టవల్‌ కోసం అన్ని డబ్బులు తగలేస్తావా? అని ఒకటే తిట్టుడు.. | Sara Ali Khan Scolds Mum Amrita Singh For Buying Towel For Rs.1600 | Sakshi
Sakshi News home page

Sara Ali Khan: టవల్‌ కోసం భారీగా ఖర్చుపెట్టిన తల్లి, చెడామడా తిట్టేసిన హీరోయిన్‌

Published Wed, May 31 2023 8:37 PM | Last Updated on Wed, May 31 2023 8:56 PM

Sara Ali Khan Scolds Mum Amrita Singh For Buying Towel For Rs.1600 - Sakshi

సెలబ్రిటీల లైఫ్‌స్టయిల్‌ ఎలా ఉంటుందంటే.. చిన్న వస్తువు కోసం కూడా బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అవి వందలు, వేలు, లక్షలు, కొన్నిసార్లైతే కోట్లల్లో కూడా ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత హుందాగా ఫీలవుతారు. అయితే కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా సింపుల్‌గా ఉండాలనుకుంటారు. హీరోయిన్‌గా, సహాయ నటిగా మెప్పించిన ఒకప్పటి బాలీవుడ్‌ సీనియర్‌ నటి అమృత సింగ్‌ కూడా ఏదైనా భారీగానే ప్లాన్‌ చేస్తుంది. ఎంత భారీగా అంటే ముఖం తుడుచుకునే టవల్‌ కూడా వేలు పోసి కొంటుంది. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ బయటపెట్టాడు.

విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం 'జర హట్‌కే జర బచ్‌కే'. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఆన్‌స్క్రీన్‌ జంట ద కపిల్‌ శర్మ షోలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విక్కీ కౌశల్‌. 'ఒక రోజు సెట్‌లో సారా తన తల్లి అమృత మేడమ్‌ను తిడుతోంది. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అంతా ఓకేనా? అని అడిగా. దానికామె.. మా అమ్మ రూ.1600 పెట్టి కొత్త టవల్‌ తీసుకుంది. అందుకే కోప్పడుతున్నా అని చెప్పింది.


నేను నమ్మలేకపోయాను. తను జోక్‌ చేస్తుందేమో అనుకున్నాను. నిజం చెప్పు? అని అడిగితే నిజమే చెప్తున్నానని అరిచింది. నేను షాకయ్యాను.. రూ.1600 పెట్టి ఎవరైనా టవల్‌ కొంటారా? అందుకే సారా వాళ్లమ్మను తిడుతూనే ఉంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతలో సారా మధ్యలో కలగజేసుకుంటూ 'మరి ఒక్క టవల్‌ కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు పెడతారా? కావాలంటే వానిటీ వ్యాన్‌లో ఉన్న ఫ్రీ టవల్స్‌ వాడుకోవచ్చుగా' అని పేర్కొంది.

చదవండి: నిశ్చితార్థం జరిగిందంటూ అనుపమ పోస్ట్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement