
పంజగుట్ట: ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నంబర్ ప్లేట్‌కు ఆకు అతికించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు అత్తాపూర్‌కు చెందిన నందకిషోర్ విద్యార్థి. అతను తన (ఎపీ28డీఎక్స్ 5079) యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై బుధవారం ఉదయం షాలీమార్ జంక్షన్ నుంచి పంజగుట్ట వైపు వస్తుండగా పంజగుట్ట సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ సిబ్బంది అతడి వాహనం వెనక ఏదో అంటించి ఉండటాన్ని గుర్తించి వాహనాన్ని ఆపారు. దగ్గరికి వెళ్లి చూడగా అతను ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌కు ఆకును అతికించినట్లు గుర్తించారు. అతని వాహనం వివరాలు పరిశీలించగా ఏడు చలాన్లకు గాను రూ.2045 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించగా నందకిషోర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment