
బంజారాహిల్స్: ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్‌పై మాస్క్ కప్పడమే కాకుండా ఒక నెంబర్‌పై బ్లాక్ స్టిక్కర్‌ను తగిలించిన వాహనదారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 12న బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్‌ఐ శాంతి కుమార్ తాజ్‌కృష్ణా చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా టీఎస్ 09 ఈవై 4858 నెంబర్ బజాజ్ పల్సర్‌పై ఓ వాహనదారుడు వెళ్తుండగా ఆపారు.
వాహన నెంబర్ ప్లేట్‌పై మాస్క్ కప్పడమే కాకుండా ఓ నెంబర్‌పై బ్లాక్ స్టిక్కర్ తగిలించడంతో ఇదేమిటని ప్రశ్నించాడు. తాను ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినట్లు వాహనదారుడు వెల్లడించాడు.
ఈ వాహనంపై పోలీసులు ఆరా తీయగా జియాగూడ దుర్గానగర్ కాలనీకి చెందిన కరన్ కోట్ నాగేకర్ సందీప్‌గా గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment