
Police Clarify On Indore Resident Complaint Against Vicky Kaushal : బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌పై ఇండోర్‌కు చెందిన జైసింగ్ యాదవ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విక్కీ, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న లుకా చుప్పి 2. ఈ సినిమా చిత్రీకరణలో వాడిన బైక్ నంబర్ ప్లేట్ తనదే అని పోలీసులను ఆశ్రయించాడు. 'విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రంలో హీరో నడిపే ద్విచక్రవాహనానికి ఉన్న నంబర్ వాస్తవానికి నాది. ఈ విషయంపై చిత్రబృందానికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ, అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహన నంబర్ వేరొకరు వాడటం చట్ట వ్యతిరేకం. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా' అని తెలిపాడు.
జైసింగ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అయితే సినిమా షూటింగ్‌లో విక్కీ ఉపయోగించిన నంబర్ ప్లేట్‌కు బోల్ట్ బిగించడం వల్ల పొరపాటు జరిగిందని పోలీసులు తెలిపారు. యాదవ్ ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు సినిమా సెట్స్‌కు చేరుకున్న బంగంగా సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర సోనీ మాట్లాడుతూ 'ఈ దర్యాప్తులో నంబర్ ప్లేట్‌పై అమర్చిన బోల్ట్ వల్ల పొరపాటు జరిగింది. బోల్ట్‌ను గట్టిగా బిగించడంతో 1 నంబర్ 4 లాగా కనిపిస్తుంది. అందుకే జైసింగ్ అపార్థం చేసుకున్నాడు. సినిమా సీన్‌లో ఉపయోగించిన ఆ నంబర్ ప్లేట్ మూవీ ప్రొడక్షన్ వారికి చెందినది. కాబట్టి ఇందులో చట్ట విరుద్దం ఏం లేదు.' అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'హీరో వాడిన బైక్ నంబర్ నాది' పోలీసులకు వ్యక్తి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment