడ్డు మీదకు అనుమతి.
► ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు వాహనాలపై ఆంక్షలు
► అత్యవసర వాహనాలైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వ్యాన్లకు ఈ ప్రణాళిక వర్తించదు.
► జనవరి 1 నుంచి ఆంక్షలు అమలు
► ఆదివారం ఎలాంటి ఆంక్షలు ఉండవు
► నిబంధనలు వీవీఐపీలు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు కూడా వర్తింపు