కేటీఆర్‌ పేరుతో కారు నంబర్‌ ప్లేట్‌ | Car number plate with ktr name | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ పేరుతో కారు నంబర్‌ ప్లేట్‌

Published Thu, Jun 21 2018 2:13 AM | Last Updated on Thu, Jun 21 2018 2:49 AM

Car number plate with ktr name - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ‘కేటీఆర్‌’పై ఉన్న అభిమానాన్ని ఓ  అభిమాని వినూత్నంగా తెలియజేశారు. తన కారుకు కేటీఆర్‌ పేరు వచ్చేలా నంబర్‌ ప్లేట్‌ను పొందారు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ‘‘టీఎస్‌ 11 కేటీఆర్‌ 5343’’కలిగిన కారు ఫొటోను ఓ వ్యక్తి ‘కేటీఆర్‌ సర్‌ మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు’ అనే క్యాఫ్షన్‌తో ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అభిమానానికి ముగ్దులైన కేటీఆర్‌.. దండాలయ్యా ఎమోజీతో రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే  ఆ అభిమాని వివరాలు మాత్రం తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement