Luka Chuppi 2: Man Files Complaint Over Illegal Use Of His Number Plate In Vicky Kaushal, Sara Ali Khan Movie - Sakshi
Sakshi News home page

Vicky Kaushal: 'హీరో వాడిన బైక్‌ నంబర్‌ నాది' పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు

Published Sun, Jan 2 2022 12:00 PM | Last Updated on Sun, Jan 2 2022 12:33 PM

Man Files Complaint Over Illegal Use Of His Number Plate In Vicky Kaushal, Sara Ali Khan Movie - Sakshi

యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌, బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం లుకా చుప్పి 2. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్‌ లీకైంది. ఇందులో హీరో.. చీరకట్టులో ఉన్న సారా అలీ ఖాన్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. ఈ సన్నివేశంపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జై సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆగ్రహం చేశాడు. కారణం.. విక్కీ నడుపుతున్న బైక్‌ నంబర్‌ ప్లేట్‌ తనదే కావడంతో చిత్రయూనిట్‌పై మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా నంబర్‌ ప్లేట్‌ వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

'ఆ బైక్‌ సీన్‌లో వాడిన నంబర్‌ ప్లేట్‌ నాది. ఈ విషయం సదరు చిత్రయూనిట్‌కు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నా అనుమతి తీసుకోకుండా అలా నంబర్‌ ప్లేట్‌ వాడుకోవడం మాత్రం చట్టరీత్యా నేరం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు తగు చర్యలు తీసుకుంటారు' అని యాదవ్‌ చెప్పుకొచ్చాడు. మరి ఈ ఘటనపై లుకా చుప్పి 2 చిత్రబృందం ఏమని స్పందిస్తారో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement